చలిగాలులతో జర జాగ్రత్త తెలంగాణకు ఐఎండీ అలర్ట్
నేడు రేపు పలు రాష్ట్రాల్లో శీతల గాలులు వీస్తాయని హెచ్చరిక
తెలంగాణ సహా ఉత్తరాది, మధ్యభారతంలోని రాష్ట్రాలకు అప్రమత్తత
రాత్రి సమయంలో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్
దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో చలి బాగా ముదిరింది. తీవ్రంగా వీస్తున్న చలిగాలులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, నైరుతి, మధ్య భారత రాష్ట్రాలలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన విడుదల చేసింది.
డిసెంబరు 16, 17 తేదీల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో శీతల గాలులు వీస్తాయని, దట్టమైన పొగమంచు పరిస్థితులకు అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అనేక రాష్ట్రాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని పౌరులను అప్రమత్తం చేసింది.
మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ (సోమవారం) చలిగాలుల నుంచి తీవ్రమైన చలిగాలుల పరిస్థితులు ఉంటాయని ఐఎండీ అప్రమత్తం చేసింది. ఇక హర్యానా చండీగఢ్ ఢిల్లీ జమ్మూ కశ్మీర్ లడఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఒడిశా మధ్య మహారాష్ట్ర విదర్భ మరాఠ్వాడా సౌరాష్ట్ర, తెలంగాణ, గుజరాత్‌లోని కచ్ ప్రాంతాలలో చలి గాలులు ఎక్కువగా వీస్తాయని పేర్కొంది. ఇక కొన్ని దట్టమైన పొగమంచు పడనుందని తెలిపింది.
Dec 16 2024, 12:28