మర్రిగూడ మండలంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి
నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:
మర్రిగూడ: నేడు భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న, ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా.. మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్రిగూడ మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు,నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి పురస్కరించుకుని నిర్వహించుకునే ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ సందర్భంగా మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె స్పూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
మర్రిగూడ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మేతరీ యాదయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ పాల్వాయి అనిల్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు సీనియర్ నాయకులు మారనేని లూర్దయ్య, నున్సవత్ బిచ్య నాయక్, ఐతపాక జంగయ్య, మాజీ ఎంపీటీసీ భీమ్లా నాయక్, వెంకటపేట బాలయ్య, మార్కెట్ పిఎసిఎస్ డైరెక్టర్లు డైరెక్టర్లు, గంట మల్లేష్ , బాయికడి కొండల్, గ్రామ శాఖ అధ్యక్షులు కోలుకుపల్లి శంకర్, జాల వెంకటయ్య, రాజు నాయక్ మునుగోడు యూత్ కాంగ్రెస్ కాంటెస్టెడ్ అధ్యక్షులు అబ్బనగోని రాము యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బేత వెంకటేష్, కాంటెస్ట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడలా ఆల్వాల్ రెడ్డి, లవకుమార్, ఎస్సీ సెల్ జిల్లా కన్వినర్ సిరపంగి శ్రీనివాస్, మండల నాయకులు, రావుల రాములు, కోలుకుల పల్లి జంగయ్య, ఎలిమినేటి సతీరెడ్డి మారనేని ప్రశాంత్, పగడాల యాదయ్య, తన్నీరు యాదయ్య,గ్యార వెంకటేష్, లపంగి యాదయ్య,జిల్లా శంకర్, దుబ్బ మల్లేష్, వంపు రాంచరణ్, గొట్టిముక్కల ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి జయంతి ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు.
Nov 19 2024, 21:07