నటి జత్వాని కేసు విద్యాసాగర్ బెయిల్‌పై సోమవారం తీర్పు
నటి జత్వాని కేసులో నిందితుడు విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 5న హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో బెయిల్ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. సోమవారం (9వ తేదీ) తీర్పు వెల్లడించనున్నట్లు పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వాని కేసు (Mumbai Actor Jethwani Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు, వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader) కుక్కల విద్యాసాగర్(Vidyasagar) బెయిల్ (Bail)పై సోమవారం హైకోర్టు (High Court) తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు కుక్కల విద్యాసాగర్ పిటిషన్ దాఖలు చేశాడు. జత్వానీ, పోలీసుల తరుపున న్యాయవాది నర్రా శ్రీనివాస్, పీపీ లక్ష్మీ నారాయణ కోర్టులో వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరు చేస్తే నిందితుడు కేసును ప్రభావితం చేస్తారని తెలిపారు. అలాగే నిందితుడు తరుపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. నిందితుడు ఇప్పటికే 76 రోజులుగా జైలులో ఉన్నాడని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. దీంతో ఈ కేసుపై తీర్పును హైకోర్టు సోమవారం నాటికి వాయిదా వేసింది.
విద్యాసాగర్ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 5న సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. వరుసగా మంగళ, బుధవారాల్లో హైకోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో బెయిల్ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. సోమవారం బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించనుంది.
కాగా ఏపీలో సంచలనంగా మారిన ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాదంబరి కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చాక విద్యాసాగర్ అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్నిరోజులు ముంబైలో, మరికొన్ని రోజులు ఢిల్లీలో తలదాచుకున్నారని పోలీసులు గుర్తించారు. చివరకు డెహ్రాడూన్‌లోని ఓ రిసార్ట్ వద్ద అరెస్టు చేశారు. అక్కడి మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు.
తనపై తప్పుడు కేసు నమోదుచేసి మానసికంగా వేధించారని కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్ అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ, పలువురు పోలీసు అధికారులపై జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఈ నెల 13న కేసు నమోదు చేశారు. ఇందులో కుక్కల విద్యాసాగర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. జెత్వానీ విజయవాడకు వచ్చి వాంగ్మూలం ఇచ్చినప్పటి నుంచి విద్యాసాగర్ పరారీలో ఉన్నారు. తాను నమోదు చేయించిన కేసుకు సంబంధించిన వివరాలు మీడియాలో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా కాదంబరి వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఉన్నతాధికారులు విచారణాధికారిని నియమించారు. ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్‌లోని ఏసీపీ స్రవంతిరాయ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆమె కాదంబరితో పాటు తండ్రి నరేంద్రకుమార్ జెత్వానీ, తల్లి ఆశా జెత్వానీ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. 100 పేజీలతో విచారణ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. కాదంబరి మొత్తం నాలుగుసార్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మూడుసార్లు పోలీసు కమిషనర్‌కు, నాలుగోసారి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అజ్ఞాతంలోకి వెళ్లిన విద్యాసాగర్‌ను పట్టుకోవడానికి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను నియమించారు. ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ముగ్గురి సస్పెన్షన్ ఫైల్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. అధికార దుర్వినియోగ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులను డీజీపీ సస్పెండ్ చేశారు. డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కూడా వేటు పడింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. జీవో నంబర్ 1590, 1591,1592 విడుదల చేసింది. కాన్ఫిడెన్షియల్ అని వెబ్‌సైట్‌లో ప్రభుత్వం పేర్కొంది
Dec 10 2024, 09:20