Lokesh: బాహుబలిలో కుంతల రాజ్యం.. జగనన్న పాలనలో గుంతల రాజ్యం: లోకేశ్
ఒంగోలు: బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం చూశాం.. జగనన్న పాలనలో గుంతల రాజ్యం చూస్తున్నామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
యువగళం పాదయాత్రలో భాగంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో లోకేశ్ మాట్లాడుతూ.. జగనన్న ఒక్క గుంత కూడా పూడ్చలేకపోతున్నారని విమర్శించారు.
''జగన్‌కు ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేయడం తెలీదు. ఆయనొక అద్భుతమైన కటింగ్, ఫిటింగ్ మాస్టర్. జగన్ దగ్గర రెండు బటన్లు ఉంటాయి.. బల్లపైన బ్లూ బటన్, బల్లకింద రెడ్ బటన్. భారత దేశంలో 100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక సీఎం జగన్. మహిళలకు జగన్ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు.
మహిళల కన్నీరుతుడిచే బాధ్యత తెదేపా తీసుకుంటుంది. చంద్రబాబు హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.650 ఉంటే.. ఇప్పుడు రెట్టింపయ్యింది. తెదేపా ప్రభుత్వం రాగానే యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం..
రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉంది. నిధులు, విధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బడుగు, బలహీన వర్గాలంటే సీఎం జగన్‌కు చిన్నచూపు. జగన్ పేదల పక్షపాతి కాదు. రైతులకు రుణమాఫీ చేసింది తెదేపానే. సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసింది తెదేపా. పేదలకు సీఎం జగన్ చేసిందేమీ లేదు. పేదలకిచ్చిన 3లక్షల ఇళ్ల పట్టాలను వెనక్కి లాక్కున్నారు. నాలుగేళ్లలో జగన్ పూర్తి చేసిన ఇళ్లు 9,500 మాత్రమే. చంద్రబాబు హయాంలో 3లక్షల ఇళ్లు పూర్తి చేశాం. 3లక్షల ఇళ్లు కట్టాలంటే జగన్ వంద జన్మలు ఎత్తాలి'' అని లోకేశ్ అన్నారు..











Jul 26 2023, 21:01
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.3k