తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై వివక్షను మానుకోవాలి : తెలంగాణ గౌడ సంఘాల JAC హెచ్చరిక
తెలంగాణ గౌడ సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్ మరియు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొనగాని యాదగిరి గౌడ్ గారు మాట్లాడుతూ గడిచిన 7నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని తక్షణమే విరమింపు చేసుకోవాలి అని తెలంగాణ గౌడ సంఘాలు డిమాండ్ చేశాయి.
అంతేకాకుండా గత నాలుగు రోజుల క్రితం తెలంగాణ మాజీ మంత్రివర్యులు బహుజన నాయకులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారిపై TTD చైర్మన్ &TV5 చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకుంటామని ప్రకటించడం వారి చేతగానితనమని అంతేకాకుండా వారి పొరపాటులను తెలియజేస్తే చర్యలు తీసుకుంటారా అని తెలంగాణ గౌడ సంఘాలు ధ్వజమెత్తాయి.
తక్షణమే వారు చేసిన వ్యాఖ్యలు విరమింప చేసుకొని తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తులను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ శునకానందం పొందుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఇకనైనా తక్షణమే తెలంగాణ ప్రజలపై ద్వంద వైఖరిని మానుకొని అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులకు సిఫారసు లేఖలకు ఎలాంటి గుర్తింపు గౌరవం ఇస్తున్నారో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు కూడా అలాంటి గుర్తింపే ఇవ్వాలని తెలంగాణ గౌడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
లేనియెడల మరో 48 గంటలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ చైర్మన్ దిష్టిబొమ్మలు తగలబెట్టి తన TV5 ఆఫీసులను అష్టదిగ్బంధం చేసి గౌడ సంఘాల మోకు దెబ్బ రుచి చూపిస్తామని యువజన సంఘాల JAC చైర్మన్ గట్టు నరేష్ గౌడ్ మరియు తెలంగాణ గౌడ సంఘాలు హెచ్చరిస్తున్నాయి ఈ కార్యక్రమంలో పాపన్న గౌడ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనగాం శ్రీనివాస్ గౌడ్ గారు రాజు గౌడ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు సదానందం గౌడ్ గారు తదితర వరంగల్ జిల్లా గౌడ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Jan 04 2025, 15:28