'చలో హైదరాబాద్ సెప్టెంబర్ 5న లేబర్ ఆఫీస్ ముట్టడిని జయప్రదం చేయాలి'
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: గతంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో భవన నిర్మాణ కార్మికులకు ప్రకటించిన మోటార్ సైకిల్ ను, కార్మికులకు అందించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులు సెప్టెంబర్ ఐదున చలో లేబర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేయడం జరిగింది. లేబర్ కార్డు ఉన్న కార్మికుడికి సొంత ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు, అంగవైకల్యం చెందిన కార్మికులకు నెలకు పదివేల పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన మోటార్ సైకిల్ స్కూటీలను వెంటనే ఇవ్వాలి.
ఎల్ఓ కార్యాలలో పెండింగ్ క్లైములు వెంటనే పరిష్కరించి నిధులు విడుదల చేయాలని, పైరవీకారుల వ్యవస్థను అరికట్టాలి అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అట్లాగే నిర్మాణరంగంలో వాడే ముడి సరుకుల ధరలు మరియు కార్మికులు నిత్యం వాడే నిత్యవసర వస్తువులను తగ్గించాలని, రాష్ట్ర వెల్పర్ బోర్డు అడ్వైజర్ కమిటీని ట్రేడ్ యూనియన్ నాయకులతో నియమించాలి.
కార్డుకు అప్లై చేసుకునే ముందు వేలిముద్ర పద్ధతిని మార్పు చేసి ఐరిష్ పద్ధతిని పెట్టాలి. రాష్ట్రంలో 25 లక్షల కార్మికులు ఉంటే తొమ్మిది సంవత్సరాలు గడిచిన 15 లక్షలమందికి మాత్రమే చట్టబద్ధత కల్పించారు. మిగతా పది లక్షల కార్మికులకు ఎలాంటి భద్రత లేకుండా అన్యాయం చేశారు. అందుకు భవన నిర్మాణ కార్మికులంతా సెప్టెంబర్ 5న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు గ్యార యాదయ్య, బుసరాజు లక్ష్మణ్, పగడాల అంజయ్య, నూకల యాదయ్య, కుందేలు అభిలాష్, కురంపల్లి యాదమ్మ తదితరులు పాల్గొన్నారు

నల్లగొండ జిల్లా, మర్రిగూడ: గతంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో భవన నిర్మాణ కార్మికులకు ప్రకటించిన మోటార్ సైకిల్ ను, కార్మికులకు అందించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులు సెప్టెంబర్ ఐదున చలో లేబర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేయడం జరిగింది. లేబర్ కార్డు ఉన్న కార్మికుడికి సొంత ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు, అంగవైకల్యం చెందిన కార్మికులకు నెలకు పదివేల పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన మోటార్ సైకిల్ స్కూటీలను వెంటనే ఇవ్వాలి.
ఎల్ఓ కార్యాలలో పెండింగ్ క్లైములు వెంటనే పరిష్కరించి నిధులు విడుదల చేయాలని, పైరవీకారుల వ్యవస్థను అరికట్టాలి అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అట్లాగే నిర్మాణరంగంలో వాడే ముడి సరుకుల ధరలు మరియు కార్మికులు నిత్యం వాడే నిత్యవసర వస్తువులను తగ్గించాలని, రాష్ట్ర వెల్పర్ బోర్డు అడ్వైజర్ కమిటీని ట్రేడ్ యూనియన్ నాయకులతో నియమించాలి.

ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చలో సూర్యాపేట పిలుపు మేరకు, నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మరియు నకిరేకల్ నియోజకవర్గ నాయకులు సూర్యాపేట కు తరలి వెళ్లగా మార్గ మధ్యలో పోలీస్ లు అరెస్టు చేసి అర్వపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
అనంతరం నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. బీసీ బిడ్డ అయిన వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు బనాయిస్తూ వేధించడం చాలా సిగ్గుచేటని, బీసీలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా వారిని అణచివేయడంలో భాగంగానే ఈ అరెస్టులకు తెర లేపినారని ఆమె భావిస్తున్నట్లు తెలిపారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం వట్టే జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, లేనిపక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజనులు అంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. అక్రమ అరెస్టులతో బహుజన రాజ్యాన్ని ఆపలేరని అన్నారు.
నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గం ఉపాధ్యక్షులు పావిరాల నర్సింహా యాదవ్, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, రామన్నపేట మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, చిట్యాల మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య, చిట్యాల అడ్వైజర్ జిట్ట నర్సింహా రాజ్, అన్నమళ్ళ సైదులు తదితరులు ఉన్నారు.
తిరుమలగిరి సాగర్: బహుజన బిడ్డ ఒట్టే జానయ్య యాదవ్ పై ఒక్క రాత్రిలోనే అక్రమంగా 71 కేసులను నమోదు చేయించారని ఆరోపిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బహుజన బిడ్డ ఒట్టే జానయ్య యాదవ్ కు మద్దతుగా చలో సూర్యాపేట పిలుపునిచ్చిన నేపథ్యంలో తిరుమలగిరి మండల పోలీస్ అధికారులు బీఎస్పీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా నియోజవర్గ బీఎస్పీ ఉపాధ్యక్షులు బత్తుల ప్రసాద్ మాట్లడుతూ.. తక్షణమే ఒట్టే జానయ్య యాదవ్ పై అక్రమంగా నమోదు చేసిన 71 కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. బీఎస్పీ తిరుమలగిరి మండల అధ్యక్షుడు అంగోత్ శివ నాయక్, బోడ రవి, తదితరులు ఉన్నారు.
దేవరకొండ డివిజన్, పీఏ పల్లి మండలం మల్లాపురం గ్రామంలో గతంలో రేషన్ డీలర్ భర్త వెంక రెడ్డి పై, రేషన్ బియ్యం బైక్ పై అక్రమంగా తరలిస్తున్న ఫోటోలు తీసి కంప్లీట్ చేయగా దాని విచారణలో కంప్లైంట్ దారునికి తెలియకుండా అధికారులు వచ్చి విచారణ చేశారని ఆరోపిస్తూ.. అదే గ్రామానికి చెందిన జిల్లా రాములు బుదవారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయం లో మళ్లీ అట్టి రేషన్ డీలర్ పై రీ- ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పేరికే విజయ్ కుమార్, ధర్మపురం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Sep 01 2023, 21:16
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.1k