కాలేశ్వరం ప్రాజెక్టు కు ఖర్చు చేసింది 80 వేల కోట్లు లక్ష కోట్లు ఎలా అవినీతి జరిగింది ❓️రాహుల్ జీ
కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ చెప్పడం విడ్డురంగా ఉంది. ఖర్చు పెట్టింది 80 వేల కోట్లు అయితే లక్ష కోట్లు అవినీతి ఏలా జరుగుతుందని? రాహుల్ గాంధీ వాఖ్యల పై రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క చెరువు అయినా బాగు చేశారా.? నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ వాళ్లది నోరా.. మోరా..?
అంటూ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రంగనాయక సాగరులో ముంచి లేవడితే కాంగ్రెస్ నాయకులకు నీళ్ళు ఉన్నవి, లేనిది తెలుస్తది కావొచ్చునని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పత్తి మార్కెట్ యార్డులో బుధవారం ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, తెలంగాణ ఆయిల్ ఫెడ్ సిద్ధిపేట జిల్లా ఆధ్వర్యంలో రైతులకు స్పింక్లర్లు-తుంపర సేద్య పరికరాలు పంపిణీ, ఆయిల్ ఫామ్ సాగు అవగాహన సదస్సు కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు హాజరై 1001 స్పింక్లర్లు-తుంపర సేద్య పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం పూర్తి చేశాం కాబట్టే భూమికి బరువైన పంట పండుతున్నది. కాళేశ్వరం పని కానిదే ఈ ఘనత సాధ్యమౌతదా అంటూ చెప్పుకొచ్చారు.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవలం 300 స్పింక్లర్లు సెట్లు పంచేదని, కానీ ఇవాళ ఒక్కరోజు 1001 మందికి స్పింక్లర్లు పంపిణీ చేసుకుంటున్నామని, ఇప్పటికే సిద్ధిపేట జిల్లాలో రెండేళ్లలో 17 వేల స్పింక్లర్లు సెట్లు ఇచ్చామని, చిన్నకోడూర్ మండలంలోనే 5100 స్పింక్లర్లు సెట్లు ఇచ్చామని గుర్తు చేశారు.
రైతులను చైతన్యం చేయాలని, బీఆర్ఎస్ రైతు ప్రభుత్వమని జిల్లా వ్యాప్తంగా 17 వేల స్పింక్లర్లు సెట్లు పంపిణీ చేసేందుకు రూ.20 కోట్ల 18 లక్షల రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం భరించిందని, ఇది రైతుల పట్ల ప్రేమ, చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు.
ఈ యేడు కాలమయ్యే అంశం పై సీఎం కేసీఆర్ సమీక్షించి రైతు శ్రేయస్సు కోసం ఆలోచన చేశారని, రైతులకు కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి కాల్వల ద్వారా నీళ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
గతంలో రైతులు ముఖాన్ని మొగులుకు పెట్టి చూసేవారు కానీ., ఇప్పుడు సీఎం కేసీఆర్, కాళేశ్వరం పై నమ్మకంతో నారు పోస్తున్నారని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రైతులలో ఎంతో మార్పు వచ్చిందని, కాలంతో నిమిత్తం లేకుండా నీళ్లు అందిస్తున్నట్లు, యాసంగి పంట నూకలుగా మారి తుట్టి అవుతున్నా.., ఆ నష్టాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.
రైతులు గుండెజారి పోవొద్దని, రైతుల కోసం చుక్క చుక్క ఒడిసి పట్టి కాళేశ్వరం జలాశయాలు నింపాలని సీఎం కేసీఆర్ స్పష్టంగా ఆదేశించారని, కాలం ఎత్తి పోయినా.. కాళేశ్వరం గేట్లు ఎత్తి రైతులకు కాల్వల ద్వారా పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
కాళేశ్వరంతో యాసంగిలో 55 లక్షల ఎకరాల పంట పండింది. పండిన పంట 26 వేల కోట్లు రూపాయల ధాన్యం కొన్నాం. ఎక్కడా గుంట, ఎకరం ఎండలేదు. మూడేళ్లలో యుద్ధంలా పనిచేసి కాళేశ్వరం నిర్మించినట్లు వివరించారు.
ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం వాడు నూకలు తినమని చెప్తే ముఖ్యమంత్రి కేసీఆర్ నూకల ఖర్చు భరించి అందరికీ బియ్యం అందిస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో 7 గంటలు కూడా కరెంటు ఉండేది కాదనీ, కానీ ఇప్పుడు నిరంతరాయంగా వ్యవసాయ బావుల వద్ద కరెంటు ఉంటుందని చెప్పారు.
కరెంట్ బిల్లుపోతే పోతుందని, ప్రతి ఒక్క రైతుకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. ఇంకా వానలు మొదలు కాకున్నా., అన్నీ గ్రామాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని తెలిపారు.
జిల్లాలో 8 వేల 500 ఏకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేసినట్లు, ఈ సంవత్సరం 1800 ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నట్లు, ఆయిల్ ఫామ్ ద్వారా ఎకరాకు లక్ష రూపాయల వరకు ఆదాయం ఉన్నదని, ఆయిల్ ఫామ్ లాభాల పంటగా ఎకరాకు 80 వేల రూపాయల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నదని చెప్పారు.
ఈ మేరకు ఆయిల్ ఫెడ్ సిద్ధిపేట జిల్లా కమిటీ మెంబర్లకు సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ వైస్ ఛైర్మన్ సోమిరెడ్డి, జిల్లాలోని పలు మండలాల ఏంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సునీత, అధికార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు......
Jul 06 2023, 10:24