/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz రేపు సూర్యాపేటకు రానున్నా సీఎం కేసీఆర్ Yadagiri Goud
రేపు సూర్యాపేటకు రానున్నా సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్‌ ఈనెల 20న సూర్యాపేటకు రానున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం, జిల్లా పోలీస్‌ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

వీటి ప్రారంభోత్సవం అనంతరం సుమారు రెండు లక్షల మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా జన సమీకరణకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూర్యాపేట నియోజకవర్గంలోని మండలాలు, పట్టణాల బాధ్యతలను అప్పగించారు.

సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిద్దిద్దారు. రహదారులపై ఎక్కడా గుంతలు లేకుండా మరమ్మతు చేశారు. సీఎం ప్రారంభించనున్న ప్రభుత్వ కార్యాలయాలకు నూతనంగా రోడ్లు ఏర్పాటుచేశారు. సీఎం పర్యటన విజయవంతానికి ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

సూర్యాపేటలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైనది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ సామర్ధ్యాన్ని పెంచేందుకు ఈ మార్కెట్‌ను నిర్మించారు. సుమారు రూ.30కోట్లతో 2.50లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మార్కెట్‌ను నిర్మించారు. ఆరుఎకరాల విస్తీర్ణంలో ఐదు బ్లాకుల్లో 200 దుకాణాలు నిర్మించారు.

ఈ మార్కెట్‌లో రోజుకు 9 నుంచి 10గంటల పాటు స్కైషేడ్‌తో పగటి వెలుగు ప్రసరించేలా ఏర్పాటుచేశారు. దేశంలోనే ఈ తరహా మార్కెట్‌ నిర్మాణం సూర్యాపేటలోనే ప్రథమం కావడం విశేషం. మార్కెట్‌లోని దుకాణాల్లో విద్యుత్‌ లైట్లు అవసరం లేకుండా పగటి వేళల్లో స్కైషేడ్‌ ద్వారా వెలుతురు ప్రసారం అవుతుంది. ఈ మార్కెట్‌లో పండ్లు, పూలు, మటన్‌, చికెన్‌, కూరగాయలు, చేపలతో పాటు ఇంకా పలు రకాల వస్తువులు ఒకే చోట లభించేలా నిర్మించారు.

రూ.65కోట్లతో సమీకృత కలెక్టరేట్‌ భవనం

జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సుమారు రూ.65కోట్లతో నిర్మించారు. 21ఎకరాల్లో 1.25లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మించారు.

జిల్లాలోని 37 ప్రభుత్వ శాఖలన్నీ ఈ భవనంలోనే కొనసాగనున్నాయి. కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, మీటింగ్‌ హాల్‌తో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా నిర్మించారు. కార్యాలయాన్ని గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు మరో రెండు అంతస్తుల్లో నిర్మించారు. కలెక్టరేట్‌లో పచ్చదనానికి అధిక ప్రాధా న్యం ఇచ్చారు. ప్రాంగణంలో సుమారు 70రకాల మొక్కలు నాటారు. అంతేగాక హెలీప్యాడ్‌ను నిర్మించారు.

కలెక్టరేట్‌కు విద్యుత్‌కు బదులు సోలార్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశా రు. సుమారు రూ.65లక్షలతో వంద కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్‌ ఎనర్జీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. కలెక్టరేట్‌కు మిషన్‌ భగీరథ నీటిని అందించనున్నారు.

కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మిషన్‌ భగీరథ నీటినే వినియోగించనున్నారు. అందుకు కలెక్టరేట్‌ సముదాయం వద్ద 1.20లక్షల లీటర్ల సామర్ధ్యంతో ట్యాం కులు నిర్మించారు. ఈ ట్యాంకులకు ఖమ్మం రోడ్డులోని మిషన్‌ భగీరథ ట్యాంక్‌ నుంచి పైప్‌లైన్‌ ఏర్పాటుచేశారు...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

వీకెండ్ వచ్చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే ఉంటుంది.

ఈ క్రమంలోనే నేడు శనివారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 17 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

శుక్రవారం స్వామివారిని 61,904 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.42 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 31,205 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.....

Flight: గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్యూర్‌.. మంటలతో విమానం ల్యాండింగ్‌..!

డల్లాస్‌: విమానం(Plane) గగనతలంలో ఉండగా అత్యవసర పరిస్థితి ఎదురైంది. ఆకస్మికంగా ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో.. విమానాన్ని టేకాఫ్ చేసిన వెంటనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది..

దాంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.

సౌత్‌ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌( Southwest Airlines)కు చెందిన బోయింగ్ విమానం టెక్సాస్‌లోని విలియం పి హాబీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది.

అది మెక్సికో(Mexico)లోని కాంకస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరింది. కానీ టేకాఫ్‌ అయిన వెంటనే ఒక ఇంజిన్‌ నిప్పులు చిమ్మింది. దాంతో వెనకవైపు మంటలు చెలరేగాయి.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది 30 నిమిషాల వ్యవధిలో టేకాఫ్ అయిన చోటే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు( Plane makes emergency).

'మాకు ఏదో పేలిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఇంధనం వాసన వచ్చింది' అని ప్రయాణికుడు ఒకరు వెల్లడించారు. మెకానికల్‌ సమస్య రావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని విమానయాన సంస్థ తెలిసింది. ప్రయాణికులందరినీ వేరే విమానంలో గమ్యస్థానాలకు పంపించామని తెలిపింది..

Nara Lokesh: పోసానిపై పరువు నష్టం కేసు.. కోర్టుకు హాజరైన నారా లోకేశ్‌

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హాజరయ్యారు.

వైకాపా నేతలపై వేసిన పరువు నష్టం కేసులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన వచ్చారు..

తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్ పోసాని కృష్ణ మురళితో పాటు సింగలూరు శాంతిప్రసాద్‌పై లోకేశ్‌ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

తాడికొండ మండలం కంతేరులో 14 ఎకరాల పొలాన్ని లోకేశ్‌ కొనుగోలు చేశారని పోసాని కృష్ణమురళి ఆరోపించారు.

ఓ ఛానెల్ నిర్వహించిన చర్చలో సింగలూరు ప్రసాద్ కూడా ఆరోపణలు చేశారు.

ఈ కేసుల్లో వీరిద్దరికీ న్యాయస్థానం ద్వారా నోటీసులు పంపినా స్పందించలేదని లోకేశ్‌ తెలిపారు.

Manipur Violence: మణిపుర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఆందోళనకారులు.. ముగ్గురి మృతి

ఇంఫాల్‌: తెగల మధ్య వైరం కారణంగా గత వందరోజులుగా హింసాత్మకంగా మారిన మణిపుర్‌ (Manipur)లో మరోసారి అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఉఖ్రుల్‌ (Ukhrul) జిల్లాలో శుక్రవారం ఉదయం సాయుధులైన దుండగులు కాల్పులకు తెగబడ్డారు..

ఉఖ్రుల్‌ జిల్లా పోలీసు అధికారి ఎన్‌. వాషుమ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి 47 కి.మీ దూరంలో కుకీ తెగవారు నివసించే తోవాయి కుకీ అనే గ్రామంపైకి ఉదయం 4:30 గంటల ప్రాంతంలో కొండపై నుంచి సాయుధ మూకలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాయి.

ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్థులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కాల్పులు జరిపిన వారి కోసం రాష్ట్ర పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు..

మణిపుర్‌లో శాంతి నెలకొల్పేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

మరోవైపు కుకీ-జో తెగల నివాసిత ప్రాంతాలకు స్వయంప్రతిపత్తిని ప్రకటించాలని గిరిజన మహిళల వేదిక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

ఇప్పటి వరకు రాష్ట్రంలో చెలరేగిన హింస కారణంగా సుమారు 160 మంది ప్రాణాలు కోల్పోగా, మూడు వేల మంది వరకు గాయపడ్డారు. ఆందోళనలను కట్టడి చేసి, శాంతి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు 40 వేల కేంద్ర బలగాలను మోహరించింది..

BA.2.86: కరోనా కొత్త వేరియంట్‌ వెలుగులోకి.. అప్రమత్తమైన WHO, సీడీసీ!

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 (Corona Virus) వ్యాప్తి, తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ కొత్త వేరియంట్లు కలవరపెడుతూనే ఉన్నాయి..

తాజాగా అమెరికాలో కొవిడ్‌ 19కి చెందిన కొత్త రకాన్ని గుర్తించారు. ఈ వేరియంట్‌ను బీఏ.2.86గా పేర్కొన్నారు. దీనిని అమెరికాతోపాటు డెన్మార్క్‌, ఇజ్రాయెల్‌లోనూ కనుగొన్నారు.

దీంతో అప్రమత్తమైన అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం (CDC).. దీన్ని ట్రాక్‌ చేసే పనిలో నిమగ్నమైంది. ఈ రకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని.. కరోనా నుంచి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది..

ఈ బీఏ.2.86 కొత్త రకానికి సంబంధించి అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా స్పందించింది. ఇందులో భారీ సంఖ్యలో ఉత్పరివర్తనాలు చోటుచేసుకుంటున్నందున.. ప్రస్తుతం దీన్ని 'వేరియంట్‌ అండర్‌ మానీటరింగ్‌'గా పేర్కొన్నామని తెలిపింది.

ఈ రకానికి చెందిన సీక్వెన్స్‌లు కొన్ని దేశాల్లోనే వెలుగు చూశాయని.. ప్రస్తుతం మూడు వేరియంట్‌ ఆఫ్‌ ఇంటెరెస్ట్‌లతోపాటు

ఏడు వేరియంట్స్‌ అండర్‌ మానిటరింగ్‌లను ట్రాకింగ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్‌ వ్యాప్తి, తీవ్రతను అర్థం చేసుకునేందుకు మరింత సమాచారం అవసరమని.. దీనిపై ప్రపంచ దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటున్నట్లు తెలిపింది..

వరల్డ్‌ టూరిజంలో ఏపీకి ప్రత్యేక స్థానం రావాలి: సీఎం జగన్‌

విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం విజయవాడలో పర్యటించారు. గుణదలలో నూతనంగా నిర్మించిన హయత్‌ ప్లేస్‌ హోటల్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు..

హయత్‌ ప్లేస్‌ హోటల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంశాఖమంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కే రోజా, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, హోటల్‌ హయత్‌ ప్లేస్‌ ఛైర్మన్‌ ఆర్ వీరా స్వామి, ఉన్నతాధికారులు, పలువులు ఇతర ప్రజా ప్రతినిధులు.పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే...

హయత్‌ ఛైర్మన్‌ వీరస్వామి, హయత్‌ ఇంటర్నేషనల్‌ ఏరియా ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌, మేనేజింగ్ డైరెక్టర్‌ సాయికార్తీక్‌లతో పాటె ఈ ప్రాజెక్టులో మమేకమైన అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు సీఎం జగన్‌

విజయవాడలోనే కాకుండా ఆంధ్రరాష్ట్రమంతా ఇలాంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్‌, ప్రముఖ హోటల్స్‌ వచ్చి... ఆంధ్రరాష్ట్రం కూడా గ్లోబల్‌ ఫ్లాట్‌ఫాంమీద, ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో ఒక ప్రత్యేకమైన స్ధానం పొందాలని... మంచి టూరిజం పాలసీని తీసుకువచ్చాం.

మంచి టూరిజం పాలసీని తీసుకునిరావడమే కాకుండా.. మంచి చైన్‌ హోటల్స్‌ను కూడా ప్రోత్సహిస్తూ వచ్చాం.

ఒబెరాయ్‌తో మొదలుకుని ఇవాళ ప్రారంభం చేసుకుంటున్న హయత్‌ వరకు దాదాపు 11 పెద్ద బ్రాండ్లకు సంబంధించిన సంస్ధలన్నింటినీ ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం.

తెలంగాణ ధీరత్వానికి ప్రతీక సర్వాయి పాపన్న గౌడ్‌ : సీఎం కేసీఆర్‌

తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని సీఎం కేసీఆర్ కొనియాడారు.

సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన కృషిని, పోషించిన చారిత్రక పాత్రను సీఎం స్మరించుకున్నారు.

కుల, మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కాలనే సమ సమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్నగౌడ్ పోరాడడం గొప్ప విషయమన్నారు.

విశ్వకీర్తిని పొందిన పాపన్న గొప్పతనాన్ని స్మరించుకునేందుకు ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

తెలంగాణ స్వయం పాలనలో సబ్బండ వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం లభించిందని, స్వరాష్ట్రంలో వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడం ద్వారా పాపన్నగౌడ్ ఆశయాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు....

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న… మంత్రి గంగుల

గోల్కోండ కోటపై జెండా ఎగరేసిన బహుజన వీరుడు, తెలంగాణ చత్రపతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

శుక్రవారం కరీంనగర్ లో సర్వాయి పాపన్న 373వ జన్మదినం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ…

తెలంగాణ రాక ముందు పోరాట యోధులను, మహానీయులను సమైక్య ప్రభుత్వం విస్మరించిందని, తెలంగాణ ప్రభుత్వం మహనీయుల ఆశయాలను కొనసాగిస్తుందన్నారు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ది అని, ఆయన పోరాట పటిమను పౌరుషాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు..

ఆయన చరిత్రను బాహ్య ప్రపంచానికి తెలిపే విధంగా కార్యక్రమాలు చేపడతామని పునరుద్ఘాటించారు.

300సంవత్సరాల కంటే ముందే బహుజన రాజ్యం కోసం గోల్కొండ కోటను అధిరోహించి గోల్కోండ సింహాసనాన్ని వశపరుచుకున్న బడుగు, బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని గుర్తు చేశారు.

పాపన్న గౌడ్ ఒక గౌడకులానికే కాకుండా బీసీ సామాజిక వర్గానికి అన్ని కులాలకు సహకరించిన ధీరుడని, పెత్తందారులను ఎదురించి పేద ప్రజలకు అండగా నిలిచి ఆదుకున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ బి గోపి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, బారాసా నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, రెడ్డ వేణి మధు కలర్ సత్తన్న, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు......

ప్రజల ఆరోగ్య పరిరక్షణ లో నిర్లక్ష్యం వద్దు..ఎమ్మెల్సీ కవిత సూచన

వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఎమ్మెల్సీ కవిత కోరారు.

నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పాటు మున్సిపల్‌ కమిషనర్‌తో ఈరోజు ఎమ్మెల్సీ కవిత ఫోన్‌లో మాట్లాడి పలు సూచనలు చేశారు.

నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పాటు మున్సిపల్‌ కమిషనర్‌తో ఎమ్మెల్సీ కవిత ఫోన్‌లో మాట్లాడి పలు సూచనలు చేశారు.

ముఖ్యంగా డెంగీ వ్యాధి ప్రబలకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ఎప్పటికప్పుడు దోమల నివారణ మందులు పిచికారీ చేస్తూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

డెంగీ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీజనల్‌ వ్యాధుల నివారణ మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించవద్దని కోరారు...