తీరనున్న అంజన్న భక్తుల కష్టాలు
జగిత్యాల జిల్లా:జులై 20
కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుల కోనేరు కష్టాలు తీరనున్నాయి. అధిక భారంతో భగీరథ నీటిని కోనేరులో నింపడానికి ఆలయ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.
మురుగు నీటిలో స్నానం ఆచరిస్తూ భక్తుల ఇక్కట్లు చెప్పనక్కర్లేదు. ఇందుకు శాశ్వత పరిష్కారం ఆలోచించాలంటూ భక్తుల కోరిక ఆలయ అధికారుల విన్నపం సంతులోని లొద్ది లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా స్థానిక ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.
దీనికి సంబంధించిన శంకుస్థాపన మరియు భూమి పూజ గురువారం రోజున రాష్ట్ర ప్రణాళిక వైస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, శాసనమండలి సభ్యుడు ఎల్.రమణ, సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జడ్పీ చైర్ పర్సన్ పాల్గొన్నారు.
గురువారం రోజున మల్యాల మండలం కొండగట్టు ఆలయానికి నీటి సౌకర్యం కోసం ఎత్తిపోతల పథకం పనులకు భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొండగట్టు ఆలయ అభివృద్దికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన కార్యక్రమంలో భాగంగా రూ.13.43 కోట్లతో ముగ్దూంపేట గ్రామ సమీపంలోని ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి నీటిని గుట్టపైకి ఎత్తిపోసే పనులను ప్రారంభించారు. రానున్న 2, 3 నెలల్లో పనులు పూర్తి చేసి భక్తులకు శాశ్వత పరిష్కారం కల్పించనున్నామని తెలిపారు....
Jul 20 2023, 21:55