గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
•బిసి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.
నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల అధ్వర్యంలో గత 17 రోజులుగా
గ్రామ పంచాయతీ కార్మికులు, కారోబార్లు మరియు బిల్లు కలెక్టర్లు చేస్తున్న నిరవధిక సమ్మెలో శనివారం బిసి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ పాల్గొని సంఘీభావం తెలిపిన అనంతరం ప్రసంగించారు.
ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల, కారోబార్ల మరియు బిల్ కలెక్టర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బందినందరిని పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిరంతరం గ్రామాలన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, గ్రామ శ్రేయస్సుకు పాటుపడే గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం ఉదాసీనత వైఖరి వహించకుండా, సత్వరమే వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జి.ఓ. నెంబర్ 51 సవరించి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దుచేసి బిల్ కలెక్టర్ కారొబార్లను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని ఆయన కోరారు. 11వ పి ఆర్.సి లో నిర్ణయించిన విధంగా బేసిక్ సాలరీ 19000 రూపాయలు చెల్లించాలని కోరారు.
అంతేకాకుండా ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలకు 10 లక్షల రూపాయల ప్రమాదభీమా వర్తింపచేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా తక్షణమే ఈఎస్ఐ పీఎఫ్ వర్తింపజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, యలిజాల రమేష్, మారోజు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Jul 22 2023, 17:14