/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 68 వ వర్ధంతి Mane Praveen
భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 68 వ వర్ధంతి
నల్లగొండ జిల్లా:
నాంపల్లి: నేడు బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా, మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం  అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారత దేశానికి మహనీయుడు అంబేద్కర్ చేసిన సేవలను వారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దాచేపల్లి నర్సింహా, యువమోర్చ మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్, వడ్లకొండ మల్లయ్య, పొలగోని శ్రీకాంత్ గౌడ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
TG: సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన యూపీ ఉపముఖ్యమంత్రి
HYD: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య,  ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ మేరకు 2025 జనవరి లో ప్రారంభం కాబోయే మహా కుంభమేళాలో పాల్గొనాల్సిందిగా సిఎం ను వారు ఆహ్వానించారు.
NLG: 'నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలి'
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం, మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నీలకంఠం రాములు అధ్యక్షతన జరిగింది. ఈ మేరకు సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ..  ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు లేని ప్రతి పేదవారిని గుర్తించి, పార్టీలకతీతంగా నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని అన్నారు. రేషన్ కార్డు, వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయాలి.

వికలాంగులు సదరం సర్టిఫికెట్ పొంది ఎదురుచూస్తున్నారని గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా, ఈ ప్రభుత్వం  పెన్షన్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు నీలకంఠం రాములు  మైల సత్తయ్య గడగోటి వెంకటేష్ సల్వోజు రామలింగా చారి, కృష్ణయ్య మేడిపల్లి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
NLG: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్
నల్గొండ: నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా, శుక్రవారం పట్టణంలోని భాస్కర్ టాకీస్  వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పలు ప్రజా సంఘాల, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా  పలువురు మాట్లాడుతూ.. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి నేటి సకలజనుల సమాజానికి దిక్సూచి  అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ శ్రీనివాస్, బంజారా నాయకులు కెలావత్ నగేష్ నాయక్, ఎరుకల సంఘం నాయకులు బిక్షం, జర్నలిస్టు రాజశేఖర్, సాగర్ తదితరులు ఉన్నారు.
అంబేద్కర్ 68వ వర్ధంతిని నిర్వహించిన ఆల్ ఇండియా సమతా సైనిక దళ్
నల్లగొండ జిల్లా:
కొండమల్లేపల్లి: మండల కేంద్రంలో ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ నియోజకవర్గ కన్వీనర్ జిల్లా రాములు ఆధ్వర్యంలో, ఇవాళ డాక్టర్ భీమ్ రావు రాంజీ అంబేద్కర్ 68 వ వర్ధంతిని పురస్కరించుకుని, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ మేరకు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డాక్టర్ బుర్రి వెంకన్న, జిల్లా కన్వీనర్ దళిత రత్న మద్దిమడుగు బిక్షపతి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన అందరి చీకటి బతుకుల్లో వెలుగులు నింపిన గొప్ప మహానీయుడని అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ధర్మాపురం శ్రీను, ఆడెపు శోభన్ బాబు  కండెల వెంకన్న, మేదరి ప్రసాద్ చంటి తదితరులు పాల్గొన్నారు.
యరగండ్లపల్లి: బాబా సాహెబ్ అంబేద్కర్ కు నివాళులు అర్పించిన నాయకులు
మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి గ్రామంలో ఇవాళ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆ మహానేతకు నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాడెం శాంతమ్మ వెంకటయ్య, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమ్మల వెంకటేష్, యరగండ్లపల్లి సామాజిక కార్యకర్త యువ నాయకుడు వల్లంల సంతోష్ యాదవ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కురంపల్లి జంగయ్య, గ్యార వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
NLG: మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 68 వ వర్ధంతి  సందర్భంగా, మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు దళితరత్న నాగిల్ల మారయ్య బస్టాండు వద్ద ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

రాజ్యాంగం మనకు రక్షణ కల్పిస్తుంది
ఈ సందర్భంగా  మారయ్య మాట్లాడుతూ..  భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని అన్నారు. ఆ మహనీయుని అందించిన రాజ్యాంగం  మనకు రక్షణ కల్పిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వంపు వెంకటయ్య, కోరే రవి,ఈద కాశి, మచ్చ పోతుల సుధాకర్ , నరేష్ , అభి సందేశ్, వంపు చరణ్, తదితరులు పాల్గొన్నారు,
NLG: ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు విజయవంతం
నల్గొండ : ప్రభుత్వానికి, ప్రజలకు మీడియా వారధిగా నిలవాలని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సంచలనం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని మీడియా లకు అలవాటుగా మారిందని, దానివల్ల మొత్తం మీడియా ఇమేజ్ కు భంగం వాటిల్లుతుందన్నారు. గురువారం నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల హెల్త్ క్యాంపు ను గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం వార్తలు, వృత్తే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా జర్నలిస్టులు చేపట్టడం అభినందనీయమన్నారు. కొత్తగా ఏర్పడిన నల్గొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఇటీవల వనభోజనాలు కూడా ఏర్పాటు చేసుకొని ఒకచోట కలవడం శుభ పరిణామం అని.. జర్నలిస్టులకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని సుఖేందర్ రెడ్డి తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏర్రెడ్ల చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమమే ధ్యేయంగా ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని.. ఇందులో భాగంగానే ఇటీవల కార్తీక వనభోజనాలు, ఇవాళ మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. కోరిన వెంటనే మెడికల్ క్యాంపు నిర్వహణకు ముందుకు వచ్చిన యశోద హాస్పిటల్, తమ విజ్ఞప్తి మేరకు కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.ప్రతి జర్నలిస్టు ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కాగా నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులు సుమారు 200 మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి హెల్త్ క్యాంపు ను సద్వినియోగం చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు మెడికల్ క్యాంప్ జరిగింది. కార్యక్రమంలో భాగంగా యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రఫుల్ కిల్లారు, శిల్పారెడ్డి, చేతన్ వీరమనేని, రాఘవేందర్ గౌడ్, కమల్ తేజ్, భాను తేజ, వినీత.. జర్నలిస్టులకు మరియు వారి కుటుంబ సభ్యులకు మెడికల్ చెక్ అప్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైద్యులకు ప్రెస్ క్లబ్ కార్యవర్గం జ్ఞాపకలు అందజేసి, ఆత్మీయ సన్మానం చేశారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వంగాల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి గుండాల యాదగిరి, కార్యదర్శులు జూలకంటి అశోక్ రెడ్డి, మంజుల, ఉయ్యాల లింగయ్య,
కార్యవర్గం కట్టా సుధాకర్, విజయభాస్కర్, ఉపేందర్, సయ్యద్, రామకృష్ణ, జిల్లా యాదయ్య, అశ్వక్ అహ్మద్, మదనా చారి, జాకీర్ అలీ, బజరంగ్ ప్రసాద్, రవీందర్ రెడ్డి, భాస్కర్, మీసాల శ్రీనివాస్, కనకయ్య, ప్రేమ్, హరి ప్రసాద్, సీనియర్ జర్నలిస్టులు గణేష్, జనార్ధన్ రెడ్డి, ఫణీంద్ర, సత్యనారాయణ, శ్రీధర్, చాంద్, అతీక్ అహ్మద్, అంజయ్య, రాంప్రసాద్, రమేష్, కోటగిరి రామకృష్ణ, ముచ్చర్ల విజయ్, భవాని ప్రసాదు, కంది శ్రీను, కారింగుల శ్రీను, ఖలీం, కత్తుల హరి, రవి, వెంకట్, బాలరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.
NLG: ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు
నల్గొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా, గురువారం తెలంగాణ  రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ  ఆధ్వర్యంలో రీజినల్ మేనేజర్  కె. జాని రెడ్డి సమక్షంలో  ప్రజా పాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాన్ని పట్టణంలోని బస్టాండ్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్రంలోని మహిళలందరికీ ఆధార్ గుర్తింపుతో  పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణం నీరాటంకంగా కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 114.34 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకొని 3856.40 కోట్ల రూపాయలు ఆదా చేశారన్నారు.

మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఏడాది కాలంలో 1389 కొత్త బస్సులు తీసుకురావడం జరిగిందని,  మహాలక్ష్మి పథకం కోసం 822 నూతన బస్సులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు.

అందులో నల్గొండ రీజియన్ కు 96 కొత్త బస్ లు కేటాయించడం, బస్ ఆన్ కాంట్రాక్టు ద్వారా విహార వివాహ శుభకార్యం లకు అద్దె బస్ లపై ధరలు తగ్గించడం జరిగిందని, నల్గొండ జిల్లాకు 75 ఎలక్ట్రికల్ బస్ లు త్వరలో కేటాయించడం జరుగుతుందని, అన్ని బస్ లలో జీపీఎస్ అనుసంధానం చేశామని, బస్ ఎక్కడ వుందో తెలుసుకొనే సదుపాయం కూడా అందుబాటులో ఉందని తెలిపారు.

అన్ని బస్ స్టేషన్ లో ఉచిత టాయిలెట్ల సదుపాయం, అదనంగా కుర్చీలు, ప్యాన్లు, వాటర్ కూలర్స్ ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిసి కి ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ఆర్ధికంగా ముందుకు తీసుకుపోతుందని అన్నారు.

అనంతరం ప్రయాణికులు మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత ప్రయాణం తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని, దీని ద్వారా కొంత డబ్బును ఆదా చేసుకోగలుగుతున్నామని అన్నారు. మహాలక్ష్మి పథకం పేరుతో ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి,  డిప్యూటీ ఆర్ ఎం  (ఎం) శివశంకర్, రీజినల్ పిఓఏ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ మేనేజర్(పి) వి.శ్యామలాదేవి, నల్గొండ డిపో మేనేజర్ శ్రీనాథ్, అసిస్టెంట్ మేనేజర్ హుస్సేన్, ఎం.ప్రభాకర్(ఎల్.ఓ.) మరియు విజిలెన్స్, ఆర్టీసీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ భవన్ ను వినియోగంలోకి తీసుకురండి: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న
నల్లగొండ జిల్లా:
దేవరకొండ: అంబేద్కర్ కమిటీ నూతన హాల్ ప్రజా అవసరాలకు వినియోగంలో లేకపోవడం  చాలా బాధాకరమని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డా.బుర్రి వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ కమిటీ హాల్ పాత భవనం శిఖలావ్యవస్థకు చేరితే పునర్నిర్మానం చేసి ప్రారంభంచి సంవత్సరమవుతున్నా .. నేటికీ పూర్తిస్థాయి వినియోగంలోకి రాకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కమిటీ హాల్ ను ప్రజా అవసరాలకు వాడుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని కోరారు.