/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి Yadagiri Goud
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి

•సంక్షేమ వసతి గృహాలలో వసతులు సరిగా లేక అనారోగ్యానికి గురవుతున్న విద్యార్థులు

•బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్_

బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న పెంచినటువంటి మెస్ చార్జీలు స్వాగతిస్తూ పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచితే విద్యార్థులు ఇంకా సంతోషపడే వారిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.

సంక్షేమ వసతి గృహాలలో వసతులు సరిగా లేక విద్యార్థులు ఎందరో అనారోగ్య గురవుతున్నారు అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని ఖాళీ అయిన వార్డెన్ పోస్ట్ లనే తక్షణమే భర్తీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యార్ధులకు నోటు పుస్తకాలు, యూని ఫామ్ బెడ్ షీట్ , ఇవ్వకుంటే విద్యార్ధులు ఎలా చదువుకుంటారనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల గురించి ఏమాత్రం పట్టిం చుకోవడ లేదు విద్యార్ధులకు కొత్త మెనూ ప్రకారం ఆహారాన్ని అందించవలసిన వార్డెన్లు పాత మెనూనే పాటిస్తునారు. వసతి గృహంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.

విద్యా ర్ధుల సంఖ్య తగ్గట్టు బాత్రూమ్స్ నిర్మించాలి. విద్యార్థులకు త్రాగునీరు మినరల్ వాటర్ సౌకర్యం కల్పించాలి జిల్లా కలెక్టర్, స్థానిక ఎం.ఎల్.ఎ సంక్షేమ వసతి గృహాలు అన్నింటిని సందర్శించి వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని విద్యార్ధుల సమస్యలన్నింటిని పరిష్కరించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. లేని యెడల బిసి విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగ్ నరేష్ గౌడ్ ,బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నబోయిన రాజు యాదవ్ ,శేఖర్ యాదవ్, సతీష్ ,రాములు ,మహేష్ , రవి ,రమేష్ ,శంకర్ ,మల్లికార్జున్ ,యాదగిరి ,మల్లేష్ ,లక్ష్మణ్, పృధ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Zaheerabad: హెల్మెట్‌ ధరించి టమాటాల చోరీ

జహీరాబాద్: దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటడంతో దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో టమాటా ట్రేలను దొంగ ఎత్తుకెళ్లాడు..

ముఖం గుర్తించకుండా హెల్మెట్‌, జాకెట్‌ ధరించిన దొంగ.. ₹6,500 విలువైన మూడు ట్రేలను దొంగిలించాడు.

కమిషన్‌ ఏజెంట్ దుకాణం నుంచి రైతు తీసుకొచ్చి నిల్వ ఉంచిన మూడు టమాటా ట్రేలను దుండగుడు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు

సీసీటీవీలో రికార్డయ్యాయి. ఘటనపై కమిషన్‌ ఏజెంట్‌, బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు..

నీ గర్భంలో నాకు ప్రాణం పోసింది ఇందుకేనా❓️

పల్నాడు జిల్లా:జులై 23

తల్లిపొత్తిళ్లలో సేద తీరాల్సిన పసికందు ఆర్టీసీ బస్టాండ్ బాత్ రూమ్‌లో ప్రత్యక్షమైంది. ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆ తల్లి మాతృత్వపు మమకారాన్ని సైతం కాదనుకుంది. అంతే పురిట్లో పుట్టిన బిడ్డను ఆర్టీసీ బాత్ రూమ్‌ లో వదిలి వెళ్లిపోయింది.

అయితే టాయిలెట్ కోసం వచ్చిన ప్రయాణికులు చిన్నారిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని పసికందును రక్షించారు.

ఈ అమానుష ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. కన్నపేగు బంధాన్ని పొత్తిళ్లలోనే తుంచేసుకున్న దారుణ ఘటన వినుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్‌లో వెలుగులోకి వచ్చింది.

నవ మాసాలు కడుపులో మోసి బిడ్డను కన్న ఓ తల్లి వినుకొండ బస్టాండ్‌లోని ఆర్టీసీ టాయి లెట్‌లో వదిలేసి వెళ్లిపోయింది. అయితే టాయిలెట్‌లో పసిగుడ్డు ఏడుపును ప్రయాణికులు గుర్తించారు. టాయిలెట్‌లో చిన్నారిని చూసి చలించి పోయిన వారు ఆర్టీసీ సిబ్బంది తోపాటు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే చిన్నారి ప్రాణాలతో ఉండటాన్ని గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చిన్నారికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పసి కందును ఆర్టీసీ బస్టాండ్‌లో వదిలివెళ్లిన వాళ్లు ఎవరో తెలుసుకునే పనిలోపడ్డారు. తల్లిదండ్రులే ఈ బిడ్డను వదిలిపెట్టారా? లేక వేరొకరి చిన్నారిని ఎత్తుకొచ్చి ఇక్కడ వదిలేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు...

దోమలను నివారించాలంటే ఇంటి పరిసరాలను శుభ్రం చేయండి . మంత్రి హరీష్ రావు*

ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం సాధ్యమవుతుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించి కుటుంబ సమేతంగా ఇంటి పరిసరాలను, నిల్వ ఉండే నీటిని శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చారు.

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న ఉదయం 10 గంటలకు .. దోమల నివారణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

కోకాపేటలోని తన నివాసంలో 10 నిమిషాలు దోమల నివారణ కోసం ఇంటి పరిసరాలలో నిల్వ ఉండే నీరును స్వయంగా తొలగించి చెత్తను శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షా కాలంలో అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. మరీ ముఖ్యంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకున్నా, నీటి నిల్వ ఉండటంతో దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పారు.

వాటి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే దోమల నివారణకు అందరూ కృషి చేయాలని మంత్రి సూచించారు....

కవిత చిన్న కొడుకు పుట్టినరోజు.. అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు

హైదరాబాద్ :జులై 23

ఎమ్మెల్సీ కవిత తన చిన్న కుమారుడు ఆర్య దేవనపల్లి జన్మదినం సందర్భంగా ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత దంపతులు పూజలు నిర్వహించారు.

వేద పండితులు ఆర్య కు తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనాలు అందజేశారు.

అనంతరం ఎమ్మెల్సీ కవిత దేవాలయానికి వచ్చిన పలువురు భక్తులతో ముచ్చటించారు.

ఎమ్మెల్సీ కవితతో పాటు భర్త అనీల్, కుమారులు ఆదిత్య, ఆర్య పాల్గొన్నారు...

ఒక్కరోజు ముందే కేటీఆర్‌ బర్త్‌డే!

•పోటాపోటీగా బీఆర్‌ఎస్‌ నేతల ప్లెక్సీలు

మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు ఒక్కరోజు ముందే వచ్చిందన్న వాతావరణం నెలకొంది. సోమవారం కేటీ ఆర్‌ పుట్టినరోజు కాగా పోటీ పోటీగా బీఆర్‌ఎస్‌ నేతలు ఆయన ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.

మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ చౌరస్తా వరకు మెట్రోఫిల్లర్లపై కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ నేతలు

కర్నాటి విద్యాసాగర్‌, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.

మును గోడు నుంచి విద్యాసాగర్‌ టికెట్‌ను ఆశిస్తుండగా, ఉప్పల్‌ నుంచి పోటీ చేయాలని రామ్మోహన్‌ భావిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు దగ్గర సైతం ఈ నేతల ప్లెక్సీలు కనిపించాయి....

నేడు కాంగ్రెస్ పీఏసీ సమావేశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పీఏసీ సమావేశం కానుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశ మవుతుంది. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీఏసీ సభ్యులు తదితరులు పాల్గొంటారు.

రాబోయే వంద రోజుల్లో చేపట్టబోయే రాజకీయ వ్యవహారాలు, పార్టీ చేరికలు, యాత్రలు, ఎన్నికల సభలు, సామాజిక వర్గాల వారీగా డిక్లరేషన్లు, మేనిఫెస్టో, తదితర అంశాలపై చర్చలు జరుగు తాయని సమాచారం. కర్నాటకలో ఘన విజయం తర్వాత కాంగ్రెస్ నేతల్లో మరింత జోష్ పెరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరి కలతో పార్టీ బలోపేతంగా మారింది.

పార్టీలో ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా బస్సు యాత్రను విడతల వారీగా చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహాలపైన చర్చించేందుకు ఈ నెల 20న పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి,

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, జూపల్లి కృష్ణారావు, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి తదితరులు సమావేశమయ్యారు. పార్టీ నేతలంతా ఏకతాటిపైన ఉన్నారన్న సంకేతాన్ని కాంగ్రెస్‌ శ్రేణుల్లోకి పంపేందుకు నిర్వహించిన ఈ సమావేశంలో.. నేతల మధ్య ఐక్యతపైనే ప్రధానంగా చర్చించారు.

ఇందులో భాగంగా బస్సుయాత్రను నిర్వహించడంతో పాటుగా తరచుగా పార్టీ ముఖ్య నాయకులు ఇలాంటి విందు సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిటీని, మేనిఫెస్టో కమిటీని వేసుకోవాలని, మేనిఫెస్టోను ప్రకటించి ప్రచారంలోకి వెళ్లిపోవాలని అనుకున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ముఖ్యమైన అంశాలను ప్రచారంలో తరచూ ప్రస్తావించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది........

మణిపూర్ దారుణంపై ఐఏఎస్ స్మిత సబర్వాల్ స్పందన

మణిపూర్ లో మే 4న చోటుచేసుకున్న దారుణంపై యావత్ దేశం స్పందిస్తోంది. ఓ తెగకు చెందిన మహిళలను వివస్త్రలుగా మార్చి వీధుల్లో ఊరేగించడంపై జనం మండిపడుతున్నారు. పార్లమెంట్ కూడా రెండు రోజులుగా దద్దరిల్లుతోంది.

ఈ ఘటనపై తాజాగా తెలంగాణకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ స్పందించారు. ట్విట్టర్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. మణిపూర్ లో ఇన్ని దారుణాలు జరుగుతున్నా మీడియా వెలుగులోకి తీసుకురావడంలేదేమని ప్రశ్నించారు.

చరిత్రలో ఎప్పుడు ఎలాంటి కలహాలు జరిగినా సరే అందులో మహిళలనే అవమానిస్తున్నారని స్మిత సబర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను నిస్సహాయ స్థితిలోకి నెట్టి దారుణాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు.

మణిపూర్ లో అమాయక మహిళలను వివస్త్రలుగా మార్చి వేల మంది ముందు నిలబెడితే దాదాపు 70 రోజుల తర్వాత కానీ బయటకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణం మన మూలాలను కదిలిస్తోందని, అక్కడి మీడియా ఏంచేస్తోందని ప్రశ్నించారు.

మణిపూర్ తగలబడిపోతుంటే, దారుణాలు జరుగుతుంటే ప్రపంచం దృష్టికి తీసుకురాకుండా ఏంచేస్తోందని మీడియాను నిలదీశారు. రాజ్యాంగపరంగా తమకున్న విశేష అధికారాలను ఉపయోగించి మణిపూర్ లో పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలంటూ స్మిత సబర్వాల్ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ ను ట్యాగ్ చేస్తూ స్మిత సబర్వాల్ ట్వీట్ చేశారు. నైతికత లేని మెజారిటీ మనోభావాలు మన నాగరికతను నాశనం చేసేలా ఉన్నాయని స్మిత సబర్వాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కఠిన శిక్షలు లేని ; చట్టాలెందుకు ❓️

మణిపూర్ లోని ఇద్దరు కుకి మహిళలపై జరిగిన దారుణ సంఘటన దేశంలోని స్త్రీలకు గల రక్షణ ఏపాటిదో స్పష్టం చేసింది. సంఘటనపై సుమోటాగా స్పందించిన సుప్రీంకోర్టు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటుగా వ్యాఖ్యానించడం అభినందనీయం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పా, మిగతా సమయంలో కోర్టులు కానీ, మీడియా కానీ పట్టించుకోకపోవడం శోచనీయం.

వాస్తవంగా ఆలోచిస్తే మహిళలపై దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ప్రతినిత్యం ఇలాంటి హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు సంఘటన అనంతరం కూడా ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా జరిగిన సంఘటనకు మత రాజకీయం పూసి, లబ్ది పొందాలనుకోవడం దురదృష్టకరం.

చట్టం తన పని తాను చేసుకుపోతుందనేది నిజమే కావచ్చు కానీ ఇలాంటి సంఘటనల్లో బాధితుల కన్నా ఎక్కువగా రాజకీయ పార్టీలు లాభపడుతున్నాయి అని చెప్పొచ్చు. దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నంతకాలం మహిళలు, బాధితులు బలవుతూనే ఉన్నారు.

నిందితుల పైన ఎన్ని బలమైన చట్టాలు ప్రయోగించినా భారత చట్టాలలోని బలహీనతలు ఆధారంగా నిందితులు జైలు నుండే కాదు, కేసుల నుండి కూడా బయటపడుతూనే ఉన్నారు. ఇలాంటి కేసుల్లో అయితే విదేశాల్లో ఖచ్చితంగా మరణ శిక్షలు విధిస్తారు కానీ మనదేశంలో మాత్రం నిందితుల పక్షాన నీతి సూత్రాలు వల్లిస్తాం, వారిని దర్జాగా వదిలేస్తాం. అత్యాచారాల విషయాల్లో నిందితులను ఉరి తీయాలి అని వాదించే రాజకీయ నాయకులు ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్న ఉదంతాలు దేశంలో ఎన్నో వున్నాయి.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు మాట్లాడే నాయకులు ఒక్క మన దేశంలో మాత్రమే కనిపిస్తారు. కోర్టుల్లో పెండింగ్ కేసులు, దీర్ఘకాలిక విచారణ కారణంగా బాధితులకు సత్వర న్యాయం జరగడం లేదు. నేరాన్ని నిరూపించి, నిందితులకు శిక్షలు వేయించడంలో పోలీసులు సైతం విఫలమవుతూనే వున్నారు.

పోలీసు, న్యాయవ్యవస్థల్లోని అవినీతి, లంచగొండితనం కూడా నేరస్తులకు శిక్షలు పడకుండా కాపాడుతోంది. ఈ దేశాన్ని దేవుడు కూడా రక్షించలేడని గతంలో సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. న్యాయవాదులు సైతం ఇలాంటి హత్యాచార ఘటనల్లో నిందితుల పక్షాన వకాల్తా పుచ్చుకోవడం మానేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా మహిళలపై నేరాల విషయంలో నిందితులకు ఖచ్చితంగా శిక్షలు పడితేనే ఇలాంటి హత్యాచారాలు పునరావృతం కావు. నేరస్థులపై శిక్షలు పడని ఎన్ని చట్టాలు ప్రయోగించినా ప్రయోజనం లేదు....

రెండు రాష్ట్రాల మధ్య ఉప్పొంగి పారుతున్న పెన్ గంగా

ఆదిలాబాద్ :జులై 23

ఐదు రోజులుగు కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్‌ జిల్లాలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నారు. వరద నీరు భారీగా వచ్చిన చేరుతుండటంతో నదుల ప్రవాహ ఉద్ధృతి పెరిగింది.

జైనథ్‌ మండలం డొలారా వద్ద పెన్‌గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం 50 అడుగుల ఎత్తులో ఉన్న వంతెనను తాకింది.

ఫలితంగా తెలంగాణ-- మహారాష్ట్ర సరిహద్దులోని 44 వ నంబరు జాతీయ రహ దారిపై వాహనాల రాక పోకలు నిలిపివేశారు.

వరద ఉద్ధృతి కారణంగా తెలంగాణ- మహారాష్ట్ర మధ్య రాక పోకలు బంద్ అయ్యాయి.

వరద ప్రవాహం తగ్గిన తర్వాత రాక పోకలు పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు. ప్రవాహ ఉద్ధృతిని అధి కారులు ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి డొలారా వంతెన వద్ద పరిస్థితిని సమీక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్లే వాహ నాలను జైనథ్ మండలంలోని పిప్పర్వాడ టోల్ ప్లాజా వద్ద నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు...