/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ధరల అదుపులో నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి Miryala Kiran Kumar
ధరల అదుపులో నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి

ధరల అదుపులో నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి

  ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి ఆరోపణ.

 

సిపిఎం ఆధ్వర్యంలోనల్లగొండలో నిరసన ప్రదర్శన

   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ రంగంలో ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ఘోరంగా విఫలం చెందాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆరోపించారు 

       

  సిపిఎం కేంద్ర పార్టీ పిలుపుమేరకు నల్లగొండలో స్థానిక సుభాష్ విగ్రహం నుండి పెద్ద గడియారం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిత్యావసర వస్తువుల ధరలు గ్యాస్ పెట్రోలు ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పెరిగాయని అన్నారు. దీని ప్రభావం వలన ప్రజలు కొనలేని తినలేని స్థితిలోకి నెట్టబడ్డారని అర్ధాకలితో జీవిస్తున్నారని అన్నారు. దేశ సంపదను పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మేస్తున్నారని వాటినుండి ప్రజల ను పక్కదారి పట్టించేందుకు కులం పేరా, మతం పేరా, ప్రాంతం పేరా అనేక అలజడలు సృష్టిస్తూ ప్రజల దృష్టి మరల్చే కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు నల్లధనం వెలికితీత ధరల నియంత్రణ అనే అంశాలు ఎక్కడ అమలు కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలైనా ఇండ్లు ఇండ్ల స్థలాలు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మూడెకరాల భూమి ఇతర పథకాలు అర్హత ఉన్న ప్రజలందరికీ అందలేదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని అన్నారు. మరోపక్క కార్మికుల వేతనాల్లో కోత ఉపాధి హామీ పనులను నిధులు కేటాయించకపోవడం పట్టణ కేంద్రాలలో ఉపాధి పనులు కల్పించడం లేదని అన్నారు. ఉపాధి హామీ పనులకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను గాలికొదిలి సనాతన ధర్మం అంటూ ఇండియా భారత్ అంటూ మతం కులం వాటిపైనే కేంద్రీకరిస్తూ ఘర్షణలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రజలు ప్రజాతంత్ర వాదులు ఖండించాలని కోరారు 

      

*ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, సయ్యద్ హశం, పట్టణ కార్యదర్శి ఎం డి సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ ,గంజి మురళీధర్, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, నాయకులు కుంభం కృష్ణారెడ్డి అద్దంకి నరసింహ నాయకులు, గాదె నరసింహ, పాక లింగయ్య, సలివొజు సైదాచారి, జిల్లా అంజయ్య, కొండ వెంకన్న , రాము, మంజుల, బొల్లు రవీందర్, మారయ్య, రుద్రాక్ష యాదయ్య, మహాబుబ్ అలీ, సాజిద్, తదితరులు పాల్గొన్నారు.

ఎలిషాల రవి ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలిపిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు

ఎలిషాల రవి ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలిపిన బొమ్మపాల గిరిబాబు

YRP ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎలిశాల రవి ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు అభినందనలు తెలియజేశారు. 

రవిప్రసాద్ గారు YRP ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువులకై ఆర్థిక సహాయం చేయడంతో పాటు క్రీడలకు కూడా ఎంతో సహాయం చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్రీడాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షులుగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దేవాలయాల అభివృద్ధికి, మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను మారుమూల గ్రామాలకు సైతం విస్తరించేటట్లు చేయాలని మేమందరం కూడా వారు చూపిన బాటలోనే నడుస్తామని తెలిపారు.

ఆఖరికి ధర్మమే గెలిచింది.. ఈ విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలి సీఎం కేసీఆర్‌

ఆఖరికి ధర్మమే గెలిచింది.. ఈ విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలి సీఎం కేసీఆర్‌

తలాపున కృష్ణమ్మ పారుతున్నా.. నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో వివక్షతో తాగునీరు సాగునీటికి నోచుకోక దశాబ్దాల కాలం పాటు ఉమ్మడి పాలమూరు-రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలు బాధలు అరిగోసను అనుభవించాయని సీఎం కేసీఆర్‌ అన్నారు.

తలాపున కృష్ణమ్మ పారుతున్నా.. నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో వివక్షతో తాగునీరు సాగునీటికి నోచుకోక దశాబ్దాల కాలం పాటు ఉమ్మడి పాలమూరు-రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలు బాధలు అరిగోసను అనుభవించాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. 'కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులను మొదలుపెట్టినట్టే పెట్టాలె వాటిని ఆదిలోనే ఆపేసి పెండింగులో పెట్టాలె ఇదీ నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకుల వైఖరి. ఒకనాడు సుసంపన్నంగా వర్ధిల్లుతూ ఎంతో చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని సొంతం చేసుకున్న పాలమూరులో గంజికేంద్రాలను నడిపించిన దుస్థితి నాటి ఉమ్మడి పాలకులది. నాటి వలస పాలనలో పాలమూరులో ఎటుచూసినా వలసలే తాండవించేవి. పాలమూరు అంటే దేశంలోనే వలస లేబర్‌కు పేరుగాంచిన దుస్థితినాడు. పాలమూరు నిండా బొంబాయి బస్సులు క్యూలు కట్టే దుస్థితి ఉండేది' అని సీఎం వివరించారు.

ఉమ్మడి రంగారెడ్డిలోనూ కరువు తాండవం..

'నాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా నీరు లేక కరువు తాండవమాడేది. సాగునీరు సంగతి దేవుడెరుగు తాగునీరు కూడా కల్పించలేని నిర్లక్ష్యపూరిత వివక్ష నాటి పాలకులది' సీఎం అన్నారు. పాలమూరు జిల్లా ప్రజల బాధలను నాటి ఉద్యమకాలంలో గోరెటి వెంకన్న వంటి పాలమూరు కవులు 'పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా' అంటూ.. 'చేతానమేడుందిరా తెలంగాణ చేలన్ని బీల్లాయెరా' అంటూ పాటలు రాసిన సందర్భాన్ని సమీక్ష సందర్భంగా సీఎం గుర్తు చేశారు. 'వలస పోయిన జనం.. అనివార్యమైన పెండ్లికో చావుకో వచ్చుడు తప్ప తమ తమ స్వస్థలాలకు రాకపోదురు అంటూ నాడు ఉద్యమ కాలంలో పాటలు రాసి పాడిన సంధర్భాలు మరుద్దామన్నా మరుపురావు. అరవై ఎకరాలున్న ఆసామి కూడా అడవులు పట్టుకోని కూలికి పోయిన దుస్థితిని నేను స్వయంగా చూసి దుఃఖపడ్డ. నీరులేక కరువుతో హృదయ విదారకమైన పరిస్థితి తాండవించేవి. రంగారెడ్డి ఉమ్మడి జిల్లా అత్యద్భుతమైన నేలలకు నెలవు. ఇక్కడి నేలలు కుంకుమ లాగా వుంటవి. అద్భుతమైన పంటలు పండే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు. పసిడి పంటలతో నాడు సిరులు కురిపించే నేలలు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి పాలనలో సాగునీరు లేక కరువు పాలైంది' అని ఆవేదన వ్యక్తం చేశారు.

స్వయం పాలనలో పాలమూరు-రంగారెడ్డిపై దృష్టి..

'పోరాడి తెలంగాణ తెచ్చుకున్నంక స్వయంపాలనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. నూతన ప్రభుత్వం తక్షణమే పాలమూరు పరిధిలో నాటి ఉమ్మడి పాలకులు మొదలు పెట్టి పెండింగులో పెట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. దాంతో పాలమూరు జిల్లా పచ్చబడడం ప్రారంభమైంది. వలసలు ఆగిపోయినయి. బయటి రాష్ట్రాలనుంచే పాలమూరుకు ఉల్టా వలసలు ప్రారంభమైన చారిత్రక సందర్భం చోటుచేసుకున్నది' అంటూ సీఎం కేసీఆర్‌ జరిగిన ప్రగతిని వివరించారు. 'మరి చిన్న చిన్న పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటెనే ఇంతగొప్పగా పాలమూరు పచ్చబడ్డదంటే దక్షిణ తెలంగాణ దశ దిశను మార్చే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసుకుంటే ఇంకెంత గొప్పగా తెలంగాణలో అభివృద్ధి అవుతుందో ఊహించుకోవచ్చు' అన్నారు. అదే దార్శనికతతో ఎత్తిపోతలను ప్రారంభించాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే అనేక అడ్డంకులు ప్రారంభమయ్యాయన్నారు. స్వయానా పాలమూరు జిల్లా రాజకీయ నాయకులే వందలాది కేసులు పెట్టడం నిజంగా దురదృష్టకరమన్నారు. 'ఇటువంటి నేతలు ఉండడం పాలమూరు జిల్లా ప్రజలకు శాపంలా పరిణమించింది. రాజకీయాలు ప్రజల జీవితాలను గుణాత్మకంగా మార్చే దిశగా వుండాలి తప్ప.. ఇట్లా వారిని జీవితాలను చిన్నాభిన్నం చేసే దిశగా తమ స్వార్థం కోసం ప్రజల జీవితాలను బలిపెట్టే దిశగా ఉండకూడదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో సరిగ్గా అదే జరిగింది' అంటూ తలెత్తిన అడ్డంకుల గురించి వాటి కారణాల గురించి సీఎం వివరించారు.

ఆఖరికి ధర్మమే గెలిచింది..

'మొక్కవోని పట్టుదలతో ధృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టింది. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు సవాల్‌గా స్వీకరించారు. ఎన్ని అడ్డంకులనెదుర్కునేందుకయినా సిద్ధ పడి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్నిపూర్తిచేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఒక వైపు నిర్మాణం పనులను మరోవైపు న్యాయం సాధించేందుకు ప్రజలకు సాగునీరు తాగునీరును అందించేందుకు తీవ్రమైన కృషిని కొనసాగిస్తూ అడ్డంకులను దాటే ఎత్తుగడలు వ్యూహాలను అమలు పరుస్తూ కొనసాగించిన వారి కృషి ఫలించింది. ఆఖరికి ధర్మమే గెలిచింది. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రావడంతో పాటు పలు అడ్డంకులు తొలగి పోయాయి. ఇది ఎంతో శుభ సందర్భం. ఇది తెలంగాణకు పండుగరోజు. దక్షిణ తెలంగాణ ప్రజల తాగునీరు సాగునీరు కష్టాలు తొలగిపోయిన శుభ సందర్భంకన్నా మనకు మరో గొప్ప వేడుక ఉంటదని నీననుకోను' అని సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన ఇరిగేషన్ శాఖ ప్రన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్‌, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్, ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డిని, సీఈలు రమణారెడ్డిని, హమీద్ ఖాన్‌ను సీఎం అభినందించారు.

అందరి కృషికి దైవ కృప తోడై..

'మనందరి కృషికి దైవ కృప కూడా తోడు కావడం వల్లనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఓ కొలిక్కి వచ్చాయి. నాటి ఉద్యమ కాలంలో కృష్ణా నదిలో బాచుపల్లి వంటి ప్రదేశాల్లో నిలబడి నాణేలు వేసి నీటికోసం మొక్కుదు. ఇట్లా మనం అనేక మొక్కులు మొక్కిన ఫలితమే ఈ విజయం. ఇందుకోసం మనందరం కూడా దేవుని మొక్కలు చెల్లించుకోవాల్సి వున్నది. అందులో భాగంగా కృష్ణమ్మ ఎత్తిపోతల జలాలతో దేవుండ్ల పాదాలు కడుగుతామని నాతో సహా మనందరం మొక్కిన మొక్కులను తీర్చుకోవాల్సి వున్నది. అందుకు ఈ రెండు ఉమ్మడి జిల్లాల నుంచి వస్తున్న సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు సభకు వస్తున్నప్పుడు కలషాలు తెచ్చుకోవాలె. తెచ్చుకున్న కలషాల ద్వారా కృష్ణా జలాలను తీసుకపోయి స్వామి పాదాలకు అభిషేకం చేయాలి.

దేవునిగుడిలో కొబ్బరికాయ కొట్టి పూలుచల్లి అర్చన చేయాలి. పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహించి సంబురాలు జరుపుకోవాలి. ఈ విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలి' అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 16న నిర్వహించే పాలమూరు ఎత్తిపోతల ప్రారంభ కార్యక్రమాన్ని స్వయంగా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అందుకు తగిన ఏర్పాట్లు మంత్రులు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పర్యవేక్షించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు-రంగారెడ్డిని ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఇంజినీర్లకు సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మితమైన రిజర్వాయర్ల నుంచి నీళ్లను తరలించే కాల్వల నిర్మాణం పనులకోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. అందుకోసం అవసరమైన భూ సేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చి గతంలో అనుసరించిన పద్ధతులనే అనుసరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఉమామహేశ్వరం పనులు..

అచ్చంపేట ఉమామహేశ్వరం పనులు ప్రారంభించాలన్నారు. అదే సందర్భంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో చేపట్టాల్సిన కాల్వల నిర్మాణం పనులకు సంబంధించి మహేశ్వరం ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో మంత్రులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను యుద్ధప్రాతిపదికన సంపూర్ణంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ చిత్తంతో ఉన్నదని సీఎం పునరుద్ఘాటించారు. తద్వారా దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందనున్నదన్నారు. తెలంగాణ వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని, సమ్మిళిత సమగ్ర వ్యవసాయరంగాభివృద్ధిని సాధించి, తెలంగాణ రైతన్నల లోగిల్లు బంగారు పంటలతో తులతూగి తద్వారా మనం ఆశించిన లక్ష్యంగా పెట్టుకున్న బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నదని సీఎం స్పష్టం చేశారు.

మంచి హృదయంతో పని చేస్తే ప్రకృతి కూడా కరుణిస్తదని, దేవుడు కూడా దయచూపిస్తాడనేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సాధించిన విజయమే సాక్ష్యం అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఎత్తిపోతలకు వినయోగించే బాహుబలి పంపుల వివరాలను సీఎంకు ఇరిగేషన్ అధికారులు వివరించారు. ప్రపంచంలోనే మరెక్కడా వినియోగించని విధంగా 145 మెగావాట్ల సింగిల్ పంపులను పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కోసం వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఈ పంపులను బిగించే బోల్టు బరువు 12 కిలోలుంటుందనీ, దాని రూటర్ 80 టన్నులుంటుందనీ, తెలిపారు. 240 టన్నుల బరువుండే దాదాపు 34 పంపులను ఈ ఎత్తిపోతల కోసం వినియోగిస్తున్నట్టు ఇంజనీర్లు వివరించడంతో సమావేశం ఆశ్చర్యపోయింది.

ఎన్నో వింతలు.. ఆశ్చర్యపోయే అంశాలు..

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ఇంకా ఎన్నో వింతలు విశేషాలు ఆశ్చర్యంగొలిపే అంశాలు నమ్మశక్యం గాని సాంకేతిక అంశాలున్నాయని తెలిపారు. బాహుబలి వంటి భారీ పంపులను బిగిస్తున్నప్పుడు చూడడానికే భయం గొలిపే పరిస్థితులుంటాయని సీఎం వివరించారు. తాను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్భంగా చూశానని సీఎం వివరించారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ అటు ఇరిగేషన్ శాఖ అధికారులు ఇటు విద్యుత్ శాఖ అధికారులు పడుతున్న శ్రమను మరోసారి సీఎం అభినందించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల రాడార్ లో వచ్చే చెరువులను నింపే దిశగా అనుసంధానిస్తూ కాల్వల పనులను చేపట్టాలని సీఎం అన్నారు. ఉత్తర తెలంగాణ నిర్మించిన చెక్ డ్యాంలో అద్భుత ఫలితాలనిస్తున్నాయని సీఎం తెలిపారు. దేశంలోని మొత్తం రాష్ట్రాల్లో వొక్క తెలంగాణలో మాత్రమే భూగర్భ జలాలు విపరీతంగా పెరిగినాయని అందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నారు. అదే విధానాన్ని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సందర్భంలోనూ అనుసరించాలని సీఎం అన్నారు.

హరితహారంతో పరిస్థితులు మారాయ్‌..

ఇన్నాల్లూ మహారాష్ట్ర ఎగువనించి వస్తేనే కృష్ణా గోదావరి నదుల్లో ఎగువనుంచి వరదవచ్చేదనీ ఇప్పుడు తెలంగాణలో చేపట్టిన హరితహారంతో పరిస్థితులు మారాయన్నారు. రాష్ట్రం పరిధిలోని నదీపరీవాహక ప్రాంతాల్లోనే వర్షాలు కురిసి నదుల్లో ప్రవాహం పెరుగుతున్న సందర్భాన్ని సీఎం వివరించారు.

అదే సందర్భంగా నీటిని ఎత్తిపోసేందుకు పంపులను నడిపేందుకు కీలకమైన విద్యుత్ వ్యవస్థల నిర్మాణంపై జెన్కో ట్రాన్స్ కో సీఎండీ శ్రీ ప్రభాకర్ రావు తదితర విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తాగునీరు తరలింపుకోసం చేపట్టాల్సిన చర్యల కోసం మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి తదితర అధికారులతో సీఎం సీమీక్షించారు. ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, సీఎంఓ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సీఈలు తదితర ఇంజనీర్లు పాల్గొన్నారు.

పెండింగ్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల కై కధం తొక్కిన విద్యార్థి లోకం

పెండింగ్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల కై కధం తొక్కిన విద్యార్థి లోకం. 

 

ప్రభుత్వ విద్యను బలోపితం చేయాలని PDSU ఆధ్వర్యంలో భద్రాచలం ఆర్డీవో కార్యాలయం ముట్టడి

ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి PDSU డిమాండ్ 

మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు 4000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అధిక నిధులు కేటాయించాలని పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ, జిల్లా అధ్యక్షురాలు  కె.సంద్య కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలో బుధవారం పి డి యస్ యూ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి పి డి యస్ యూ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగల శివ ప్రశాంత్ అధ్యక్షత వహించగా వారు ముఖ్యవక్తులుగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మంది విద్యార్థులు ఫీజు నెంబర్స్ మెంట్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని మూడేళ్లుగా వారికి రియంబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు చదువులను మధ్యలోనే ఆపి పార్ట్ టైం ఉద్యోగాలు చేసి ఫీజులు చెల్లించాల్సిన దౌర్భాగ్య పరిస్థితిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర మనోవేదన గురవుతున్నారని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు చేసే ఫీజుల వేధింపులపై కనీసం ప్రభుత్వ అధికారులు నోరు మెదపడం లేదని అన్నారు. ఇప్పటికే ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయని ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని, మొత్తంగా విద్యారంగం అస్తవ్యస్తమైపోయిందని తెలిపారు. తక్షణమే పెండింగ్ స్కాలర్షిప్ సియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఒకపక్క ప్రభుత్వ బడలను మూసివేస్తూ ప్రైవేటు పాఠశాలలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ ప్రత్యక్షంగా ప్రోత్సహించడంతో పేద విద్యార్థుల వద్ద ఫీజుల పేరుతో డొనేషన్ల పేరుతో లక్షల రూపాయలని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఉచిత విద్యకు నమూనాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేసి వాటి నిర్వహణను గాలికి వదిలేసారని నేటికీ కొత్త గురుకులాలకు సొంత భవనాలు స్థలాల కేటాయింపు లేకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహాలలో చదివే విద్యార్థులకు కాస్మెటిక్స్, హాస్టల్ నిర్వాహకులకు సంవత్సరాల తరబడి డైట్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ వారి జీవితాలతో చలగాటం ఆడుతుందని అన్నారు. భద్రాచలం కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్,చర్ల మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు, పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ విద్యను అందుబాటులోకి తెచ్చి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం PDSU పట్టణ నాయకులు. పాయం నవీన్, ప్రవీణ్ ,రాంపండు, సుధాకర్ రామకృష్ణ ,చరణ్,ప్రదీప్, దీపిక, తేజశ్రీ, మౌనిక, రమాదేవి ,ప్రమీల, నాగమణి, దేవి ,ప్రసన్న తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

సిపిఎం సీనియర్ నాయకులు, కార్మిక నాయకులు కామ్రేడ్ యానాల రామకృష్ణారెడ్డి (వైఆర్ కె రెడ్డి) మృతికి సంతాపం

సిపిఎం సీనియర్ నాయకులు, కార్మిక నాయకులు కామ్రేడ్ యానాల రామకృష్ణారెడ్డి (వైఆర్ కె రెడ్డి) మృతికి సంతాపం

సిపిఎం సీనియర్ నాయకులు, కార్మిక నాయకులు కామ్రేడ్ యానాల రాధాకృష్ణారెడ్డి (వైఆర్ కె రెడ్డి) మరణం సిపిఎం కు తీరని లోటు అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు

  

  బుధవారం అనారోగ్యంతో మరణించిన వై ఆర్ కె రెడ్డి పార్థివ దేహం పై పార్టీ ఎర్రజెండా కప్పి ఘనంగా నివాళులర్పించడం జరిగింది సిపిఎం నల్గొండ జిల్లా కమిటీ సంతాపం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సుమారు నాలుగు 3 దశాబ్దాల పాటు ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని, చిన్ననాటి నుండి తుది శ్వాస విరిచే వరకు కమ్యూనిస్టు ఉద్యమాభివృద్దికి నిరంతరం కృషి చేసిన నిస్వార్థ కమ్యూనిస్టు అని కొనియాడారు.  

ఆర్టీసీ పరిరక్షణ కోసం జరిగిన దీర్ఘకాలిక సమ్మెలలో, ప్రవేట్ సర్వీసులను ఆర్టీసీ స్వాధీనపర్చుకోవాలి అనే సాగిన ఉద్యమాలలో సమరశీలంగా పోరాడారని గుర్తు చేశారు. 

వారు సిపిఎం పట్టణ కమిటీ సభ్యులుగా, సిఐటియు జిల్లా కోశాధికారిగా, ఆర్టీసీ లో సిఐటియు అనుబంధ యూనియన్ ఎస్ డబ్ల్యూ ఎఫ్ లో డిపో, రీజియన్, రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతల్లో పని చేశారని గుర్తు చేశారు.

వారిని ఇటీవల కాలంలో పరమార్శించడానికి వెళ్ళినప్పుడు గత జ్ఞాపకాలను నెమరువేస్తూ రాబోయే కాలంలో పార్టీ నిర్వర్తించే ఉద్యమాల గురించి సలహాలు సూచనలు చేశారని గుర్తు చేశారు. చిన్ననాటి నుండి కమ్యూనిస్టు పార్టీలో సిపిఐఎం లో చేరి నకరికల్లు, నల్లగొండ ప్రాంతాలలో ఉద్యమ విస్తరణకు కృషి చేశారని చెప్పారు.

ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమాలతో పాటు కార్మిక ఉద్యమాలకు కూడా తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

  వారికి నివాళులర్పించిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం, పట్టణ కార్యదర్శి ఎం డి సలీం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య పుచ్చకాయల నర్సిరెడ్డి నన్నూరి వెంకటరమణారెడ్డి తిప్పర్తి మండల కార్యదర్శి మన్నెం బిక్షం తదితరులు పాల్గొన్నారు

   పలువురి సంతాపం

 సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు వై ఆర్ కె రెడ్డి మరణం కార్మికోద్యమాలకు తీరని లోటు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి సీనియర్ నాయకులు పెన్నా అనంతరామ శర్మ, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీ నారాయణ, రైతు సంఘం జిల్లా నాయకులు ఉట్కూరి నారాయణరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మహిళ కార్మికుల జిల్లా కన్వీనర్ దండెం పల్లి సరోజ, ఎస్ డబ్ల్యూ ఎఫ్ రీజియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రాంబాబు అధ్యక్ష కార్యదర్శులు బత్తుల సుధాకర్ కందుల నరసింహ, లు సంతాపం తెలిపారు.

తెలంగాణలో రూ. 215 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న డీపీ వరల్డ్

తెలంగాణలో రూ. 215 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న డీపీ వరల్డ్

తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దుబాయ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ప్రపంచ స్థాయి కంపెనీలతో సమావేశమవుతూ బీజిగా ఉన్నారు.

తాజాగా ప్రపంచ స్థాయి దిగ్గజ పోర్టు ఆపరేటివ్ డీపీ వరల్డ్ సంస్థ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. 

తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దుబాయ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ప్రపంచ స్థాయి కంపెనీలతో సమావేశమవుతూ బీజిగా ఉన్నారు. అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో(NAFFCO) కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ. 700 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రపంచ స్థాయి దిగ్గజ పోర్టు ఆపరేటివ్ డీపీ వరల్డ్ సంస్థ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలో రాష్ట్రంలో రూ. 215 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు డీపీ వరల్డ్ సంస్థ ప్రకటించింది. దుబాయ్‌లో కేటీఆర్‌తో డీపీ వరల్డ్ సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపిన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇన్‌లాండ్ కంటైనర్ డిపో ఆపరేషన్ కోసం డీపీ వరల్డ్ పెట్టుబడులు పెట్టనుంది. రూ. 165 కోట్లతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వెల్లడించింది. మేడ్చల్‌లో రూ. 50 కోట్లతో కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌజ్ నిర్మించాలని నిర్ణయించింది.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. డీపీ వరల్డ్ లాజిస్టిక్స్‌లో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు డీపీ వరల్డ్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. డీపీ వరల్డ్‌కు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

1,06,65,000/- రూపాయల విలువ కలిగిన... ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధితులకు అందజేసిన నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

 నేడు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు... వీటి కాలనీలోని తమ క్యాంపు కార్యాలయంలో..

 నల్లగొండ నియోజకవర్గానికి చెందిన 279 మంది... వివిధ ప్రవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్న బాధిత లబ్ధిదారులకు 1,06,65,000/- రూపాయల విలువ కలిగిన... ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నేడు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

 

ఇప్పటివరకు తాను శాసనసభ్యునిగాఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి సహాయనిది కొరకు 8250 దరఖాస్తులు పంపగా..అందులో LOC, CMRF చెక్కుల రూపంలో 6839 మందికి..32,74,03,850/- రూపాయలు అందజేశామని... ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సహాయం అందుకోవడంలో రాష్ట్రంలోనే నల్లగొండ నియోజక వర్గం అగ్రస్థానంలో ఉన్నదని, ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ..

పేద వర్గాల వారు... అనారోగ్యాల కారణాలవల్ల ప్రైవేట్ దవాఖానాలను ఆశ్రయించడంతో... ఆర్థికంగా చితికి పోతున్నారని... అందుకు వారికి ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కలుగుతుందని... ఇప్పుడు అన్ని ప్రభుత్వ దవాఖానాలు పూర్తి వసతులతో కార్పొరేట్ హాస్పిటల్ వైద్య సేవల అందిస్తున్నారని.. ముఖ్యంగా నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో... కొత్తగా అనేకమంది డాక్టర్లు అపాయింట్మెంట్ అయ్యారని.. 123 రకాల ల్యాబ్ టెస్ట్ హబ్ ను ఏర్పాటు చేశారని.. ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయించుకోవాలని ఒకవేళ నల్లగొండలో కాకుంటే హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో... అతి తక్కువ ధరలకు కార్పొరేట్ వైద్యం అందుతుందని.. అవసరమైతే అక్కడ ఆరోగ్యశ్రీ ఎల్ఓసిలు అందజేసే అవకాశం ఉందని దాన్ని ఉపయోగించుకోవాలని కోరారు...

 

ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు.. ప్రజా ప్రతినిధులు పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ..

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ

కరీంనగర్‌ విద్యావిభాగం : దివ్యాంగ బాలలు, ప్రత్యేక అవసరాల పిల్లలు గల తల్లిదండ్రులు మనోధైర్యంతో వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ గార్డెన్‌లో జిల్లా విద్యాశాఖ-సమగ్ర శిక్ష, అలీమ్‌కో వారి ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలోని ప్రత్యేక అవసరాల బాలలకు ఉపకరణాలను మంత్రి పంపిణీ చేశారు.

కార్యక్రమంలో కలెక్టర్‌ డాక్టర్‌ గోపి, మేయర్‌ వై.సునీల్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కె.విజయ, అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. జిల్లాలోని 172 మంది ప్రత్యేక అవసరాల బాలలకు ఉచితంగా వివిధ రకాల ఉపకరణాలను అందించారు. మంత్రి కాసేపు ప్రత్యేక అవసరాల బాలలతో ముచ్చటించారు. మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంత్రి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.

నెలాఖరులోగా రైతులకు కొత్త రుణాలివ్వాలి...

నెలాఖరులోగా కొత్త రుణాలివ్వాలి

రైతులందరికీ కొత్త రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రుణమాఫీపై సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ సచివాలయంలో బ్యాంకర్లతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ.

సాంకేతిక కారణాలతో 1.6 లక్షలమందికి అందని రుణమాఫీ

వారికి వెంటనే జమచేసేలా చర్యలు

రాష్ట్రస్థాయిలో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు

బ్యాంకర్లకు మంత్రి హరీశ్‌ ఆదేశాలు

రైతులందరికీ కొత్త రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రుణమాఫీపై సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ సచివాలయంలో బ్యాంకర్లతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికే రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసిందని, మిగతావారికి ప్రాధాన్య క్రమంలో రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు 35 శాతం మందికి మాత్రమే కొత్త రుణాలు మంజూరైనట్టు గణాంకాలు చెప్తున్నాయని, ఈ నెలాఖరు నాటికి మొత్తం 18.79 లక్షల మంది రైతులకు పంట రుణాలు రెన్యువల్‌ పూర్తి కావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం మాఫీ చేసిన రూ.9,654 కోట్లు తిరిగి కొత్త లోన్ల రూపంలో రైతులకు చేరాలని తెలిపారు. కొత్త రుణాలపై జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పురోగతిపై బ్యాంకుల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని వెల్లడించారు. దేశంలోనే ఎకడాలేని విధంగా రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని, ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని తెలిపారు. ప్రతి రైతుకు రుణమాఫీ ప్రయోజనం అందాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని చెప్పారు.

రాష్ట్రస్థాయిలో గ్రీవెన్స్‌ సెల్‌

రుణమాఫీ సమస్యల పరిషారానికి బ్యాంకులు రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌ ఆదేశించారు. దీనికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి, వారి ఫోన్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఇబ్బంది ఉన్న రైతులు ముందుగా బ్యాంకు స్థాయిలో సంప్రదిస్తారని, అకడ పరిషారం కాకపోతే రాష్ట్రస్థాయి అధికారిని సంప్రదించి, సమస్యను చెప్పుకుంటారని తెలిపారు. ఇదే తరహాలో వ్యవసాయశాఖ తరఫున జిల్లాకు ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమిస్తామని చెప్పారు. రుణమాఫీ, పంట రుణాల రెన్యువల్‌పై ఈ నెలాఖరులో మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం ఆయా జిల్లాల్లో రుణ మాఫీ అంశంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, పలు అదేశాలు జారీ చేశారు. సమీక్షలో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, స్పెషల్‌ సీఎస్‌ రామకృష్ణరావు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

నాలుగు కారణాలు.. మూడు మార్గాలు

ఇప్పటివరకు 18.79 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.9,654 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇందులో 17.15 లక్షల మంది ఖాతాల్లో నిధులు చేరాయని, సాంకేతిక, ఇతర కారణాల వల్ల 1.6 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని వివరించారు. వీరికి వెంటనే అందేలా చూడాలని బ్యాంకర్లను ఆదేశించారు. బ్యాంకు ఖాతాలు పనిచేయకపోవటం, అకౌంట్లు క్లోజ్‌ కావటం, అకౌంట్‌ నంబర్లను మార్చటం, బ్యాంకుల విలీనం కారణాల వల్ల సమస్య తలెత్తినట్టు అధికారులు మంత్రికి వివరించారు. వీటిపై చర్చించిన అనంతరం సమావేశంలో 3 పరిషార మార్గాలను గుర్తించారు.

1 ఆధార్‌ నంబర్ల సాయంతో రైతుల రైతుబంధు ఖాతాలను గుర్తించి అందులోకి రుణమాఫీ డబ్బు వేయటం. దీనివల్ల సుమారు లక్ష మందికి రుణమాఫీ డబ్బు అందుతుందని అంచనా వేశారు.

2 ఎన్‌పీసీఐ సాయంతో బ్యాంకుల్లోని రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించి మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి అందజేయాలని బ్యాంకులకు సూచించారు. వారికి ఆర్థికశాఖ నిధులు విడుదల చేస్తుందని, ఇలా సుమారు 50 వేల మందికి డబ్బు అందుతుందని చెప్పారు.

3 మిగతా 16 వేల మంది వివరాలను కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను సేకరిస్తారని, ఆ సమాచారం ఆధారంగా రుణమాఫీ పూర్తి చేస్తారని చెప్పారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు తిరుగులేదు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం: ప్రశాంత్‌ కిశోర్‌

తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు తిరుగులేదు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం: ప్రశాంత్‌ కిశోర్‌

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ జోస్యం చెప్పారు. తెలంగాణలో కొలువు దీరేది గులాబీ సర్కారేనని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు తిరుగులేదని వెల్లడించారు.

వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అంచనా

కేసీఆర్‌కు తిరుగులేదు.. హ్యాట్రిక్‌ పక్కా

సరైన నాయకుడు లేని విపక్ష 'ఇండియా'

జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఎన్నికలపై కుండబద్దలు కొట్టిన పీకే

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ జోస్యం చెప్పారు. తెలంగాణలో కొలువు దీరేది గులాబీ సర్కారేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు తిరుగులేదని వెల్లడించారు. సోమవారం ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్‌గఢ్‌లో కాం గ్రెస్‌, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తాయని చెప్పారు. విపక్ష ఇండియా కూటమిని ముందుకు నడిపే సరైన నాయకుడు లేడని, రాహుల్‌కు ఆ సామర్థ్యం లేదని అన్నారు. విద్యార్థులు పరీక్షల ముందు అరగంటసేపు పుస్తకం పట్టినట్టు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి కట్టారని చురకలంటించారు. తాను భవిష్యత్తులో ఏ పార్టీకి ఎన్నికల సమన్వయకర్తగా పనిచేయబోనని, తాను ఆ పని మానేశానని చెప్పారు. తన దృష్టి అంతా తన సొంత రాష్ట్రం బీహార్‌ అభివృద్ధిపైనే ఉన్నదని చెప్పారు. తాను బీహార్‌లో సరైన వ్యవస్థను ఏర్పాటు చేస్తానని, అక్కడి ప్రజల కోసమే పనిచేస్తానని తేల్చిచెప్పారు.

ప్రశాంత్‌ కిశోర్‌ చెప్తే అంతే..

ప్రశాంత్‌ కిశోర్‌ 2012 నుంచి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. 2012లో గుజరాత్‌ సీఎంగా నరేంద్రమోదీ వరుస విజయం సాధించడంతోపాటు 2014లో దేశప్రధానిగా అద్భుత విజయం సాధించడంలో కీలకంగా పనిచేశారు. బీహార్‌లో నితీశ్‌కుమార్‌ హ్యాట్రిక్‌ సీఎంగా గద్దెనెక్కడంలోనూ ఆయన కృషి ఉన్నది. అనంతరం పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా గద్దెనెక్కేందుకు కారణమయ్యారు. 2012 నుంచి ఇప్పటివరకూ ఒకటి రెండు చోట్ల తప్ప అన్ని ఎన్నికల్లో ఆయన చెప్పిన పార్టీలే విజయం సాధించడం విశేషం.