రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి
•సంక్షేమ వసతి గృహాలలో వసతులు సరిగా లేక అనారోగ్యానికి గురవుతున్న విద్యార్థులు
•బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్_
బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న పెంచినటువంటి మెస్ చార్జీలు స్వాగతిస్తూ పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచితే విద్యార్థులు ఇంకా సంతోషపడే వారిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.
సంక్షేమ వసతి గృహాలలో వసతులు సరిగా లేక విద్యార్థులు ఎందరో అనారోగ్య గురవుతున్నారు అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని ఖాళీ అయిన వార్డెన్ పోస్ట్ లనే తక్షణమే భర్తీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యార్ధులకు నోటు పుస్తకాలు, యూని ఫామ్ బెడ్ షీట్ , ఇవ్వకుంటే విద్యార్ధులు ఎలా చదువుకుంటారనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల గురించి ఏమాత్రం పట్టిం చుకోవడ లేదు విద్యార్ధులకు కొత్త మెనూ ప్రకారం ఆహారాన్ని అందించవలసిన వార్డెన్లు పాత మెనూనే పాటిస్తునారు. వసతి గృహంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.
విద్యా ర్ధుల సంఖ్య తగ్గట్టు బాత్రూమ్స్ నిర్మించాలి. విద్యార్థులకు త్రాగునీరు మినరల్ వాటర్ సౌకర్యం కల్పించాలి జిల్లా కలెక్టర్, స్థానిక ఎం.ఎల్.ఎ సంక్షేమ వసతి గృహాలు అన్నింటిని సందర్శించి వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని విద్యార్ధుల సమస్యలన్నింటిని పరిష్కరించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. లేని యెడల బిసి విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగ్ నరేష్ గౌడ్ ,బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నబోయిన రాజు యాదవ్ ,శేఖర్ యాదవ్, సతీష్ ,రాములు ,మహేష్ , రవి ,రమేష్ ,శంకర్ ,మల్లికార్జున్ ,యాదగిరి ,మల్లేష్ ,లక్ష్మణ్, పృధ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Jul 23 2023, 20:12