/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz జూన్ 10న ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి; కొండమడుగు నరసింహ తెలంగాణ వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి Vijay.S
VijayaKumar

May 31 2024, 22:05

జూన్ 10న ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి; కొండమడుగు నరసింహ తెలంగాణ వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి

యాదాద్రి భువనగిరి జిల్లా; జూన్ 10 న ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సు ను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, ఆలేరు మండలాల్లో జాతీయ ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహా.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు - సవాళ్లు అనే అంశంపై నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సులో ఉపాధి హామీ కార్మికులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు . ఈ సందర్భంగా కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 31 2024, 21:50

చౌటుప్పల్ లో విత్తన, ఎరువుల డీలర్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే

యాదాద్రి భువనగిరి జిల్లా:నకిలీ విత్తనాలు అమ్మిన కృత్రిమ కొరత సృష్టించిన కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండాగే డీలర్లను హెచ్చరించారు. శుక్రవారం నాడు చౌటుప్పల్ లోని ధనలక్ష్మి ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ షాప్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఇన్వాయిస్ బిల్లులు, పత్తి, వరి విత్తనం ప్యాకెట్లను పరిశీలించి దాని లోని లాట్ నంబర్స్, ఇన్వాయిస్ లు ఎక్కడినుండి తెచ్చారు, డీలర్ షిప్ వివరములు, రిజిస్టర్ లో నమోదు చేసిన వివరాలు అన్ని క్షుణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తన డీలర్లు ప్రభుత్వం నుండి అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే రైతులకి విక్రయించాలని, రైతులకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంచాలని, రైతులకు విత్తనాలు కొన్న తర్వాత రసీదులు ఇవ్వాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో డీలర్లు అనుమతి లేని విత్తనములు, నకిలీ విత్తనములు, ప్యాకింగ్ చేయకుండా లూస్ గా ఉన్న విత్తనములు రైతులకు అందుబాటులో ఉంచకూడదని తెలిపారు. రైతులు కూడా తప్పనిసరిగా లైసెన్సు ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, విత్తనాలు కొన్న దానికి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, సీజన్ అయిపోయే వరకు బిల్లులను, విత్తన ప్యాకెట్లని భద్రపరచుకోవాలని కోరారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో విత్తన బ్యాగు మీద విత్తన తయారీ తేదీ, గడువు తేదీలను తప్పనిసరిగా సరిచూసుకోవాలని, బీటీ టు పత్తి విత్తనాలు అన్ని రకాలు ఒకే రకమైన దిగుబడిస్తాయి కాబట్టి రైతులు దయచేసి ఒకే రకం పత్తి విత్తనాలు డిమాండ్ చేయకుండా నచ్చిన విత్తనాలను తీసుకోవాల్సిందిగా సూచించారు. గ్రామాల్లో ఎవరైనా లూజు పత్తి విత్తనాలు ఎటువంటి ప్యాకింగ్ లేకుండా ఉండే విత్తనాలను, బీటీ త్రీ పత్తి విత్తనాలు అమ్మినట్లయితే వారి దగ్గర కొనకూడదని, ప్రభుత్వ అధికారులకు అటువంటి నకిలీ విత్తనాలపై సమాచారం ఇవ్వాలని, రైతులు కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 7288878404 ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. జిల్లాలోని 240 విత్తన డీలర్లను, గోదాములను విస్తృతంగా తనిఖీ చేయుటకు నాలుగు సీడ్ స్క్వాడ్ బృందాలతో పాటు ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారి, తాసిల్దారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో మండల స్థాయి తనిఖీల బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, నకిలీ విత్తనాలు రాకుండా, అలాగే డీలర్లు గారిని డిస్ట్రిబ్యూటర్లు కానీ పత్తి విత్తనాలు, ఇతర విత్తనాలను బ్లాక్ మార్కెట్ చేయకుండా, విత్తనాల కొరత చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, అధికారులు పాల్గొన్నారు.

VijayaKumar

May 31 2024, 19:44

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రపాలనగరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు బందెల క్రిస్టఫర్

నకిరేకల్ నియోజకవర్గ ప్రజాపతినిదులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికి తెలియజేయునది  ఏమనగా  రేపు అనగా తేది 01/06/2024(శనివారం) నాడు మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం  జన్మదినం పురస్కరించుకుని ఉదయం 11.00 గంటల నుండి వేడుకలను నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం కనకదుర్గ ఆలయ ఎదురుగా ఉన్న స్థలంలో నిర్వహించబడును.కావున ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొని ఎమ్మెల్యే వీరేశం జన్మదిన వేడుకలను జయప్రదం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్ర పాల నగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బందరు క్రిస్టఫర్ ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ముందస్తుగా ఎమ్మెల్యే వేముల  వీరేశం కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

VijayaKumar

May 31 2024, 19:31

వలిగొండ లో వాహనాల తనిఖీలు, నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు సీజ్: ఎస్సై డి మహేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వలిగొండ ఎస్సై డి మహేందర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ ఈ తనిఖీల్లో నెంబర్ ప్లేట్ లేని పలు వాహనాలను సీజ్ చేశామని అన్నారు. పలు వాహనాలకి సంబంధిత ధ్రువపత్రాలు లేని కారణంగా సీజ్ చేశామని తెలిపారు. ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్స్ ఉండాలని సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


VijayaKumar

May 31 2024, 19:23

ఖైసర్ పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి


భువనగిరి జిల్లా కాంగ్రెస్ నాయకులు మజహార్,అతహార్,లయిక్ అహ్మద్ గారి తండ్రి కైసర్ పటేల్ గారు రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు .కైసర్ పటేల్ గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరారు. ఈ సందర్భంగా భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు తదితరులు వారి వెంట ఉన్నారు.

VijayaKumar

May 31 2024, 14:43

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో జర్నలిస్టులను గుర్తించాలి : తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షానూర్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్టులను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం రోజున జిల్లా కేంద్రంలోని ఎస్వీ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలను ప్రపంచ నలుమూలలకు తెలిసేలా చేసింది జర్నలిస్టులు మాత్రమే అని పేర్కొన్నారు. విద్యార్థి సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారస్తులు, కవులు, కళాకారులు, రచయితలు, మహిళా సంఘాలు,ఇలా ఎన్నో సబ్బండ వర్గాలు చేసిన ఉద్యమాలను చూసి నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందని అన్నారు. దాని వెనుక ముమ్మాటికి జర్నలిస్టుల పాత్ర ఉందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని జర్నలిస్టు సంఘాలు వారు ప్రత్యక్ష పరోక్ష ఉద్యమాల్లో పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన కారకులైన జర్నలిస్ట్ లని విషయాన్ని గత ప్రభుత్వం మర్చిపోయిందని,మరోసారి గుర్తు చేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మర్చిపోవద్దని తెలిపారు. ఈ ప్రభుత్వమైనా జర్నలిస్టులను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపరాజు వెంకన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు గడ్డం సత్యనారాయణ, మండల కార్యదర్శి శివ, బలరాం రెడ్డి, శ్రీనివాస్, కనకయ్య తదితరులు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

VijayaKumar

May 31 2024, 09:48

గ్రామాలలో డ్రగ్స్, నకిలీ విత్తనాలు ఎరువుల పట్ల అవగాహన కలిగి ఉండాలి: వలిగొండ ఎస్సై డి మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ ఎస్సై డి మహేందర్ మాట్లాడుతూ ... గ్రామంలో ఎవరైన మత్తు పదార్థాలు (డ్రగ్స్) సరఫరా చేస్తున్నా/ సేవిస్తున్నా వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలని అన్నారు. వర్షాకాల విత్తనాలు నాటే సమయం వచ్చింది కాబట్టి ప్రతీ ఒక్కరు నకిలీ విత్తనాలు మరియు ఎరువుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఎవరికైనా నకిలీ విత్తనాలు/ఎరువులు అమ్ముతున్నారు అనే సమాచారం తెలిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. గ్రామంలోని యువత మత్తు పదార్థాలకు(డ్రగ్స్ ) కు అలవాటు అయి వారి ప్రవర్తనలో ఏమైన మార్పులు కలిగినా వెంటనే వారికి అవగాహన కల్పించడం కోసం పోలీస్ వారికి సమాచారం అందించి పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కలిగి ఉండి, తమ స్నేహితులకు, తోటి వారికి అవగాహన కల్పించాలి. గ్రామాల్లో ఎవరైనా రాత్రివేళ కొత్త వ్యక్తుల సంచారాన్ని గమనించినట్లయితే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసు వారికి తెలియ పరచాలని కోరారు.

VijayaKumar

May 30 2024, 19:56

తెలంగాణ రాష్ట్ర రాజముద్ర ను మార్చడం సరైన పద్ధతి కాదు: వలిగొండ మాల మహానాడు అధ్యక్షులు నీలం నరేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర రాజ ముద్రను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం, ప్రభుత్వం మారగానే ప్రభుత్వ చిహ్నాలు మార్చడం సరైన నిర్ణయం కాదని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల మాల మహానాడు మండల అధ్యక్షుడు నీలం నరేందర్ అన్నారు . బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ మారుస్తానని అనడం, కాంగ్రెస్ బిజెపి దొండుదొండని ఇప్పటికైనా ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలయ్యేలా చూడాలని అన్నారు.

VijayaKumar

May 30 2024, 18:23

బడిబాట కార్యక్రమం లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ హనుమంతు కే జెండగే

యాదాద్రి భువనగిరి జిల్లా లో బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని గురువారం కలెక్టర్ హనుమంతు కే జెండగే అధికారులను కోరారు. జూన్ 3 నుంచి 19 వరకు జరిగే బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు .బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గంగాధర్, భువనగిరి ఆర్డీవో అమరేందర్ ,తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 30 2024, 18:07

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చౌటుప్పల్ మండల అధ్యక్షులుగా గట్టు సుధాకర్ నియామకం

తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలలో పాల్గొని తెలంగాణ సాదనే లక్ష్యంగా పనిచేసిన తెలంగాన ఉద్యమ కారుడు గట్టు.సుధాకర్ ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చౌటుప్పల్ మండల అధ్యక్షులుగా గట్టు సుధాకర్ ను నియమిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ గురువారం ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్బంగా గట్టు.సుధాకర్ మాట్లాడుతూ నా నియామకానికి సహకరించి నియమించినందుకు రాష్ట్ర అద్యక్షులు చీమ.శ్రీనివాస్,ఉమ్మడి నల్లగొండ జిల్లా అద్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను చైతన్యంవంతం చేసి,అనేక తెలంగాణ ఉద్యమ పోరాటాలు చేసి నష్టపోయిన ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు.ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు న్యాయం చేయాలని అన్నారు.ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారులను ఆదుకోవాలని కోరారు.ఈ సమావేశంలో బాబు. లింగం తదితరులు పాల్గొన్నారు.