పార్లమెంట్‌లో మణిపుర్ కల్లోలం: నిమిషాలకే వాయిదా పడిన లోక్‌సభ
దిల్లీ: ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్(Monsoon Session of Parliament) కార్యకలాపాలకు మణిపుర్ అల్లర్ల అంశం తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. దానిపై ప్రధాని ప్రకటన చేయాలని ఎంపీలు పట్టుపట్టడంతో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది..
ఈ పరిస్థితుల మధ్య మంగళవారం లోక్‌సభ(Lok Sabha) ప్రారంభమైన వెంటనే వాయిదా పడింది. 11 గంటలకు ప్రారంభమైన సభను స్పీకర్ ఓం బిర్లా నిమిషాల వ్యవధిలోనే వాయిదా వేశారు.
మళ్లీ మధ్యాహ్నం రెండు గంటలకు దిగువసభ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మణిపుర్ అంశం, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌పై సస్పెన్షన్ వేటుతో రాజ్యసభ కార్యకలాపాలు సజావుగా సాగలేదు.
దాంతో ఛైర్మన్ జగదీప్ ధనఖడ్ ఎగువ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదావేశారు. ఇదిలా ఉంటే..
ప్రధాని ప్రకటన చేయాలంటూ పట్టుపడుతున్న విపక్ష ఎంపీలు దానిపై వెనక్కి తగ్గుతాయని ప్రభుత్వం భావించడం లేదు. దాంతో ప్రభుత్వం ఇక బిల్లుల్ని ప్రవేశపెట్టడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం..
Jul 25 2023, 12:43