/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz తెలంగాణలో బహుజన రాజ్యం రావాలి: డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Mane Praveen
తెలంగాణలో బహుజన రాజ్యం రావాలి: డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
"నల్లగొండలో బహుజన విద్యార్థి గర్జన"
TS: రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే బడ్జెట్ లో విద్యకు 60 వేల కోట్లు కేటాయించి, తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, స్వేరోస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ (SSU) ఆధ్వర్యంలో లక్ష్మీ గార్డెన్లో జరిగిన "బహుజన విద్యార్థి గర్జన" సభకు ముఖ్య అతిధిగా ఆర్ఎస్పి హజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో విద్యకు నిధులు కేటాయించమంటే, మద్యానికి అధిక నిధులు కేటాయించి మద్యం అమ్మకాల్లో తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపారని ఆరోపించారు. మద్యం టెండర్లలో స్వయంగా మంత్రులే బినామీ పేర్లతో టెండర్లు వేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమయిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాళేశ్వరం కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఖర్చు పెడుతున్న  ప్రభుత్వం.. పేద విద్యార్థులు చదువే పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ ఫెలోషిప్ ద్వారా విదేశీ విద్య అభ్యసన, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలేదని విమర్శించారు. విద్యకు బడ్జెట్ లో ఎన్ని నిధులు కేటాయించారో ముఖ్యమంత్రితో చర్చించుటకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. బహుజనుడు ముఖ్యమంత్రి అయితే ప్రతి విద్యార్థి ముఖ్యమంత్రి అయినట్టేనన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే కేసీఆర్ దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, గృహలక్ష్మి అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. పేద ప్రజల అభివృద్ధిపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2014 నుండి ఈ పథకాలు ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. 99శాతమున్న పేదలకు సంపద, రాజ్యాధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో వరుసగా పోటీ పరీక్షల షెడ్యూలు విడుదల చేయడంతో లక్షలాది మంది గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన చెందుతున్నారన్నారు. గ్రూప్-2 అభ్యర్థుల విన్నపం మేరుకు మరో మూడు నెలలు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ పరీక్షలు, గురుకుల ఉద్యోగాలకు మధ్య ప్రిపరేషన్ కు మధ్య కాల వ్యవది తక్కువ ఉండడంతో లక్షలాదిమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నరన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే "మహాత్మ జ్యోతిరావ్ పూలే విద్యా భరోసా" పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలు నిర్మిస్తామన్నారు. ప్రతి జిల్లాలో బాలురు, బాలికలకు వేర్వేరుగా సైనిక పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు నాలుగో భాషగా కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెడతామన్నారు. జాంబావ స్పార్క్ కేంద్రాలను ఏర్పాటు చేసి 12 వేల గ్రామాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచితంగా ఏసీ కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ ఇస్తామన్నారు. ఉద్యోగ హక్కు చట్టం తీసుకువచ్చి, రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో యువజన సహకార సంఘాలకు 25 శాతం కాంట్రాక్టులు కేటాయించి లక్షల కోట్ల బడ్జెట్ ను యువతుల చేతిలో పెడతామన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం ఆధిపత్య వర్గాలకు మాత్రమే కాంట్రాక్టులు కేటాయిస్తుందని విమర్శించారు. 'యువతను కాంట్రాక్టర్లుగా మార్చే ఏకైక పార్టీ బీఎస్పీ' నే అని అన్నారు. మాన్యశ్రీ కాన్షిరాం స్ఫూర్తితో యువతను నాయకులుగా తీర్చిదిద్ది, స్థానిక సంస్థల్లో యువతకు 30% రాజకీయ రిజర్వేషన్లు కల్పించి, ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో షాడో మంత్రులుగా నియమిస్తామన్నారు. యువతకు మంత్రివర్గంలో తర్ఫీదునిస్తామన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ స్మారకంగా గద్దర్ ఫ్రీడమ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. జానపద కళలు, గ్రామీణ సంస్కృతిని ప్రోత్సహిస్తామన్నారు. శ్రీకాంతాచారి ఉద్యోగహామీ ద్వారా ప్రతి ఏడాది టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, పేపర్ లీకేజీ లేకుండా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. పూర్ణ-ఆనంద్ క్రీడా స్ఫూర్తితో ప్రతి జిల్లాలో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామన్నారు.

ఎంవిఎఫ్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో అందరికీ విద్య అనేది దురదృష్టవశాత్తు రాజకీయాలతో ముడిపడి, ప్రధాన సమస్యగా మారిందని విచారం వ్యక్తం చేశారు. పేదల విద్యపై ఆధిపత్య పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు. విద్యార్థి, యువత కోసం బడ్జెట్ లో 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని బీఎస్పీ హామీ ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు. మంత్రిత్వశాఖలను నియంత్రించేలా విద్యార్థులను షాడో మంత్రులుగా నియమిస్తానని బీఎస్పీ ప్రకటించడం గొప్ప విషయం అన్నారు. విద్యా సంక్షోబానికి పాలకులే కారణమన్నారు.

సభ ప్రాంగణానికి రావడానికి కంటే ముందుగా, నార్కట్ పల్లి-అద్దంకి బైపాస్ నుండి లక్ష్మీ గార్డెన్ వరకూ విద్యార్థులు ఆర్ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. సభకు స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేష్ అధ్యక్షత వహించగా, సభలో రాష్ట్ర అధ్యక్షులు మొగిలిపాక నవీన్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ ముదిగొండ, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు రాజ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిబాబా, మహిళా విభాగం రాష్ట్ర ఇంచార్జ్ మాధవి, రాష్ట్ర సహాయ కార్యదర్శి అందే అజయ్, నల్లగొండ జిల్లా స్వేరో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షులు ఆకులపల్లి నరేష్, మోసెస్, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు కట్టెల శివ, మరియు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, ఆర్ఎస్పీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ మల్లికార్జున్ కు డాక్టరేట్.
నల్లగొండ: జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ఇంగ్లీష్ అధ్యాపకులు  మల్లికార్జున్,  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో గల మోనాడు యూనివర్సిటీ నుండి ఇంగ్లీష్ సబ్జెక్టులో పీహెచ్డీ అవార్డు పొందారు. "ఆన్ ఎనలిటికల్ స్టడీ ఆన్ ఎక్స్ప్లోరింగ్ ఫెమినైన్  సప్రేషన్ అండ్ ప్యాట్రియార్కి ఇన్ ద ఇండియన్ సొసైటీ విత్ ద హెల్ప్ ఆఫ్ సెలెక్టెడ్ ఫిమేల్ ఆథర్స్" అనే టాపిక్ లో.. డాక్టర్ అజిత్ కుమార్ పర్యవేక్షణలో పరిశోధన చేసి  పిహెచ్డి  పొందారు. ఈ సందర్భంగా గురువారం డాక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ.. తన పీహెచ్డీ డాక్టరేట్ కు సహకరించిన ప్రిన్సిపాల్ మరియు డిపార్ట్మెంట్ సభ్యులకు, ఇతర అధ్యాపక బృందానికి మల్లికార్జున్ తన యొక్క కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్ మాట్లాడుతూ.. ఇంగ్లీష్ సబ్జెక్టులో తమ కాలేజీకి చెందిన మల్లికార్జున్ కు డాక్టరేట్ అవార్డు రావడం అభినందనీయమని ప్రశంసించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ మంజుల, దేవయాని, లైబ్రేరియన్ డాక్టర్ రాజారామ్, రవిచంద్ర, భాస్కర్ రెడ్డి, నరేష్, శ్రీనివాస్ రెడ్డి, బిక్షమయ్య, యాదగిరి, తదితరులు డాక్టర్ మల్లికార్జున్ కు అభినందనలు తెలిపారు.
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మునుగోడు ఎమ్మెల్యే
చౌటుప్పల్: మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ, మృతి చెందిన బాలగొని నాగేష్ కుటుంబ సభ్యులను గురువారం మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ మరియు మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు పరామర్శించి, నాగేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. వారిలో మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిలర్ అధ్యక్షుడు ఎం.డీ బాబా షరీఫ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
గృహలక్ష్మి పథకం లబ్ది రూ. 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచాలి: దళిత రత్న బుర్రి వెంకన్న

TS: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకంలో లబ్ధిదారులకు అందించే మొత్తం రూ. 3 లక్షల నుండి ఐదు లక్షలకు పెంచాలని ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న అవార్డు గ్రహీత బుర్రి వెంకన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండ లో వారు మాట్లాడుతూ.. అధిక రేట్ల  దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది పడకుండ ఉండాలంటే కనీసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈరోజుల్లో ఇల్లు కట్టుకోవడానికి రూ. 3,00,000/- సరిపోవని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ప్రతి లబ్ధిదారులనికి  ఎలక్షన్ లోపే ఆ డబ్బులు ఇవ్వాలని అన్నారు.
గృహలక్ష్మి నిరంతర ప్రక్రియ: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
TS: గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్  ఇండ్లులేని నిరుపేదల కోసం.. ఖాళీ స్థలం ఉండి, సొంత ఇల్లు కట్టు కోవడానికి 3లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే, లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కి దరఖాస్తులు పంపించవచ్చని తెలిపారు

గృహలక్ష్మి నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారు. ప్రతి పక్షాలు, కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.
బాధితుడికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు: మండలంలోని కిష్టాపురం గ్రామంలో జాజుల వెంకటయ్య ఆటో డ్రైవర్ నోటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉండగా, ఆ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో, విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  వెంటనే లక్ష రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించగా, ఆ మొత్తాన్ని ఈరోజు కిష్టాపురం బీజేపీ నాయకులు వారి కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ రాధా రమేష్, బిజెపి జిల్లా కార్యదర్శి వేదాంతం గోపీనాథ్, మునుకుంట్ల మల్లయ్య, బోయ సురేష్, మునుకుట్ల కిష్టయ్య, బీమనపల్లి సాయిబాబా, ఐతరాజు వేణు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, జాజుల శంకరయ్య, మాల్గు కొండల్, గంటల మోహన్ రావ్, తదితరులు పాల్గొన్నారు.
గుజ్జ: విద్యార్థులకు షూస్, పలకలు, నోట్స్  ఉచితంగా పంపిణీ
యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం, గుజ్జ ప్రాధమిక పాఠశాలలో, నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వేలిమినేడు గ్రామానికి చెందిన యువకుడు సురుగూరు రఘుమారెడ్డి.. బుధవారం విద్యార్థులకు షూస్, పలకలు, నోట్స్  ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పబ్బు దేవేందర్ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్  మైల యాదవ రెడ్డి, మండల నోడల్ ఆఫీసర్ సుల్తాన్ హనుమంతు, ఉపాధ్యాయురాలు శివరంజని పాల్గొన్నారు. సర్పంచ్,నోడల్ ఆఫీసర్ దాతలను అభినందించారు.
గృహలక్ష్మి పథకం దరఖాస్తు సమయాన్ని పొడిగించాలి: మేడి ప్రియదర్శిని
నల్లగొండ జిల్లా:
నకిరేకల్: గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తు సమయాన్ని ఒక నెల రోజులకు పొడిగించాలని బిఎస్పి నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని ఒక ప్రకటనలో కోరారు. ఆమె మాట్లాడుతూ.. గృహలక్ష్మి దరఖాస్తుకు అవసరమైన కులము, ఆదాయము, నివాస ధ్రువీకరణ పత్రం ఎమ్మార్వో ఆఫీస్ నుంచి తొందరగా తీసుకునే అవకాశం లేదు. మీ సేవలో సర్వర్ ప్రాబ్లం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నాలుగు రోజుల గడువు సమయం సరిపోదని, వాళ్ళు ఎప్పుడు దరఖాస్తు చేసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీ బందు, మైనార్టీ బంద్ దరఖాస్తు సమయంలో కూడా తక్కువ సమయం ఇచ్చినందున చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయి ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోయారు. ప్రభుత్వం ఆదాయం కోసం ప్రారంభించిన వైన్స్ దరఖాస్తులకు 15 రోజులు గడువు ఇచ్చి పేదవాళ్ల చిరకాల కోరిక అయిన గృహనిర్మానానికి నాలుగు రోజుల గడువు ఇవ్వడం శోచనీయమని అన్నారు. పేదవారికి ఎలాంటి షరతులు లేకుండా సొంత ఇంటి స్థలం ఉండి, ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరికీ అవకాశం కల్పించాలని కోరారు.నిజమైన అర్హత కలిగిన  పేదవారికి ప్రభుత్వ పథకాలలో  అవకాశం కల్పించాలని కోరారు.
NLG: మంత్రిని కలిసిన చర్లగూడెం భూ నిర్వాసితులు

మర్రిగూడెం: మండలంలోని చర్లగూడెం  భూ నిర్వాసితులు బుధవారం హైదరాబాదులో మంత్రి జగదీశ్వర్ రెడ్డిని, మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చర్లగూడెం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన తమకు  పునరావాస ఇంటి స్థలం, ఉపాధి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వారం పది రోజుల్లో పునరావాస ఇంటి స్థలాన్ని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్లగూడ గ్రామస్తులు వల్లపుదాస్ కేశవ్ గౌడ్, సంకబుడ్డి శ్రీనివాస్ యాదవ్, తొడేటి వెంకన్న, ఎరుకల శేఖర్ గౌడ్, శంకరయ్య, ముంత నర్సింహ్మ, తదితరులు పాల్గొన్నారు
NLG: గృహలక్ష్మి దరఖాస్తుదారులకు ముఖ్య గమనిక
మర్రిగూడెం: గృహలక్ష్మి పథకానికి చివరి తేదీ ఈ నెల 10. రేపే చివరి తేదీ కావడంతో, దరఖాస్తుదారులు మీసేవ సెంటర్ల చుట్టూ తిరుగుతూ, అప్లికేషన్ ఫారాలను నింపుతూ హడావిడిగా ఉన్నారు. దరఖాస్తు ఫారం లో కులం సర్టిఫికేట్ ఆదాయం సర్టిఫికెట్ అని ఉండగా అభ్యర్థులు ఆందోళన చెందుతూ.. కులం ఆదాయం సర్టిఫికెట్లు అప్లై చేయడానికి, మీసేవ సెంటర్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. అయితే మర్రిగూడ మండల ఎమ్మార్వో మహేందర్ రెడ్డి బుధవారం మాట్లాడుతూ.. గృహలక్ష్మి దరఖాస్తు ఫారంతో పాటు అభ్యర్థులు తమ వద్ద ఉన్న పత్రాలను జతచేసి ఎమ్మార్వో కార్యాలయంలో అందజేయాలని అన్నారు. కులం ఆదాయ సర్టిఫికెట్ వెంటనే తీయాలని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు వంటివి ప్రస్తుతం అభ్యర్థుల దగ్గర ఉన్న సర్టిఫికెట్లను జత చేసి ఎమ్మార్వో కార్యాలయంలో అందజేయాలని అన్నారు. తర్వాత వెరిఫికేషన్ సమయంలో  మిగతా సర్టిఫికెట్లు అందిస్తే సరిపోతుందని అన్నారు.