/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz రైల్వేకు శ్రీవారి భక్తుల స్పెషల్ రిక్వెస్ట్ Raghu ram reddy
రైల్వేకు శ్రీవారి భక్తుల స్పెషల్ రిక్వెస్ట్

కలియుగ ప్రత్యక్ష దైవం శేషాచల కొండలలో కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం లక్షలాది మంది ప్రజలు తిరుమల శ్రీవారి ఆలయానికి వెళుతుంటారు. ఇక అటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకు కావలసిన వసతులను కల్పించడంలో టిటిడితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ, అలాగే రైల్వే శాఖ కూడా ఎప్పటికప్పుడు విస్తృతమైన ఏర్పాట్లను చేస్తూనే ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం వారి అవసరాలను తెలుసుకొని తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది.

అయితే తాజాగా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు రైల్వే శాఖకు ఒక కీలక విజ్ఞప్తిని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులను కలిగి ఉన్న తిరుమల శ్రీవారి ఆలయానికి దర్శనం కోసం వెళ్లే భక్తులు రేణిగుంట రైల్వే స్టేషన్ విషయంలో దక్షిణ మధ్య రైల్వేకు విజ్ఞప్తి చేస్తున్నారు. రేణిగుంట రైల్వేస్టేషన్ లో చిన్నపాటి వర్షం పడినప్పటికీ వర్షపునీరు నిలిచిపోతుందని, చిన్నపాటి నీటి గుంటలాగా ఆ ప్రాంతం మారుతుందని చెబుతున్నారు.

భక్తులు వర్షపు నీళ్లలో నుండే నడవాల్సిన పరిస్థితి వస్తుందని తిరుమలకు వెళుతున్న శ్రీవారి భక్తులు వాపోతున్నారు.భారతదేశంలో భౌగోళికంగా నలు దిక్కులకు ప్రయాణించడానికి సామర్థ్యం కలిగి ఉన్న మేజర్ జంక్షన్ అయిన రేణిగుంట రైల్వే స్టేషన్ ప్రాంగణం బయట వర్షం పడితే వచ్చే వర్షపు నీరు అలాగే అక్కడ వినియోగించే వ్యర్ధ జలాలు పోవడానికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

మురికి కాలువలలోని మురుగునీరు వర్షపు నీటితో కలిసి రేణిగుంట రైల్వే స్టేషన్ ప్రాంగణం మురుగునీటి గుంటను తలపిస్తుందని వారు చెప్తున్నారు. ఈ మురుగునీటి గుంటలో నుండి నడుచుకుంటూ వెళ్లాలంటే భక్తులకు అసౌకర్యంగా ఉందని వారు వాపోతున్నారు. దీనిపైన రైల్వే అధికారులు చొరవ చూపించాలని వారు కోరుతున్నారు.

నిఖేష్‌ కుమార్‌ బాగోతం

సింగిల్‌ విండో అవినీతి గురించి ఎప్పుడైనా విన్నారా.. ఇరిగేషన్‌ శాఖలో ఏఈఈగా పని చేస్తూ సస్పెండైన ఓ వ్యక్తి.. దీనికి తెర తీశాడు. తన పై అధికారుల తరఫున కూడా ఆయనే రేటు మాట్లాడి అనుమతులు మంజూరు చేయించేవాడు. ఏసీబీ సోదాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అవినీతి కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఇరిగేషన్‌ విభాగం అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ) నిఖేశ్‌కుమార్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది.

సస్పెండ్ (Suspended) అయిన ఇరిగేషన్ ఏఈఈ (Irrigation AEE) నిఖేష్‌ కుమార్‌ (Nikesh Kumar) బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ (ACB) అధికారులు గుర్తించారు. శనివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఆయన నివాసంతోపాటు అతడి బంధువులు, స్నేహితుల నివాసాలు, కార్యాలయాల్లో కలిపి మొత్తం 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆస్తులకు సంబంధించిన పలు పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిఖేష్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు ఆదివారం ఉదయం 6 గంటలకు ఏసీబీ జడ్జి నివాసంలో నిఖేష్‌ను హాజరపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఈనెల 13 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో నిఖేష్‌ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

సింగిల్‌ విండో అనుమతుల మంజూరు గురించి విని ఉంటాం.. కానీ, సింగిల్‌ విండో అవినీతి గురించి ఎప్పుడైనా విన్నారా? ఇరిగేషన్‌ శాఖలో ఏఈఈగా పని చేస్తూ సస్పెండైన ఓ వ్యక్తి.. దీనికి తెర తీశాడు. తన పై అధికారుల తరఫున కూడా ఆయనే రేటు మాట్లాడి అనుమతులు మంజూరు చేయించేవాడు. ఏసీబీ సోదాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అవినీతి కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఇరిగేషన్‌ విభాగం అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ) నిఖేశ్‌కుమార్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. గండిపేట జోన్‌లో ఏఈఈగా విధులు నిర్వహిస్తున్న హేరూర్‌ నిఖేష్‌ కుమార్‌.. ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వటానికి ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఈ ఏడాది మే 30న పట్టుకున్నారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న నిఖేష్‌ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శనివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు నిఖేష్‌ నివాసంతోపాటు అతడి బంధువులు, స్నేహితుల నివాసాలు, కార్యాలయాల్లో కలిపి మొత్తం 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆస్తులకు సంబంధించిన పలు పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదు ప్రాంతాల్లో ఇంటి స్థలాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఖరీదైన అపార్ట్‌మెంట్లలో ఆరు ఫ్లాట్లు, రెండు వ్యాపార సముదాయాలు నిఖేష్‌ కుమార్‌కు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రకారం స్థిర, చర ఆస్తులు కలిపి మొత్తం రూ.17.74 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. మార్కెట్‌ ధర ప్రకారం వీటి విలువ రూ.150 కోట్లకుపైగా ఉంటుందని భావిస్తున్నారు. సోదాల్లో గుర్తించిన ఆస్తులు కాకుండా బంగారం, బ్యాంకు లాకర్లు, బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలపైనా ఏసీబీ విచారణ కొనసాగుతోంది.

పదేళ్ల క్రితం ఇరిగేషన్‌ శాఖలో చేరిన నిఖేష్‌ కుమార్‌ 2021 నుంచి గండిపేట జోన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గండిపేట జోన్‌ హైదరాబాద్‌ శివారుప్రాంతం కావడంతో అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. చెరువులు, కుంటల సమీపంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నిర్మాణాలు చేపట్టేందుకు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిబంధనలు ఆటంకంగా ఉండటంతో.. వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి ఎన్‌ఓసీ ఇచ్చేలా నిఖేష్‌ డీల్‌ కుదుర్చుకునేవాడని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. పేరుకే ఏఈఈగా విధులు నిర్వహిస్తున్నా.. తన పై అధికారుల్ని సైతం ఒప్పించి ఫైల్‌ ఓకే చేయించేలా ఏకమొత్తంలో బేరం కుదుర్చుకునేవాడని తేలింది. కొన్ని సందర్భాల్లో ఒక్కో ఎన్‌ఓసీకి రూ.50 లక్షల వరకు కూడా వసూలు చేసినట్లు సమాచారం. వసూలు చేసిన మొత్తంలో సగానికిపైగా తాను తీసుకుని మిగిలిన దాంట్లో పైఅధికారులకు వాటాలు ఇచ్చేవాడని తెలుస్తోంది. కొత్తూరు మండలం సిద్దాపూర్‌లో రూ.2.50 కోట్ల విల్లాను నిఖేష్‌ కొన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇరిగేషన్‌ విభాగంలో ఆయనతోపాటు పనిచేసే మరో ఐదుగురికి కూడా ఇక్కడే విల్లాలు ఉన్నాయి. దీనిపైనా ఏసీబీ విచారణ జరుపుతోంది.

అక్రమంగా సంపాదించిన మొత్తాన్ని కాపాడుకోవడానికి నిఖేష్‌ బినామీలను పెట్టుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. దీంట్లో భాగంగా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తన చిన్ననాటి స్నేహితులను, బంధువులను ఎంచుకునేవాడు. వారికి రూ.5-10 లక్షల వరకు సహాయం చేసి వారి పేరుతో విలువైన ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు ఏసీబీ సోదాల్లో వెల్లడైంది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాల ఆధారంగా బినామీలకు నోటీసులు జారీ చేసి విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారు. 2021 నుంచి ఇప్పటి వరకు గండిపేట జోన్‌లో ఇరిగేషన్‌ విభాగం జారీ చేసిన అన్ని ఎన్‌ఓసీలపైనా ఏసీబీ దృష్టి సారించింది. నిఖేశ్‌తోపాటు ఉన్నతాధికారుల ప్రమేయంపైనా లోతుగా విచారణ జరుపుతోంది.

లగచర్లలో భూ సేకరణ కోసం మరో నోటిఫికేషన్

లగచర్లలో భూ సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. లగుచర్ల, పోలేపల్లి, హకీంపేట పరిధిలో ఫార్మా విలేజ్ స్థానంలో మల్టిపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సర్కార్ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమిని సమీకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలియజేసింది.

లగచర్ల (Lagacharla)లో భూ సేకరణ కోసం (Land Acquisition ) తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.,) మరో నోటిఫికేషన్ (Another notification) విడుదల (Release) చేసింది. లగచర్లలో మల్టిపర్ఫస్ ఇండస్ట్రీయల్ పార్క్ కోసం ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించింది. లగచర్లలో మొత్తం 497 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బహిరంగ ప్రకటనను వికారాబాద్ జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. నిన్న లఘచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లి గ్రామంలో 71.89 ఎకరాల భూ సేకరణకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. తాజాగా దూద్యాల మండలంలో మరో 497 ఎకరాల భూసేకరణకు ఆదివారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. లగచర్ల, పోలేపల్లిలో ఫార్మా విలేజ్ భూ సేకరణ కోసం గత ఆగస్టులో ఇచ్చిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వాపస్ తీసుకుంది. ఆ స్థానంలో మల్టి పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది.

వికారాబాద్ జిల్లా లగుచర్ల, పోలేపల్లి, హకీంపేట పరిధిలో ఫార్మా విలేజ్ స్థానంలో మల్టిపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సర్కార్ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమిని సమీకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలియజేసింది. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచర్లలో 110.32 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది.

జిల్లాలో భూసేకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఇచ్చిన కొత్త నోటిఫికేషన్‌లో పలు జాగ్రత్తలు తీసుకుంది. భూములు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్న రైతుల నుంచి మొదట భూసేకరణ చేస్తామని తెలిపారు. సర్వే నెంబర్, రైతు పేరుతో సహా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. బలవంతంగా భూములు లాక్కోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ స్థానంలో మల్లీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు‌కు ప్లాన్ చేస్తోంది. ప్రజల అంగీకారంతోనే భూసేకరణ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

వికారాబాద్ జిల్లా లగుచర్ల, పోలేపల్లి, హకీంపేట పరిధిలో ఫార్మా విలేజ్ స్థానంలో మల్టిపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సర్కార్ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు మల్టిపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమిని సేకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలియజేసింది. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచర్లలో 110.32 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే పోలేపల్లి గ్రామంలో 71.89 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. భూసేకరణ చట్టం 2013 సెక్షన్ 11 ప్రకారం నోటిఫికేషన్‌ను వికారాబాద్ జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఆ మేరకు బహిరంగ ప్రకటన విడుదలైంది. భూములు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్న రైతుల నుంచి మొదట భూసేకరణ చేయనుంది. సర్వే నంబర్, రైతు పేరుతో సహా భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. లగచర్ల, పోలేపల్లిలో ఫార్మా విలేజ్ భూసేకరణ కోసం గత ఆగస్టులో ఇచ్చిన ఇచ్చిన నోటిఫికేషన్ ప్రభుత్వం వాపస్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో మల్టి పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌కు ప్లాన్‌ను సిద్ధం చేసింది. ప్రజల అంగీకారంతోనే భూ సేకరణ చేస్తామని.. బలవంతంగా భూములు లాక్కోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

లగచర్ల, పోలేపల్లిలో ఫార్మా విలేజ్ భూసేకరణ కోసం గత ఆగస్టులో ఇచ్చిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు శుక్రవారం వికారాబాద్‌ కలెక్టర్ ప్రకటనను విడుదల చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చిన జిల్లా కలెక్టర్‌పై గ్రామస్థులు దాడి చేయడం ఎంతటి చర్చకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. ఈ దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సహా 28 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల చర్యలపై గ్రామస్థులు ఢిల్లీకి వెళ్లి మానవ హక్కుల కమిషన్‌‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషన్‌ బృందాలు రాష్ట్రానికి వచ్చి విచారణ జరిపింది. ఈ క్రమంలో ఫార్మా విలేజ్ నిర్ణయంపై సర్కార్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దాని స్థానంలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌‌ను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.

ఫెంగల్‌ అలజడి

ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి.

ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండగా, మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ, అక్కడక్కడా కుంభవృష్టి వర్షాలు కురిశాయి. శనివారం రాత్రి మహాబలిపురం, కారైక్కాల్‌ మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫాను తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కి.మీ. వేగంతో గాలులు వీచినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. విశాఖ, తిరుపతిత్లో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తడ మండలం భీములివారిపాలెంలో 131.5 మిల్లీమీటర్లు, సూళ్లూరుపేట మండలం మన్నార్‌పోలూరులో 128.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే పుత్తూరు మండలం కేఎం అగ్రహారంలో 116, దొరవారిసత్రంలోని పూలతోటలో 114, తడలో 108, చిత్తమూరు మండలం మల్లంలో 103, నగరిలో 92 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు మల్లంలో 111.5, అల్లంపాడులో 103.5, విద్యానగర్‌లో 98.5 మి.మీ. వర్షం కురిసింది. నెల్లూరు జిల్లావ్యాప్తంగా శనివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది.

ఉదయం నుంచి ఎడతెరపిలేని వర్షం కురవడంతో కాలువలు, రోడ్లు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షానికితోడు చలితీవ్రత పెరగడంతో వృద్ధులు, పిల్లలు వణికిపోతున్నారు. ఆది, సోమవారాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం వద్ద సముద్రం 20 అడుగులు ముందుకు వచ్చింది.

తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం గోవర్థనపురం సమీపంలో నేరేడు కాలువ పొంగి ప్రవహిస్తోంది. 40మంది ప్రయాణికులతో వచ్చిన ఆర్టీసీ బస్సు కాజ్‌వేపై నీటి ఉధృతిలో చిక్కుకుని ఆగిపోయింది. బస్సులో ఉన్నవారిని గ్రామస్థులు క్షేమంగా గట్టుకు చేర్చారు.

ఆది సోమవారాల్లో దక్షిణ కోస్తా రాయలసీమల్లో అనేకచోట్ల ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం సూచించింది. కృష్ణపట్నం ఓడరేవులో 6వ నంబరు డేంజర్‌ సిగ్నల్‌ నిజాంపట్నం మచిలీపట్నం విశాఖపట్నం కాకినాడ గంగవరం భీమునిపట్నంలో మూడో నంబరు హెచ్చరిక ఎగురవేశారు

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం ఉప్పొంగుతోంది. ఈదురుగాలులతో పాటు హోరున వర్షం కురుస్తోంది. సముద్రంలో కెరటాలు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తులో దూసుకొస్తున్నాయి. కెరటాలు భూమిలోపల నుంచి కోరుకుంటూ రావడంతో ఉప్పాడ పాత బజారు, మాయాపట్నం, సూరాడపేట, జగ్గరాజుపేట, అమీనబాద్‌, కొత్తపట్నం తదితర తీరప్రాంత గ్రామాల్లో మత్స్యకారులకు చెందిన ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. తిరుపతి జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. 30 విద్యుత్‌ స్తంభాలు, రెండు ఇళ్లు కూలిపోయాయి. రేణిగుంట మండలంలోని మల్లిమడుగు రిజర్వాయర్‌, కేవీబీపురం మండలంలోని కాళంగి రిజర్వాయర్‌ నిండిపోయాయి. వాగులు, వంకల్లో ప్రవాహాలు మొదలయ్యాయి. 30 చెరువులు నిండిపోయి కలుజులు పారుతున్నాయి.

పలు మండలాల్లో వరి పొలాలు నీట మునిగాయి. 15 చోట్ల కాజ్‌వేలపై నీటి ఉధృతి పెరగడంతో రాకపోకలు నిలిపివేశారు. తిరుపతి జిల్లావ్యాప్తంగా 62 ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు. ఇండిగో, స్పైస్‌ జెట్‌, ఎయిర్‌ అలయెన్స్‌, స్టార్‌ ఎయిర్‌ లైన్స్‌ సంస్థలకు చెందిన 11 విమాన సర్వీసులు రద్దు చేశారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానం రేణిగుంటలో ల్యాండ్‌ కాలేకపోవడంతో బెంగళూరుకు మళ్లించారు. విశాఖపట్నంలోనూ వాతావరణం అనుకూలించక పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై-విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమాన సర్వీసులను రద్దు చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచి తిరుపతి జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా వరి కోతలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లాలో అక్కడక్కడ రహదారులపై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.

విశాఖపట్నం నగరంలోని ప్లాస్టిక్‌ వ్యర్థాలన్నీ సముద్రంలోకి చేరుతున్నాయి. తుఫాన్‌తో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఆ వ్యర్థాలన్నీ తీరానికి కొట్టుకువచ్చాయి. దీంతో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఏరుకునేవారు సంచులు పట్టుకొని తీరంవైపు పరుగు తీస్తున్నారు. వారి సంచులు క్షణాల్లో నిండిపోతున్నాయి. జోడుగుళ్లపాలెం బీచ్‌లో శనివారం ఉదయం కనిపించిన దృశ్యమిది.

ఉసూరుమనిపించిన రైతు పండుగ

రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో ఆడంబరంగా నిర్వహించిన రైతు పండు గ యావత్‌ తెలంగాణ రైతాంగాన్ని ఉసూరుమనిపించిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించా రు.

రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో ఆడంబరంగా నిర్వహించిన రైతు పండు గ యావత్‌ తెలంగాణ రైతాంగాన్ని ఉసూరుమనిపించిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించా రు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి రైతులందరికీ రుణమాఫీ, వానాకాలంతో పాటు యాసంగికి కలిపి ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా ప్రకటిస్తారనుకుంటే మరోసారి మొండిచెయ్యి చూపారన్నారు. కౌలు రైతులు, ఉపాధి కూలీలకు రైతుబంధు అతీగతీ లేకుండా పోయిందని పేర్కొన్నారు. రైతు పండుగలో సీఎం ప్రసంగం చూస్తే రైతుల పట్ల ప్రేమకంటే గిరిజనుల నుంచి భూసేకరణ చేయడంలో ఘోరంగా విఫలమయ్యామనే ఆవేదనే కనిపించిందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాలని సీఎం చెబుతున్నారని, వారిని బెదిరిస్తున్నారని విమర్శించారు.

అసెంబ్లీకి రమ్మని సీఎం తెగ పిలుస్తున్నారని తాము ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ ఏడాది పాలన అసలు రంగు బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, మైకులు కట్‌ చేయకుం డా సమయం కేటాయించే దమ్ముందా అని ప్రశ్నించారు.

రైతుబంధు పథకాన్ని శాశ్వతంగా బందుపెట్టే కుట్రకు తెరతీయడం సిగ్గుచేటని విమర్శించారు. రైతుబంధు కంటే సన్నాలకు ఇచ్చే రూ.500 బోనసే మేలు అని రైతులు చెబుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి చెప్పడం శోచనీయమన్నారు.

కొండా సురేఖను తెలంగాణ సమాజం తిరస్కరించిందని, ఆమెకు మంత్రిగా ఉండే అర్హత లేదని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. ఆమె సంస్కారం లేకుండా మాట్లాడుతున్న తీరును ప్రజలు గుర్తించారని, ఆమె కుటుంబం గురించి వరంగల్‌ ప్రజలకు తెలుసన్నారు. తాను ప్రభుత్వ హాస్టల్‌లో చదువుకుని ఐపీఎస్‌ అయ్యానని, దేశ సేవ చేయడంతో పాటు ఏడేళ్ల సర్వీస్‌ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

రాష్ట్రంలో గురుకుల విద్యా వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. సంవత్సర కాలంగా విద్యా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు లేరని, సమస్యలపై విద్యార్థులు రోడ్డెక్కుతున్నారని పేర్కొన్నారు.

ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు హతం

తెలంగాణ అడవుల్లో మరోసారి తుపాకీ తూటాలు పేలాయి. ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చల్పాక అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగ్గా.. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం.

తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టగా.. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగ్గా.. ఏడుగురు నక్సల్స్ మృతి చెందినట్లు తెలిసింది. మృతుల్లో మావోయిస్టు కీలక నేత బద్రు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రాద్రి-ములుగు జిల్లాల సరిహద్దుల్లోని గుండాల, కరికగూడెం మండలాల పరిధిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో గ్రేహండ్స్ బలగాలు అడవిలో కూబింగ్ చేపట్టగా... వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరగాయి. ఈ కాల్పుల్లో లచ్చన్న దళానికి చెందిన ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.

తెలంగాణలో చాలా కాలంగా మావోయిస్టుల కదలికలు అంతగా లేవనే చెప్పొచ్చు. పోలీసులు తెలంగాణ సరిహద్దుల్లోని అడవిని జల్లెడ పడుతుండటంతో వారి కదలికలు తగ్గాయి. అడపాదడపా ఎన్‌కౌంటర్లు జరిగినా.. ఈ స్థాయిలో మాత్రం మావోయిస్టులు హతం కాలేదు. సెప్టెంబర్‌లో ఆరుగురు, ప్రస్తుతం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందటం నక్సల్స్‌కు ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలను అలర్ట్ చేశారు. అనుమానస్పద వ్యక్తులు, మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచాలని చెప్పారు.

ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణ్ పూర్ – దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేశ్ అలియాస్ విష్ణు హతమయ్యాడు. మెుత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 250కు పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.

వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. దాదాపు హత్య జరిగి ఐదేళ్లు గడిచినా ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. ఈ హత్య చేసిందేవరో కోర్టు తుది తీర్పు తర్వాతనే తేలనుంది. సీబీఐ సుదీర్ఘకాలంగా కేసును విచారిస్తోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ కేసు విచారణలో స్పీడ్ తగ్గింది.

వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy)కి సుప్రీం కోర్టు (Supreme Court ) నోటీసులు (Notices) జారీ చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case)లో నిందితుడు భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) బెయిల్ (Bail) మంజూరు చేసింది. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ (CBI) సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం సిజెఐ సంజీవ్ ఖన్నా (CJI Sanjeev Khanna) నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. అనంతరం భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీచేస్తూ... తదుపరి విచారణ మార్చికి వాయిదా వేసింది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. దాదాపు హత్య జరిగి ఐదేళ్లు గడిచినా ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. ఈ హత్య చేసిందేవరో కోర్టు తుది తీర్పు తర్వాతనే తేలనుంది. సీబీఐ సుదీర్ఘకాలంగా కేసును విచారిస్తోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ కేసు విచారణలో స్పీడ్ తగ్గింది. వాస్తవానికి వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినా.. కుదరలేదు. చివరికి తెలంగాణ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పొందడంతో అవినాష్ అరెస్ట్ విషయం వెనక్కి వెళ్లిపోయింది. ఇంత జరుగుతున్నా.. వివేకానంద రెడ్డి హత్య ఎందుకు జరిగింది.. ఈ హత్యలో ఎవరు పాత్రదారులు.. ఎవరు సూత్రదారులు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. చట్టప్రకారం దర్యాప్తు సంస్థలు విచారణ పూర్తి చేసి సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించిన తర్వాత.. న్యాయస్థానం తీర్పు తర్వాత ఈ హత్యలో దోషులు ఎవరో అధికారికంగా తేలుతుంది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు సీబీఐ విచారణ మందగించింది. ఓవైపు ఎన్నికల సమయం కావడంతో కొంత గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లుగా సీబీఐ ఈ కేసులో అసలు నిందితులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినా.. గత వైసీపీ ప్రభుత్వం ఏదో విధంగా వారి విధులకు ఆటంకం కలిగిస్తూనే ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నిందితులను కాపాడేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు సక్రమంగా జరగకుండా మాజీ సీఎం జగన్ కుట్రలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఏకంగా సీబీఐ అధికారులపై కేసులు నమోదు చేసిన సందర్భాలు చూశాము. దర్యాప్తు సంస్థల అధికారుల నైతికతను, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం గత వైసీపీ ప్రభుత్వం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ అధికారంలో లేదు. జగన్ ప్రజల మద్దతును కోల్పోయారు. ఈ నేపథ్యంలో సీబీఐ వివేకా కేసు దర్యాప్తును వేగవంతం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై విశ్వాసం లేదని.. నిందితులను ప్రభుత్వం కాపాడే అవకాశం ఉందన్న అనుమానంతో వివేకా కుమార్తె సునీత కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు దర్యాప్తును న్యాయస్థానం సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తుతో అసలు విషయాలు బయటకు వస్తాయని అంతా భావించారు. అనుకున్నట్లుగానే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఈ హత్యలో ఉన్నట్లు సీబీఐ ప్రాథమికంగా ఆధారాలు సేకరించిందనే ప్రచారం జరిగింది. గూగుల్ టేకవుట్, టైమ్ లైన్ ఆధారంగా అవినాష్‌ రెడ్డికి ఈ హత్యతో ప్రమేయం ఉన్నట్లు సీబీఐ నిర్థారణకు వచ్చిందన్న ప్రచారం జరిగింది. కానీ అవినాష్ రెడ్డిని ఇప్పటిరవకు ఈ కేసులో అరెస్ట్ కాలేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుతూ వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

అవినాష్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని సీబీఐ అధికారులు విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని.. అదే జరిగితే మాజీ సీఎం జగన్‌తో పాటు ఆమె భార్య భారతి ఇరుక్కునే అవకాశం ఉండటంతోనే అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఎంపీ టికెట్ కోసమే ఈ హత్యను చేసినట్లు కేసులోని కొందరు సాక్ష్యులు, నిందితులు ఇప్పటికే చెప్పారు. దీంతో ఈ విషయం బయటకు వస్తే వైసీపీతో పాటు జగన్ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉండటంతోనే జగన్ నిందితులకు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీకి త‌ప్పిన తుపాను ముప్పు

ఏపీకి తుపాను ముప్పు లేద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంత‌రం చెంద‌లేద‌ని, ఇది ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా బ‌ల‌హీన‌ప‌డుతుంద‌న్నారు.

ఇది గురువారం సాయంత్రానికి శ్రీలంక‌లోని ట్రింకోమ‌లీకి 200 కి.మీ, నాగ‌ప‌ట్ట‌ణానికి 340, చెన్నైకి 470, పుదుచ్చేరికి 410 కి.మీ. దూరంలో కేంద్రీకృత‌మై ఉంది.  

రేపు (శ‌నివారం) ఉద‌యం క‌ల్లా కారైకాల్‌, మ‌హాబ‌లిపురం మ‌ధ్య‌లో తీరం దాట‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. అయితే, తుపాను ముప్పు లేకున్నా వాయుగుండం ప్ర‌భావంతో ఈరోజు రేపు ద‌క్షిణ కోస్తా రాయ‌ల‌సీమ‌లో అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

నెల్లూరు జిల్లాలో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు రావొచ్చ‌ని హెచ్చ‌రించింది.

దిలావల్‌పూర్ ఇథనాల్ కంపెనీ ఎపిసోడ్

నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటు అంశం తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌పై సర్కార్ సీరియస్ అయ్యింది. గత ప్రభుత్వ అండతో పీఎంకే డిస్టలరీ కంపనీ నిబంధనలు తుంగలో తొక్కిందని ఫైర్ అయ్యింది. ప్రభుత్వ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈసీ తీసుకునే విషయంలో సదరు కంపనీ కేంద్రాన్ని, పర్యావరణ శాఖను మోసం చేసినట్లు గుర్తించింది. 2023, డిసెంబర్ 7కు ముందే టీఎస్-ఐపాస్ (TS-iPASS) ద్వారా ఆ కంపెనీకి అనుమతులు జారీ అయినట్లు సర్కార్ చెబుతోంది.

నిర్మల్ జిల్లా దిలావల్పూర్ ఇథనాల్ కంపనీ ఎపిసోడ్‌పై ప్రభుత్వం (Telangana Govt) సీరియస్ అయ్యింది. ఆ కంపెనీకి అనుమతులు నిబంధనల ఉల్లంఘన వ్యవహారాలపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతి ఇచ్చిందని.. అప్పటి ప్రభుత్వ అండతో పీఎంకే డిస్టలరీ కంపనీ నిబంధనలు తుంగలో తొక్కిందని ఫైర్ అయ్యింది. ప్రభుత్వ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈసీ తీసుకునే విషయంలో సదరు కంపనీ కేంద్రాన్ని, పర్యావరణ శాఖను మోసం చేసినట్లు గుర్తించింది. 2023, డిసెంబర్ 7కు ముందే టీఎస్-ఐపాస్ (TS-iPASS) ద్వారా ఆ కంపెనీకి అనుమతులు జారీ అయినట్లు సర్కార్ చెబుతోంది. పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఫ్యూయల్ ఇథనాల్‌కు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది.. కానీ ఇథనాల్, ఎక్స్ ట్రా న్యూటల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ లాంటి అన్ని ఉత్పత్తులకు అప్పటి మంత్రివర్గం అనుమతి ఇవ్వడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి.

కేసీఆర్ ప్రభుత్వం పీఎంకే కంపెనీకి అనుకూలంగా మంత్రివర్గంలోనే అడ్డగోలు అనుమతులు జారీ చేసిందని రేవంత్ సర్కార్ చెబుతోంది. ఫ్యూయల్ ఇథనాల్ సాకు చూపించి ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మినహాయింపు పొందేందుకు ఇథనాల్ కంపనీ అడ్డదారులు తొక్కినట్లు గుర్తించింది. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం అక్కడి స్థానిక సంస్థల నుంచి ఎన్‌వోసీ తీసుకోవడం తప్పనిసరి. ఎన్‌వోసీ తీసుకోకుండానే పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. అప్పట్లోనే ప్రహరి నిర్మించేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతోనే పర్యావరణ అనుమతుల నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘించిందనేది సర్కార్ వారి మాట.

2022, అక్టోబర్ 22న 600 లక్షల లీటర్ల ఇథనాల్ / ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్/ ఇండస్ట్రియల్ స్పిరిట్స్ / అబ్సల్యూట్ ఆల్కహాల్ తయారీకి లెటర్ ఆఫ్ ఇండెంట్ కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసింది. అప్పటి ప్రభుత్వం కేబినేట్ ఆమోదం లేకుండానే అత్యవసరం పేరిట ఆదేశాలు జారీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. 2022 డిసెంబర్‌లో ఆ నిర్ణయాన్ని కేసీఆర్ కేబినెట్ ర్యాటిఫై చేసింది. ఇథనాల్ తయారీకి కేంద్ర ప్రభుత్వంతో పాటు పర్యావరణ అనుమతి తప్పనిసరి. ఇథనాల్ / ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ / ఇండస్ట్రియల్ స్పిరిట్స్ / అబ్సల్యూట్ ఆల్కహాల్ తయారీకి పీఎంకే డిస్టిలెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లెటర్ ఆఫ్ ఇండెంట్ తీసుకుంది.. కానీ కేంద్ర పర్యావరణ శాఖకు మాత్రం"ఫ్యూయల్ ఎథనాల్" కోసమే దరఖాస్తు చేసినట్లు విచారణలో బయటపడింది. 

అక్కడ ప్రతిపాదించిన 300 కేఎన్‌పీడీ సామర్థ్యం మొత్తం ఫ్యూయల్ ఇథనాల్ తయారీకేనని కంపెనీ స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించింది. కంపెనీ సమర్పించిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఈ ఫ్యాక్టరీ బీ2 కేటగిరీకి వస్తుందని.. ప్రజాభిప్రాయ సేకరణ నుంచి అప్పటి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 2023 ఫిబ్రవరి 24 కేంద్ర పర్యావరణ శాఖ కేవలం ఫ్యూయల్ ఇథనాల్ ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్ 1న ఆ ఫ్యాక్టరీకి ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్లో ఫ్యూయల్ ఇథనాల్‌‌కు పరిమితం కాలేదు. మిగతా ఉత్పత్తులన్నీ జోడించిన లెటర్ ఆఫ్ ఇండెంట్‌ను (LOI) కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసింది.

కొత్త లెటర్ ఆఫ్ ఇండెంట్‌ను చూపించి 2023 జూన్ 7న ఇథనాల్ / ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్/ ఇండస్ట్రియల్ స్పిరిట్స్ / అబ్సల్యూట్ ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌కు పీఎంకే కంపెనీ దరఖాస్తు చేసుకుంది. పర్యావరణ శాఖ అనుమతి ప్రకారం అక్కడి స్థానిక సంస్థల నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ (NoC) తీసుకోవటం తప్పనిసరి. కానీ పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థానికంగా అనుమతి తీసుకోకుండానే కాంపౌండ్ వాల్ నిర్మించేసింది. దీంతో పర్యావరణ అనుమతుల నిబంధనలను ఉల్లంఘించింది సదరు కంపెనీ. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్ ఆధారంగా 2023 జూన్ 15న ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఆదిలాబాద్ చీఫ్ ఇంజనీర్ విభాగం నీటి కేటాయింపులకు అనుమతి ఇచ్చినట్లు విచారణలో అధికారులు గుర్తించారు.

లగచర్ల భూసేకరణ రద్దు

రాష్ట్రంలో సంచలనంగా మారిన లగచర్ల భూ వివాదంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనుల ఆందోళనకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

రాష్ట్రంలో సంచలనంగా మారిన లగచర్ల భూ వివాదంలో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

గిరిజనుల ఆందోళనకు లగచర్ల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

లగచర్ల భూసేకరణ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫార్మా విలేజ్ కోసం దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.