/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఇందూర్ విద్యా సంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి జన్మదిన వేడుకలు Vijay.S
ఇందూర్ విద్యా సంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి జన్మదిన వేడుకలు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పీడిత ప్రజల కోసం నిరంతరం ప్రజల్లో ఉండే గొప్ప హృదయ ప్రదాత స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెరిడేషన్ చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా సార్ ని కలవడం జరిగినది వారు ఆరోగ్యంగా 100 సంవత్సరాలు జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగినది... ఈ కార్యక్రమంలో రెడ్లరేపాక మాజీ సర్పంచ్ మాద లావణ్య శంకర్ గౌడ్ జిల్లాగొర్రె కాపర్ల సంగం డైరెక్టర్ దేశ బోయిన సూర్యనారాయణ యాదవ్. భగత్ సూర్యం అన్న సతీష్. ఎస్ఎస్ఎఫ్ ఫౌండర్ చాగంటి రాజేష్ నాగరాజుగౌడ్ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెరిడేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్ జువ్వగాని సతీష్ గౌడ్. జువ్వగాని శ్రీహరి గౌడ్ కోమల్ల కుమార్ ,,ధోని ,,,శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం దాతలుగా నిలిచిన జక్కిలి పరమేష్ యాదవ్ - కవిత, ముప్పిడి రవి - ప్రత్యూష కుటుంబ సభ్యులు

దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం* *- అన్నీ దానాల కన్న అన్నదానం మీన్న* *- దుర్గామాత సన్నిధిలో అన్నదాన కార్యక్రమం* *- దాతలుగా నిలిచిన జక్కిలి పరమేష్ యాదవ్ - కవిత, ముప్పిడి రవి -ప్రత్యుష & కుటుంబ సభ్యులు* నల్గొండ అక్షిత ప్రతినిధి నార్కట్ పల్లి మండలం ఔరవాణి గ్రామంలో దుర్గాదేవి ఉత్సవ కమిటీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుదవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన దాతలుగా జక్కిలి పరమేష్ యాదవ్ - కవిత, ముప్పిడి రవి -ప్రత్యుష మరియు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిగా నార్కెట్ పల్లి మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి బత్తుల ఉషయ్య మాట్లాడుతూ అన్ని దానాల కన్న అన్నదానం మిన్న అని, ఎన్ని దానాలు చేసినా రాజీ పుణ్యం అన్నదానం చేయడం వల్ల లభిస్తుందని, ఎన్ని రకాల అవసరాలు తీర్చిన కానీ ఆకలితో ఉన్న వారి కడుపునిండా భోజనం పెట్టిన మంచిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాలం రవీందర్ రెడ్డి,నీరుడు రాంరెడ్డి, కల్లూరి బాలరాజు, జక్కలి పరమేష్, డాక్టర్ రవి ముప్పిడి, నకిరేకంటి సతీష్, శివరాత్రి వెంకటేష్,ఎక్కురి బుచ్చయ్య,బొంతల పాండు, ముప్పిడి శంకర్, దుర్గాదేవి ఉత్సవ కమిటీ సభ్యులు,దుర్గా మాత స్వాములు భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన సంగిశెట్టి క్రిస్టఫర్

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన సంగిశెట్టి క్రిస్టఫర్ ను రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ బుధవారం నియామక పత్రం అందజేశారు .ఈ సందర్భంగా క్రిస్తఫర్ మాట్లాడుతూ తన నియమకానికి సహకరించి, నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమకారులకు రావలసిన హక్కుల కోసం తన వంతు కృషి చేస్తారని ఆయన అన్నారు .నిజమైన ప్రతి ఉద్యమకారుడుకి న్యాయం జరిగేంత వరకు తాను పనిచేస్తారని తెలిపారు. జిల్లాలోని పలు రాజకీయ పార్టీ నాయకులు, ఉద్యమకారులు ,గ్రామస్తులు కృష్ణఫర్ కి అభినందనలు తెలియజేశారు.
తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన బాలల హక్కుల కార్యకర్త : కొడారి వెంకటేష్

తల్లిదండ్రుల నుండి తప్పిపోయి భువనగిరి బస్టాండ్ లో తిరుగుతున్న బాలుడు ధనుష్ (3)ను గుర్తించిన బాలల హక్కుల కార్యకర్త కొడారి వెంకటేష్, బాలున్ని చేరదీసి, పట్టణ సీఐ సురేష్ కుమార్ కు అప్పగించారు. సీఐ , జిల్లా బాలల పరిరక్షణ అధికారి సైదులు కు సమాచారం అందించారు. బాలునికి మాటలు రాకపోవడంతో, బాల సదనం కు పంపించాలని నిర్ణయం తీసుకున్న సమయంలోనే బాలుని తల్లిదండ్రులు గుగులోతు అనూష, మధు దంపతులు బాలున్ని వెతుక్కుంటూ పోలిస్ స్టేషన్ కు వచ్చారు. బాలుని తల్లిదండ్రులు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురం బద్దు తండాకు చెందిన వారుగా గుర్తించారు. గత కొద్ది కాలంగా భువనగిరి ఖిలానగర్ లో కిరాయికి ఉంటూ పూల వ్యాపారం చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం బాలున్ని, మరియు పాప ను అనూష అత్తగారికి అప్పగించి, పూలు అమ్ముతున్నారు. బాలుడు నానమ్మ దగ్గరినుండి పారిపోయి భువనగిరి బస్టాండ్ లో తిరుగుతున్న సమయంలో బాలల హక్కుల కార్యకర్త కొడారి వెంకటేష్ గుర్తించి బాలున్ని పట్టణ పోలీసులకు అప్పగించారు. ఏది ఏమైనా బాలున్ని, తల్లిదండ్రుల వద్దకు చేర్చడం తో కథ సుఖాంతం అయ్యింది. తప్పిపోయిన బాలున్ని గుర్తించి, చేరదీసి, పోలీసులకు, జిల్లా బాలల పరిరక్షణ అధికారికి సమాచారం అందించి, చివరకు తల్లిదండ్రులకు బాలున్ని అప్పగించడంతో బాలల హక్కుల కార్యకర్త వెంకటేష్ ను పలువురు అభినందించారు ‌.
సమాచార హక్కు చట్టం కమిషనర్లను నియమించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు వినతి

సమాచార హక్కు చట్టం కమిషనర్లను నియమించాలని MLC తీన్మార్ మల్లన్న ను సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు స్రవంతి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం. వెంకటేష్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు మరియు ఇతర సభ్యులతో కలిసి MLC తీన్మార్ మల్లన్న కీ వినతి పత్రం అందజేయడం జరిగింది సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నుంచి సహకారం లభించడం లేదన్నారు. అధికారుల్లో జవాబుదారితనం కొరవడిందన్నారు. సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో ఆ వ్యక్తికి కోరిన సమాచారం అందించాల్సిన బాధ్యత ఆయా అధికారులపై ఉందన్నారు. నిర్ణీత సమయంలోపు అందించకపోతే అప్పిలేట్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఇక్కడా స్పందన రాకపోతే రాష్ట్ర సమాచార చట్టం చీఫ్ కమిషనర్ కు అప్పీల్ చేసుకోవాలన్నారు. కమిషన్ స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటుందన్నారు.సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును నిరాకరించే అధికారం ప్రభుత్వ వ్యవస్థలో ఏ శాఖ, అధికారికి లేదన్నారు. సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం పరిరక్షణ కోసం కమిషనరలను నియమించాలని శాసనమండలిలో కమిషనర్లను నియమించడం గురించి మాట్లాడాలని ఈరోజు ఎం.ఎల్.సి తీన్మార్ మల్లన్న గారిని కలవడం జరిగింది . జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూర స్రవంతి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం,రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు,బత్తుల మహేష్ గౌడ్ ,మాదగోని శ్రీనివాస్ గౌడ్, అఖిల్ పవన్ కళ్యాణ్, అక్కెల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు..
స్థానిక సమస్యలపై ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించాలి: దయ్యాల నరసింహ CPM మండల కార్యదర్శి

భువనగిరి మండలం బస్వాపురం గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ పదవ మహాసభ ఉడుత విష్ణు అధ్యక్షతన జరిగింది ఈ మహాసభకు సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పాల్గొని మాట్లాడుతూ బస్వాపురం గ్రామంలో ఉన్న సమస్యలపై గత నాలుగు సంవత్సరాల నుండి ఉసిర్ల ఆగుపై బీటి రోడ్ వేయాలని హనుమాపురం నుండి బస్వాపురం వరకు బీటీ రోడ్డు వేయాలని బస్వాపురం నుంచి గంగసానిపల్లి వరకు బీటీ రోడ్ వేయాలని గ్రామంలో సిసి రోడ్లు,డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని వారు అన్నారు. గతంలో పేదలకు పట్టాలిచ్చిన స్థలాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అనేకసార్లు అధికారుల దృష్టికి మాజీ ఎమ్మెల్యే దృష్టికి ఇప్పుడున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి అనేక సార్లు తీసుకుపోయినప్పటికీ ఏఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పుడైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి స్థానిక సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేసారు. వీరితోపాటు మహసభలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం అన్నంపట్ల కృష్ణ పార్టీ సీనియర్ నాయకులు ఉడత విష్ణు ఉడుత సత్యనారాయణ ముదిగొండ కృష్ణ మధ్యపురం బాలనరసింహ నరాల చంద్రయ్య ఉడుత వెంకటేష్ పార్టీ సభ్యులు ఉడుత సిద్ధులు మచ్చ జహంగీర్ మచ్చ భాస్కర్ రాసాల దేవేందర్ రాసాల ఐలయ్య నరాల బాలకృష్ణ ఉడుత దశరథ తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జోగు అంజయ్య నియామకం

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జోగు అంజయ్య నియమితులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం గొల్నెపల్లి గ్రామానికి చెందిన. జోగు అంజయ్య ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ నియమించడం జరిగింది. ఈ సందర్భంగా జోగు అంజయ్య మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ రాష్ట్ర కమిటీకి కృతజ్ఞత తెలిపారు.
ధరల నియంత్రణ ప్రభుత్వ కనీస బాధ్యత: పెరిగే ధరలను నియంత్రించాలి: కొడారి వెంకటేష్ వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు

ప్రతి పక్షం లో ఉన్నప్పుడు ధరల విషయంలో ఆందోళనలు చేసి, రోడ్ల పైకి వచ్చి ఉద్యమాలు చేపట్టిన పెద్దలే అధికారం లోకి రాగానే మారిపోతున్నారు. ఇటీవల అదుపు లేకుండా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలతో అన్ని వర్గాల ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పండుగ సీజన్ లో ప్రజల అవసరాలను ముందుగానే పసిగట్టిన వ్యాపారులు ఒక వ్యూహం ప్రకారం వస్తువుల కృత్రిమ కొరత సృష్టించి, ఇష్టానుసారం ధరలు పెంచుతూ లక్షలు గడిస్తున్నారు. ఏ వస్తువు ధర ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో అర్థం కావడం లేదు. గత మూడు నాలుగేళ్లుగా వరి ధాన్యం అధిక దిగుబడులు వచ్చాయి. నిల్వ చేద్దామంటే గిడ్డంగులు కూడా సరిపోవడం లేదు. కానీ ప్రస్తుతం బియ్యం ధర మునుపెన్నడూ లేని విధంగా కిలో బియ్యం అరవై రూపాయలకు చేరింది. ఒక్క బియ్యం మాత్రమే కాదు పప్పు దినుసులు,మిర్చి, వంటనూనె ల ధరలు ఆకాశాన్ని తాకాయి. పేద, మద్యతరగతి, సామాన్యులు రాబోయే దసరా పండుగ సందర్భంగా కావాల్సిన సరుకులు కొని సంతోషంగా పండుగ జరుపుకోనే స్థితిలో లేరు. ముడి, రిఫైండ్ వంటనూనె ల పై కేంద్రం దిగుమతి సుంకాన్ని ఒక్కసారిగా 20 శాతం వరకు పెంచడంతో వంటనూనెల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పామోలిన్, సోయా, సన్ ఫ్లవర్ , సహా వివిధ రకాల నూనె లపై ఈ భారం పడనుంది. వీటి ముడి నూనె లపై ఇప్పటివరకు సుంకం ఉండేది కాదు. ఇప్పుడు సుంకం ఏకంగా 20 శాతం విధించడం వల్ల పేద మద్యతరగతి ప్రజలపై అధిక భారం పడనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం వంటనూనె ధర లీటరుకు 20 నుండి 40 రూపాయలు పెరిగింది. అల్లం కిలో 100 నుండి -150 కి , వెల్లుల్లి కిలో 300 నుండి -360, ఎండుమిర్చి కిలో 200 నుండి 240కి, కందిపప్పు కిలో 150 నుండి 175 కి, మినప్పప్పు కిలో 135 కు చేరింది . అలాగే పెసరపప్పు కిలోకు 30 రూపాయలు, ఉల్లిపాయలు కిలో 60 రూపాయలకు చేరింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. *పెరిగే ధరలను నియంత్రించాలి* కొడారి వెంకటేష్ *వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు* రోజు రోజుకు పెరిగి పోతున్న నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం బడుగు , పేద వర్గాల ప్రజలే కాదు మద్యతరగతి ప్రజలకు కూడా భారం కానుంది. వ్యవసాయ మార్కెట్ పాలకులు, సివిల్ సప్లయ్, తూనికలు కొలతల శాఖ అధికారులు స్పందించి పెరిగే ధరలను అదుపు చేయాలి. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ పద్ధతులను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలి. పేద మద్యతరగతి ప్రజలకు అండగా ఉండాలి. కృత్రిమ కొరతను సృష్టించే, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కల్తీకి పాల్పడే వ్యాపారులపై ఉక్కు పాదం మోపాలి.
ఈనెల 9న జిల్లా కేంద్రంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన విజయవంతం చేయండి ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి

యాదాద్రి భువనగిరి జిల్లా: ఎమ్మార్పియాస్,యం యస్ పీ అనుబంధ సంఘాల జిల్లా కార్యవర్గ సమావేశం ఈనెల 9న జిల్లా కేంద్రంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన విజయవంతం చేయండి ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండానే మాదిగలను మోసం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ నిలుపుదల చేయాలని ఈరోజు స్థానిక రహదారి బంగ్లా లో ఎమ్మార్పీఎస్, యం యస్ పీ అనుబంధ సంఘాల జిల్లా కార్యవర్గ సమావేశం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యం యస్ పీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ హాజరై మాట్లాడుతూ... ముప్పై ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత భారత సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కు అనుకూలంగా తీర్పును ఆగష్టు1న వెలువరించడం జరిగింది, తీర్పును ఇచ్చిన మరుక్షణమే నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ కి మరియు రాబోయే నోటిఫికేషన్ లో కూడా వర్గీకరణకి అనుగుణంగా ఉంటుందని, అలాగే గ్రూపు 1 & 2 మరియు మెడిసిన్ సీట్ల కేటాయింపు, విశ్వ విద్యాలయాల్లో సీట్ల కేటాయింపు, ప్రయివేటు రంగం లో కూడా వర్గీకరణ కి అనుగుణంగా చేస్తామని హామి ఇచ్చి ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాలలో 11,062 ఉపాధ్యాయ నియామకాల్లో వర్గీకరణ అనుగుణంగా న్యాయమైన వాటా 1200ల ఉద్యోగాలు మాదిగలు మరియు ఉపకులాలకి రావాల్సి ఉండగా కేవలం 200 మందికే ఉద్యోగాలు రావడం మరియు ఈ నెల 9న నియామక పత్రాలు ఇవ్వడం మాదిగలకు మరియు ఉపకులాలకి తీరని అన్యాయం చేసినట్టేనని అన్నారు. తక్షణమే నియామకాలు ఆపాలని, మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ కి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగల మరియు ఉపకూలాల ఆవేదనను తెలియజేసేందుకు ఎమ్మార్పియాస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 9న జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల నుండి జరిగే నిరసన ర్యాలీలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాలతో పాటు డీఎస్సీలో వెనకబడ్డ ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని మరియు ఈనెల 15వ తారీకున హైదరాబాద్ నగర కేంద్రంలో జరిగే ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఎస్సీల వర్గీకరణ లేకుండానే నియామకాలను నోటిఫికేషన్లు నిలిపివేయాలని లేకుంటే ఈ నెల 15 తర్వాత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నిరంతర కార్యచరణ రూపంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండబెట్టడానికి కార్యాచరణ రూపొందించుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. -------------------------------------------- ఈ కార్యక్రమంలో యం యస్ పీ జాతీయ నాయకులు మంద శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ, ఎంఎస్పి జిల్లా నాయకులు దుబ్బ దానయ్య మాదిగ, జిల్లా కార్యదర్శి బోయ లింగ స్వామి, బండారు శివ శంకర్ మాదిగ , నారికడప నర్సింగ్ రావ్ మాదిగ,నల్ల స్వామి మాదిగ, మద్దూరి నర్సింగ్ రావ్ మాదిగ, మొగిలిపాక సత్తయ్య మాదిగ, మోత్కూపల్లి నవీన్ మాదిగ, కోయ సమ్మయ్య మాదిగ,కోళ్ల జహంగీర్ మాదిగ,గాయపాక పృథ్వీ మాదిగ, వాసాలమర్రి రవి మాదిగ,కొండగడప నరేష్ మాదిగ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
గోపరాజు పల్లి లో కీసర్ల సావిత్రమ్మకు నివాళులర్పించిన నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కీసర్ల మహేందర్ రెడ్డి మాతృమూర్తి కీసర్ల సావిత్రమ్మ గురువారం మృతి చెందారు. శుక్రవారం గోపరాజుపల్లి లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, నాయకులు నరేష్ రెడ్డి,బత్తిని సహదేవ్ గరిసే రవి ,కొండూరు భాస్కర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు మొగుళ్ళ శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, పాల్గొని వారి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోపరాజు పల్లి మాజీ సర్పంచ్ కీసర్ల సత్తిరెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సలిగంజి బిక్షపతి, చిల్లర స్వామి, యాస అయిల్ రెడ్డి, పాలకూర్ల యాదయ్య, గాజుల అంజయ్య, పాలకూర అంజయ్య,సంగిశెట్టి రమేష్, బంధువులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.