/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png
రామడుగులో అత్యధికం వర్ష పాతం నమోదు
కరీంనగర్ జిల్లా:జులై 21
రామడుగు మండలంలో శుక్రవారం ఉదయం రాష్ట్రం లొనే అత్యధిక వర్ష పాఠం నమోదయింది. రామడుగులో 21. 35 సెంటి మీటర్ల వర్షపాతం నమోదుకగా గంగాధర లో 14. 38 సెంటి మీటర్లు గా నమోదయింది. భారీ వర్షంతో అధికారులు అప్రమత్తమైనారు..
SB MEWS
SB NEWS
SB NEWS
"SB NEWS*
తెలంగాణలో 51 మంది డీఎస్పీలకు పోస్టింగ్స్
హైదరాబాద్:జులై 21
తెలంగాణ పోలీసు శాఖ లో 51 మంది డీఎస్పీలు గా నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ అంజనీ కుమార్ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
పోస్టింగ్‌లు పొందిన డీఎస్పీలు
1)మహంకాళి ఏసీపీగా రవీందర్
2)వనస్థలిపురం ఏసీపీగా భీమ్రెడ్డి
3)గోషామహల్ ఏసీపీగా వెంకట్రెడ్డి
4)సిరిసిల్ల డీఎస్పీగా ఉదయ్‌రెడ్డి
5)మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీగా రణ్‌వీర్‌రెడ్డి
6)రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీగా మురళీకృష్ణ
7)భువనగిరి ట్రాఫిక్ ఏసీపీగా ప్రభాకర్‌రెడ్డి
8)కామారెడ్డి డీఎస్పీగా ప్రకాష్
9)బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీగా రమేష్
10)బేగంపేట ఏసీపీగా రామలింగరాజు
11)పేట్‌బషీరాబాద్ ఏసీపీగా రఘునందన్‌రావు
12)అబిడ్స్ ఏసీపీగా ఆకుల చంద్రశేఖర్
13)ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీగా సదయ్య
14)చాంద్రాయణగుట్ట ఏసీపీగా అంజయ్య
15)మహేశ్వరం ఏసీపీగా బుర్ర శ్రీనివాస్
16)సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏసీపీగా మురళీధరప్రసాద్
మొత్తం 51 మంది డీఎస్పీలను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. చాన్నాళ్లుగా పోస్టింగుల కోసం వీరు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల కావడంతో పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు...
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది
తిరుపతి :జులై 21
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ బాగా పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులతో క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి.
ఇక గురువారం నాడు స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టింది గురువారం నాడు 63,628 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.26 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,548 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...
SB NEWS
SB NEWS
9 ఏండ్లలో యువతకు 30 లక్షల ఉద్యోగాలు లభించాయి... : ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శక విధానాల వల్ల గత తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రానికి 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దానితో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా గురువారం నియమితులైన మఠం భిక్షపతి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. కార్పొరేషన్ చైర్మన్ గా నియమితుడైన భిక్షపతికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..కష్టపడి పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనడానికి భిక్షపతి నిదర్శనమని తెలిపారు. గ్రామ స్థాయిలో కార్యకర్తగా పనిచేసిన భిక్షపతిని గుర్తించి సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇవ్వడం సామాన్యమైన విషయం కాదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆంథోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను భారీ మెజారిటీతో గెలిపించడానికి భిక్షపతి చేయుత, పదవి ఉపయోగపడుతుందని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమల రంగంలో దూసుకెళ్తున్నామని, దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నా కూడా ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాల కల్పన చేస్తున్నామని వివరించారు. పరిశ్రమల శాఖ పారదర్శకమైన విధానం వల్ల దేశం ఎక్కడా లేని విధంగా గత 9 ఏళ్లలో 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని, దాని వల్ల 30 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు.
ఉత్పత్తులను ఎగుమతులు చేసుకోడానికి పారిశ్రామికవేత్తలకు ఈ కార్పొరేషన్ వెన్నుదన్నుగా పనిచేస్తుందని అన్నారు. కరోనా కన్నా ముందు రూ. 30 కోట్ల ఆదాయం ఉన్న కార్పొరేషన్ ప్రస్తుతం రూ. 130 కోట్ల లాభాల్లో ఉందని, ఈ మొత్తం రూ. 1500 కోట్లకు చేరుకుంటుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలు బాగుండాలనే సిద్ధాంతంతో పనిచేసే విధానం తమదని, ఈ కార్పొరేషన్ ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని భిక్షపతికి కవిత సూచించారు...
తీరనున్న అంజన్న భక్తుల కష్టాలు
జగిత్యాల జిల్లా:జులై 20
కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుల కోనేరు కష్టాలు తీరనున్నాయి. అధిక భారంతో భగీరథ నీటిని కోనేరులో నింపడానికి ఆలయ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.
మురుగు నీటిలో స్నానం ఆచరిస్తూ భక్తుల ఇక్కట్లు చెప్పనక్కర్లేదు. ఇందుకు శాశ్వత పరిష్కారం ఆలోచించాలంటూ భక్తుల కోరిక ఆలయ అధికారుల విన్నపం సంతులోని లొద్ది లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా స్థానిక ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.
దీనికి సంబంధించిన శంకుస్థాపన మరియు భూమి పూజ గురువారం రోజున రాష్ట్ర ప్రణాళిక వైస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, శాసనమండలి సభ్యుడు ఎల్.రమణ, సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జడ్పీ చైర్ పర్సన్ పాల్గొన్నారు.
గురువారం రోజున మల్యాల మండలం కొండగట్టు ఆలయానికి నీటి సౌకర్యం కోసం ఎత్తిపోతల పథకం పనులకు భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొండగట్టు ఆలయ అభివృద్దికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన కార్యక్రమంలో భాగంగా రూ.13.43 కోట్లతో ముగ్దూంపేట గ్రామ సమీపంలోని ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి నీటిని గుట్టపైకి ఎత్తిపోసే పనులను ప్రారంభించారు. రానున్న 2, 3 నెలల్లో పనులు పూర్తి చేసి భక్తులకు శాశ్వత పరిష్కారం కల్పించనున్నామని తెలిపారు....
ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్
భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది..
రేపు ఎల్లుండి అన్ని విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రైవేటు సంస్థలకు సైతం సెలవు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు...
SB NEWS
SB NEWS
SB NEWS
TPCC: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ.. 29 మంది కీలక నేతలకు చోటు..
హైదరాబాద్: తెలంగాణలో రాబోయే శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీని ఏఐసీసీ ప్రకటించింది..
రేవంత్‌రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించనున్న 2023 రాష్ట్ర ఎన్నికల కమిటీలో 26 మంది సభ్యులు, మరో ముగ్గురు ఎక్స్‌అఫిషియో సభ్యులను అధిష్ఠానం నియమించింది. మొత్తం 29మంది కీలక నేతలకు ఈ కమిటీలో చోటు లభించింది..
వీరిలో ఎన్నికల కమిటీ సభ్యులుగా రేవంత్‌రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, సీతక్క, బొమ్మ ముఖేష్‌గౌడ్, గీతారెడ్డి,
అజహరుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్, చల్లా వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, రేణుకా చౌదరి, బాలరాం నాయక్, మహ్మద్ అలీ షబ్బీర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రేంసాగర్ రావు, సునితా రావు ముదిరాజ్ సభ్యులుగా ఉన్నారు.
పీసీసీ ఎన్నికల కమిటీలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు..
చంద్రయాన్-3.. నాలుగో కక్ష్య పెంపు విజయవంతం..
చంద్రుడిపై పరిశోధనలకుగానూ ప్రయోగించిన 'చంద్రయాన్-3' వ్యోమనౌక.. లక్ష్యం దిశగా సాగిపోతోంది. ఇప్పటివరకు మూడో కక్ష్యలో భూమిచుట్టూ చక్కర్లు కొట్టిన ఈ వ్యౌమనౌకకు సంబంధించిన నాలుగో కక్ష్య పెంపును అంతరిక్ష పరిశోధన సంస్థ గురువారం విజయవంతంగా నిర్వహించింది..
బెంగళూరులోని 'ఇస్ట్రాక్' కేంద్రం నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టింది. చంద్రయాన్-3కి సంబంధించిన అయిదో, చివరి కక్ష్యను పెంచేందుకు జులై 25న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య చేపడతామని ప్రకటించింది.
నేడు అంతర్జాతీయ చంద్ర దినోత్సవం. ఈ సందర్భంగా చంద్రయాన్-3ని జాబిల్లికి మరింత చేరువ చేస్తూ..
భారత్ ఈ వేడుక చేసుకుంటోంది' అని ట్విటర్ వేదికగా ఇస్రో పేర్కొంది.
జులై 14న ఈ వ్యోమనౌకను ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు.
ఇప్పటివరకు దశలవారీగా నాలుగుసార్లు పెంచి.. చంద్రయాన్-3 జాబిల్లికి చేరువచేస్తున్నారు. అయిదో కక్ష్య పూర్తయిన అనంతరం ఈ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి వెళ్తుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెడుతుంది..
Pawan Kalyan: వాలంటీర్లపై వ్యాఖ్యలు.. పవన్ కల్యాణ్‌పై కేసు నమోదుకు ఆదేశం..
అమరావతి: వారాహి యాత్రలో భాగంగా ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా పవన్ కల్యాణ్‌పై కేసు నమోదుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
జులై 9న ఏలూరు సభలో పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 29వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, వీరిలో కొంత మంది మాత్రమే ట్రేస్ అయ్యారు..
మిగతా వారు ఏమయ్యారో తెలియదని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారం సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై సీసీపీ 199/4 ప్రకారం కేసు నమోదుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పవన్ కల్యాణ్‌పై పరువు నష్టం కేసులు పెట్టాలని
పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ గ్రామవార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నోటీసులు అందజేశారు..
Jul 21 2023, 10:06