నేడు కాంగ్రెస్ పీఏసీ సమావేశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పీఏసీ సమావేశం కానుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశ మవుతుంది. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీఏసీ సభ్యులు తదితరులు పాల్గొంటారు.
రాబోయే వంద రోజుల్లో చేపట్టబోయే రాజకీయ వ్యవహారాలు, పార్టీ చేరికలు, యాత్రలు, ఎన్నికల సభలు, సామాజిక వర్గాల వారీగా డిక్లరేషన్లు, మేనిఫెస్టో, తదితర అంశాలపై చర్చలు జరుగు తాయని సమాచారం. కర్నాటకలో ఘన విజయం తర్వాత కాంగ్రెస్ నేతల్లో మరింత జోష్ పెరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరి కలతో పార్టీ బలోపేతంగా మారింది.
పార్టీలో ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా బస్సు యాత్రను విడతల వారీగా చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహాలపైన చర్చించేందుకు ఈ నెల 20న పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి,
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, జూపల్లి కృష్ణారావు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి తదితరులు సమావేశమయ్యారు. పార్టీ నేతలంతా ఏకతాటిపైన ఉన్నారన్న సంకేతాన్ని కాంగ్రెస్ శ్రేణుల్లోకి పంపేందుకు నిర్వహించిన ఈ సమావేశంలో.. నేతల మధ్య ఐక్యతపైనే ప్రధానంగా చర్చించారు.
ఇందులో భాగంగా బస్సుయాత్రను నిర్వహించడంతో పాటుగా తరచుగా పార్టీ ముఖ్య నాయకులు ఇలాంటి విందు సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిటీని, మేనిఫెస్టో కమిటీని వేసుకోవాలని, మేనిఫెస్టోను ప్రకటించి ప్రచారంలోకి వెళ్లిపోవాలని అనుకున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ముఖ్యమైన అంశాలను ప్రచారంలో తరచూ ప్రస్తావించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది........
Jul 23 2023, 13:17