మోహన్ బాబు అరెస్ట్‌పై పోలీసుల క్లారిటీ
జర్నలిస్ట్‌పై దాడి నేపథ్యంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆయన ఆశ్రయించారు. కాని బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఎపిసోడ్‌లో ట్విస్ట్ కాదు బిగ్ ట్విస్ట్ కొనసాగుతోంది. మంచు ఫ్యామిలీలో ఇటీవల వరసగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ వ్యవహార శైలితో.. ఆ కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నట్లు స్పష్టమైంది. దీంతో మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఆ క్రమంలో చిన్న కుమారుడు మనోజ్‌ను ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు.
మోహన్ బాబు మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని..దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఎక్కడ ఆలస్యం లేదని స్పష్టం చేశారు. ఆయన వద్ద మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలని చెప్పారు.మోహన్ బాబుకు నోటీస్ ఇచ్చామని.. ఈ నెల 24 వ తేదీ వరకు సమయం అడిగారని తెలిపారు. 24వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు కూడా మోహన్ బాబుకు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. 24వ తేదీ లోపు ఎగ్జామిన్ చేయొచ్చా లేదా అనే విషయం గురించి కోర్టును అడుగుతామని అన్నారు.రాచకొండ పరిధిలో మోహన్ బాబుకు ఎలాంటి గన్ లైసెన్స్ లేవని తేల్చిచెప్పారు. మోహన్ బాబు వద్ద రెండు గన్స్ ఉన్నాయన్నారు. డబుల్ బ్యారెల్ ఒకటి .స్పానిష్ మేడ్ రివాల్వర్ ఒకటి ఉందని వివరించారు. మోహన్ బాబుకు మరోసారి నోటీస్ ఇస్తామని తెలిపారు. 126 BNSS ద్వారా ఆయన సమయం అడగవచ్చు అని అన్నారు. మరోవైపు నోటీసులకు స్పందించకపోతే అరెస్ట్ చేస్తామని రాచకొండ సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.
మంచు ఫ్యామిలీలో ఇటీవల ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఏదో జరుగుతుందంటూ ప్రచారం జరిగింది. దీంతో శంషాబాద్ మండలంలోని జల్‌పల్లిలో మోహన్ బాబు నివాసంలోకి మంచు మనోజ్ బలవంతంగా వెళ్లారు. ఆ తర్వాత మోహన్ బాబు ఆడియో క్లిప్ విడుదల చేశారు. అదే సమయంలో మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు.. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చారు.
ఇంతలో విలేకర్ల సమావేశంలో మంచు మోహన్ బాబు సీరియస్ అయ్యారు. ఆ క్రమంలో ఓ మీడియా ఛానెల్ జర్నలిస్ట్‌పై ఆయన దాడి చేశారు. ఈ ఘటనపై జర్నలిస్ట్‌లు నిరసన బాట చేపట్టారు. ఈ నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మోహన్ బాబుపై హత్యయత్నం కేసు నమోదు అయింది. ఇంతలో మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చి..బుధవారం సాయంత్రం.. అంటే డిసెంబర్ 11వ తేదీ మీడియా ముందుకు వచ్చి.. అన్ని విషయాలు వివరిస్తానని ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం రద్దు అయింది.
హత్యాయత్నం కేసు నమోదు కావడంతో.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కానీ మోహన్ బాబు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అలాగే ఈ పిటిషన్‌కు సంబంధించిన విచారణను గురువారానికి వాయిదా వేసింది. దీంతో అరెస్ట్ నుంచి తప్పించుకోనేందుకు మోహన్ బాబు అజ్జాతంలోకి వెళ్లారంటూ ఓ చర్చ అయితే వాడి వేడిగా జరుగుతోంది. అలాంటి వేళ.. తాను ఎక్కడికి వెళ్లలేదంటూ మోహన్ బాబు ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. అనంతరం ఆయన్ని పోలీసులు విచారిస్తున్నారు.
Dec 16 2024, 15:31