/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz తెలంగాణ ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి : జోగు అంజన్న Vijay.S
తెలంగాణ ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి : జోగు అంజన్న

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి, మలిదశ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షుడు కళ్లెం లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి 25వేల రూపాయల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలంతో పాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఉద్యమకారులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పత్రికా సమావేశం ద్వారా వారు ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు ఆదివారం జిల్లా, డివిజన్,మండల ,స్థాయిలో పత్రిక సమావేశాలు నిర్వహిస్తున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షురాలు గంధమల్ల మల్లమ్మ, జిల్లా సంస్కృతిక కార్యదర్శి మల్లం వెంకటేశం గౌడ్, బత్తిని రవీందర్, ఈతాప మల్లేశం,కన్నె కంటి శ్రీనివాసచారి, ఏక్కల దేవి శ్రీనివాస్, కొండూరు సత్తయ్య, ఎదురుగట్ల రాములు, నాగేల్లి రాములు, ఎం. యాదమ్మ, సిహెచ్ అనిత, ఎం పద్మ, పి.కవిత, శోభ పద్మ, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చిట్టేటి వెంకట్ రామ్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆదివారం రోజున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సింగల్ విండో చైర్మన్ చిట్టేడి వెంకట్ రామ్ రెడ్డి . ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిట్టి డి జనార్దన్ రెడ్డి  జిల్లా కాంగ్రెస్ నాయకులు బండారు నరసింహారెడ్డి తుమ్మల శ్రీనివాస్ సింగల్ విండో డైరెక్టర్ ఆవుల స్వామి వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి మాజీ సర్పంచ్ జనకల దానయ్య అరూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ అరూరు డైరీ చైర్మన రెబ్బసు సత్యనారాయణమాజీ సర్పంచ్ పోలేపాక చెమ్మయ్య మాజీ ఎంపీటీసీ బై కానీ ముత్యాలు కాంగ్రెస్ నాయకులు బండి రవికుమార్ ఆరూరు గ్రామ గౌడ సం ఘం అధ్యక్షుడు కళ్లెం బాల శంకర్ ఆవుల బిక్షపతి పిట్టల సుధాకర్ ప్రైమరీ స్కూల్ మాజీ చైర్మన్ ఆవుల అంజయ్య అరూరు గ్రామ మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులు నిమ్మల రవికుమార్ జిలకల స్వామి సింగన బోయిన కృష్ణ మరియు సీఈవో కృష్ణ ఎలిమినేటి వెంకటేశం అటెండర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు
మూసి పునర్జీవనం చైతన్య యాత్ర లో పాల్గొన్న డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా,భూదాన్ పోచంపల్లి (మ) పిల్లయిపల్లి నుంచి మక్తా అనంతరం వరకు మూసి ప్రక్షాళన చేయాలని రైతులు, కులవృత్తి దారులు మహిళలు, పార్టీలకు అతీతంగా కార్యకర్తలు నాయకుల తో కలిసి మూసి బ్రిడ్జి మీద అవగాహన యాత్రలో పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకటి అనంతరెడ్డి  మాట్లాడుతూ... కెసిఆర్  కాళేశ్వరం ప్రాజెక్టు కు డీపీర్ లు లేకుండా కట్టి ఆగం చేశారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మూసి నదిని పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీ ద్వారా ప్రక్షాళన చేసి నదికి ఇరువైపులా శాపింగ్ మాల్స్ కట్టాలి అనే ఉదేశ్యం లో సీఎం రేవంత్ రెడ్డి  ఉన్నారు. ప్రతిపక్షాలు మాత్రం ప్రజల కడుపు గొట్టే విదంగా కార్యక్రమం చేస్తూ సోషల్ మీడియాలో ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నాయి. హైదరాబాద్,రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాల ప్రజల యొక్క మురికి నీళ్ల కష్టాల్ని తీర్చాలని మూసి నది మీద ఉన్న ప్రజలు, చేతి వృత్తుల వారు తదితరులు మురికి కూపం లో ఉంటున్నారు.వారికి డబుల్ బెడ్ రూమ్లు ఇచ్చి, వారిని మురికి కూపం నుంచి రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం చేస్తుంటే, ప్రతిపక్షాలు మురికి ప్రచారం చేస్తున్నాయి ప్రజలు వారి విష ప్రచారం తిప్పి కొట్టాలి మూసి పరివాహక రైతులను కడుపు కొట్టె ప్రయత్నం చేస్తుర్రు ప్రతిపక్షాలు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ లు, ఎంపీ ఈటల రాజేందర్ గారు ఇక్కడనేమో రాజకీయం , ఢిల్లీలో గొప్పలు చెప్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు గంగా నది ప్రక్షాళన చేస్తే గొప్ప.. మా ప్రభుత్వం తెలంగాణ లో మూసి నది చేస్తే తప్ప అని అన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను కలిసిన డాక్టర్ శేఖర్ తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సమితి రాష్ట్ర అధ్యక్షులు

నూతనంగా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమితులైన ప్రొఫెసర్ కుమార్ సార్ ని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శేఖర్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి విద్యారంగంలో, పరిపాలన అనుభవంలో అన్ని అర్హతలు ఉన్నా తొలి దళిత ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ గా నియమితులు కావడం సంతోషించదగ్గ విషయం అన్నారు.అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీని అన్ని రంగాలలో ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు తీసుకెళ్లాలని విద్యార్థులకు, ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించి పరిష్కరించి సుపరిపాలన పాలన అందించి యూనివర్సిటీ అభివృద్ధిలో అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్లాలని తెలిపారు.
AJR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా:- వలిగొండ మండల:- ఈ రోజున పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన పల్లపు స్వామి గారి కూతురు నిమోనియాతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు అని సమాచారం తెలిసిన వెంటనే , ఆసుపత్రి ఖర్చులకి (AJR ఫౌండేషన్) ఎలిమినేటి జంగారెడ్డి గారు వెంటనే తన టీముని భువనగిరి లో ఉన్న ఈశ్వర్ చిన్న పిల్లల హాస్పిటల్ కి పంపించారు (5000 వేల రూపాయలు ) అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజేఆర్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శారాజీపేట లో ప్రతిఘటన ఉద్యమంలో అమరుడైన దూడల వెంకన్న 35వ వర్ధంతి

ప్రతిఘటనోద్యమంలో అమరుడైన వీరుడు దూడల వెంకన్న 35వ వర్ధంతి సందర్భంగా శారాజిపేటలో పార్టీ శ్రేణుల నివాళులు* భూమి, భుక్తి, దోపిడీ నుండి విముక్తి కోసం ప్రతిఘటన పంథాలో పోరాడుతూ అరాచక శక్తులచే హత్య చేయబడ్డ దూడల వెంకన్న 35వ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అమరులు దూడల వెంకన్న, అయిల వీరస్వామి, గిరి దేవందర్, ఉప్పు నర్సింహలకు శారాజిపేటలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జండాను గ్రామ కార్యదర్శి అయిల యాకయ్య ఆవిష్కరించిన అనంతరం రెండు న్యూడెమోక్రసీల డివిజన్ కార్యదర్శులు ఇక్కిరి సహదేవ్, బేజాడి కుమార్ లు మాట్లాడుతూ పేద ప్రజల శ్రమను దోచుకుంటున్న దోపిడీ దారులకు ఎదురు నిలిచి కట్ట నర్సింహరెడ్డి స్పూర్తితో ప్రతిగటనోద్యమంలో పోరాడి, యువకులను కూడగట్టి ప్రగతిశీల బాటలో నడుపుతూ ఈ సమాజ మార్పు కోసం పోరాడిన వీరుడు దూడల వెంకన్న అనీ,రాజ్యం నిర్బందాలను, శత్రువు దాడులను దైర్యంగా ఎదుర్కొంటూ ప్రజలే జీవితంగా బతికాడనీ, కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యమని తన ప్రాణాలను వదులుకున్నాడని, పేద ప్రజల జీవితాల మార్పు కోసం అయిల వీరస్వామి, గిరి దేవందర్ లు సైతం తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారని, ఆ వీరులకు నివాళులు అర్పించడం అంటే, వారు కోరుకున్న సమాజం కోసం పోరాడడమే అనీ, విప్లవ శక్తులు ఐక్యమయ్యి ఒకతాటి పైకి రావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ. కె.ఎం.ఎస్. జిల్లా అధ్యక్షులు చిరబోయిన రాజయ్య, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.సీత, కొమురయ్య, వీరమల్లు, తమ్మడి అంజయ్య, ఎలగందుల సిద్ధులు,నెమిలే స్వామి, వంగల నర్సింహ రెడ్డి,ఆర్.ఉదయ్, గాజుల వెంకటేష్, శ్రీను, బుర్ర మల్లయ్య, కాన్రాజు రమేష్,మధు సూధన్, రాజిరెడ్డి, అంజయ్య, రాం చందర్ తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ కి సర్దార్ వల్లభాయ్ పటేల్ పురస్కారం

యాదాద్రి జిల్లా భువనగిరి మండలం భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీ కాలనీకి చెందిన యువ రచయిత,గాయకులు ముదిగొండ సిద్దయ్య (సిద్దు భాయి నేత) కు సర్దార్ వల్లభాయ్ పటేల్ పురస్కారం లభించింది..ఈ పురస్కారానికి హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు మాతృ భాష సంస్కృతి సాంప్రదాయం అభివృద్ది కి సాహిత్యం ద్వారా కృషి చేస్తున్నoదుకు ముదిగొండ సిద్దు ను ఎంపిక చేశారు..ఈ పురస్కారం ఈ నెల 27న ఆదివారం చిక్కడ పల్లి లోని త్యాగరాయ గానసభ లో జరిగే కార్య క్రమంలో సిద్దు ప్రసంగించి పురస్కారం అందుకోబోతున్నారు.. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా వివిధ ప్రముఖులు పాల్గొంటున్నారు అని విలేకరుల సమావేశంలో తెలిపారు.
అసంపూర్తిగా ఉన్నటువంటి సిసి రోడ్డును అండర్ డ్రైనేజ్ సమస్యను వెంటనే పూర్తి చేయాలి : CPI

అసంపూర్తిగా ఉన్నటువంటి సిసి రోడ్లను అండర్ డ్రైనేజ్ సమస్య వెంటనే పూర్తి చేయాలి సిపిఐ. వలిగొండ మండలంలోని అరూర్ గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గ్రామ శాఖ సమావేశం కామ్రేడ్ పగిడి వెంకటేష్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్ హాజరై మాట్లాడుతూ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న సిసి రోడ్లను వెంటనే పూర్తిచేయాలని అండర్ డ్రైనేజీలు లేక మురుగు నీరు అంత రోడ్డుపయికి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అకాల వర్షాల కారణంగా బజార్లు నీటి గుంతల మయమయి దోమలు ఈగలతో గ్రామాలలో ప్రజలకు వైరల్ విష జ్వరాలు వెదజల్లుతున్నాయి వెంటనే బ్లీచింగ్ పౌడర్, దోమల మందు, గడ్డి మందులు పిచికారి చెయ్యాలి వీధి దీపాలను ఎప్పటికప్పుడు వేయించాలని ఆయన అన్నారు ప్రత్యేక అధికారులు వెంటనే గ్రామాలను సందర్శించాలి వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి మేడి దేవేందర్ సిపిఐ మండల సమితి సభ్యులు సుద్దాల సాయికుమార్ బుర్ర మల్లేశం సిపిఐ సీనియర్ నాయకులు జక్కుల లక్ష్మయ్య చిలకమర్రి నారాయణ గుడ్డేటి ఐలయ్య గుడ్డటి యాదయ్య గోగు రమేష్ సంఘీ కృష్ణ నూకల ఉదేష్ తదితరులు పాల్గొన్నారు
ఈనెల 29న నిర్వహించే ఉమ్మడి నల్గొండ జిల్లా మాదిగల ధర్మ యుద్ధ సదస్సును జయప్రదం చేయండి: MRPS

ఈనెల 29 నిర్వహించే ఉమ్మడి నల్లగొండ జిల్లా మాదిగల ధర్మయుద్ధ సదస్సును జయప్రదం చేయండి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ రాక - ఎమ్మార్పియస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ. హాజరై మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ మాదిగలను మోసం చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఈనెల 29న జిల్లా కేంద్రంలో జరుగు మాదిగల ధర్మయుద్ధ ఉమ్మడి నల్లగొండ జిల్లా సదస్సు జయప్రదం చేయాలని ఎంఎస్పి, ఎమ్మార్పియాస్ నాయకులుకు మరియు ప్రతి ఒక్క మాదిగ బిడ్డ రావాలని పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పోచంపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల భువనగిరి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం టౌన్ అధ్యక్షులు పెద్దల శ్రీను మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ నల్ల చంద్ర స్వామి మాదిగ హాజరై మాట్లాడుతూ.... రేవంత్ రెడ్డి మాదిగలతో తియ్యగా మాట్లాడి, మాదిగలపట్ల ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తూ..మాదిగలకు ద్రోహం చేస్తున్నాడని అన్నారు. ఆగస్ట్ 1న సుప్రీం కోర్టు ఎస్సి వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చింది సుప్రీమ్ కోర్టు తీర్పు వచ్చిన అర్ధగంటలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణలోనే వర్గీకరణ చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో ఏ నోటిఫికేషన్ వచ్చిన వర్గీకరణ అమలు ఐతదని ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీలో హామీ ఇచ్చారు. కానీ,రెండు నెలలు తిరుగక ముందే మాట మార్చిన రేవంత్ రెడ్డి మాదిగలకు ద్రోహం చేశారు అని విమర్శించారు . దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వర్గీకరణలో మొట్టమొదటి రాష్ట్రం ఐతదని మాదిగలు ఎంతో సంతోషించారు అన్నారు.రేవంత్ రెడ్డి చేస్తున్న నమ్మక ద్రోహాన్ని మాదిగ జాతి సహించదు అని హెచ్చరించారు . విద్యా శాఖ తన పరిధిలోని ఉన్నది. ఎస్సీ వర్గీకరణ మీద మాట ఇచ్చి తన శాఖ పరిధిలోనే 11 వేలకు పైగా టీచర్ పోస్టులను ఎస్సీ వర్గీకరణ లేకుండా భర్తీ చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం మాదిగలకు అన్యాయం చేయడం తగదు... ఒక జాతికి న్యాయం చేయడం కన్నా ముఖ్యమంత్రి పదవీ కాపాడుకోవడమే ఎక్కువా...? మల్లిఖార్జున్ ఖర్గే ,కొప్పుల రాజు ను చూసి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు .. రాష్ట్రంలోని మాల ప్రజాప్రతినిధులకు తలొగ్గి ఉద్యోగాలు దోచి పెట్టే కార్యక్రమానికి పూనుకున్నాడు...మాదిగలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈనెల 29 న ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రం లో జరిగే మాదిగల ధర్మ యుద్ధం సదస్సును మాదిగ మాదిగ ఉప, ఉద్యోగులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ----------------------------------------------------------------------- ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ ఎమ్మెస్ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ యాకరి రేణుక నరసింగా రావు మాదిగ మాజీ సర్పంచ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ mrps సందల శ్రీనివాస్ మాదిగ మాజీ జెడ్పిటిసి సందల సుధాకర్ మాదిగ మాజీ సర్పంచ్ బక్కన దాస్ సోమారపు శంకర్ తంగడిపల్లి బిక్షపతి మాదిగ కనగళ్ల కుమార్ సోమారపు చంద్రయ్య . కుమార్ బండారి శివశంకర్ ఎడ్ల లింగస్వామి మాదిగ మచ్చ నరసింహ మాదిగ గోస్కొండ స్వామి ఏర్పుల రమేష్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. జై మాదిగ... జై జై మంద కృష్ణ మాదిగ..
రచ్చబండ సమావేశ గద్దె నిర్మాణ దాత కర్నేకంటి యాదయ్య ను సన్మానించిన గ్రామస్తులు

వలిగొండ మండలం వెంకటాపురం గ్రామం లోని రచ్చబండ సమావేశ గద్దెను తన సొంత నిధులతో నిర్మించిన కర్నేకంటి యాదయ్య ని గ్రామస్థులు సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా కర్నెకంటి యాదయ్య  మాట్లాడుతూ ఇదే విధంగా గ్రామస్తులు నాకు సహకరిస్తే రైతుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని కాలువల మరమ్మతుల నిమిత్తం తన సొంత నిధుల నుండీ సంవత్సరం కు 100000(ఒక లక్ష) రూపాయలు విరాళంగా ఇస్తానని మరియు ముందు ముందు గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహకారం ఉంటుందని అన్నారు ఇట్టి కార్యక్రమం లో గ్రామం లోని యువకులు వృద్దులు తదితరులు పాల్గొన్నారు.