ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టమును పోరాడి సాధించిన సిపిఎం ను, చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రలు చేస్తున్న మోడీ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్ట పరిరక్షణ కోసం పోరాడుతున్న సిపిఎం భువనగిరి పార్లమెంటు అభ్యర్థి యుండి. జహంగీర్ గారిని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు భాస్కర్ నర్సింహ్మ పిలుపునిచ్చానారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని పెంచికల్ పహాడ్, అనాజిపురం గ్రామాలలో సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి యండి.జహంగీరి గారిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పెంచికల్ పహాడ్ గ్రామంలో పని చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి కూలీల పని ప్రదేశాన్ని సందర్శించి వారి సమస్యలు తెలుసుకున్న అనంతరం భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న పరిస్థితి ఉన్నదని విమర్శించారు.అనాడు వామపక్షాలు, ప్రజా సంఘాలు పోరాడి సాధించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ నిరుపేదలకు, వ్యవసాయ కూలీలకు ఉపాధికి ఉపయోగపడుతూ రెండు పూటల తిండి తినడానికి ఉపయోగపడుతుందని, గ్రామీణ పేదలు వ్యవసాయ కూలీలు గౌరవంగా జీవించడానికి ఉపాధి హామీ పనులు తోడ్పడుతున్నాయని అన్నారు. కానీ నేడు అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఎత్తివేయాలనే కుట్ర కోణం నుండి ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ కార్మికుల పైన అనేక భారాలు మోపుతూ చట్టంలో ఉన్న సౌకర్యాలు అన్నింటినీ ఎత్తివేస్తున్నదని మొత్తమే చట్టం లేకుండా చేయాలనే ఆలోచనలో బిజెపి ఉన్నదని ఈఎన్నికల్లో బిజెపి నీ ఓడించకపోతే ఉపాధి చట్టం ఉండదని పేదలందరూ ఐక్యంగా బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మరోపక్క నిత్యవసర వస్తువుల ధరలు పెంచుతూ పేదల పైన భారాలను మోపుతున్నదని కార్మిక చట్టాలను కాలరాస్తూ పనివారాన్ని పెంచుతూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న పరిస్థితి ఉన్నదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బిజెపితో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్ పూర్తిగా విఫలమయ్యాయి అని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే ప్రజా ఉద్యమాల సారధి సిపిఎం సిపిఎం అభ్యర్థి ఎండి. జహంగిర్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వారు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జే. వెంకటేష్ , కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, శాఖ కార్యదర్శి ఎదునూరి వెంకటేశం, నాయకులు బిక్షపతి బాలయ్య, స్వామి, బాలరాజు, శ్రీకాంత్, వెంకటేశు, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.

 వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామంలో భువనగిరి బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారి గెలుపు కొరకై ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు హాజరైనారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామ ప్రజలకు ఒక్కొక్కటిగా వివరించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బూర నర్సయ్య గౌడ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించగలరని వారిని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నాయకులు సీఎన్ రెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ రాచకొండ కృష్ణ గారు, మండల ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ గారు, మండల ఉపాధ్యక్షులు సంతోష్ గారు, భారతీయ జనతా యువమోర్చా మండల అధ్యక్షులు మందడి రంజిత్ రెడ్డి గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వెంకటేష్ గారు, టేకుల సోమరం గ్రామ బూత్ అధ్యక్షులు పాటి వెంకట్ రెడ్డి , నవీన్ రెడ్డి, రామకృష్ణ , అంబరీష్ , భాను ప్రకాష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకులో నగదు లో కొరత ఏర్పడిందని బ్రాంచ్ మేనేజర్ జి మౌనిక స్థానిక వలిగొండ పోలీస్ స్టేషన్లో పిటిషన్ దాఖలు చేశారు. బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి, క్యాష్ ఇన్చార్జి కాలేరు అనిల్ కుమార్ ఈనెల 16వ తేదీ నుండి విధులకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారు. ఎక్కడున్నాడో తెలియదు. అతని క్యాబిన్ చెక్ చేయగా నగదు లో రూ. 15 లక్షల 50 వేలు తక్కువగా ఉన్నాయి. ఎంక్వయిరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్యాంక్ మేనేజర్ కోరారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వలిగొండ ఎస్సై మహేందర్ తెలిపారు.

Apr 18 2024, 17:51
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
19.5k