మణిపూర్ లో ఏం జరగనట్టు వ్యవహరిస్తున్న ప్రధాని
80 రోజులుగా మణిపూర్ అట్టుడుకుతుంటే బీజేపీ ప్రభుత్వం ఎం చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి ప్రశ్నించారు. శనివారం ఆమె గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ..
మణిపూర్‌లో ఏం జరగనట్టు ప్రధాని తీరు..
హైదరాబాద్: 80 రోజులుగా మణిపూర్ అట్టుడుకుతుంటే బీజేపీ ప్రభుత్వం ఎం చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి ప్రశ్నించారు.
శనివారం ఆమె గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌లో ఎం జరగనట్టు ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని, బీజేపీ ఆదివాసీ తెగల మీద చిచ్చుపెట్టిందని విమర్శించారు. అ
క్కడి ముఖ్యమంత్రి ఇది ఒక్క సంఘటనే కదా.. వందల సంఘటనలు జరుగుతాయని చెప్పడంతో బీజేపీ ఏంటనేది తెలుస్తోందన్నారు. మణిపూర్ గవర్నర్ మే 3న జరిగిన సంఘటన వీడియో బయటకు రావడంపై బావోద్వేగానికి గురవుతున్నానని చెప్పడం సిగ్గుచేటన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి ఈషాన్య రాష్ట్రాల మరణాహోమం కనబడడం లేదా? అని పాల్వాయి స్రవంతి ప్రశ్నించారు. బీజేపీ మహిళా మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కవితక్క లిక్కర్ స్కామ్ పై తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారని, మణిపూర్ ఘటనపై ఈ మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. రాజస్థాన్‌లో దళిత మహిళపై అత్యాచారం జరిగితే 24 గంటల్లో పట్టుకున్నారని.. వారు ఏబీవీపీకి సంబందించిన వారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు ఆత్మపరిశీలన చేసుకోవాలని పాల్వాయి స్రవంతి అన్నారు...
Jul 22 2023, 17:16