/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు మరువలేని: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ Mane Praveen
మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు మరువలేని: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్
నల్లగొండ జిల్లా:
దేవరకొండ: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో గురువారం, పట్టణంలోని డివిజన్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే 134 వ వర్ధంతిని నిర్వహించారు. ఈ మేరకు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డివిజన్ కన్వీనర్ జిల్లా రాములు, ఆలిండియా సమతా సైనిక్ దళ్ సలహాదారులు నక్క వెంకటేశ్వర్లు, కొమ్ము రాజశేఖర్, జాజాల మురళి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే సామాజిక తత్వవేత్త, సంఘ సేవకుడు, పాఠశాలలు లేని రోజుల్లో తను సొంతంగా పాఠశాలలు స్థాపించి అంటరానితనం, వివక్షపై ఎన్నో ఉద్యమాలు చేశారని.. ఆయన సేవలు మరువలేనివి అని మహాత్మా పూలే సేవలను కొనియాడారు.
NLG: ఈనెల 29 న సాధారణ సమావేశం
నల్గొండ: పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో, ఈనెల 29 శుక్రవారం ఉదయం 10.30 గంటలకు, సాధారణ సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ముసబ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు.

మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్ లు పాల్గొననున్నారు.

ఈ మేరకు పాలకవర్గం సభ్యులు సకాలంలో హాజరు కావాలని వారు కోరారు.
NLG: డిసెంబర్ 2 న బహిరంగ సభకు తరలిరండి: బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా:
చండూరు: సిపిఎం నల్గొండ జిల్లా 21వ మహాసభలు డిసెంబర్ 2 న, మిర్యాలగూడలో జరగనున్నట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం తెలిపారు. ఈ మేరకు బహిరంగ సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బుధవారం మండల కేంద్రంలో బహిరంగ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు.మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, మండల కమిటీ సభ్యులు చిట్టిమల్ల లింగయ్య,నాయకులు బొమ్మరగోని యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: గురుకుల పాఠశాల నూతన భవన సముదాయం ను ప్రారంభించిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గం:
సంస్థాన్ నారాయణపూర్ మండలం,  సర్వేల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవన సముదాయం ను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ ప్రారంభించారు. ఈ మేరకు గురుకుల పాఠశాల సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గురుకుల పాఠశాల స్థలదాత మద్ది నారాయణరెడ్డి విగ్రహంతో పాటు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్, అబ్దుల్ కలాం విగ్రహాల కు  పూలమాల లు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, 18.61 కోట్ల రూపాయల వ్యయంతో భవనాలు, 1 కోటి రూపాయల వ్యయం తో ఫర్నిచర్ తో కూడిన నూతన పాఠశాల భవన సముదాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు పాటించేలా తెలంగాణ ప్రభుత్వం  ప్రయత్నిస్తుందని, దేశంలోనే సర్వేలు పాఠశాలకు ఉన్నతమైన ఘన చరిత్ర ఉంది.మద్ది నారాయణరెడ్డి తన 44 ఎకరాల స్థలం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారని తెలిపారు. డబ్బు తో గౌరవం రాదు, విద్యతోనే వస్తుంది. చదువుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. రాజకీయ నాయకులు,కలెక్టర్లు,డాక్టర్లు,  శాస్త్రవేత్తలు కావచ్చని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో విద్య కోసం కృషి చేస్తుందని,
ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థాపనలో భాగంగా  మునుగోడు వద్ద 300 కోట్ల రూపాయల తో శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో మండలానికి 5 పాఠశాలల చొప్పున 30 స్కూల్ లను నిర్మించేలా కృషి చేస్తానని అన్నారు. పిల్లల ఆరోగ్యం, ఆహారం విషయంలో తేడా రావొద్దని పాఠశాల సిబ్బంది కి సూచించారు. కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, పలువురు నాయకులు, గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
రిక్వెస్ట్ బస్ స్టాప్ గురించి దేవరకొండ.డిఎంకు వినతిపత్రం
నల్లగొండ జిల్లా, దేవరకొండ:
కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎస్టీ గురుకుల హాస్టల్, దేవత్ పల్లి గేట్ వద్ద ఎక్స్ప్రెస్ బస్సులను నిలుపుదల చేయాలని రిక్వెస్ట్ బస్ స్టాప్ కోరుతూ, బుధవారం హాస్టల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ డా.బుర్రి వెంకన్న ఆధ్వర్యంలో, దేవరకొండ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు.

అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా రవాణా సేవలు అందిస్తున్నందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ఆర్టీసీ డిపో మేనేజర్ లను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హాస్టల్ పేరెంట్స్ కమిటీ సభ్యులు జిల్ల రాములు, ఖండాల వెంకన్న మేదరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
NLG: ప్రజా పాలన విజయోత్సవాల లో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నాంపల్లి పట్టణంలోని గుర్రంపోడు రోడ్డు నుండి కస్తూరిబా బాలికల విద్యాలయం వరకు 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేసారు.

అనంతరం నాంపల్లి గ్రామపంచాయతీ భవన ఆవరణలో నర్సరీ ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 

ఈ సందర్భంగా నాంపల్లి పట్టణ కేంద్రంలో ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని బ్రతికాయి అని ఉపాధి హామీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాంపల్లి పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  నాటి నుండి 1600 మొక్కలు నాటామని అధికారులు తెలిపారు. ఈ మేరకు మొక్కల సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
NLG: విద్యార్థులకు రాజ్యాంగ పీఠిక అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి: చేల్లం పాండురంగారావు
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం తమ్మడపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా పి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండురంగారావు మాట్లాడుతూ..  సామాజిక న్యాయం సమానత్వాలే రాజ్యాంగానికి మూల స్తంబాలని, సమాన హక్కుల కోసం ఉద్యమించాలని దానికోసం *బోధించు* *సమీకరించు* *పోరాడు* అని సందేశం ఇచ్చిన విశ్వ మానవుడు సమతా మూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.

అంబేద్కర్ తాను రాసిన రాజ్యాంగాన్ని ఏ ఒక్క కులానికో, మతానికి పరిమితం కాకుండా సబండ వర్గాల కోసం, మానవాళి మనుగడ కోసం రాశాడని అన్నారు.

ఈ సందర్భంగా మహనీయుడు రాసిన రాజ్యాంగాన్ని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా, భవిష్యత్ తరాల వారి జీవితాలు మెరుగుపడే విధంగా ప్రభుత్వాలు చొరవ చూపించాలని  ఈరోజు భారతదేశం గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా నడుస్తుందంటే అది మహనీయుడు రాసిన రాజ్యాంగం వలన అని, తెలంగాణ అస్తిత్వ పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలు నడిపిన పోరాటంతో పాటు ఎంతోమంది అమరవీరుల ప్రాణ త్యాగాలు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం కూడా సాధించుకోవడం జరిగిందని అన్నారు.

కాబట్టి అలాంటి మహనీయుని జీవితాన్ని పాఠశాలలో కళాశాలలో విద్యార్థులు చదువుకునే విధంగా రాజ్యాంగ పీఠికను అందుబాటులో ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, అలాంటి మహనీయుని ఆలోచన విధానాన్ని అమలుపరచి ఆయన బాటలో మనం నడిచి జ్ఞానాన్ని సంపాదించి, ప్రయోజకులమైనప్పుడు మాత్రమే సమతా మూర్తికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు చేల్లం బాలసుందర్, యంజాల యాదగిరి, యంజాల అనిల్, చేల్లం రమేష్, భానుచందర్, ఎమ్మార్పీఎస్ నాయకులు ముదిగొండ రమేష్, జిల్లా రమేష్, మహమ్మద్ మునీర్, తదితరులు పాల్గొన్నారు.
NLG: నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం, శివన్న గూడెం లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న  నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, మంగళవారం కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

పాత గ్రామపంచాయతీ భవన  ఆవరణ మొత్తం కలియతిరిగి నూతనంగా నిర్మించే భవనానికి పలు మార్పులు సూచించారు.

శివన్నగూడెంలో త్వరలోనే మహిళా సమాఖ్య భవన్, సబ్ సెంటర్, రెండు అంగన్వాడి కేంద్రాలకు కొత్త భవనాలు నిర్మిస్తామని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ భవన నిర్మాణాలు ఉంటాయని తెలిపారు.

అదేవిధంగా  చర్లగూడెం రిజర్వాయర్ లో  ముంపుకు గురైన నిర్వాసితులు  బయట ఇల్లులు నిర్మించుకోవడానికి  అనుమతులు ఇవ్వాలని మర్రిగూడెం ఎమ్మార్వో, స్థానిక పంచాయతీ సెక్రెటరీ లను ఆదేశించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి లు మేతరి యాదయ్య, పలువురు నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
NLG: రాజ్యాంగం ప్రజలనే ప్రభువులుగా పేర్కొంది: దుచ్చర్ల
నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో రాజనీతి శాస్త్రం విభాగం, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన జలసాధన సమితి వ్యవస్థాపకులు దుచ్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రజలనే ప్రభువులుగా పేర్కొందని,పౌరులకు స్వేచ్ఛను ప్రసాధించడంలో భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఉత్తమమైనదని అన్నారు. ఈ సందర్బంగా భారత రాజ్యాంగ పీఠకను విద్యార్థులచే చదివించారు.

కార్యక్రమంలో ప్రిన్సిపాల్  ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్, రాజనీతిశాస్త్ర విభాగం అధ్యక్షులు ఆదె మల్లేశం, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్లు వెంకట్ రెడ్డి, అనిల్ బొజ్జ, శివరాణి, ఎన్ సి సి ఆఫీసర్ సుధాకర్, పరీక్షల నియంత్రణధికారి నాగరాజు, అధ్యాపకులు మునిస్వామి, వెల్దండి శ్రీధర్, విద్యార్థులు పాల్గొన్నారు.
NLG: రోడ్డుపై బైఠాయించి నిరసన
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: మండల కేంద్రంలోని చౌరస్తాలో, సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని, సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు మట్టం భాగ్యమ్మ, మంజుల, తదితరులు పాల్గొన్నారు.