TTD దేవస్థాన చైర్మన్ B R నాయుడు తెలంగాణ మాజీ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారి పై చర్యలు తీసుకుంటామని ప్రకటించడం
తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించిన తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టు నరేష్ గౌడ్
తిరుమలలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుల పై చర్యలు తీసుకోకుండా.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద చర్యలకు ఆదేశించిన టీటీడీ
తిరుమలలో తెలంగాణ వారిపై వివక్ష
తిరుమలలో టీటీడీ అవలంభిస్తున్న వైఖరిని తప్పుబట్టిన శ్రీనివాస్ గౌడ్
తిరుమలలో దర్శనాలు, గదుల కేటాయింపులో తెలంగాణ భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారు
గడచిన పదేళ్ల కాలంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఇప్పుడు ఇరురాష్ట్రాల ప్రజలను టీటీడీ సమానంగా చూడడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు
కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ నాయకులు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ కూడా ఇదే తరహాలో టీటీడీ పై కామెంట్స్ చేశారు
తిరుమల గుడికి తెలంగాణ నుండి లెటర్స్ వస్తే ఈవో ఆక్సెప్ట్ చేయడం లేదు. ఇదే ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణలోని యాదగిరి గుట్ట, భద్రాచలం ఈవోలకు కాల్ చేస్తే స్పెషల్ దర్శనాలు అవుతున్నాయి.
చంద్రబాబు నాయుడు గారు మీరు కేవలం వ్యాపారం కోసమే తెలంగాణకు రాకండి.. మేము చెప్తే తిరుమల దర్శనం జరిగేటట్లు ఈవోకు ఆదేశాలు ఇవ్వండి.
లేదంటే మేము కూడా కలిసి నిర్ణయం తీసుకొని మిమ్మల్ని బాయ్‌కాట్ చేసి భద్రాచలం, యాదగిరి గుట్టలో లెటర్స్‌పై దర్శనం జరగకుండా చేస్తాం - జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
తిరుమల దేవస్థానంలో తెలంగాణ సిఫారసు లేఖలు రద్దు చేయడం కరెక్ట్ కాదు. ఏపీ, తెలంగాణ నాకు రెండు కళ్ళు అన్న చంద్రబాబు మర్చిపోయారా - ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
తిరుమల కొండపై శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు ఖండిస్తూ.. శ్రీనివాస్ గౌడ్ మీద చర్యలకు ఆదేశిస్తున్నట్లు చెప్పారు.
అయితే కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించకుండా కేవలం శ్రీనివాస్ గౌడ్ మీదే చర్యలు తీసుకోవాలని ఆదేశించిన టీటీడీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రాలో సర్దార్ గౌతు లచ్చన్న గౌడ్ విగ్రహావిష్కరణలో గౌడులను అవమానించింది తెలంగాణ బహుజన కీలక నేతైన మాజీ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారిని అవమానించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎల్లో మీడియా చైర్మన్ &టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది ఇకనైనా మీ వైఖరి మార్చుకోవాలని తెలంగాణ గౌడ యువజన సంఘం హెచ్చరిస్తుంది.
Dec 23 2024, 20:32