/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz సీఎం సెన్సేషనల్ కామెంట్స్ Raghu ram reddy
సీఎం సెన్సేషనల్ కామెంట్స్

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు తెలిపారు. రాబోయే రెండేళ్లలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు కొని హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడుతామన్నారు.

ఆరు గ్యారెంటీలలో భాగంగా డిసెంబర్ 9న ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. కేసీఆర్ ఆనాడు ఆర్టీసీ కార్మికులు చనిపోయినా పరామర్శించని పరిస్థితి లేదని విమర్శలు గుప్పించారు. ఈనాడు కీలకమైన అంశాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రతీ ఆడబిడ్డ ప్రతీ నెలా 5 నుంచి 7 వేలు ఆదా చేయగలుగుతున్నారన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలను రూ.500లకే గ్యాస్ సిలిండర్.. పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రతీ నెలా ఒక కుటుంబానికి 10వేలు ప్రయోజనం పొందేలా పథకాల అమలు జరుగుతోందని వెల్లడించారు.

రాష్ట్రంలో 25లక్షల 35 వేల రైతు కుటుంబాలకు మొదటి ఏడాదిలోనే 21కోట్లతో రైతు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. వరి వేసిన వారికి గిట్టుబాటు ధరతో పాటు సన్నాలకు రూ.500 బోనస్ అందిస్తున్నామన్నారు. 1కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదని.. అందుకే రైతులు సన్నాలు పండించండి అని కోరారు. అలా చేస్తే తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో, రేషన్ షాపుల్లో, మధ్యాహ్న భోజనాలకూ సన్నబియ్యం అందిస్తామన్నారు. ఈ నేలలో పండిన పంటనే మన బిడ్డలకు అందిస్తామన్నారు. బియ్యం రీసైక్లింగ్ మాఫియాను కూకటి వేళ్లతో పేకలిద్దామని అన్నారు.

నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్లు పారిపోతే.. కోర్టుల్లో కేసులు పరిష్కరించి మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉందా? అని ప్రశ్నించారు. ఏ లక్ష్యం కోసం అమరులు ప్రాణ త్యాగం చేశారో.. ఆ లక్ష్య సాధనలో భాగంగా తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. ఇందులో ఒక్క తల తగ్గినా తాను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

నగరంలో కాలుష్య నియంత్రణలో రవాణా శాఖది కీలక పాత్ర అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరగాల్సిన అవసరం ఉందని.. దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు కొని హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడుతామన్నారు.

హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ ఆటోలు నడుపుకునేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో ఒక ప్రణాళిక రూపొందించాలన్నారు. నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చాల్సిన బాధ్యత మనపై ఉందని.. మూసీకి గోదావరిని అనుసంధానం చేసి మూసీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అవసరమైతే కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకునైనా సరే హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని పారదోలుతామని వివరించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా నిలబెట్టేందుకు కృషి చేస్తామన్నారు.

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన భారతీయ రైల్వే

ప్రయాణానికి కొద్దిరోజులు ముందుగానే రిజర్వేషన్ కోసం ప్రయత్నించినప్పటికీ టికెట్లు దొరుకుతాయనే నమ్మకం ఉండదు. అయితే కొంతమందికి మాత్రం ఎలాగోలా ఆర్ఏసీ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. దీన్ని రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్ అని వ్యవహరిస్తారు. ఒక బెర్తును ఇద్దరు పంచుకోవాలి. డబ్బులు మాత్రం పూర్తి టికెట్ కు వసూలు చేస్తారు. నిబంధనల ప్రకారమే అలా చేస్తామని అధికారులు చెబుతుంటారు. ఏసీ బోగీల్లో ప్రయాణించేటప్పుడు ఇటీవలికాలం వరకు ప్రయాణికులు రైలబాగా ఇబ్బంది పడేవారు.

అందుకు కారణం.. వారికి పూర్తి బెడ్ రోల్ కిట్ ను ఇచ్చేవారు కాదు. కానీ ఇకనుంచి ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా పూర్తి బెడ్ రోల్ కిట్ ను ఇస్తున్నారు. దీనికి సంబంధించి రైల్వే అధికారికంగా ప్రకటన చేసింది. పూర్తి టికెట్ డబ్బులు తీసుకోవడంతోపాటు అందులోనే బెడ్ రోల్ కిట్ ఛార్జీలు కూడా వసూలు చేస్తారు. ఇవన్నీ కలిపే టికెట్ ధర ఉంటుంది. దీంతో పూర్తి బెడ్ రోల్ కిట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 2017 నుంచి భారతీయ రైల్వే ఏసీ బోగీల్లో ప్రయాణించేవారికి బెడ్ రోల్స్ ఇవ్వడం ప్రారంభించింది. రెండు బెడ్ షీట్లు, కప్పుకోవడానికి ఒక రగ్గు, దిండు, టవల్ ఇస్తున్నారు. వాస్తవానికి ఏసీ బోగీలో ప్రయాణించడంవల్ల జర్నీ చేసి బాగా అలసిపోయామనే భావన కలగదు. అందుకే చాలామంది ఏసీవైపు మొగ్గుచూపుతుంటారు.

దీంతో భారతీయ రైల్వే కూడా స్లీపర్ బోగీల సంఖ్య తగ్గించి ఏసీ బోగీల సంఖ్య, ముఖ్యంగా థర్డ్ ఏసీ బోగీల సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. దీనిపై విమర్శలు వస్తుండటంతో ఇప్పుడు స్లీపర్ బోగీలు పెంచే ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ప్రతి రైలుకు ఇకనుంచి నాలుగు జనరల్ బోగీలు ఉండేలా చూస్తోంది. ఇప్పటివరకు ముందు ఒకటి, వెనక ఒకటి జనరల్ బోగీ ఉండేది. ప్రయాణికులు వీటిల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లేవారికైతే నరకం కనపడుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న రైల్వే కొత్తగా ఎల్ హెచ్ బీ బోగీలను అందుబాటులోకి తెచ్చింది. వచ్చే రెండు సంవత్సరాల్లో దాదాపు అన్ని సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లకు నాలుగు జనరల్ బోగీలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై హైకోర్టు కీలక ఆదేశాలు

విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనల్లో నివేదికను సమర్పించాలని సూచించింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై దాఖలైన పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలని న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనల్లో నివేదికను సమర్పించాలని సూచించింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది.

భోజనం వికటించిన ఘటనల్లో రెండు కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఏఏజీ కోర్టుకు తెలిపారు. బాధ్యులను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాణ్యమైన భోజనాన్ని అందించడానికి ఏజెన్సీలకు చెల్లించే డబ్బులను 40శాతం పెంచామని వెల్లడించారు. అయితే, పీఎం పోషణ్ పథకంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలుండాలని పిటీషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కమిటీల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. కమిటీలు సరిగ్గా పనిచేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరగా అన్ని కమిటీలు పనిచేస్తున్నాయని ఏఏజీ తెలిపారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌ పీఎస్‌లో విధులకు ఆటంకం కలిగించారంటూ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదు చేశారు. దీంతో గురువారం ఉదయం కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు చేరుకుని ఆయనను అరెస్ట్‌ చేశారు. అనంతరం అక్కడి నుంచి పీఎస్‌కు తరలించారు.

అంతకు ముందు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్‌రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన ఇంట్లోకి ప్రవేశించేందుకు హరీశ్‌రావు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి గేట్లు దూకి వెళ్లేందుకు కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో హరీశ్‌రావును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. హరీశ్‌రావును తరలిస్తున్న వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కౌశిక్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్వేదికగా మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు, కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు. గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు ఏంటని మండిపడ్డారు. ప్రభుత్వం కూలుస్తున్న పేదవారి ఇండ్లకు అడ్డుపడితే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వంలోని వ్యవస్తలను వాడుకొని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు పెడుతున్నారన్నారు. కాసులు మీకు కేసులు మాకు అన్నారు. సూటుకేసులు మీకు..అరెస్టులు మాకా అని ప్రశ్నించారు. మా నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమని తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో నేటితో ప్రజాస్వామ్యం మరణించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించినందుకు తనను అరెస్టు చేశారని ఎక్స్ వేదికగా స్ఫందించన హరీశ్ రావు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందా లేక ఎమ్మర్జెన్సీనా అంటూ ప్రశ్నించారు. తన ఫోన్ ట్యాపింగ్కి గురైందని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పైనే తిరిగి కేసులు పెట్టి అరెస్టు చేశారంటూ మండిపడ్డారు.

ఎమ్మెల్యే అరెస్టును ప్రశ్నించినందుకు తమను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య పాలన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక్షస పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. సీఎం పిట్ట బెదిరింపులకు ఎవరూ భయపడరన్న హరీశ్ రావు.. తెలంగాణ సమాజమే మీకు బుద్ధి చెబుతుందని వ్యాఖ్యానించారు.

జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అవినీతి వ్యవహారాలపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అవినీతి వ్యవహారాలపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు. అదానీ నుంచి ఆయన తీసుకున్న ముడుపుల వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అదానీతో డీల్‌ రద్దు చేయడానికి సీఎం చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ‘అదానీ’తో జగన్‌ సర్కారు చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదానీతో ఒప్పందాన్ని రద్దు చేయాలని సీఈఆర్‌సీకి లేఖ రాశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో బుధవారం షర్మిల విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్‌ రూ.1,750 కోట్ల ముడుపులు తీసుకున్నారు. ఈ అంశంపై అమెరికా కోర్టులో కేసు నమోదైంది. ఇంత జరిగినా కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అదానీ పేరును చంద్రబాబు ఎత్తడమే లేదు. తన పేరెక్కడుందని ప్రశ్నిస్తున్న జగన్‌కు.. అప్పటి సీఎం తానేనని తెలియదా? రాష్ట్రానికి 25 ఏళ్ల పాటు అదానీ పవర్‌ భారమే.

పక్క రాష్ట్రాల్లో యూనిట్‌ రూ. 1.99కు అమ్ముతుంటే.. ఏపీలో 50 పైసలు ఎక్కువగా రూ. 2.49కు ఎందుకు కొన్నారు? జగన్‌ అధికారంలోనికి వచ్చిన వెంటనే చంద్రబాబు చేసిన ఒప్పందాలను రద్దు చేశారు. లాంగ్‌ టర్మ్‌ ఒప్పందాలు ఉండకూడదని ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన జగన్‌.. అధికారంలోనికి వచ్చాక సెకీతో 25 ఏళ్లకు ఒప్పందాలు ఎలా చేసుకున్నారు? మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు. పచ్చ కామెర్లు వచ్చిన వాడిలా బొత్స తీరు ఉంది. నేను వ్యక్తిగత అంశాలు మాట్లాడితే జగన్‌ ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టలేడు. జగన్‌ నిర్లక్ష్యాన్ని, అవినీతిని మాత్రమే నేను ప్రశ్నించాను. అదానీ నుంచి ముడుపుల సంగతి అడిగితే, వివేకా హత్య గురించి మాట్లాడితే గంగవరం పోర్టును ఎందుకమ్మేశారని ప్రశ్నిస్తే పర్సనల్‌ అవుతుందా జగన్‌ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారు. కూటమి అధికారం చేపట్టి ఆరు నెలలు అయింది. సూపర్‌ సిక్స్‌ ఎక్కడ’’ అని షర్మిల ప్రశ్నించారు.

ఏపిలో కొత్తగా 53 కళాశాలలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీలో కొత్తగా 53 జూనియర్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 37 మండలాలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

37 మండలాల్లో 47 కళాశాలలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ఆరు కళాశాలలు ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఏపీ నుంచి బెంగళూరు కు వందేభారత్

ఏపీ నుంచి త్వరలో మరో కొత్త వందేభారత్ అందుబాటులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రయాణీకుల నుంచి ఆదరణ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రారంభించిన వందేభారత్ రైళ్లతో మరిన్ని మార్గాల్లో ప్రారంభానికి డిమాండ్ పెరుగుతోంది. ఇదే సమయంలో విజయవాడ నుంచి గుంటూరు మీదుగా బెంగళూరుకు కొత్త వందేభారత్ ఏర్పాటు పైన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రూట్ పైన ఒక నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే ఈ రైలు ప్రారంభం పైన అధికారికంగా నిర్ణయం వెలువడనుంది.

వందేభారత్ రైళ్లకు తెలుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. విశాఖ - సికింద్రాబాద్ అదే విధంగా సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కు ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపిస్తోంది. ఇక, విజయవాడ నుంచి చెన్నై మధ్య నడుస్తున్న వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరుకు కొత్త సర్వీసు కావాలనే డిమాండ్ పెడింగ్ లో ఉంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న కాచిగూడ - యశ్వంత్ పూర్ వందేభారత్ కు ఆక్యెపెన్సీ రేషియో పెరుగుతోంది. అయితే, ఏపీ నుంచి బెంగళూరుకు కొత్త వందేభారత్ పైన ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి.

తాజాగా, టీడీపీ లోక్ సభ పార్టీ నేత..ఎంపీ లావు శ్రీక్రిష్ణ దేవరాయులు రైల్వే మంత్రితో ఈ లైన్ లో ప్రతిపాదన పైన మరోసారి చర్చించారు. ఇప్పటికే రూట్ .. అవసరాలు.. డిమాండ్ పైన వివరంగా నివేదిక ఇచ్చిన ఎంపీ... తాజాగా పార్లమెంట్ లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. గుంటూరు నుంచి బెంగళూరుకు ప్రస్తుతం రైల్వే ప్రయాణం ఆశించిన స్థాయిలో లేదని.. ప్రయాణీకుల ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గుంటూరు నుంచి బెంగళూరు కు దాదాపు 16 గంటల సమయం తీసుకుంటోందని వివరించారు. దీంతో, ఈ రూట్ లో వందేభారత్ అసవరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన పైన రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఇప్పటికే రైల్వే అధికారులు సైతం ఈ రైలు ఏ మార్గంలో నడపాలనే దాని పైన ప్రాధమికంగా నివేదిక సిద్దం చేసారు. గుంటూరు నుంచి పల్నాడు ప్రాంతం మీదుగా నంద్యాల, డోన్, గుంత కల్లు, అనంతపురం, హిందూపురం, యలహంకలో స్టాపులు ఉండేలా ప్రతిపాదించారు. దీని పైన త్వరలోనే రైల్వే శాఖ అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మార్గం లో కొత్తగా వందేభారత్ నడిపేందుకు సాంకేతిక అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. వీటిని పరిశీలించిన తరువాత ఈ నెలాఖరులో లోగా వందేభారత్ కొత్త రైలు పైన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.

డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది ముగిసిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈనెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసారు. తొమ్మిదో తేదీ ఉదయం పదిన్నర గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది ముగిసిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోన్న నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ సమావేశాల్లో ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, థర్మల్‌ పవర్‌ప్లాంట్లపై న్యాయ విచారణ కమిషన్‌ ఇచ్చిన నివేదిక, ఫోన్‌ట్యాపింగ్ తదితర అంశాలను చర్చకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఈ నెల 7 నుంచి 9 వరకు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. చివరి మూడు రోజుల్లో ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ నుంచి పీవీ మార్గ్‌ వరకు ఐదుచోట్ల ప్రత్యేక వేదికలపై భిన్న రీతుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, డ్వాక్రా సంఘాల వారు ఏర్పాటు చేయనున్న 120 ఫుడ్, హస్తకళల స్టాళ్లు 3 రోజులపాటు కొనసాగుతాయన్నారు. ఐమాక్స్‌ HMDA గ్రౌండ్స్‌లో 7న వందేమాతరం శ్రీనివాస్‌ బృందంతో, 8న రాహుల్‌ సిప్లిగంజ్‌తో, 9న తమన్‌తో సినీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. చివరిరోజు సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని సీఎస్ వెల్లడించారు.

ఉత్సవాల ముంగిపు సందర్బంగా భారీ ఎత్తున డ్రోన్, లేజర్, కాక్రర్స్ ప్రదర్శనలు ఉంటాయని అన్నారు. ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు లక్ష మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి సంబంధిత డిపార్ట్‌మెంట్ అధికారులతో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు.

ఎల్లుండి మళ్లీ అల్పపీడనం

ఫెంగల్‌ తుఫాను ప్రభావం నుంచి బాధితులు ఇంకా కోలుకోక ముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈనెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు మంగళవారం వెల్లడించారు.

ఫెంగల్‌ తుఫాను ప్రభావం నుంచి బాధితులు ఇంకా కోలుకోక ముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈనెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు మంగళవారం వెల్లడించారు. ఇది బలపడి శ్రీలంక తీరం దిశగా వెళుతుందని అంచనా వేశారు. రానున్న రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుందన్నారు. కాగా, మూడు రోజుల క్రితం తీరం దాటిన ఫెంగల్‌ తుఫాన్‌ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి మంగళవారం అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. అయినప్పటికీ రాష్ట్రాన్ని వర్షాలు వదలడం లేదు.

తుఫాన్‌ ప్రభావంతో సముద్రం నుంచి భారీగా తేమ రావడంతో తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ప్రకాశం జిల్లా కనిగిరిలో 97, చిత్తూరు జిల్లా కటికిపల్లిలో 84, పెనుమూరులో 82, అనంతపురం జిల్లా ఈస్టు కందిపల్లిలో 82, తిరుపతి జిల్లాలో పాకాలలో 71, చిత్తూరు జిల్లా అరగొండలో 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నాగేంద్రపురంలో 73, శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలో 71 మి.మీ. వర్షపాతం నమోదైంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. తరువాత రెండు, మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వివరించారు.

తెలంగాణలో భూ ప్రకంపనలు

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఏపీలోని కృష్ణా, ఏలూరు జిల్లాలతో పాటుగా.. తెలంగాణలోని పలు జిలాల్లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఓ రెండు, మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

తెలంగాణలోని భూప్రకంపనలు స్థానికులను కలవరపాటుకు గురి చేశాయి. పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సుమారు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఇవాళ ఉదయం 7.25 గంటల నుంచి 7.28 గంటల మధ్య భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక హడలిపోయారు. ఖమ్మం, మహబూబాబాద్‌, నల్గొండలోని కొన్ని ప్రాంతాలు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, చర్ల, చింతకాని, నాగులవంచ, మణుగూరు, భద్రాచలం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.

ఉదయం 7.25 గంటల సమయంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఉత్తరం నుంచి దక్షిణం, దక్షిణం నుంచి ఉత్తరానికి కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రజలు తెలిపారు. హఠాత్తుగా భూమి కంపించటంతో ప్రజలు హడలిపోయారు. అసలేం జరగుతోందో అర్థం కాక.. భయంతో వణికిపోయారు. ముఖ్యంగా ఇంట్లో వంట సామాగ్రి, వస్తువులు ఉన్నట్లుండి కింద పడిపోవంతో ప్రజలు హడలిపోయారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో నగర ప్రజలు భయంతో వణికిపోయారు.

ఏపీలోని కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. ప్రధానంగా గోదావరి పరివాహాక ప్రాంతంతో పాటుగా.. కోల్ బెల్ట్ ఏరియాలో ఎక్కువగా భూమి కంపించినట్లు అధికారులు చెపుతున్నారు. రికార్డు స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. భూమి లోపల 40 కి.మీ లోపల ఈ రేడియేషన్ ఉద్భవించి ఉంటుందని తెలిపారు. మహారాష్ట్ర ఛత్తీస్‌గడ్‌లోనూ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. గడ్చిరౌలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. తెలంగాణలో భూకంపాలు రావటం చాలా అరుదు అని.. అటువంటింది 5.3 తీవ్రతతో భూమి కంపంచటం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.