/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నలపరాజు శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి కృతజ్ఞతలు! Yadagiri Goud
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నలపరాజు శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి కృతజ్ఞతలు!
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ నియామకం ఏకగ్రీవంగా ముగిసింది. ఈ కమిటీలో జిల్లా కాంగ్రెస్ (డీసీసీ) కార్యదర్శిగా నలపరాజు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీనివాస్ నియామకం పట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు యలిజాల శంకర్, పట్టణ అధ్యక్షులు నలపరాజు సైదులు ఒక ప్రకటనలో నలపరాజు శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేశారు. నిబద్ధత గల నాయకుడిగా పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషికి తగిన గుర్తింపు లభించిందని వారు పేర్కొన్నారు.

నలపరాజు శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నికకు పూర్తి స్థాయిలో సహకరించిన మాజీ జెడ్పీటీసీ పాశం రామ్ రెడ్డి గారికి ఈ సందర్భంగా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ అధిష్టానం నమ్మకాన్ని నిలబెడుతూ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీనివాస్ మరింత చురుగ్గా పనిచేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు మరియు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.