/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తిరుపతి లో భారీగా పెరిగిన భక్తుల రద్దీ Yadagiri Goud
తిరుపతి లో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి :జులై 13

తిరుమలలో నేడు గురువారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 72,664 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.49 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 32,336 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

చంద్రయాన్‌కు నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

•షార్‌కు చేరుకున్న ఇస్రో అధిపతి

సూళ్లూరుపేట చంద్రయాన్‌-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) సిద్ధమైంది..

ఈరోజు మధ్యాహ్నం 2:35:13 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమై 24 గంటలు కొనసాగనుంది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

షార్‌కు చేరుకున్న ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌.. వాహకనౌకను పరిశీలించారు. అనంతరం భాస్కరా అతిథి భవనానికి చేరుకుని శాస్త్రవేత్తలతో సమీక్షించారు. చంద్రయాన్‌-3 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌ వీరముత్తువేల్‌, ఎల్‌వీఎం-3పీ4 మిషన్‌ డైరెక్టర్‌ ఎస్‌.మోహన్‌కుమార్‌, అసోసియేట్‌ మిషన్‌ డైరెక్టర్‌ నారాయణన్‌, వెహికల్‌ డైరెక్టర్‌ బిజూస్‌ థామస్‌ ఉన్నారు.

ఉచిత విద్యుత్ ఇస్తే కాంగ్రెసోళ్లకు కళ్ల మంట ఎందుకు? : కవిత

పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే బాగుపడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతు విధానాలు అమలు అవుతున్నాయన్నారు. రైతుబంధు పధకం దేశంలో ఎక్కడా లేదన్నారు. రైతుకు వ్యవసాయం మంచిగా ఉండాలంటే నీళ్లు, కరెంటు ఉండాలని అన్నారు.

కేసీఆర్ పెట్టిన రైతుబంధు పధకాన్ని ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ పధకాలతో తెలంగాణలో కేసీఆర్ నీళ్లు పారించారని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఓ బోగస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే తప్పు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ పాలనలో రైతులకు మేలు జరగలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తే తమకు కళ్ళ మంట ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశఢారు. కాంగ్రెస్ పాలనలో అర్ధరాత్రి కరెంటు వస్తే అనేక మంది రైతులు చనిపోలేదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌పై తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధరణి పోవాలి... దళారీలు రావాలి ఇది కాంగ్రెస్ పార్టీ విధానమని ఎమ్మెల్సీ కవిత విరుచుకుపడ్డారు...

రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, తెలుగు రాష్ట్రాల వారికి దక్కని చోటు

న్యూఢిల్లీ: ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్టానం బుధవారం ప్రకటించింది. గుజరాత్‌ నుంచి బాబు బాయి జేసంగ్‌ బాయ్‌, కే శ్రీదేవన్స్‌ జాలా, బెంగాల్‌ నుంచి అనంత్‌ మహారాజ్‌కు అవకాశం ఇచ్చింది..

అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి చోటు దక్కలేదు. కాగా ఇప్పటికే గుజరాత్‌ నుంచి కేంద్రమంత్రి జైశంకర్‌ పేరును నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే..

జులై 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో ఆరు స్థానాలకు, గుజరాత్‌లో మూడు, గోవాలో ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ జులై 6న విడుదలవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. జూలై 13 వరకు నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణకు జులై 17న చివరి తేదీగా పేర్కొంది. 24న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్‌ జరుగుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది..

Emergency Landing: ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో రన్‌వేపై దొర్లిన విమానం.. వీడియో వైరల్

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) ఎయిర్‌పోర్ట్‌లో ఓ విమానం ప్రమాదానికి గుర్తింది. హెచ్‌ఏఎల్ ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరిన ప్రీమియర్ 1ఏ ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది..

నోస్ ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్‌ అయిన కాసేపటికే వెనక్కి తిరిగి వచ్చింది. ఈ క్రమంలో అత్యవసరంగా ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై ప్రమాదానికి గురైంది. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో విమానం రన్‌వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది..

రన్ వేపై నీరు నిలవడంతో.. ఆ నీటిలో అలాగే ముందుకు వెళ్లింది. అప్పటికే విమానం నోస్ గేర్ సరిగా లేకపోవడంతో విమానం ఒక్కసారిగా ముందుకు దొర్లింది. అయితే అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు పైలెట్లు మాత్రమే ఉన్నట్లు తెలిపింది. హాల్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అవుతున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు..

మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు నమోదు

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై బుధవారం కేసు నమోదు అయ్యింది. శ్రీ సాయి సూర్య డెవలపర్స్‌ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అయితే ఆ సంస్థ ప్లాట్స్ పేరుతో డబ్బులు కట్టించుకుని ఎగ్గొట్టింది. దీంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకటనలు చూసి మోసపోయామని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

సాయి సూర్య డెవలపర్‌ సంస్థ అధినేత సతీష్ చంద్ర గుప్తాపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. 30 మంది బాధితులు సాయి సూర్య డెవలపర్స్‌పై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు సాయి సూర్య డెవలపర్స్‌పై సెక్షన్‌ 406, 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు...

పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 774 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో ఇప్పటికే 399 స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నది.

మరో 103 స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు అనుమతి మంజూరైందని తెలిపింది.

సీసీ కెమెరాలు లేక కొన్ని పీఎస్‌లలో ప్రజల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ అందిన లేఖను

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం సుమోటో పిల్‌గా స్వీకరించి మంగళవారం విచారణ జరుపగా, ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదన వినిపించారు. సదరు పిల్‌పై విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించింది....

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యల మీద మండిపడ్డ బీఆర్‌ఎస్‌.. రెండోరోజూ నిరసనలు

వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇస్తున్న ఉచిత కరెంట్‌కు ఉరి వేస్తారా? అంటూ మండిపడ్డారు.

రేవంత్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు ఆందోళనలు చేపట్టారు. ఊరూరా రేవంత్ రెడ్డి‌, కాంగ్రెస్‌ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రేవంత్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌ విద్యుత్‌ సౌధ వద్ద బుధవారం నిర్వహించిన ధర్నాలో బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు. రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన నిరసనల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. బోయిన్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల ఆందోళన

ఉలిక్కి పడ్డ ఇంటర్ బోర్డు

ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గడం ఇంటర్‌ బోర్డులో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ తగ్గుదలకు కారణాలపై అధికారులు దృష్టిసారించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి అడ్మిషన్లు తగ్గడంతో వాటిని మళ్లీ ఏవిధంగా పెంచాలనే అంశంపై చర్చించారు. ఈ ఏడాది ‘ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్లు సగమే’ అంటూ మంగళవారం ఈ అంశంపై బోర్డు ఉన్నతాధికారులు చర్చించారు. కాలేజీలు ప్రారంభమై ఇప్పటికే 40 రోజులు గడుస్తోంది. ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ కాలేజీల్లో పూర్తి స్థాయి బోధన ప్రారంభంకాలేదు.

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ ఇంకా మొదలే కాలేదు. సబ్జెక్టులను బోధించడానికి ఉద్దేశించిన సుమారు 2 వేల మంది గెస్ట్‌ లెక్చరర్లను ఇంకా నియమించలేదు. కాలేజీల్లో అడ్మిషన్లను పెంచడానికి అధికారులు, కాలేజీ సిబ్బంది కూడా ఈ ఏడాది పెద్దగా ప్రయత్నం చేయలేదు. దీంతో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య పడిపోయింది. ఈ అంశంపై ఈ మధ్య రెగ్యులరైజ్‌ అయిన కాంట్రాక్టు లెక్చరర్లు కూడా స్పందించారు. ఇంటర్‌ విద్య సంఘం నాయకుడు సయ్యద్‌ జజీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

అడ్మిషన్లు తగ్గిపోవడానికి కాంట్రాక్టు లెక్చరర్ల ప్రయత్న లోపం కారణం కాదన్నారు. రాష్ట్రంలో వందలాది గురుకులాలు, మైనార్టీ కళాశాలలు, కస్తూర్బా కళాశాలలు, మోడల్‌ స్కూళ్లు వచ్చాయని.. వీటిలో భోజనం, హాస్టల్‌ వసతితోపాటు అన్ని సౌకర్యాలతో అడ్మిషన్లు కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇలాంటి సదుపాయాలు లేవని, ఆడ పిల్లలను దూర ప్రాంతానికి పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. విద్యార్థిణుల జాగ్రత్త కోసం హాస్టల్‌ ఉన్న కాలేజీలనే ఎంచుకుంటున్నారన్నారు. అడ్మిషన్ల సమయంలోనే సప్లమెంటరీ పరీక్షలు, తదనంతరం పేపర్‌ మూల్యాంకన బాధ్యతల్లో ప్రభుత్వ కాలేజీల లెక్చరర్లు 15 రోజులు పాల్గొన్నారని, ఈ సమయంలోనే కొన్ని ప్రేవేట్‌ సంస్థలు ఆన్‌లైన్‌లో అడ్మిషన్లను నమోదు చేసుకున్నట్టు చెప్పారు. అడ్మిషన్లు పెంచేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అడ్మిషన్లకు ఇంకా గడువున్నందున సంఖ్య పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో హాస్టల్‌ వసతి లేదా మధ్నాహ్న భోజనం, ఉచిత బస్‌పా్‌సలాంటి సౌకర్యాలు కల్పించాలని పలు సందర్భాల్లో తాము ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ప్రభుత్వం కొన్ని మెరుగైన చర్యలు తీసుకుంటే అడ్మిషన్లు లక్ష దాటడంతోపాటు ప్రైవేట్‌ కార్పొరేట్‌ కళాశాలల మాదిరిగా అభివృద్ధి చేసి చూపుతామని ఆయన వెల్లడించారు....

ట్విట్టర్లో మంటలు పుట్టిస్తున్న కేటీఆర్

కేసీఅర్ నినాదం… ” మూడు పంటలు” …

కాంగ్రెస్ విధానం… ” మూడు గంటలు” …

BJP విధానం “మతం పేరిట మంటలు”

” మూడు పంటలు ” కావాలా..

” మూడు గంటలు “* కావాలా..

“ మతం పేరిట మంటలు” కావాలా…

తెలంగాణ రైతు… తేల్చుకోవాల్సిన.. తరుణం ఇది..!! అంటూ బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కెటిఆర్ ట్విట్ట‌ర్ చేసిన ట్విట్ ఇప్పుడు మంట‌లు పుట్టిస్తున్నది.. బిజెపి,కాంగ్రెస్ ల‌ను టార్గెట్ చే స్తూ చేసిన ట్విట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా దూసుకుపోతున్న‌ది..

ఇక కాంగ్రెస్‌కు ఎప్పుడూ చిన్నకారు రైతులు అంటే చిన్న చూపు అని.. సన్నకారు రైతు అంటే సవతి ప్రేమ అని కెటిఆర్ అన్నారు. నాడు ఏడు గంటల కరెంట్‌ ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్‌.. నేడు ఉచిత కరెంట్‌కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందని పేర్కొన్నారు.

మూడు గంటలతో మూడెకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలని ఎద్దేవా చేశారు. అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగమవుతుందని అన్నారు. మరోసారి రాబందు 3 గంటల మాటెత్తితే.. రైతుల చేతిలో మాడు పగలడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం అని కేటీఆర్‌ పేర్కొన్నారు. రైతును రాజును చేసే మనసున్న సీఎం కేసీఆర్‌ కావాలా? మూడు గంటల కరెంట్‌ చాలన్న మోసకారి రాబందు కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు