48 గంటల్లో అతి భారీ వర్షాలు.. అధికారులకు సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను అప్ర మత్తం చేశారు. ఈ మేరకు ఆమె అధికార యంత్రా గానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఈ 48 గంటల పాటు అత్యంత అప్రమత్తతతో ఉండాలని సీఎస్ ఆదేశించారు.
ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని తెలిపారు.ఇప్పటికే గోదావరి బేసిన్‌లో పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాలువలు పూర్తి స్థాయి నీటి మట్టంతో ప్రవహిస్తున్నాయి.
ఇక ఈ రెండు రోజుల్లో కురిసే అత్యంత భారీ వర్షాల వల్ల అవి మరింత ప్రమాద స్థాయిలో ప్రవహించే అవకాశముంది. నిండిన ప్రతీ చెరువు వద్ద, ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న కాజ్- వే ల వద్ద ప్రత్యేక అధికారులతో పాటు పోలీస్ అధికారులను నియమించి తగు జాగ్రత్త చర్యలను చేపట్టాలని అధికారులకు సీఎస్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాలలో అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. గుర్తించిన పునరావాస కేంద్రాలలో అవసరమైన వస్తు సామాగ్రి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వర్షాలకు దెబ్బతినే రాష్ట్ర, నేషనల్ హైవే రోడ్లకు వెంటనే మరమ్మతులు జరపాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.జలపాతాలు, ఇతర పర్యాటక ప్రాంతాలకు ప్రజలు రాకుండా నివారించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ దళాలను సిద్ధంగా ఉంచామని, అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టిన జాగ్రత్త చర్యలపై ప్రజలను చైతన్యవంతం చేసేలా స్థానిక కేబుల్ టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తెలపాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు....
Jul 27 2023, 11:17