/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz 'మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవాలి': లెంకలపల్లి గాంధీ సెంటర్ యూత్ Mane Praveen
'మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవాలి': లెంకలపల్లి గాంధీ సెంటర్ యూత్
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా, గాంధీ సెంటర్ యూత్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ ఎంచుకున్న అహింస మార్గాన్ని, గాంధీ సిద్ధాంతాలను గుర్తు చేసుకున్నారు. దేశానికి గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీ అడుగుజాడల్లో నడవాలని భావితరాల యువతకి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పగిళ్ల హరీష్, పగిళ్ల రాహుల్, మానే ప్రవీణ్, పాక పరమేష్, కుందారపు సాయి, దాసరి విగ్నేష్, పాక శివ, తదితరులు పాల్గొన్నారు
NLG: లెంకలపల్లి లో ఘనంగా గాంధీ జయంతి
నల్లగొండ జిల్లా:  ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో  ఘనంగా గాంధీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. కార్యక్రమంలో మేతరి శంకర్, ఏర్పుల సురేష్, కల్లెట్ల శంకర్, ఏర్పుల నరసింహ, దాసరి నరసింహ, పగిళ్ల యాదయ్య, పాక అంజయ్య, గురుస్వామి, ఏర్పుల సైదులు, తదితరులు పాల్గొన్నారు.
TS: తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం: ప్రధాని మోదీ
మహబూబ్‌నగర్‌: జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఆదివారం రూ.13,700 కోట్ల అభివృద్ధి పనులకు  శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం - హైదరాబాద్‌ మల్టీ ప్రోడక్ట్‌ పైప్‌లైన్, వరంగల్‌ - ఖమ్మం - విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యుల్లారా అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. దేశంలో పండగల సీజన్‌ నడుస్తోంది. పార్లమెంట్‌లో నారీశక్తి బిల్లును ఆమోదించుకున్నాం. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. రవాణా సదుపాయాలు మెరుగవుతాయని మోదీ అన్నారు. రోడ్డు ప్రాజెక్టుల ద్వారా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు మెరుగవుతాయని తెలిపారు.

పసుపు బోర్డుపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణకు పసుపు బోర్డు, పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని పాలమూరు సభ సాక్షిగా ప్రధాని మోదీ ప్రకటించారు. అంతేకాదు ములుగు జిల్లాకు సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ప్రకటించారు. సమ్మక్క సారక్క పేరుతో సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీకి నామకరణం చేశారు.

SB NEWS TELANGANA
సెమీఫైనల్ చేరుకున్న నల్గొండ జిల్లా SGF U/19 ఫుట్బాల్ టీం
NLG: గత రెండు రోజులుగా మెదక్ జిల్లా సదాశివపేట లో జరుగుతున్న SGF U/19 బాలుర ఫుట్బాల్ పోటీల్లో.. నల్గొండ జిల్లా ఫుట్బాల్ టీం ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్ లలో రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, జిల్లా జట్ల పై విజయం సాధించి, పూల్ విన్నర్ గా సెమి ఫైనల్ కు చేరుకుందని జిల్లా జట్టు కోచ్, మేనేజర్లు లింగయ్య నాయక్, మద్ది కరుణాకర్ లు తెలిపారు. ఈ సందర్భంగా SGF అండర్19 సెక్రెటరీ ఇందిర మరియు ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ బొమ్మపాల గిరిబాబు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రేపటి పర్యటన వివరాలు

NLG: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గంలో అభివృద్ధి పర్యటనలో భాగంగా.. సోమవారం మునుగోడు మరియు చండూరు మండలాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఉదయం గం. 7:30 లకు కోతులారం బ్రిడ్జి శంకుస్థాపన

ఉ.8:00 గంటలకు కల్వకుంట్ల నుండి వెల్మకన్నె బిటి రోడ్ శంకుస్థాపన.

ఉ.8:30 గంటలకు చొల్లేడు నుండి బోడంగిపర్తి బిటి రోడ్ శంకుస్థాపన.

ఉ. 9:00 గంటలకు నెర్మట బిటి రోడ్ బ్రిడ్జి శంకుస్థాపన

ఉ. 9:30 గంటలకు పిడబ్ల్యూడి రోడ్ నుండి జోగుగూడెం బిటి రోడ్ శంకుస్థాపన

ఉ.10:15 గంటలకు తిమ్మరెడ్డిగూడెం నుండి నాంపల్లి రోడ్ వరకు బిటి రోడ్ శంకుస్థాపన

ఉ.11:00 గంటలకు గుండ్రేపల్లి నుండి చొప్పరివారి గూడెం బిటి రోడ్ శంకుస్థాపన

ఉ.11:30 గంటలకు చొప్పరివారిగూడెం నుండి లక్కినేనిగూడెం బిటి రోడ్ శంకుస్థాపన

మధ్యాహ్నం 12:15 గంటలకు ఉడుతలపల్లి నుండి దుబ్బగుడెం రోడ్ శంకుస్థాపన

మ.12:45 గంటలకు పిడబ్ల్యూడి రోడ్ నుండి పడమటితాళ్ల బిటి రోడ్ శంకుస్థాపన

మ. 01:30 గంటలకు పుల్లెంల నుండి బోడంగిపర్తి బిటి రోడ్ మరియు పుల్లెంల నుండి గొల్లగూడెం బిటి రోడ్ శంకుస్థాపన మ. 02:00 గంటలకు తాస్కానిగూడెం నుండి సిర్దేపల్లి బిటి రోడ్ శంకుస్థాపన

మ. 3:00 గంటలకు కొరటికల్ నుండి శిర్దేపల్లి బిటి రోడ్ శంకుస్థాపన మరియు నూతన సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు శంకుస్థాపన, అదేవిదంగా కొరటికల్ నుండి దుబ్బాకలువ మిగులు బిటి రోడ్ శంకుస్థాపన చేయనున్నట్లు క్యాంపు కార్యాలయం వారు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

NLG: వ్రాతపూర్వక హామీలు వచ్చే వరకు సమ్మె విరమించేది లేదు: బండ శ్రీశైలం
చండూరు: మంత్రుల సమక్షంలో నేడు జరిగిన అంగన్వాడీ ఉద్యోగ సంఘాల చర్చల హామీలు.. రాతపూర్వకంగా ఇచ్చేవరకు సమ్మె యధావిధి గా కొనసాగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. చండూరు మండల కేంద్రంలో మండల తహసిల్దార్ ఆఫీస్ ముందు జరుగుతున్న అంగన్వాడీల సమ్మె  శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ నిరవధిక సమ్మె నేటితో 21వ రోజు కు చేరుకుంది. ఈ సందర్భంగా బండ శ్రీశైలం మాట్లాడుతూ.. మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్ ఇరువురి సమక్షంలో అంగన్వాడీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు సిఐటియు, ఏఐటియూసి సంఘాల నాయకులు ఆదివారం మంత్రి నివాసంలో చర్చలు జరపడం జరిగిందని తెలిపారు. చర్చలలో పి ఆర్ సి పరిధిలోకి వచ్చే విధంగా వేతన పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వేతనాలు ఎంత పెంచాల్సి ఉంటుందో మరో మారు చర్చిద్దామని అన్నారని తెలిపారు. అయితే వేతన పెంపు ఎంత అని స్పష్టమైన హామీ రాతపూర్వకంగా వచ్చేవరకు సమ్మె కొనసాగుతుందని బండ శ్రీశైలం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బొమ్మరగోని కిరణ్ అడ్వకేట్, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ నాయకులు కేదారి, నాగమణి, సత్తెమ్మ, తారక, మునిసా, రాజేశ్వరి, పార్వతమ్మ, భాగ్యమ్మ, సుజాన, అనంతలక్ష్మి, వెంకటమ్మ, మంగ, కలమ్మ, ఉషారాణి, జగదీశ్వరి, సునీత, ఆయాలు అండాలు, సుగుణమ్మ, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.
TS: బిఆర్ఎస్ ను వీడి బీఎస్పీ లోకి చేరిన వట్టే జానయ్య కుటుంబం
ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ కుటుంబం వారి అనుచరులతో బీఎస్పీ పార్టీలో చేరారు. నేడు హైదరాబాద్ బీఎస్సీ రాష్ట్ర కార్యాలయంలో, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్పీ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని పొందారు. వట్టే జానయ్య భార్య వట్టే రేణుక సూర్యాపేట 13వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు. ఈమె బిఆర్ఎస్ పార్టీని వీడి బిఎస్పి పార్టీలో చేరారు. అదేవిధంగా వట్టే జానయ్య తల్లి ఐలమ్మ కూడా బీఎస్పీ పార్టీలో చేరారు. వీరికి పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బహుజన సమాజానికి మరియు నవ  నిర్మాణానికి కృషి చేసే పార్టీ 'బహుజన్ సమాజ్ పార్టీ' అని తెలిపారు. సమాజంలో బడుగు బలహీన వర్గాలు ఎదగడానికి కృషి చేసే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ నుండి వట్టే జానయ్య పోటీ చేస్తున్నారని ఆయన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వట్టె రేణుక యాదవ్ మాట్లాడుతూ.. బహుజనుల కోసం సూర్యాపేట నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి పథంలో నడపడమే ఏకైక లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట బీసీ సెల్ అధ్యక్షుడు కుంభం వెంకన్న, పెన్ పహాడ్ బీసీ సెల్ అధ్యక్షుడు ఆవుల అంజయ్య, పిల్లలమర్రి శివాలయం చైర్మన్ వల్లాల సైదులు, లింగమంతుల స్వామి దేవస్థానం డైరెక్టర్ చింతపండు జానయ్య , మహమ్మద్ చాంద్ పాషా, ఎంపీపీ భూక్య కాంతమ్మ , మాజీ ఎంపిటిసి ముక్కాల పద్మ,మాజీ వార్డు మెంబర్ ముక్కాల లింగయ్య, గొర్రెల పెంపక సంఘం అధ్యక్షుడు పెద్ద బోయిన జానకి రాములు, రైతు వేదిక కమిటీ కోఆర్డినేటర్ లింగాల సైదులు, 13వ వార్డు బీసీ సెల్ అధ్యక్షుడు రాగం చిన్న లింగయ్య, టిఎస్డిఏ టౌన్ అధ్యక్షుడు వల్లాల బుచ్చయ్య, మంటపల్లి వెంకన్న, దాసరి నరేష్ యాదవ్, పల్లపెల్లి అంజమ్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
దామరచర్ల: సబ్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నాయకుల ఆందోళన
NLG: మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం బి.అన్నారం సబ్ స్టేషన్ ఎదుట 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నాయకులు రైతులు ఆందోళన చేశారు.ఈ సందర్బంగా మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మా రెడ్డి BLR మాట్లాడుతూ.. పొట్ట దశకొచ్చిన వరికి నీరందక ఎండిపోతున్నాయని అన్నారు. 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బెజ్జం సాయి, పొదిల శ్రీనివాస్, పవన్, సిద్దు, తదితరులు పాల్గొన్నారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
అంగన్వాడీలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
TS: రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ లో వారిని చేర్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70వేల మందికి ప్రయోజనం కలగనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల కానున్నాయి. త్వరలోనే ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఆ జాబితాలో అంగన్వాడీ లను కూడా చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇదే విషయాన్ని అంగన్వాడీ సంఘాల నేతలతో మంత్రి హరీశ్ రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆదివారం ఇద్దరు మంత్రులతో ఆయా సంఘాల ప్రతినిధులు భేటీ కాగా.. ఇందులో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా అంగన్‌వాడీ ల డిమాండ్లపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. జేఏసీ ప్రతినిధులు మంత్రులతో జరిపిన చర్చలు సఫలం కావటంతో అంగన్వాడీలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

ఆదివారం మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్ తో జరిగిన చర్చలు ఫలవంతం అయ్యాయని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. త్వరలో ప్రకటించే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ లో అంగన్వాడీలను చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం గొప్ప విషయమన్నారు. దీంతోపాటు మధ్యాహ్న భోజనానికి సంబధించిన పెండింగ్ బిల్లులు సైతం ప్రభుత్వం విడుదల చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. మిగతా అన్ని సమస్యల పరిష్కారం కోసం నివేదిక అందించాలని శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ ని మంత్రులు ఆదేశించారని తెలిపారు.

తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో.. అంగన్వాడి సమ్మెను నేటితో విరమించుకుంటున్నట్లు ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ పై తమకు పూర్తి విశ్వాసం ఉందని… అంగన్వాడీల బాగోగులు చూసుకునే విషయంలో ముఖ్యమంత్రి అనుకూలంగా ఉంటారని కోరుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్ కు ఆయా సంఘాల ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మర్రిగూడ: 21వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్స్ ల సమ్మె కొనసాగుతుంది. నేడు 21వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ప్రమాద బీమా, కనీస వేతనము 26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కి పది లక్షలు హెల్పర్లకు ఐదు లక్షలు ఇవ్వాలని, వేతంలో సగం పెన్షన్ నిర్ణయించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాడ్యుయేట్ చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని  వారు డిమాండ్ చేశారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగుల సంఘం మండల నాయకురాలు కాకులవరం రజిత, బొబ్బలి శోభారాణి, చిట్యాల సువర్ణ, రాపోలు విజయశ్రీ, విజ్ఞేశ్వర, సిల్వేరు లక్ష్మి,శారద, ఉడుతల లక్ష్మి, రమావత్ సుగుణ, అనంతలక్ష్మి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA