ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో సెకండ్ PRC..?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని భావిస్తున్నది.
ఇందులో భాగంగా ఉద్యోగుల నుంచి ఇటీవల వచ్చిన డిమాండ్లకు అనుగుణంగా వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. త్వరలోనే ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం కావాలనుకుంటున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ పీఆర్సీని 2018 జూలైలో ఏర్పాటు చేశారు. అది ఇచ్చిన సిఫారసులను పరిగణనలోకి తీసుకుని 30% ఫిట్‌మెంట్ ప్రకటించింది. ఆ కమిషన్ గడువు ఈ ఏడాది జూన్ చివరితో ముగిసింది.
దీంతో కొత్త పీఆర్సీ జూలై 1వ తేదీ నుంచి కొత్తగా అమల్లోకి రావాల్సి ఉన్నది.
గడువు సమీపిస్తున్నా కొత్త పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో ఉద్యోగుల్లో అసహనం నెలకొన్నది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడంతో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొన్నది.
షెడ్యూలు ప్రకారం జూలై నుంచే కొత్త పీఆర్సీ రావాల్సి ఉండడంతో అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ మైలేజ్ పొందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల చివరిలోగానే ఎంప్లాయీస్ యూనియన్ల ప్రతినిధులతో మాట్లాడి అవసరాన్ని బట్టి ఆ తర్వాత ఐఆర్ ఇంటెరిమ్ రిలీఫ్ పైనా ప్రకటన చేసే అవకాశం ఉంది....
Jul 21 2023, 16:09