త్రిప్ట్ ,నూలుపై సబ్సిడీ పథకాలను పునః ప్రారంభించాలి
![]()
చేనేత కార్మికులకు ఎంతగానో ఉపయోగ పడుతున్న త్రిప్ట్, నూలుపై సబ్సిడీ పథకాలను ప్రభుత్వం వెంటనే పునర్ ప్రారంభించాలని, వృత్తి దారుల జిల్లా కన్వీనర్ మాటూరి బాలరాజు, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు. చేనేత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు గుర్రం నర్సింహా గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ... చేనేత కార్మికులు రోజువారి కూలిపనిలో పొదుపు చేసి, కార్మికుడు 1200/ రూ లు, అనుబంధ కార్మికులు 800/రూ లు, చొప్పున ప్రతి నెల RD 1 బ్యాంక్ ఖాతలో జమచేస్తే, ప్రభుత్వం RD 2 లో రెండింతలు 4000/ రూల చొప్పున జమచేసి, మూడు సంవత్సరాలకు తీసుకునే విధంగా గత ప్రభుత్వం త్రిప్ట్ పథకం ప్రవేశపెట్టిందని, అది కరోనా కష్టకాలంలో, చేనేత కార్మికులకు ఎంతగానో ఉపయోగ పడిందని తెలిపారు. ఆగస్టు నెలలో ముగిసిన ఈ త్రిప్ట్ పతకాన్ని మళ్ళీ పునర్ ప్రారంభించాలని కోరారు. నూలుపై 40/ శాతం సబ్సిడీ నేరుగా కార్మికుల ఖాతల్లో జమచెయ్యాలని, ప్రతి చేనేత కుటుంబానికి పెట్టుబడి సాయంగా 5 లక్షల రూపాయల సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇండ్లు లేని నిరుపేద చేనేత కార్మికులకు హౌజ్ కం వర్క్ షెడ్ నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుర్రం నర్సింహా, జిల్లా ఉపాధ్యక్షులు కూరపాటి రాములు, గంజి రామచంద్రం, బోడ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని 'అరూరు గ్రామానికి చెందిన సార గండ్ల నవీన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి వారి కుటుంబానికి సేవ సమితి ఆధ్వర్యంలో ఆరువేల రూపాయలు మరియు జక్కుల నరసింహ యాదవ్ మాజీ ఉపసర్పంచ్ ఐదువేలు ఆర్థిక సాయం అందియడం జరిగినది .ఈ కార్యక్రమంలో సేవా సమితి గౌరవ అధ్యక్షులు బండారు నరసింహారెడ్డి , అధ్యక్షులు కసిర బోయిన లింగయ్య ,సింగల్ విండో డైరెక్టర్ ఆవులస్వామి, వలిగొండ మండల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి, మాజీ సర్పంచ్ పోలేపాక చెన్నయ్య కాంగ్రెస్ నాయకులు ఆవుల సత్యనారాయణ ఆవుల అంజయ్య నల్ల రామచంద్రం జినుకల మల్లేష్ మత్స్య కార్మిక సంఘం అధ్యక్షుడు నిమ్మల రవికుమార్ నిమ్మల భిక్షం నాయకులు అంజయ్య కసిర బోయిన నరసింహ సుంకి ఆనంద్ మర్రి నాగరాజు సుంకి అజిత్ ,మీసాల మచ్చ గిరి పాల్గొని శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.

Nov 09 2024, 19:40
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.7k