హైదరాబాద్‌లో బయటపడ్డ మరో ఉగ్ర కోణం.. ఈ మోసాలు అందుకేనా?
హైదరాబాద్: అతిపెద్ద సైబర్ క్రైమ్ ఫ్రాడ్‌ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో రూ. 712 కోట్ల ఫ్రాడ్ చేసిన ముఠాని అదుపులోకి తీసుకున్నామని సీపీ ఆనంద్ తెలిపారు..
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ తరహా మోసాలకు సంబంధించి 15 వేల మంది బాధితులు ఉన్నారని అన్నారు. టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా ఈ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు.
ఆన్లైన్ లో టాస్క్‌ల పేరుతో.. మొదట డబ్బులు ఇచ్చి... ఆ తర్వాత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మోసం చేస్తున్నారని.. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
ఇందులో అమాయకులే కాకుండా హై లెవెల్ పొజిషన్ లో ఉన్న ఐటీ ఎంప్లాయిస్ కూడా బాధితులు ఉన్నట్లుగా గుర్తించారని చెప్పారు. శివకుమార్ అనే ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేశామన్నారు. చైనా, దుబాయ్ కేంద్రంగా ఈ ఫ్రాడ్ జరుగుతోందని చెప్పారు..
ఇక్కడ ఎజెంట్లను నియమించుకొని, షెల్ కంపెనీలు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి చైనా, దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారని అన్నారు. చైనా, దుబాయ్‌లో ఉన్న ప్రధాన నిందితులకు ఇండియాలో సహకరిస్తున్న 9 మందిని అరెస్ట్ చేశామన్నారు. అకౌంట్స్ లో ఉన్న డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసుకుని చైనా, దుబాయ్‌లో విత్‌డ్రా చేసుకుంటున్నారని అన్నారు. ఇక్కడ ఫ్రాడ్ చేసిన డబ్బును టెర్రరిస్టులకు ఫైనాన్స్ చేసే అవకాశం కూడా ఉందన్నారు. ఎన్‌ఐఐ(NIA) వాళ్ళకి ఈ కేసు గురించి సమాచారం ఇచ్చామని ..వాళ్లు కూడా ఇన్వాల్వ్ అవచ్చని చెప్పుకొచ్చారు. హిజ్బుల్ టెర్రర్ మోడ్యూల్ కి క్రిప్టో కరెన్సీ ట్రాన్స్ఫర్ పై ఎన్‌ఐఏ దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు..
Jul 22 2023, 19:17