పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ : జులై 20
పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఎటువంటి చర్చలు లేకుండానే ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి.
ఇటీవల మృతి చెందిన సభ్యులకు సంతాపం ప్రకటించాయి. అనంతరం మణిపూర్‌పై చర్చ జరపాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో రాజ్యసభను 12 గంటల వరకు వాయిదా వేశారు.
సభ ప్రారంభమైన అనంతరం సభ్యులు మళ్లీ ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన కొద్ది సేపటికే మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది.
మణిపూర్ అంశంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్ష పార్టీలు నినాదాలు చేశాయి. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు..
Jul 20 2023, 16:52