షర్మిలని తప్పించండి... కాంగ్రెస్ లో విలీనం చేస్తా
డీకే ముందు ఆఫర్ పెట్టిన జగన్..?
11 సీట్లకే పరిమితమై ఘోర పరాజయం అయిన జగన్ రెడ్డి, ఇక తన మనుగడ కష్టమని భావిస్తున్నారు. చంద్రబాబు పక్కన మోడీ ఉండటం, తనపైన సిబిఐ, ఈడీ కేసులతో పాటు, బాబాయ్ మర్డర్ కేసు కూడా వేలాడుతూ ఉండటంతో, జాతీయ పార్టీ సాయం లేనిదే బ్రతికి బట్టకట్టటం ఇక సాధ్యం కాదని భావించిన జగన్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటానికి సిద్ధం అయ్యారు.
ఇందుకు బెంగుళూరు వేదికగా జగన్ చర్చలు జరుపుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, డీకే శివకుమార్ తో నిన్న రాత్రి భేటీ అయిన జగన్,
కాంగ్రెస్ నుంచి షర్మిలని తరిమేస్తే, తాను కాంగ్రెస్ లో విలీనం చేసేస్తా అని ఆఫర్ ఇచ్చారు. దీని పై హైకామాండ్ తో చర్చించి నిర్ణయం చెప్తామని డీకే చెప్పినట్టు తెలుస్తుంది.
ఇటు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే చంద్రబాబు నుంచి, అక్కడ హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉంటే రేవంత్ నుంచి ఇబ్బందులు ఉంటాయని, ఇంటలిజెన్స్ ద్వారా మొత్తం లాగేస్తారని భావిస్తున్న జగన్, ఇక నుంచి బెంగుళూరు యలహంకా ప్యాలెస్ లోనే ఉండనున్నారు. అందుకే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. చూడాలి పరిణామాలు ఎలా మారతాయో.
Jun 26 2024, 10:56