మీరు ఎవ్వరు? మీరేమైనా మినిస్టరా❓️
తెలంగాణలో బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజానీకం ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతోంది. ఇక పిల్లలను స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వర్షానికి చిన్నారులను ఎలా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ క్రమంలోనే ఓ చిన్నారి తల్లి ట్విటర్ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని స్కూళ్లకు సెలవులను ప్రకటించాలని కోరింది. మంత్రి స్పందించలేదు కానీ ఆమె కుమారుడు స్పందించాడు. తానే మంత్రిని అన్న రేంజ్‌లో వెటకారంగా రిప్లై ఇచ్చాడు. అంతే.. మంత్రి కుమారుడి రిప్లై చూసిన ఆ తల్లితో పాటు నెటిజన్లకు పట్టరాని కోపం వచ్చింది. అసలు రిప్లై ఇవ్వడానికి మీరెవరు? మీరేమైనా మినిస్టరా? అని నిలదీశారు.
వర్షం వస్తోంది కాబట్టి.. విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాక సెలవు ప్రకటిస్తే ప్రయోజనం ఉండదని, ముందుగా స్పందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఓ విద్యార్థి తల్లి ట్విటర్ వేదికగా కోరారు. దీనికి మంత్రి కుమారుడు కార్తీక్ రెడ్డి రిప్లై ఇస్తూ.. ‘మీ వెటకారం అర్థమయ్యింది. ప్రభుత్వం ఏమీ ట్విటర్‌లో నడవదని గ్రహించండి. ఇటీవల మంత్రి సెలవులపై 8.15కి ట్వీట్ చేశారు. కానీ ఆ శాఖ ముందుగానే నిర్ణయం తీసుకుంది. ట్విటర్లో ట్రోలింగ్ చేయడం సులభం. కామన్ సెన్స్ ఉపయోగించండి’ అని పేర్కొన్నారు.
కార్తీక్ రెడ్డి రిప్లై చూసిన సదరు విద్యార్థి తల్లి.. ‘మీరు చూపించిన శ్రద్ధకు అభినందనలు కార్తీక్.. కానీ అది విద్యాశాఖమంత్రికి నేను చేసిన విన్నపం. మీరు సమాధానం ఇచ్చారంటే ఒకవేళ కొంపదీసి మీరు విద్యాశాఖామంత్రా?’ అన్నట్టుగా కామెంట్ పెట్టారు.
అంతేకాదు.. కార్తీక్ రెడ్డి తానేదో మంత్రిలా ఫీలైపోతున్నారని.. తాను పిల్లలపై ఉన్న కన్సర్న్‌తో మంత్రిని అడిగిన చిన్న ప్రశ్నకు వెటకారంగా సమాధానమిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మొత్తానికి కార్తీక్ రెడ్డికి దిమ్మతిరిగే రిప్లై వచ్చింది. అంతే దెబ్బకు దిగి వచ్చారు. కేవలం తాను ట్రోల్స్‌కి మాత్రమే సమాధానం ఇచ్చానని.. పిల్లలపై కస్నర్న్ చూపే తల్లిదండ్రులకు కాదన్నారు. మీరు ట్రోలరా? లేదంటే కన్సర్స్ ఉన్న తల్లా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలని సమాధానం ఇచ్చారు. నెటిజన్లు సైతం కార్తీక్ రెడ్డి ట్వీట్‌పై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు...
Jul 25 2023, 12:05