/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz నర్సాపురం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా అన్యువల్ డే సెలబ్రేషన్ Vijay.S
నర్సాపురం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా అన్యువల్ డే సెలబ్రేషన్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నర్సాపురం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా అన్యువల్ డే సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ జి వాణిశ్రీ హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు, తల్లులు, బాలింతలు అంగన్వాడి కేంద్రాలను ఉపయోగించుకోవాలని అన్నారు.

అంగన్వాడి టీచర్ సక్కుబాయి పిల్లలకు ఇంగ్లీషు ,తెలుగు అక్షరమాల, అంకెల పరిచయాలు, పాటలు పిల్లలతో చేయించి తల్లులకు చూపించడం జరిగినది. పిల్లలకు మూడు నెలకు ఒకసారి అసైన్మెంట్ కార్డులలో పిల్లలు చేసిన యాక్టివిటీస్ మీద స్టార్స్ గుర్తించి వారికి ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా నరసమ్మ, పిల్లల తల్లులు, తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 19న భువనగిరిలో నిర్వహిస్తున్న రోడ్ షో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు

 ఈనెల 19న సిపిఎం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి యండి. జహంగీర్ గారి నామినేషన్ సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రోడ్ షో కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో సిపిఎం అభ్యర్థి గెలుపును కోరుతూ సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ప్రజల పైన అనేక భారాలు మోపుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తూ దేశ ఐక్యతను దెబ్బతీస్తూ భారత రాజ్యాంగాన్ని ప్రజలకు ఉన్న హక్కులను సమూలంగా మార్చి మనువాద రాజ్యాంగాన్ని తెచ్చి పరిపాలన చేయాలని చూస్తున్నదని ఈ విధానాలను ప్రజలంతా వ్యతిరేకించి ఈ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టడం తప్ప వారికి చేసిన పనులు ఏమీ లేవని ఈ రెండు పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడింది ఏమీ లేదని అందుకనే ఈ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ లను ఓడించి నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్నాయి ఎర్రజెండా ఎర్రజెండా అభ్యర్థి ఎండి జాహంగీర్ ని గెలిపించాలని కోరినారు. 19 నాటి రోడ్ షో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జి. నాగయ్య, రాష్ట్ర రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు

ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి , పోతినేని సుదర్శన్, టి. జ్యోతి, డిజి. నరసింహారావు, చుక్క రాములు, పాలడుగు భాస్కర్ , జాన్ వెస్లీ , టి. సాగర్ ,మల్లు లక్ష్మి , ఎండి అబ్బాస్, పి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారని నర్సింహ తెలియజేసినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, మాజీ సర్పంచ్ రాసాల నిర్మల, మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ , కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు రాసాల వెంకటేష్, శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య, సభ్యులు మధ్యపురం బాల నర్సింహ, మచ్చ భాస్కర్, ఉడుత వెంకటేష్, ఎంఏ. రైహిమాన్ తదితరులు పాల్గొన్నారు.

          

జవహర్ బాల్ మంచ్ యాదాద్రి భువనగిరి జిల్లా కో- ఆర్డినేటర్ గా కొడారి వెంకటేష్ నియామకం


 జవహర్ బాల్ మంచ్ యాదాద్రి భువనగిరి జిల్లా కో- ఆర్డినేటర్ గా భువనగిరి పట్టణానికి చెందిన కొడారి వెంకటేష్ ను నియమించినట్లు జవహర్ బాల్ మంచ్ (జే బి ఎం) రాష్ట్ర కో- ఆర్డినేటర్ చెరుకు కిరణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చెరుకు కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలల హక్కులను కాపాడుటకు, భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న జాతీయ నాయకుల జీవిత చరిత్రను సమగ్రంగా నేటి బాలలకు అందించటానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జిల్లా జవహర్ బాల్ మంచ్ కో- ఆర్డినేటర్ కొడారి వెంకటేష్ మాట్లాడుతూ తనను జిల్లా కో- ఆర్డినేటర్ గా నియమించిన జవహర్ బాల్ మంచ్ జాతీయ కన్వీనర్ అశోక్ మరిదాస్, రాష్ట్ర కో- ఆర్డినేటర్ చెరుకు కిరణ్ కుమార్, రాష్ట్ర చైర్మన్ మామిడి రుషికేశ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులకు కొడారి వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

యాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరిశాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో ముద్దపురం యంపిటిసి సామ రాం రెడ్డి, మాజీ సర్పంచ్ ఉప్పల్ రెడ్డి,జక్క నర్మద వెంకట్ రెడ్డి,చంద్రారెడ్డి,గూడూరు యాదిరెడ్డి,గుర్ర క్రిష్నారెడ్డి,వాకిటి కోండల్ రెడ్డి,గుంటోదు మదనాచారి,ఆవుల దర్మయ్య,కొంపల్లి లక్ష్మయ్య,సామ దర్మారెడ్డి,జక్కమల్లారెడ్డి,సామ సంతోష వెంకట్ రెడ్డి,పిన్నింటి క్రిష్నారెడ్డి,పిన్నింటి వెంకట్ రెడ్డి,మొగిలిచెర్ల నవీన్,సామ దర్మారెడ్డి,కొంపల్లి లక్ష్మయ్య 50మంది బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీతి రమేష్ వలిగోండ జడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి,మండల అధ్యక్షులు పాశం సత్తి రెడ్డి,గరిసె రవి,బోల్ల శ్రీనివాస్,కంకల కిష్టయ్య,బత్తిని సహదేవ్,పల్లెర్ల సుదాకర్,నిరజా రెడ్డి,కాసులవెంకటేష్,నారగోని ప్రమేద్ కుమార్,ప్రవీణ్,తదితరులు పాల్గోన్నారు.

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఎస్పి పార్టీ జిల్లా ఇన్చార్జి బండారు రవి వర్ధన్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని డాల్ఫిన్ హోటల్ ఆవరణలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి  బీఎస్పీ పార్టీ జిల్లా ఇంన్చార్జ్ బండారు రవివర్ధన్ ని కాంగ్రెస్ పార్టీ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈసందర్భంగా శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 

రిటైర్డ్ భువనగిరి మండల విద్యాధికారి బండారు రవి వర్ధన్ గత కొన్ని సంవత్సరాలుగా బీఎస్పీలో కొనసాగారు. ఆయన సేవలు బిఎస్పి పార్టీకి అందించారు కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని వారు కాంగ్రెస్ పార్టీ చేయుచున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలను చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లోకి రావడం సంతోషకరమైన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూర వెంకటేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు, దర్లాయి హరిప్రసాద్, కొల్లూరి రాజు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ బండారు అశోక్ వర్ధన్,బుగ్గ మైసయ్య, 23వ వార్డుకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కర్కాల సుదర్శన్ తోట మహేందర్ నువ్వుల రాజు ఈశ్వర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ మండల కేంద్రంలో ఇంటింటికి బిజెపి ప్రచారం

*భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు వలిగొండ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు బోల్ల సుదర్శన్, బూత్ అధ్యక్షుడు ఎల్లంకి మురళి ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ ప్రచారంలో భాగంగా మోడీ గారి నాయకత్వంలో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం పథకాలు వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ బంధారపు లింగస్వామి, మండల ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ కుమార్, మాటురి పెద కిట్టు , BJYM జిల్లా కార్య వర్గ సభ్యులు దంతూరి అరుణ్ ,ఏళ్లంకి సతీష్ తదితరులు పాల్గొన్నారు

బీజేవైఎం భువనగిరి అసెంబ్లీ కన్వీనర్ గా బుంగమట్ల మహేష్ నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణానికి చెందిన బుంగమట్ల మహేష్ కి భారతీయ జనతా యువమోర్చా భువనగిరి అసెంబ్లీ కన్వీనర్ గా నియమిస్తూ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుంగమట్ల మహేష్ మాట్లాడుతూ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గా నియామకానికి సహకరించిన మండల పార్టీ అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ బందారపు లింగస్వామి జిల్లా సీనియర్ నాయకుడు టెలికం అడ్వైజరీ బోర్డు మెంబర్ దంతూరి సత్తయ్య రాచకొండ కృష్ణ బచ్చు శ్రీనివాస్ ఇతర జిల్లా రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నాపై నమ్మకంతో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గా నియమించినందుకు భారతీయ జనతా పార్టీని బీజేవైఎం బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అదేవిధంగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గేలుపే లక్ష్యంగా తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని ఆయన అన్నారు.

ఇంద్రపాలనగరం లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాల నగరంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి నీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామన్నపేట ఎంపీపీ పూస బాలమణి - నరసింహ హాజరై అంబేద్కర్ నివాళులర్పించారు. మహనీయుని జయంతి ఉత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. నూతనంగా రామన్నపేట ఎంపీపీగా ఎన్నికైన పూస బాల మణి - నరసింహ ని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శాలువా తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గర్దాసు సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బందెల క్రిస్టఫర్, మాజీ సర్పంచ్ పోతురాజు సుధాకర్, కొలుకులపల్లి చంద్రయ్య,మాజీ వార్డ్ మెంబర్ కొలుకులపల్లి యాదగిరి, కొలుకులపల్లి యాదయ్య, మహేష్ రవి, సంబోగు బాలస్వామి, కొలుకులపల్లి బాలరాజు, బొప్పని నగేష్, సంబొగు స్వామి, వంపు కృష్ణ, కొలుకులపల్లి నరేష్, కొలుకులపల్లి ప్రశాంత్, సంబొగు సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సుంకిశాల లో ఆర్థిక సహాయం అందజేత


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామం పోలేపల్లి ఈశ్వరయ్య చనిపోయిన సందర్భంగా భార్య పోలెపల్లి అనురాధ కి రూ .5000 రూపాయలు ,50 కిలోల బియ్యం ఒక చీర ఆర్థిక సాయం చేసిన నల్ల మాస బిక్షపతి అండాలు గారు ,ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

భోగారంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రామన్నపేట మండలం బోగారం గ్రామంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కునూరు సాయి కుమార్ గౌడ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేడి కృష్ణ,అంబేద్కర్ యువజన సంఘం కమిటీ అధ్యక్షులు మేడి రవీందర్, విగ్రహం కమిటీ కోశాధికారి మేడి నరసింహ, కమిటీ గౌరవ అధ్యక్షులు మేడి యాదయ్య, మాజీ ఎంపిటిసి మేడి రామలింగం,మాజీ వార్డ్ మెంబర్ మేడి యాదయ్య, మెట్టు అంజయ్య, బొడ్డుపల్లి లింగయ్య, గోగు శ్రీను,చింతల మల్లేష్,మేడి చిరంజీవి,మేడి శివ,మేడి ముఖేష్ ,గుంజా ఆంజనేయులు, గుంజ మహేష్, మేడి మల్లేష్,కునూరు రాజు గౌడ్ ,జల శ్రీనివాస్,బద్దుల మహేష్ ,బద్దుల రాజు ,చిరగోని నవీన్ గౌడ్, గుంజ గణేష్, గుంజ కనకయ్య,గుంజ సత్తయ్య,ఏర్పుల కిరణ్,మేడి స్వామి,మేడి లింగస్వామి, కునూరు వెంకన్న, మోహిన్, మెట్టు తదితరులు పాల్గొన్నారు