గూగుల్ మైక్రోసాఫ్ట్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు ఎలాన్ మస్క్ రెడీ
ఎక్స్ మెయిల్ గురించి ఆలోచించాలన్న ఎక్స్ యూజర్
సానుకూలంగా స్పందించిన మస్క్
ఎక్స్ ఫోన్ గురించి కూడా ఆలోచించాలంటున్న యూజర్లు
ప్రస్తుతం ఈమెయిల్ మార్కెట్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న యాపిల్ మెయిల్ రెండోస్థానంలో జీమెయిల్
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు షాక్ ఇచ్చేందుకు ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ రెడీ అవుతున్నారు. ఎక్స్ మెయిల్ పేరుతో ఈమెయిల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ‘ఎక్స్ మెయిల్’ కూడా ఉంటే బాగుంటుందన్న ఓ ఎక్స్ యూజర్ సూచన మేరకు మస్క్ ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఎక్స్ మెయిల్ లాంచ్ అయితే అది నేరుగా జీమెయిల్, ఇతర ఈమెయిల్ సర్వీసులకు పోటీ ఇస్తుందని మస్క్ ఆ యూజర్‌కు సమాధానం ఇచ్చారు.
సెప్టెంబర్ 2024 నాటికి గ్లోబల్ ఈమెయిల్ మార్కెట్‌లో యాపిల్ మెయిల్ ప్రస్తుతం 53.67 శాతంతో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 30.70 శాతంతో జీమెయిల్ రెండోస్థానంలో ఉండగా అవుట్‌లుక్ (4.38 శాతం), యాహూ మెయిల్ (2.64 శాతం), గూగుల్ ఆండ్రాయిడ్ (1.72 శాతం) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడీ విషయంలోనూ పోటీకి మస్క్ రెడీ అవుతున్నట్టు ఆయన కామెంట్‌ను బట్టి అర్థం అవుతోంది. దీంతో ఎక్స్ యూజర్లు మరింత ఉత్సాహంగా.ఎక్స్ ఫోన్ గురించి కూడా ఆలోచించాలని కోరుతున్నారు.
Dec 16 2024, 12:43