మోడీ ఫాసిస్టు విధానాలపై ఉద్యమించడమే కామ్రేడ్ పజ్జూరి కృష్ణారెడ్డికి నివాళి
మోడీ ఫాసిస్టు విధానాలపై ఉద్యమించడమే కామ్రేడ్ పజ్జూరి కృష్ణారెడ్డికి నివాళి
-- CPI (M-L) న్యూడెమోక్రసీ
గోడవరిలోయ ప్రతిఘటనోద్యమ నాయకుడు,అజ్ఞాత దళ కమాండర్,సరసనపల్లిలో బూటకపు ఎన్ కౌంటర్లో అమరుడైన కామ్రేడ్ పజ్జూరి కృష్ణారెడ్డి 23వ వర్ధంతి సందర్భంగా CPI (M-L) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని శ్రామిక భవన్ కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్,ఇఫ్టూ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి బొంగరాల నర్సింహ, బొమ్మిడి నగేష్ లు మాట్లాడుతూ పీడిత,తాడిత అణగారిన వర్గాలకోసం కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి రూపొందించిన ప్రతిఘటన పోరాట వెలుగులో కృష్ణారెడ్డి ఉద్యమిచాడని అన్నారు.గ్రామంలో పెత్తందార్లు,భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించాడని అన్నారు.తీవ్ర నిర్బందాలను ఎదుర్కొని అశేష ప్రజల విముక్తికోసం కామ్రేడ్ కృష్ణారెడ్డి పోరుబాట పట్టాడని అన్నారు.
ఖమ్మం,వరంగల్ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు,గిరిజనులకు,దళిత,బహునులకు ఆత్మబందువుగా విజయ్ అన్నగా పరిచయమై అజ్ఞాత దళ నాయకుడుగా పొడు భూముల రక్షణకై ఉద్యమించాడని కొనియాడారు.
కామ్రేడ్ విజయన్న ను నరహంతక చంద్రబాబు ప్రభుత్వం 2000 సంవత్సరం జూలై 19 సరసనపల్లి అడవులను చుట్టుమట్టి కామ్రేడ్ పజ్జూరి కృష్ణారెడ్డి (విజయ్)తోపాటు భరత్,రాజులను బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేసిందని అన్నారు.వారి ఆశయాల సాధనకోసం బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలని అన్నారు.
మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను అనుసరిస్తుందని ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రావుల వీరేశ్,జానపాటి శంకర్,కత్తుల చంద్రశేఖర్, దాసరి నర్సింహ, మామిడాల ప్రవీణ్, చింతల వెంకటరమణ, యం.డి సర్వాన్,జెర్రిపోతుల రాము తదితరులు పాల్గొన్నారు.
Jul 20 2023, 09:50