/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Chandrababu: జగన్‌ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: చంద్రబాబు Yadagiri Goud
Chandrababu: జగన్‌ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: చంద్రబాబు

అమరావతి: సీఎం జగన్‌ (ys jagan mohan reddy), ఆ పార్టీ నేతల తీరు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ధ్వజమెత్తారు.

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి రెండుకళ్లు లాంటి అమరావతి, పోలవరంను దెబ్బతీశారని మండిపడ్డారు. ''రాష్ట్ర రాజధానిపై నిన్న కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసింది. శివరామకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టులో ప్రస్తావించింది. శివరామకృష్ణ కమిటీ నివేదికను రాష్ట్రానికి పంపామని, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని కేంద్రం తెలిపింది.

ఆ నిర్ణయాన్ని తాము ఆమోదించామని కేంద్రం చెప్పింది. ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించకుండానే 3 రాజధానుల చట్టం తెచ్చిందని కేంద్రం అఫిడవిట్‌లో స్పష్టంగా తెలిపింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగానే కేంద్రం ఈ విషయాలు చెప్పింది.

అధికారంలోకి రాకముందు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని జగన్‌ ఏం చెప్పారు. అమరావతే రాజధానిగా ఉంటుంది. అమరావతిని తెలుగుదేశం పార్టీ కంటే మిన్నగా అభివృద్ధి చేస్తామని చెప్పారా? లేదా? ప్రజా జీవితం అంటే మీ దృష్టిలో చులకనైపోయింది. మీ తీరు చూస్తూ ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. ఓట్ల కోసం ఎన్నో అబద్దాలు చెప్పారు. చట్టానికి ఎన్ని తూట్లు పెట్టాలో అన్ని పెట్టి మీ ఇష్ట ప్రకారం చేశారు. అధికారం లేదని తెలిసినా? రాజధానిపై చట్టం చేసే హక్కు శాసనసభకు లేదా? అని మాట్లాడారు. రాజధానిపై చట్టం చేయడానికి వీల్లేదని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం పార్లమెంట్‌ చేసింది. అందులో రాజధాని ఏ విధంగా చేయాలో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారం అమరావతి రాజధాని వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని చట్టం చేసే హక్కులేదని న్యాయస్థానం చెప్పింది.

దాన్ని వక్రీకరించి.. శాసనసభకు చట్టాలు చేసే అధికారం లేదా? అని ఇష్టానుసారం మాట్లాడారు. విభజన చట్టం సెక్షన్‌5లో రాజధానిపై స్పష్టంగా ఉన్నా 3 రాజధానులపై శాసనసభలో బిల్లు పాస్‌ చేశారు. కౌన్సిల్‌లో నానా దుర్భాషలాడారు. 3 రాజధానుల బిల్లును కౌన్సిల్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తే.. కౌన్సిల్‌ రద్దుకు తీర్మానం చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి కౌన్సిల్‌ రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకున్నారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇచ్చారు. అమరావతి రాజధానిపై రూ.11,395 కోట్లు ఖర్చు పెడితే.. జగన్‌ ప్రభుత్వం అమరావతిపై విషం చిమ్మింది. రాజధాని రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తే ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు. లేని అధికారం ఆపాదించుకుని జగన్‌ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు'' అని చంద్రబాబు విమర్శించారు.

PM Modi: వారి ప్రవర్తన బాధాకరం.. విపక్షాలు విసిరే బురదలోనూ 'కమలం' వికసిస్తుంది: మోదీ

దిల్లీ: తమ ప్రభుత్వంపై విపక్షాలు ఎంతగా బురదచల్లినా 'కమలం' మరింతగా వికసిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు.

అదానీ వ్యవహారంపై రాజ్యసభ(Rajya Sabha)లో విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తూ తన ప్రసంగానికి అడ్డు తగలడంపై ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరు ఎంపీల భాష, ప్రవర్తిస్తున్న తీరు, చేస్తోన్న వ్యాఖ్యలు బాధాకరమన్నారు.

రాష్ట్రపతి(President of India) ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన ప్రధాని.. గత కాంగ్రెస్‌ పాలనను ఎండగడుతూనే విపక్షాల(Opposition Parties) తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ''విపక్షాల తీరు చూస్తుంటే బాధేస్తోంది. ఇలాంటి ముఖ్యమైన సభలో నినాదాలు చేయడం దురదృష్టకరం. ప్రజా సమస్యలపై చర్చించాలన్న ఆలోచన వారికి లేదు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన కీలక సభలో ఇలా ప్రవర్తిస్తారా? మీరు విసిరే బురదలో కూడా 'కమలం' (భాజపా ఎన్నికల గుర్తు) వికసిస్తుంది.

యూపీఏ ప్రభుత్వం ఏ సమస్యకూ పరిష్కారం చూపలేదు. దేశ ప్రగతిని నాశనం చేసింది. చిన్న చిన్న దేశాలు పురోగమిస్తున్న సమయంలో ఆరు దశాబ్దాల కాలాన్ని మన దేశం కోల్పోయింది. పరిష్కారం చూపేవాళ్లను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. ఎంత అడ్డుకున్నా ప్రజా సమస్యల పరిష్కారంలో మేం ఏమాత్రం వెనకడుగు వేయం. మా విధానాలతో దేశంలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపగలుగుతున్నాం'' అని ప్రధాని అన్నారు..

కణేకల్ మండలం కె.కొత్తపల్లి M.P.U.P స్కూల్ లో ఉన్నా మౌలిక సదుపాయాలను పరిష్కరించండి

PDSU రాయదుర్గం డివిజన్ కార్యదర్శి : మల్లెల ప్రసాద్

కె.కొత్తపల్లి గ్రామం లో M.P.U.P స్కూల్ ఉన్నా వాటర్. కాంపౌండ్. అదనపు తరగతి గదులు.కుర్చీలు. బెంచీలు.వంటగది.ఇలాంటి సమస్యల ను ఈ వైసీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మత్తులు చేయాలని

ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, M.P.U.P స్కూల్ ను హై స్కూల్ చేయాలనీ D.E.O గారికీ మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాము.

KTR: సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భారీ సభ.. జనసమీకరణపై నేతలతో కేటీఆర్‌ భేటీ

హైదరాబాద్‌: ఈనెల 17న సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న సభకు భారీ జనసమీకరణ చేయాలని గ్రేటర్‌ నేతలకు మంత్రి కేటీ రామారావు(KTR) దిశానిర్దేశం చేశారు.

అసెంబ్లీ కమిటీ హాల్‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 10వేల మంది హాజరయ్యేలా చూడాలని నేతలకు సూచించారు.

ఈనెల 13న గ్రేటర్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఇతర జిల్లాలకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్‌ఛార్జిలుగా నియమించనున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. ఈనెల 13 నుంచి 17వరకు ఇన్‌ఛార్జిలు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెప్పారు.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టినందున అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకకార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్‌ సూచించారు. సచివాలయం ప్రారంభోత్సవం, పరేడ్‌గ్రౌండ్‌ సభను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు తమిళనాడు, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రులు స్టాలిన్‌, హేమంత్‌ సోరెన్‌, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ తదితరనేతలు హాజరుకానున్నారు.

పార్టీ బలోపేతం దిశగా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ సమావేశం

•నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వెంబాయి గ్రామంలో

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వెంబాయి గ్రామంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నల్గొండ జిల్లా కార్యదర్శి చిట్యాల మండల ఇంచార్జ్ వేదాంతం గోపీనాథ్ గారు మరియు బిజెపి జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు గారు పాల్గొన్నారు.

ఈ బూత్ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి గోపీనాథ్ గారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మనదేశంలో ఎంత చిన్న గ్రామమైన పట్టణాలకు చిట్టచివరిలో ఉన్న ప్రతి చిన్న గ్రామాలను కూడా దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ పథకాలు కిందిస్థాయి వరకు అందే విధంగా నరేంద్ర మోడీ గారు పథకాలను ప్రవేశపెట్టారు.

ఇట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలాగా ప్రతి బిజెపి కార్యకర్త ప్రతినిత్యం ప్రజలతో మమేకమై వారికి ఏ రకమైన పథకాలు అందుతున్నాయి తెలుసుకొని కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి సవివరంగా తెలియపరచి వారికి అందే విధంగా చూడాలని చెప్పారు. వేంబాయి గ్రామంలో బిజెపి బూత్ కమిటీ ని ఏర్పాటు చేసుకొని పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరు పని చేయాలని తెలంగాణలో రానున్నది

బిజెపి ప్రభుత్వం అని ప్రతి ఒక్కరూ కసితో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు ఉయ్యాల ప్రశాంత్ గౌడ్, పామనగుండ్ల వెంకన్న గౌడ్, గురిజ వెంకన్న గౌడ్, కొంపెల్లి శివ, సిద్ధగోని అశోక్, గుండు లింగస్వామి, పంతంగి బిక్షం, లింగస్వామి గౌడ్, చింతకాయల రాము, పవన్, పాలకూరి వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Nadendla Manohar: జనసేన కుటుంబం అని గర్వంగా చెప్పుకొందాం

అమరావతి: మనది జనసేన కుటుంబం (Janasena Family) అని గర్వంగా చెప్పుకొందామని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Janasena PAC Chairman Nadendla Manohar) అన్నారు.

గురువారం కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. క్రియాశీలక సభ్యత్వం ఓ భావోద్వేగ ప్రయాణమన్నారు. ఆపదలో ఉన్న తోటి కార్యకర్తకు సాయంగా నిలవాలన్నదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) సంకల్పమని స్పష్టం చేశారు. మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.

మొదట్లో 90 వేల మంది క్రియాశీలక సభ్యులను జాయిన్ చేశామని... కోవిడ్ సమయంలోనూ రూ.500 కట్టి పార్టీ సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. రెండో విడతలో ఏకంగా 3 లక్షల 30వేల మంది క్రియాశీల సభ్యులుగా చేరారన్నారు. ఈసారి ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.

బాధితులకు బీమా క్లైయిమ్ కూడా 60 రోజుల్లో అందేలా పార్టీ లీగల్ విభాగం ప్రయత్నిస్తోందని తెలిపారు. సభ్యత్వ నమోదు కోసం కేవలం పార్టీ కార్యకర్తలే కాదు.. సగటు కూలీలు, పేదలు కూడా ఎదురుచూడటం గొప్ప విషయమని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

గ్రామ గ్రామాన పార్టీ పటిష్టత కోసం బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి

•భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి చిట్యాల మండల ఇంచార్జ్ వేదాంతం గోపీనాథ్

•బూత్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామం లో ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి చిట్యాల మండల ఇంచార్జ్ వేదాంతం గోపీనాథ్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి బీజేపీ జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన బిజెపి సమావేశానికి హాజరైనారు. బిజెపి చిట్యాల మండలం ఇంచార్జ్ గోపీనాథ్ గారు మాట్లాడుతూ

గ్రామ గ్రామాన పార్టీ పటిష్టత కోసం బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ప్రతి కార్యకర్త కంకణ బద్ధులై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి ఆ పథకాల పైన అవగాహన కల్పిస్తూ బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ బూత్ కమిటీ సమావేశంలో తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలకు మన యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలను అందేలాగా ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ

వారి యొక్క సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా మన బిజెపి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఉరుమడ్ల భారతీయ జనతా పార్టీ 91వ బూత్ కమిటీ అధ్యక్షులుగా ఉయ్యాల లింగస్వామి, 92వ బూత్ కమిటీ అధ్యక్షులుగా ఈదుల పవన్, 93వ బూత్ కమిటీ అధ్యక్షులుగా బొమ్మకంటి రాము ముదిరాజ్ గార్లను నియమించడం జరిగింది ఈ బూత్ కమిటీలు 22 మందితో సభ్యులతో అన్ని వర్గాల వారిని కలుపుకొని కమిటీలు వేసి పూర్తి చేయడం జరిగింది.

భారతీయ జనతా పార్టీలో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. ఇట్టి బూత్ కమిటీలు ఉరుమడ్ల గ్రామ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అనునిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యల పట్ల పరిష్కార దిశగా అడుగులు వేస్తూ కమిటీ సభ్యులు తోడ్పాటు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్లపు ఇస్తారు, పల్లపు బజారు, పాలకూరి వెంకన్న, జన్నపాల జగన్, పాకాల అర్జున్, పల్లపు లింగయ్య, గుంటోజు పవన్, పల్లపు వెంకటేష్, బొడ్డు రాము, కొండ మహేష్, పల్లపు లక్ష్మమ్మ, పల్లపు ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు..

ఎమ్మిగనూరు మార్కెట్‌లో భారీగా పతనమైన టమాట ధర

కిలో రూపాయి పలుకుతున్న టమాట ధర

టమాటాను రోడ్లపై పారబోస్తున్న రైతులు

కర్నూలు

ఎమ్మిగనూరు మార్కెట్ లో టమోటా ధర భారీగా పతనమైంది. గత 10 రోజులుగా ఎమ్మిగనూరు మార్కెట్ లో టమోటాకు ధర లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కిలో రూపాయి పలకడంతో టమోటా రైతులు రవాణా ఖర్చు కూడా రావడం లేదని వాపోతున్నారు. కొందరు తెచ్చిన టమోటా బాక్స్ లను మార్కెట్ లోనే వదిలి వెళ్లిపోతుండగా.. కొందరు రోడ్డుపైనే పారబోస్తున్నారు. ఇప్పటికైనా గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని టమోటా రైతులు కోరుతున్నారు.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం..

మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్...

టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు:

1. ప్రకాశం నెల్లూరు చిత్తూరు

2. కడప అనంతపురం కర్నూలు

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు:

1. ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు

2. కడప- అనంతపురం- కర్నూలు

3. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం

ఫిబ్రవరి 16న నోటిఫికేషన్

మార్చి 13న పోలింగ్

మార్చి 16న కౌంటింగ్

ISRO: మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం! రోదసీలోకి దూసుకెళ్లనున్న మూడు ఉపగ్రహాలు..

ఇస్రో(ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(SHAR)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రేపు స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ను ప్రయోగించేందుకు ఇస్రో సైంటిస్టులు రెడీ అయ్యారు..

రేపు ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2(PSLVD2) రాకెట్‌ మూడు ఉపగ్రహాలను మోసుకొని రోదసీలోకి దూసుకెళ్లనుంది. ఈ సిరీస్‌లో ఇది రెండో ప్రయోగం. గతేడాది ఆగస్టు 7న మొదటిసారిగా పంపిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 ప్రయోగం విఫలమవడంతో.. ఈసారి ఆ పొరపాట్లు జరగకుండా సైంటిస్టులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సారి ప్రయోగం 13.2 నిమిషాల్లో పూర్తి కానుంది. ప్రయోగవేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తిచేస్తున్నారు..

నింగిలోకి దూసుకెళ్లనున్న మూడు ఉపగ్రహాలు:

సుమారు 34 టన్నుల బరువున్న 120 మీటర్ల పొడవైన ఈ రాకెట్ రేపు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించి రిహార్స్‌ల్స్‌ను, మధ్యాహ్నం 1 గంటలకు మిషన్‌ సంసిద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ఈఓఎస్-07, జానస్-1, అజాదీశాట్-2 అనే మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడమే ఈ సారి టార్గెట్‌.

ల్యాబ్‌ చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఈ రాకెట్‌ను ఫైనల్‌గా టెస్ట్‌ చేస్తారు. తుది విడత తనిఖీలు తర్వాత ప్రయోగానికి 7 గంటల ముందు కౌంట్‌డౌన్‌ను స్టార్ట్ చేస్తారు. అంటే రేపు వేకువజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన 13 నిమిషాల్లోనే రాకెట్ తొలి ఉపగ్రహం ఈఓఎస్-07ను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత మరో రెండింటిని నిమిషం వ్యవధిలో కక్ష్యలోకి ప్రవేశపెడతారు. వీటన్నింటినీ 450 కిలోమీటర్ల ఎత్తులో 15నిమిషాల ప్రయాణంలో భూమి చుట్టూ సర్క్యూలర్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇక ఎస్ఎస్‌ఎల్‌వీ ప్రయోగంతో ప్రారంభమయ్యే ప్రయోగాల పరంపర ఈ ఏడాది షార్‌లో కొనసాగనుంది.