Bhadrachalam | భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్న గోదావరి..
రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి (Godavari river) వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది..
భద్రాచలం: రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి (Godavari river) వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది.
ఉదయం 6 గంటలకు వరద (Floods) ప్రవాహం 43.3 అడుగులకు చేరింది. దీంతో గోదావరి పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇక ఎగువన వర్షాలతో గోదావరి ఉపనది అయిన పెన్‌గంగ (Penganaga) ఉప్పొంగి ప్రవహిస్తున్నది. వరద ఉధృతి పెరగడంతో ఆదిలాబాద్ (Adilabad) జిల్లా జైనాథ్ మడలం డొలారా వద్ద నది ఉగ్రరూపం దాల్చింది.
50 అడుగుల ఎత్తు ప్రవహిస్తుండటంతో నీరు వంతెన పైనుంచి వెళ్తున్నాయి. దీంతో 44వ నంబర్ జాతీయరహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. మహారాష్ట్ర-తెలంగాణ (Maharashtra-Telangana) మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. వరద ఉధృతి తగ్గిన తర్వాత వాహనాలను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు..
Jul 23 2023, 09:53