/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png
విలేకరిపై తప్పుడు కేసు పెట్టిన సిఐ సస్పెండ్
ఖమ్మం పట్టణంలో స్థానిక విలేకరి ఇంటిలో తుపాకీ తూటాలు దొరికినట్లు గా తప్పుడు కేసులు పెట్టడం. అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవరించిన సీఐ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ రంగనాథ్.
తిరుపతయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో పోస్టల్ శాఖ ఏబిపిఎం పగిళ్ల తిరుపతయ్య ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఇవాళ తిరుపతయ్య దశదిన కర్మ కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు వెంకటమ్మ, రాజశేఖర్, ఖన్నా లు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య కార్యక్రమంలో పాల్గొని తిరుపతయ్య చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంపత్, లెంకలపల్లి ఎంపీటీసీ ఏర్పుల శ్రీశైలం, చాపల రవి, పెంబల్ల గిరి, నందికొండ లింగా రెడ్డి, మేతరి శంకర్, తదితరులు ఉన్నారు.
NLG: నూతన ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన బిసి సంక్షేమ సంఘం నాయకులు
నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శరత్ చంద్ర పవార్ ను శనివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి మిరియాల యాదగిరి, నల్గొండ జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీకి మొక్కను బహుకరించారు. యువజన సంఘం అధ్యక్షులు మునాస ప్రసన్న కుమార్, మహిళా సంఘం అధ్యక్షురాలు సింగం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
NLG: ఏపీజీవీబీ ఆధ్వర్యంలో బ్యాంకు సంబంధిత అంశాలపై అవగాహన
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు బ్యాంకు సంబంధిత అంశాల పైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ రూప శ్రీ, క్యాషియర్ చిన్న నరసింహులు మాట్లాడుతూ.. క్రాప్ లోన్ లు సంవత్సరం లోపల రెన్యువల్ చేసుకుంటే 7% ఇంట్రెస్ట్ మాత్రమే పడుతుందని, సమయం మించి పోతే రెట్టింపు ఇంట్రెస్ట్ పడుతుందని, సిబిల్ స్కోర్ తగ్గుతుందని గవర్నమెంట్ ఇచ్చే 3% రాయితీ ఉండదని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన ల గురించి వివరించారు. కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
NLG::హెచ్ఎం గా బాధ్యతలు స్వీకరించిన యూసుఫొద్దీన్ కు శుభాకాంక్షలు తెలిపిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు
నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లో గల గవర్నమెంట్ హైస్కూల్ FAC ప్రధానోపాధ్యాయులు గా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన యూసుఫొద్దీన్ కు, చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ పక్షాన వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూసుఫొద్దీన్ ఎంతో సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి అని ఆయన ఆధ్వర్యంలో పాఠశాల లోని విద్యార్థినీ,విద్యార్థులు చదువులతోపాటు సాంస్కృతిక, క్రీడా రంగాలలో కూడా ఎంతో అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తారని ఆకాంక్షిస్తూ ప్రత్యేకమైన అభినందనలు అని తెలిపారు.
NLG: విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు అందజేసిన ఆరోగ్య సిబ్బంది
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ఇవాళ జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా నులిపురుగుల నివారణకు ఆల్బండజోల్ టాబ్లెట్స్ విద్యార్థులకు వేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం స్వర్ణలత, ఆశ వర్కర్ ఏర్పుల పద్మ మాట్లాడుతూ.. 1 నుండి 19 సం.ల వయస్సు గల పిల్లలందరు నులిపురుగుల నివారణకు ఆల్బండజోల్ టాబ్లెట్లు వాడాలని తెలియజేసి టాబ్లెట్లు విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ ఉమాదేవి, హెచ్ఎం యాదగిరి, టీచర్లు వెంకటేష్, యాదయ్య, శ్యామల, అపర్ణ సౌజన్య, జానకి, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఎంపీ రఘువీర్ రెడ్డి ని సన్మానించిన జిల్లా ఎంపీటీసీ ల ఫోరం ప్రధాన కార్యదర్శి
నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి అత్యధిక మెజార్టీ తో గెలిచిన తరువాత ఇవాళ మిర్యాలగూడ కు విచ్చేసిన సందర్భంగా ఆయనను జిల్లా ఎంపీటీసీ ల ఫోరం ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పని నగేష్, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.
NLG: జేబీఎస్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బడిబాట ముగింపు కార్యక్రమం
బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం నల్గొండ పట్టణంలోని పాతబస్తీ మాధవ నగర్ జేబీఎస్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ పద్మ కుమారి అధ్యక్షతన బడిబాట ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులతో మరియు ఉపాధ్యాయ బృందంతో బోనాలు, డప్పు వాయిద్యాలు, నృత్యాలతో మాధవ నగర్ చౌరస్తా వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయురాలు పద్మకుమారి మాట్లాడుతూ.. నల్గొండ పట్టణంలోని జేబీఎస్ హైస్కూల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి గత వారం రోజుల నుండి బడిబాట కార్యక్రమంలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టామని, ఈరోజు ముగింపు కార్యక్రమంలో క్రీడా దినోత్సవం నిర్వహింకున్న అనంతరం బడిబాట ముగింపు కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేశామని తెలియజేశారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు చదువుల్లో మరియు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయి లో రాణించటానికి ఉపాధ్యాయ బృందం అంతా సమిష్టిగా కృషి చేస్తుందని తెలిపారు. సీనియర్ ఉపాధ్యాయులు ఆర్.నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా JBS హై స్కూల్ విద్యార్థులు చదువుల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని, ఆ క్రమంలో గత సంవత్సరం మంచి రిజల్ట్స్ వచ్చాయని తెలిపారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు
బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. బడిబాట ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు క్రీడా దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించుకునే క్రమంలో పాఠశాలకు అవసరమైన క్రీడా పరికరాలను సమకూర్చుకుంటూ, క్రీడా మైదానాలను సమాయత్తం చేసే కార్యక్రమాల్ని నిర్వహించామని అనంతరం విద్యార్థులతో వివిధ క్రీడా పోటీలను నిర్వహించామని తెలియజేశారు. జేబీఎస్ హైస్కూల్లో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు చదువుతో పాటు సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు పాఠశాల ఉపాధ్యాయ బృందమంతా సమిష్టిగా కృషి చేస్తూ జేబీఎస్ హైస్కూల్ ను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం రూప, రేణుక, శ్రీనివాస్, తహేరాఫాతిమా, ప్రతిమ, రత్నమాల, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్స్ పంపిణీ చేసిన HM పద్మాకుమారి
నల్గొండ: మాధవ్ నగర్ జేబీఎస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట ప్రోగ్రాంలో భాగంగా శనివారం పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరికీ ప్రధానోపాధ్యాయురాలు పద్మ కుమారి అధ్యక్షతన యూనిఫార్మ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకోవాలని మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం ఉంటారని వారి సేవలను ఉపయోగించుకుంటూ విద్యార్థిని విద్యార్థులు చదువులతో పాటు వివిధ రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు.
Jun 23 2024, 21:47