/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: ఈ నెల 28 లోపు మేడారం జాతరకు అన్ని పనులు పూర్తి Mane Praveen
TS: ఈ నెల 28 లోపు మేడారం జాతరకు అన్ని పనులు పూర్తి

HYD: మేడారం సమ్మక్క సారక్క జాతరపై ఎంసిహెచ్ఆర్డి లో మంగళవారం సాయంత్రం మంత్రుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. జిల్లా కలెక్టర్, అధికారులకు మేడారం జాతర పనులు త్వరితగతిన పూర్తికావడానికి వర్క్ అసైన్ చేశారు.

28 లోపు అన్ని పనులు పూర్తి అవుతాయని, గతంలో అక్కడ పని చేసిన అధికారులకు ట్రాఫిక్ జామ్ రూట్ క్లియారెన్స్ కోసం నోడల్ ఆఫీసర్ కి బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు.

కోట్లాది మంది భక్తులు వచ్చే జాతరలో.. ప్రధానంగా ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమ్మక్క సారక్క జాతర విజయవంతానికి అన్ని డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయం తో కలిసి పని చేయాలని కోటి 50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.

అంతేకాకుండా మహాలక్ష్మి పథకం ద్వారా భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈసారి 6 వేల బస్సులు నడిపించడానికి ఆర్టీసీ ప్రణాళికలు రచించిందన్నారు. అదనంగా బస్సులు వేయడం వల్ల 3 రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకోసం ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నాం, బస్సులు మరిన్ని అవసరమైనప్పుడు ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు ఏర్పాటు చేసుకునేలా అధికారులు ప్లాన్ చేసుకోవాలి, ఆర్టీసీ రవాణా అధికారులు సమన్వయం తో కలిసి పనిచేయాలి అని ఆయన వ్యాఖ్యానించారు.

TS: ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

తెలంగాణలో ధరణి సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సీసీఎల్ఏ సభ్యుడు చైర్మన్ గా, ఈ కమిటీలో సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రేమండ్ పీటర్, భూ నిపుణులు అడ్వకేట్ భూమి సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్‌ లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కమిటీ ధరణి పోర్టల్‌లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలను రెడీ చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ధరణి పోర్టల్‌లో చేయాల్సిన మార్పులను ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫార్స్ చేయనుంది.

NLG: ఘనంగా ప్రియదర్శిని మేడి పుట్టినరోజు వేడుకలు

చిట్యాల: మండలం వట్టిమర్తి గ్రామంలో బిఎస్పి నాయకుల ఆధ్వర్యంలో నియోజకవర్గ బిఎస్పి ఇంచార్జి ప్రియదర్శిని మేడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని, వట్టిమర్తి గ్రామంలో నిరుపేదలకు రూ. 5000 విలువ గల దుప్పట్లు పంపిణీ చేశారు.

అనంతరం క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ ను కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, చేరికల కమిటీ కన్వీనర్ మునుగోటి సత్తయ్య, మండల అధ్యక్షులు జోగు శేఖర్, జోగు యోగి, మహేష్, బిఎస్పి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఆర్టీసీ సిబ్బంది నుంచి మహిళలకు సరైన గౌరవం లభించడం లేదని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. స్టేజీల వద్ద

TS: మహిళను నీ అమ్మ అంటూ దూషించిన ఆర్టీసీ డ్రైవర్?
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఆర్టీసీ సిబ్బంది నుంచి మహిళలకు సరైన గౌరవం లభించడం లేదని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. స్టేజీల వద్ద మహిళలు కనబడితే బస్సులు ఆపడం లేదని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు. దీనిలో భాగంగా ఇవాళ ఉదయం హైదరాబాద్ చెంగిచర్ల డిపో నుంచి వస్తున్న బస్ 18 సీ బస్ ఖాళీగా ఉండగా కొందరు మహిళలు ఆపారు. అయితే డ్రైవర్ బస్సు ఆపకుండా.. ఎందుకు ఆపాలని తనను నీ అమ్మ అంటూ దూషించాడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
NLG: ఎన్జీ కళాశాల కు సుల్తాన్ చాంద్ ట్రస్ట్ వారిచే 568 పుస్తకాలు వితరణ

నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలకు.. సుల్తాన్ చాంద్ ట్రస్ట్ న్యూఢిల్లీ వారు 568 పుస్తకాలు భౌతిక, రసాయన, గణిత, గణాంక, వాణిజ్య, వ్యాపార, ఆర్థిక శాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలు ఉచితంగా వితరణ చేశారని, రూ.2,48,575/- విలువైన పుస్తకాలు అందజేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మునీర్, శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీనివాసులు, కళాశాల గ్రంథ పాలకులు దుర్గాప్రసాద్, అధ్యాపకులు నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, నక్క నరసింహ తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద విద్యార్థుల కోసమే కస్తూరి ఫౌండషన్: పిన్నింటి నరేందర్ రెడ్డి

మునుగోడు: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 80 మంది పదవ తరగతి విద్యార్థులకు రాబోయే వార్షిక పరీక్షల దృష్ట్యా.. కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ సహకారంతో రూపొందించిన స్టడీ మెటీరియల్ ను నేడు ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఫౌండేషన్ సభ్యులు పిన్నింటి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత 8 సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలకు భవన మరమ్మత్తులు, పెయింట్స్,నోటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థుల కోసమే కస్తూరి ఫౌండేషన్ పనిచేస్తుందని తెలిపారు.

కస్తూరి ఫౌండేషన్ సహకారంతో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రములోని కొన్ని వందల ప్రభుత్వ పాఠశాలల ను మరమ్మత్తులు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పరిస్థితులకు అనుగుణంగా అనుగుణంగా దేనికైనా సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటారని, భవిష్యత్తులో ఆ మనసత్త్వమే ఉత్తమ పౌరులుగా ఎదగడానికి దోహద పడుతుందని, అలాంటి విధ్యార్దుల యొక్క విద్యాభివృద్ధి కోసం కస్తూరి ఫౌండేషన్ నిరంతరం పని చేస్తుదని, పేదవారు విద్యకు దూరం కావొద్దనే లక్ష్యంతో కస్తూరి ఫౌండేషన్ ను స్థాపించామన్నారు. కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం రవీందర్, ఉపాధ్యాయులు చంద్రం, యాదయ్య, కళావతి, హరీష్, తదితరులు పాల్గొన్నారు.

NLG: సంక్రాంతి సెలవులు మరొక్క రోజు పొడగింపు

నల్గొండ జిల్లా: 

మహాత్మ గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సంక్రాంతి సెలవులు ఈనెల 7 వ తేదీ నుండి 15 వరకు ఇచ్చారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు సెలవులను మరొక్కరోజు పొడిగించారు. 

ఎంజియూ రిజిస్టార్ డా. అలువాల రవి సంక్రాంతి సెలవులు 16వ తేదీ వరకు పొడిగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ కళాశాల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సుంకరి రాజారామ్, నల్గొండ జిల్లా అధ్యక్షులు మునీర్, సెక్రెటరీ రామరాజు, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, కోశాధికారి గంజి భాగ్యలక్ష్మి, యూనివర్సిటీ కోఆర్డినేటర్ యాదగిరి రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

TGCTA నూతన సంవత్సర క్యాలెండర్ 2024 ను ఆవిష్కరించిన NG కళాశాల ప్రిన్సిపాల్

నల్లగొండ:

తెలంగాణ గెజిటెడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ TGCTA, నూతన సంవత్సర క్యాలెండర్ 2024 ను NG కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ చేతుల మీదుగా ఆవిష్కరించారని అసోసియేషన్ ఎంజియూ సెక్రెటరీ డాక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవలనే ప్రిన్సిపల్ గా వచ్చిన సముద్రాల ఉపేందర్, అధ్యాపకులు అసోసియేట్ ప్రొఫెసర్ గా ప్రదోన్నతి చెందిన లక్ష్మణ్ గౌడ్, దీపిక లను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ వైవి ప్రసన్నకుమార్, జిల్లా అధ్యక్షులు నాగరాజు, సెక్రెటరీ శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దీపిక, నాగిరెడ్డి,లక్ష్మణ్ గౌడ్, నారాయణ రావు, ముత్తయ్య, యాదగిరిరావు, మల్లేష్, నాగరాజు, రవి, బిక్షమయ్య, తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

NLG: నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి అందిస్తా: నిమ్మ స్రవంతి

నల్లగొండకు చెందిన స్రవంతి సోమవారం 'ట్రైన్ ద ట్రైనింగ్ వర్క్ షాప్' నందు మోటివేషనల్ స్పీకర్ గా నేడు సర్టిఫికెట్ పొందారు. 30 రోజుల శిక్షణ, 2 రోజుల ఆఫ్లైన్ క్లాసెస్ పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రాబాద్ లో ఇంపాక్ట్ సంస్థ వ్యవస్థాపకులు గంప నాగేశ్వరరావు ఇంపాక్ట్ నామకరణం చేసిన డా. మహేష్ చేతులు మీదుగా స్రవంతి TTWS సర్టిఫికెట్ అందుకున్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి అందించడానికి, సామాజిక సేవ చేయడానికి అవకాశం కల్పించిన తమ మెంటర్ అయిన రాము కు ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధీర్, జానీ, నాగలక్ష్మి ,శ్రీధర్, శ్రీనివాస్, రమేష్, మధుమతి, సంతోష్, దస్తగిరి మెంటర్స్ ఉన్నారు.

*తెలుగు రాష్ట్రాల్లో 1301 కోట్లు పన్ను ఎగవేత*

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జీఎస్టీ బోర్డ్ ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా, భారీ పన్ను ఎగవేత కేసులు బయట పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో 1301 కోట్ల పన్ను ఎగవేత ను గుర్తించాయి.

ఏపీలో 19 బోగస్ సంస్థలు 765 కోట్లు, తెలంగాణలో 117 బోగస్ కంపెనీలు 536 కోట్ల స్కాం చేశాయని తేలింది.

తెలంగాణలో 235 కోట్ల మేరకు రికవరీ చేసి ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఆర్ధిక శాఖ వర్గాలు వెల్లడించాయి.