వర్గీకరణ అమలుకు పోరాడదాం

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కుట్రలను సమర్థంగా ఎదుర్కొందామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) అన్నారు. వర్గీకరణ అమలు కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కుట్రలను సమర్థంగా ఎదుర్కొందామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda krishna Madiga) అన్నారు. వర్గీకరణ అమలు కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 3న మండే మాదిగల గుండె చప్పుడు ‘వెయ్యి గొంతులు-లక్ష డప్పులతో’ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సభ, దండోరా ప్రదర్శనను పురస్కరించుకుని మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సన్నాహక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తే కొందరు ప్రతిఫలం అనుభవించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా, ఆ పార్టీలో ఉన్న కొంతమంది అడ్డుకోవాలని చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో మాల సామాజికవర్గం వారి మాటే చెల్లుతుందన్నారు. వర్గీకరణ సాధన కోసం టీడీపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌(TDP, Congress, BRS) నాయకులను కలిశానని, సందర్భానుసారంగా వారికి సహాయం చేశానని తెలిపారు.

వారు వర్గీకరణ చేస్తామని చెప్పారు కానీ, బీజేపీ మాత్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని అన్నారు. వర్గీకరణ ఆలస్యమయ్యే కొద్దీ విద్య, ఉద్యోగ రంగాల్లో వాటా కోల్పోతామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే వర్గీకరణ చేయాలని కోరారు. ఫిబ్రవరి 3న మండే మాదిగల గుండె చప్పుడు దండోరా ప్రదర్శన సచివాలయం ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ప్రారంభమవుతుందన్నారు. జనవరి 2 నుంచి అన్ని జిల్లాల్లో సన్నాహక కార్యక్రమాలు సభలు సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

మెదక్ జిల్లాలో నేడు పర్యటించనున్న ప్రముఖులు

జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) పర్యటించనున్నారు. నేడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు కొల్చారం మండలం ఘనపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌ ద్వారా చేరుకుంటారు.

జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) పర్యటించనున్నారు. నేడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు కొల్చారం మండలం ఘనపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌ ద్వారా చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లిలోని ఏడుపాయలకు చేరుకోనున్నారు. ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారిని దర్శించుకుని రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ పలు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు.

ఆ తర్వాత ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. చర్చి శతాబ్ది ఉత్సవాలు, క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతుండడంతో ఆయా కార్యక్రమాల్లో రేవంత్ పాల్గొనున్నారు. ప్రార్థనా కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 12:40 గంటలకు హెలికాప్టర్ ద్వారా మెదక్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు మెదక్ జిల్లాలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నేడు పర్యటించనున్నారు. కౌడిపల్లి మండలం తునికి కృషివిజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:15కి హెలికాప్టర్ ద్వారా ఉపరాష్ట్రపతి, గవర్నర్ తునికి చేరుకోనున్నారు. సేంద్రీయ వ్యవసాయంపై 800 మంది రైతులతో ఉపరాష్ట్రపతి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 4:20 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

డెల్టా జిల్లాల దిశగా అల్పపీడనం రేపు, ఎల్లుండి భారీ వర్షసూచన

బంగాళాఖాతంలో ఆంధ్రా కోస్తాతీరం దిశగా వెళ్ళి, తీరం దాటకుండా రాష్ట్రం వైపు మళ్ళిన అల్పపీడనం ప్రస్తుతం డెల్టాజిల్లాల వైపు కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి సోమవారం మధ్యాహ్నానికి బంగాళాఖాతంలో ప్రవేశించి రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల దిశగా కదిలింది.

బంగాళాఖాతంలో ఆంధ్రా కోస్తాతీరం దిశగా వెళ్ళి, తీరం దాటకుండా రాష్ట్రం వైపు మళ్ళిన అల్పపీడనం ప్రస్తుతం డెల్టాజిల్లాల వైపు కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి సోమవారం మధ్యాహ్నానికి బంగాళాఖాతంలో ప్రవేశించి రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల దిశగా కదిలింది. మంగళవారం మధ్యాహ్నం ఆ అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి డెల్టా జిల్లాల వైపు పయనిస్తోంది.

నగరానికి 500 కి.మీ.ల దూరంలో ఉన్న తీవ్ర అల్పపీడనం బుధవారం తీరానికి చేరువగా రానుంది. గురువారం డెల్టా జిల్లాల్లో తీరం దాటి బలహీనపడి అరేబియా సముద్రం(Arabian Sea) వైపు వెళ్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నగరం సహా, పరిసర జిల్లాల్లో మంగళవారం ఉదయం చెదురుమదురుగా వర్షాలు కురిశాయి.

ఈ నెల 26, 27 తేదీల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా, ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ నెల 28న పడమటి కనుమల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు తెలిపారు. తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కాంచీపురం(Chengalpattu, Kanchipuram) సహా సముద్రతీర జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయన్నారు.

కేసీఆర్‌ హరీశ్‌కు హైకోర్టులో ఊరట

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. జిల్లా కోర్టు తన అధికార పరిధిని మీరి వ్యవహరించిందని పేర్కొంది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్‌ తదితరుల అవినీతే కారణమని పేర్కొంటూ నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి మొదట భూపాలపల్లి మేజిస్ట్రేట్‌ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. దాన్ని విచారించే పరిధి తమకు లేదంటూ ఆ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఫిర్యాదుదారు భూపాలపల్లి జిల్లా కోర్టులో క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించే అధికార పరిధి జిల్లా కం సెషన్స్‌ కోర్టుకు లేదని కోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది.

అయితే ఈ అభ్యంతరాలను పరిశీలించిన జిల్లా కోర్టు... పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ వివరణ ఇవ్వాలని కేసీఆర్‌, హరీశ్‌రావు, అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్‌, అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులు హరిరామ్‌, శ్రీధర్‌, మేఘా నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌, హరీశ్‌రావు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది టీవీ రమణారావు వాదిస్తూ సీఆర్పీసీకి విరుద్ధంగా రివిజన్‌ పిటిషన్‌ను జిల్లా కోర్టు స్వీకరించిందని తెలిపారు. జిల్లా కోర్టు జూలై 10న ఇచ్చిన ఆదేశాలను, నోటీసులను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇది పిటిషనర్లకు ప్రైవేటు ఫిర్యాదుదారుకు మధ్య వ్యవహారమని, ఇందులో ప్రభుత్వ పాత్ర లేదని వ్యాఖ్యానించింది. రాజలింగమూర్తికి నోటీసులు జారీ చేస్తూ విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.

అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసుల పిటిషన్

సంధ్య థియేటర్ ఘటనపై కేసులో పోలీసులు దర్యాప్తు ను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. 

అయితే, అల్లు అర్జున్ మీడి యా సమావేశం ఏర్పాటు చేసి సంధ్య థియేటర్ ఘటనలో తన తప్పు ఏమీలేదని చెప్పాడు. దీంతో అర్జున్ మీడియా సమావేశం పెట్టడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్ నిబంధనలు ఉల్లంఘిం చారని పేర్కొంటున్నారు. 

ఈ క్రమంలో ఆయన బెయిల్ రద్దుపై పోలీసులు అప్పీల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ తీరుపైనా పోలీసులు అసంతృప్తితో ఉన్నారు. 

రేవతి మృతి తెలిసి కూడా తెలియదని అల్లు అర్జున్ చెప్పడం ఆయన విచక్షణకే వదిలేయాలని ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో నగర సీపీ సీవీ ఆనంద్ అన్నారు. థియేటర్లో ఉన్న అల్లు అర్జున్ కు పోలీసులు విషయం చెప్పారని కానీ, రేవంతి మృతి మరుసటి రోజు తెలిసిందని అల్లు అర్జున్ మాట మార్చా డంటూ సీపీ పేర్కొన్నారు

మీడియా సమావేశంలో సంధ్య థియేటర్ ఘటన సమయంలో వీడియోలను ప్రదర్శిస్తూ సీపీ ప్రజెంటేషన్ ఇచ్చారు. న్యాయపరంగా అల్లు అర్జున్ కేసును ఎదుర్కొంటామని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. మరోవైపు అల్లు అర్జున్ నివాసం వద్ద ఓయూ జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. 

ఈ క్రమంలో పోలీసులు ఆరుగురు ఓయూ జేఏసీ నేతలను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అర్జున్ నివాసం వద్ద జరిగిన ఘటనపై డీజీపీకి ఫోన్ చేసి సీఎం రేవంత్ రెడ్డి, ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ ఆదేశించారు.

బీజేపీ ఎంపీని నెట్టేసినందుకు రాహుల్ గాంధీ జైలుకు వెళ్తారా

రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నించినప్పుడు సారంగి తనను నెట్టారని ఆరోపించారు. అయితే పార్లమెంటు ఆవరణలో ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు విషయానికి వస్తే రూల్ ఏం చెబుతోంది

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ గాంధీ తమ పార్టీ ఎంపీలను తనపై నెట్టడం వల్లే తాను మెట్లపై పడిపోయానని.. తనకు గాయలయ్యాయని బీజేపీ ఎంపీ ప్రతాప్‌చంద్ర సారంగి ఆరోపించారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లోకి వెళ్లే క్రమంలో తనను నెట్టారని సారంగి ఆరోపించారు. అయితే పార్లమెంటు ఆవరణలో ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు విషయానికి వస్తే రూల్ ఏం చెబుతున్నాయి

పార్లమెంట్ ఆవరణలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల తోపులాట మధ్య బీజేపీ ఎంపీ ప్రతాప్‌చంద్ర సారంగీ కిందపడటం, ఆయనకు గాయలవడంతో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే నిబంధనల ప్రకారం ఈ కేసులో వీడియో సాక్ష్యం లేకపోతే సారంగి మాటలు రాహుల్ గాంధీ చెబుతున్నదానికి వ్యతిరేకంగా మాత్రమే అవుతుందంటున్నారు. అందుకే ఈ కేసులో పక్కా ఆధారాలు ఉండాలి. ఈవిషయంపై లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి పిడిటి ఆచార్య మాట్లాడుతూ ఇక్కడ అత్యంత ముఖ్యమైన వీడియో సాక్ష్యం ఉండాలని లేకపోతే ఒక ఎంపీ ఆరోపణలతో మరో ఎంపీ కౌంటర్ ఇవ్వడమే అవుతుంది తప్ప నేరం నిరూపించలేమన్నారు.

కేటీఆర్ పై అన్యాయంగా కేసు నమోదు చేశారు: హరీశ్ రావు

గత ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్

నిధుల దుర్వినియోగం జరిగిందంటున్న రేవంత్ సర్కారు

కేసు నమోదు చేసిన ఏసీబీ... ఏ1గా కేటీఆర్

దమ్ముంటే అసెంబ్లీలో చర్చించాలన్న హరీశ్ రావు

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ సందర్భంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం పట్ల బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడారు. కేటీఆర్ పై కేసు నమోదు చేయడం అన్యాయమని వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం మంచి పనులు చేస్తే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రేవంత్ రెడ్డి గానీ ఈ ప్రభుత్వం గానీ మేమేదైనా ప్రశ్నిస్తే. మమ్మల్ని దబాయించడం ఎంక్వైరీ పేరిట అక్రమ కేసులు పెట్టడం... ఇదే కదా మీరు చేసేది అంటూ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ తో హైదరాబాద్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయికి పెంచిన వ్యక్తి కేటీఆర్ అని కొనియాడారు. అటువంటి వ్యక్తిపై మీరు పెట్టిన కేసులో నిజం ఉందని అనుకుంటే... దమ్ముంటే ఆ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. రాష్ట్రానికి మంచి పేరు రావాలనే కేటీఆర్ ఈ-కార్ రేసింగ్ జరపాలని నిర్ణయం తీసుకున్నారని, రేవంత్ ప్రభుత్వానికి భయం లేకపోతే ఈ శాసనసభలో రేపు గానీ ఎల్లుండి గానీ చర్చ చేపట్టాలని అన్నారు.

తెలంగాణ అసెంబ్లీలో ఇక‌పై వారికి నో ఎంట్రీ మీడియాపై కూడా ఆంక్ష‌లు

అసెంబ్లీ ఇన్న‌ర్ లాబీలోకి మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల ప్ర‌వేశంపై నిషేధం

మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల‌కు ఇన్న‌ర్ లాబీలోకి నో ఎంట్రీ అంటూ బోర్డులు

అలాగే అసెంబ్లీ ప్రాంగ‌ణంలో ఎలాంటి వీడియో తీయ‌రాద‌ని మీడియాకు ఆదేశాల జారీ

తెలంగాణ అసెంబ్లీలో సోమ‌వారం నుంచి ప‌లు ఆంక్ష‌లు విధించారు. ఇందులో భాగంగా అసెంబ్లీ ఇన్న‌ర్ లాబీలోకి మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల‌ ప్రవేశంపై నిషేధం విధించారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల‌కు ఇన్న‌ర్ లాబీలోకి నో ఎంట్రీ అంటూ బోర్డులు వెలిశాయి. 

అలాగే మీడియాపై కూడా ప‌లు ఆంక్ష‌లు విధించారు. అసెంబ్లీ ప్రాంగ‌ణంలో ఎలాంటి వీడియో తీయ‌రాద‌ని ఆదేశాలు జారీ చేశారు. కాగా, అసెంబ్లీలో కాంగ్రెస్ స‌ర్కార్ ఆంక్ష‌లు విధించ‌డం ప‌ట్ల మాజీ ప్ర‌జాప్ర‌తినిధులు విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీ చరిత్ర‌లోనే తొలిసారి మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఇన్న‌ర్ లాబీలోకి అనుమ‌తించ‌డం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

హైదరాబాద్ గజగజ - ఆరేళ్ల రికార్డు బిగ్ అలర్ట్

హైదరాబాద్ నగరం గజగజ వణుకుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దాదాపు ఆరేళ్ల తరువాత ఈ స్థాయిలో చలి వణికిస్తోంది. నగరంలోని శివారు ప్రాంతాలతో పాటుగా పలు జిల్లాల్లోనూ ఇదే విధంగా చలి గాలులు వీస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. చలి గాలుల తీవ్రత పైన వాతావరణ శాఖ తాజా అంచనాలు వెల్లడించింది. ఈ సమయంలో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు అలర్ట్ చేస్తున్నారు.

తెలంగాణలో హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో ఉదయం వేళ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలి గాలులు భయపెడుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోని బేలాలో అత్యంత కనిష్ఠంగా 6.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్ లో ఆరేళ్ల తరువాత ఈ స్థాయిలో చలి భయపెడుతోంది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల లోపే నమోదయ్యాయి. మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో అత్యల్పంగా 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, బీహెచ్‌ఈఎల్‌లో 7.4, రాజేంద్రనగర్‌లో 8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

అదే విధంగా హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట, కూకట్‌పల్లి, గోల్కొండ, సఫిల్‌గూడ, హయ త్‌నగర్, ఉప్పల్, మల్లాపూర్, ఆదర్శనగర్ తదితర ప్రాంతాల్లో 13 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. తిరుమలగిరిలో 13.6 డిగ్రీల సెల్సియస్‌, చెర్లపల్లిలో 13.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. (నిర్మల్) తాండ్రలో 6.3 డిగ్రీలు, (ఆదిలాబాద్) పొచ్చర 6.4, జైనథ్ (ఆదిలాబాద్) 6.5, అర్లి (టి) (ఆదిలాబాద్) 6.6, చాప్రాల్ (ఆదిలాబాద్) 6.6, సత్వార్ (సంగారెడ్డి) 6.6, బంట్వారం (వికారాబాద్‌) 6.7సంగారెడ్డి ) 6.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోనూ చలి పంజా విసురుతోంది. ఎలిమినేడు (రంగారెడ్డి) 6.7, సిర్పూర్ (యు) (ఆసిఫాబాద్) 6.7, చందనవల్లి (రంగారెడ్డి) 6.7, కోహీర్ (సంగారెడ్డి) 6.7, మర్పల్లి (వికారాబాద్) 6.8, నాగారం (టి) (వికారాబాద్) 6.8, మన్నెగూడ (వికారాబాద్) 6.8 (వికారాబాద్) సంగారెడ్డి) 6.8, పోతారెడ్డిపేట (సిద్దిపేట)లో 6.9 డిగ్రీల సెల్సియస్, జహీరాబాద్ (సంగారెడ్డి) 6.9 డిగ్రీల సెల్సియస్, మేనూరు (కామారెడ్డి)లో 6.9 డిగ్రీల సెల్సియస్, రాఘవపేటలో (జగిత్యాల) 7.3 డిగ్రీల సెల్సియస్, కెరమెరిలో (ఆసిఫాబాద్) 7.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ సమయంలో వృద్ధులు.. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

నేడు భూమికి సమీపం నుంచి దూసుకుపోనున్న రెండు గ్రహశకలాలు

ఇవాళ (సోమవారం) రెండు భారీ గ్రహశకలాలు భూమికి సమీపం నుంచి ప్రయాణించనున్నాయి. ఒకదాని పేరు ‘2024 ఎక్స్‌వై5’ కాగా, రెండవది ‘2024 ఎక్స్‌బీ6’ అని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నిర్ధారించింది. ఈ రెండు డిసెంబర్ 16న భూమి వైపు దూసుకురానున్నాయని తెలిపింది. అయితే, భూమికి ఎలాంటి ముప్పులేదని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్రహశకలాల ట్రాకింగ్, అప్రమత్తత విషయంలో అవగాహన పొందవచ్చని వివరించారు.

భూమి సమీపానికి రానున్న రెండు గ్రహశకలాల్లో ఒకటైన ‘2024 ఎక్స్‌వై5’ పరిమాణం 71 అడుగుల వెడల్పు ఉంది. గంటకు 10,805 మైళ్ల వేగంతో వెళ్లే ఈ గ్రహ శకలం, భూమికి దాదాపు 2,180,000 మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుంది. చంద్రుడి దూరం కంటే 16 రెట్లు ఎక్కువ దూరం నుంచి ఈ గ్రహశకలం వెళ్లనుంది. 

ఇక ‘2024 ఎక్స్‌వై’ కంటే ‘2024 ఎక్స్‌బీ6’ గ్రహశకలం కొంచెం చిన్నది. దీని వ్యాసం 56 అడుగులుగా ఉంది. గంటకు 14,780 మైళ్ల వేగంతో భూమికి దాదాపు 4,150,000 మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుందని నాసా తెలిపింది. ఇలాంటి గ్రహశకలాలు సౌర వ్యవస్థ ఆరంభానికి సంబంధించినవని, ఇవి సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇలాంటి గ్రహశకలాలను అధ్యయనం చేస్తే భూమి మూలాలు, విశ్వం చరిత్రకు సంబంధించిన వివరాలు తెలుస్తాయని నాసా శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, భూమికి సమీపంలో ఉన్న వస్తువులను పర్యవేక్షించడానికి అధునాతన వ్యవస్థలను నాసా ఉపయోగిస్తుంది.