విగ్రహావిష్కరణకు రాలేను మంత్రి పొన్నంకు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి లేఖ

డిసెంబర్ 9 సోమవారం తెలంగాణ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అందరికీ ఆహ్వాన పత్రికలు పంపింది. ప్రభుత్వం తరఫున పొన్నం ప్రభాకర్ గౌడ్ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు లేఖ రాశారు. తను సోమవారం నిర్వహించనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాలేనని పేర్కొన్నారు.

ముందస్తు కార్యక్రమాలు, పార్లమెంటు సమావేశాల ఉండడంతో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాలేకపోతున్నట్లుగా వివరించారు. తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు, ప్రత్యేక గుర్తింపు, పోరాటానికి ప్రతీకగా అని పేర్కొన్నారు. విగ్రహ ఆవిష్కరణకు తనను ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి మాజీ సీఎం రావడంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కార్యక్రమానికి ఆయన వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. కాగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ట్యాంక్‌బండ్ ప్రాంతాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. విగ్రహావిష్కరణ తర్వాత జరిగే పబ్లిక్ మీటింగ్‌లో సీఎం మాట్లాడుతారు. విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని అందరూ భావించారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మహిళల చేతులు మీదుగా ఆవిష్కరింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ వర్గాలకు చెందిన మహిళలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. కాగా ఈ కార్యక్రమానికి ‌కు ఏఐసీసీ నుంచి ఎవరు వస్తారనేది తెలియరాలేదు.

ప్రస్తుత పరిస్థితుల్లో సోనియాగాంధీ హైదరాబాద్ కు వచ్చే అవకాశం లేదు. రాహుల్ లేదా ప్రియాంకాగాంధీలో ఎవరో ఒకరు వస్తారని భావించారు. కానీ వారి రాకకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ ఖరారు కాలేదు.

కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్ షీట్

కాంగ్రెస్ ఏడాది పాలనపై మాజీ మంత్రి టిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు ఆదివారం తెలంగాణ భవన్లో చార్ సీట్ విడుదల చేశారు.

కాంగ్రెస్ ఏడాది పాలనపై మాజీ మంత్రి టిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు ఆదివారం తెలంగాణ భవన్లో చార్ సీట్ విడుదల చేశారు. ఏడాది పాలన ఎడతెగని వంచన పేరుతో ఆ పార్టీ ఛార్జిషీట్‌ను విడుదల చేసింది. ఏడాదిపాలనలో ప్రజాస్వామ్యం అపాస్యమైందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఎప్పుడూ చూడని నిర్బంధాన్ని చూస్తున్నామని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి సొంత ఊరుకు వెళ్లాలంటే పోలీస్ స్టేషన్లో అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని ఆయన ఆరోపించారు. ఖమ్మం లో వర్షాలకు వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

భారత్‌ను అస్థిరపరిచే కుట్ర

అమెరికా విదేశాంగ శాఖపై బీజేపీ నిప్పులు చెరిగింది. భారతదేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని విమర్శలు గుప్పించింది.

అమెరికా విదేశాంగ శాఖపై బీజేపీ నిప్పులు చెరిగింది. భారతదేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని విమర్శలు గుప్పించింది. పరిశోధనాత్మక జర్నలిస్టులు సహా భారత విపక్ష నాయకుడు రాహుల్‌గాంధీతో కలిసి ఈ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించింది. ఈ విమర్శలు రాజకీయంగా పెను సంచలనానికి దారి తీశాయి. అమెరికా-భారత్‌ల మధ్య రెండు దశాబ్దాలుగా సుహృద్భావ సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీ కేంద్రంగా అమెరికా దర్యాప్తు సంస్థ చేసిన ఆరోపణలు.. ప్రస్తుతం బీజేపీ చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురి చేశాయి. ఆర్గనైజ్డ్‌ క్రైం, కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (ఓసీసీఆర్‌పీ) కథనాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అదానీ గ్రూపుపై ఏకపక్షంగా విమర్శలు చేస్తోందని బీజేపీ దుయ్యబట్టింది. మోదీ ప్రభుత్వాన్ని అణిచివేయాలని భావిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూపుపై ఎఫ్‌బీఐ చేసిన లంచాల ఆరోపణలను బీజేపీ నిరాధారమైనవని కొట్టిపారేసింది.

అదేవిధంగా ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిని.. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు దుయ్యబడుతున్నారన్న ఓసీసీఆర్‌పీ కథనాలను కూడా ఖండించింది. తాజాగా ఓసీసీఆర్‌పీ, 92ఏళ్ల జార్జ్‌ సొరో్‌సలపై స్పందిస్తూ.. వీరికి అమెరికానే నేరుగా 50 శాతం నిధులు సమకూరుస్తోందని, ఈ విషయాన్ని ఫ్రెంచ్‌ మీడియా పేర్కొందని బీజేపీ తెలిపింది. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని భారత్‌ను అస్థిరపరిచేందుకు డీప్‌ స్టేట్‌ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక.. అమెరికా విదేశాంగ శాఖ అజెండా స్పష్టంగా కనిపిస్తోంది అని బీజేపీ ఎక్స్‌లో పేర్కొంది. కాగా బీజేపీ వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందించారు. 

వృత్తిపరమైన అభివృద్ధి కోసం జర్నలిస్టులకు అమెరికా ప్రభుత్వం మద్దతిస్తుందని పేర్కొన్నారు. దీనర్థం. ఆయా పత్రికల ఎడిటోరియల్‌ నిర్ణయాలను ప్రభావితం చేయడం కాదని తెలిపారు భారత అధికార పార్టీ(బీజేపీ) ఇలాంటి ఆరోపణలు చేయడం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది అని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛకు పెద్దపీట వేస్తున్న దేశం తమదేనని తెలిపారు.

చోర కళ నేర్పుతారిక్కడ

ఆ బడిలో పాఠాలు మంచి బుద్ధులు బోధించరు. దొంగతనం ఎలా చేయాలి దోపిడీలకు ఎలా పాల్పడాలి ఒకవేళ దొంగతనం చేస్తుండగా పట్టుబడితే చాకచక్యంగా ఎలా తప్పించుకోవాలి అనే చోరకళ నేర్పిస్తారు.

కడియా, గుల్‌ఖేడి, హుల్‌ఖేడి... మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 117 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామాలవి. చీకటి పడగానే ఆ ఊళ్లలో పిల్లలందరూ భుజాన బ్యాగులు తగిలించుకుని గబగబా బడికి పరుగులు తీస్తారు. అయితే వాళ్లు వెళ్లేది ఏ నైట్‌ స్కూల్‌కో అనుకునేరు... చేతిలో పెన్ను, పుస్తకం పట్టుకోవాల్సిన వయసులో కత్తెర, బ్లేడు, స్ర్కూడైవర్‌తో దొంగల బడిలో అడుగుపెడుతున్నారు. దొంగతనం, దోపిడీ వంటి చోరకళలో నిష్ణాతులవుతున్నారు.

దొంగలబడిలో విద్య ఉచితంగా నేర్పుతారనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఆయా ఊళ్లలో తల్లిదండ్రులు తమ పిల్లలకు 12 ఏళ్లు రాగానే రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల అడ్మిషన్‌ ఫీజు చెల్లించి మరీ చేర్పిస్తున్నారు. ఒక దొంగల ముఠా ఏడాదికాలం కోర్సుతో ఈ బడిని నడుపుతోందట. ఇంతకీ అక్కడ ఏం నేర్పుతారంటే... రద్దీ ప్రదేశాల్లో పిక్‌ పాకెటింగ్‌ ఎలా చేయాలి? బ్యాగులు ఎలా లాక్కోవాలి? బ్యాంకులను ఎలా దోచుకోవాలి? వేగంగా పరిగెత్తడం, పోలీసుల నుంచి తప్పించుకోవడంతో పాటు

ఒకవేళ పట్టుబడితే లాఠీ దెబ్బలను ఎలా తట్టుకోవాలి? వంటి విషయాల్లో పిల్లల్ని సుశిక్షితులను చేస్తారు. శిక్షణ అనంతరం వారిని దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించి, వాళ్లు కొట్టుకొచ్చిన సొమ్మును ఆ దొంగల ముఠాయే తీసుకుని, సదరు పిల్లల తల్లిదండ్రులకు ఏడాదికి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఇస్తుంది. దీంతో ఇదేదో బాగుందని భావిస్తున్న ఆ చుట్టుపక్కల ఊళ్ల జనం నానా తిప్పలు పడి ఫీజులు చెల్లించి తమ పిల్లలను దొంగల బడిలో చేర్పించేందుకు పోటీ పడుతున్నారు.

ఈ బడిలో అడ్మిషన్‌ పొందాలంటే కొన్ని అర్హతలు కూడా ఉండాలి. అయితే అవి చదువు, మార్కులు, ర్యాంకులో కాదు... కేవలం వయసు. ఇక్కడ చేరాలంటే పిల్లాడి వయసు 12 ఏళ్ల నుంచి 17 ఏళ్ల మధ్యనే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే అడ్మిషన్‌ ఇవ్వరు. దీనికో పకడ్బందీ కారణం ఉంది. ఒకవేళ దొంగతనం చేస్తూ కుర్రాళ్లు పట్టుబడితే... మైనర్లనే కారణంతో ఎక్కువ శిక్ష పడకూడదనే ఈ వయసును నిర్ణయించారట.

దొంగలబడి విద్యార్థుల ప్రధాన ఫోకస్‌ అంతా బడా బాబుల మీదనే ఉంటుంది. కోటీశ్వరులు, పారిశ్రామికవేత్తలే లక్ష్యంగా వీళ్లు ఎక్కువ చోరీలకు పాల్పడుతుంటారు. వారి ఇళ్లలో జరిగే పెళ్లిళ్లు, పేరంటాలు, ఫంక్షన్లకు వెళ్లి... నగలు, డబ్బు, ఖరీదైన వస్తువులు చాకచక్యంగా కొట్టేస్తుంటారు. దొంగిలించిన తర్వాత ఆయా వస్తువులతో వారు తమ స్వగ్రామానికి చేరుకోకముందే ఆ కేటుగాళ్లను పోలీసులు పట్టుకోవాలి. లేదంటే వారు దొరకడం కష్టమే. ఆ ఊళ్లోకి పోలీసులు ఎవరైనా అడుగుపెడితే చాలు... ఊరి జనమంతా ఏకమై అడ్డుకుంటారు. ఈ గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 2 వేల మందిపై దేశంలోని పలు స్టేషన్లలో ఇప్పటిదాకా 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ గ్రామాల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినా, వారి వద్ద కెమెరాలు, సెల్‌ఫోన్లు ఉన్నట్లు గ్రామస్థులు గమనించినా వెంటనే అలర్ట్‌ అయిపోతారట. మొత్తానికి అన్ని కళల్లాగే ‘చోర’కళలో శిక్షణ ఇవ్వటం విచిత్రమే కదా

తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చ అవసరమా

తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చ అవసరమా అని విమలక్క ప్రశ్నించారు. తెలంగాణ తల్లిపై చర్చ జరగడం బాధగా ఉందన్నారు. నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉన్నామన్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసం ఆలోచించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

తెలంగాణ తల్లి విగ్రహం (Telangana Talli Statue) అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా నిలిచింది. తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రజా గాయకురాలు విమలక్క (Vimalakka) శనివారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చ అవసరమా అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లిపై చర్చ జరగడం బాధగా ఉందన్నారు. నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉన్నామన్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసం ఆలోచించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించడం లేదన్నారు. ప్రభుత్వంపై నిరసన మొదలైందన్నారు. ఎక్కడ విజయం సాధించారని విజయోత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం తన పనితీరుపై సమీక్షించుకోవాలని హితవుపలికారు. ఏం హామీలు ఇచ్చాం.. ఏం చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలన్నారు. ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ కావాలని పోరాడితే వరుసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం సమీక్షించుకోవాలని విమలక్క వ్యాఖ్యలు చేశారు.

ఈనెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించనుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం దొరసానిలా ఉందని.. తాము అధికారంలోకి రాగానే అసలైన తెలంగాణ విగ్రహాన్ని రూపొందిస్తామని ఎన్నికల్లో చెప్పిన విధంగానే నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది కాంగ్రెస్ సర్కార్. అలాగే విగ్రహ ఆవిష్కరణకు కూడా అంతా సిద్ధమైంది. ఈ విగ్రహావిష్కరణకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించాలని కూడా సర్కార్ నిర్ణయించింది. కాగా.. తెలంగాణ తల్లి రూపం మార్పు రాజకీయంగా చర్చకు దారి తీసింది.

3 అడుగుల గద్దెపై 17 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి కాంస్య విగ్రహ నమూనాను తెలంగాణ ప్రభుత్వం నిన్న( శుక్రవారం) విడుదల చేసింది. బంగారు రంగు అంచుతో ఆకుపచ్చ చీర! రెండు చేతులకు ఎరుపు, ఆకు పచ్చ రంగు గాజులు! ఎడమ చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ కంకులు! కాళ్లకు మెట్టెలు, పట్టీలు! మెడలో బంగారపు గొలుసులు! నుదుట రూపాయి కాసంత ఎర్రటి బొట్టుతో నిండైన గ్రామీణ మహిళ రూపంతో తెలంగాణ తల్లి తాజా విగ్రహాన్నిరేవంత్ ప్రభుత్వం రూపొందించింది. సబ్బండ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ విగ్రహం రూపుదిద్దుకుంది.

మరోవైపు ఈనెల 9న సెక్రటేరియట్ ఆవరణలో ఆవిష్కరణ కానున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను ఆపాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై జూలూరి గౌరీ శంకర్.. హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను నిలిపివేయాలని పిల్ వేశారు.

మూడు సార్లు భూకంపం

ఈరోజు తెల్లవారుజామున హిమాచల్ ప్రదేశ్‌లో భూమి కంపించింది. మండి నగరంలో ఒకదాని తర్వాత ఒకటిగా మూడు సార్లు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ వరుసగా మూడు సార్లు ప్రకంపనలు రావడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.

హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లోని మండి జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఈ కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైంది. దీని కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల దిగువన ఉంది. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో చాలా మంది గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. మండి నగరాన్ని భూకంపం తాకింది. ఆ క్రమంలో ఒకదాని తర్వాత ఒకటిగా 3 బలమైన ప్రకంపనలు వచ్చాయి. ప్రకంపనల తర్వాత, ప్రజలు పిల్లలు, కుటుంబాలతో సహా వీధుల్లోకి వచ్చారు.

మూడు సార్లు భూకంపం

ఈరోజు తెల్లవారుజామున హిమాచల్ ప్రదేశ్‌లో భూమి కంపించింది. మండి నగరంలో ఒకదాని తర్వాత ఒకటిగా మూడు సార్లు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ వరుసగా మూడు సార్లు ప్రకంపనలు రావడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.

హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లోని మండి జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఈ కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైంది. దీని కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల దిగువన ఉంది. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో చాలా మంది గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. మండి నగరాన్ని భూకంపం తాకింది. ఆ క్రమంలో ఒకదాని తర్వాత ఒకటిగా 3 బలమైన ప్రకంపనలు వచ్చాయి. ప్రకంపనల తర్వాత, ప్రజలు పిల్లలు, కుటుంబాలతో సహా వీధుల్లోకి వచ్చారు.

నిజామాబాద్‌లో ఘనంగా నమస్తే తెలంగాణ ఆటో షో

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆటో షో (Auto Show) ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ హాజరయ్యారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆటో షో (Auto Show) ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ హాజరయ్యారు. ఎస్బీఐ డీజీఎం బిజయ్ కుమార్ సాహూ, యూబీఐ ఏజీఎం ప్రవీణ్ వేణుగోపాలన్‌లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. నిజామాబాద్‌లో నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో 4వ ఎడిషన్ ఆటో షో మొదలవడం పట్ల అతిథులు హర్షం వ్యక్తం చేశారు. నగరవాసుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ ఆటో షో దిగ్విజయం కావాలని వారంతా ఆకాంక్షించారు. మొత్తం 17 స్టాళ్లను ఏర్పాటు చేశారు.

ఔత్సాహిక కొనుగోలుదారులందరికీ అన్ని రకాల వాహనాలను ఒకే వేదికపై అందించాలన్న ఉద్దేశంతో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ గత మూడేండ్లుగా దిగ్విజయవంతంగా ఆటో షోను నిర్వహిస్తున్నది. ప్రజల స్పందనను స్ఫూర్తిగా తీసుకుని మరోసారి వాహన ప్రదర్శనకు ఏర్పాట్లు చేసింది. శని, ఆదివారాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తున్న ఈ ఆటో షోకు వచ్చే సందర్శకులకు ప్రవేశం ఉచితం. కాలానుగుణంగా వస్తున్న మార్పులతో పాటు వాహనదారుల అభిరుచికి అనుగుణంగా మార్కెట్‌లోకి వస్తున్న అధునాతన వాహనాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచనున్నారు. అలాగే, వాహనాల కొనుగోలుకు అవసరమైన లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు కూడా ఇక్కడ కొలువుదీరనున్నాయి. కియా, మారుతి, నిస్సాన్‌, హ్యుండాయ్‌, నెక్సా, టాటా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హీరో, హోండా, టీవీఎస్‌, ఏథార్‌, చేతక్‌ తదితర కంపెనీలు షోలో పాల్గొంటున్నాయి. యూనియన్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సందర్శకుల కోసం ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు చేశాయి

కడపలో ఇంత సమస్య ఉందని అనుకోలేదు

కడపలో పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ అంటే చదువుల నేల అని.. ఒకప్పుడు రాయలసీమలో అత్యధికంగా లైబ్రరీలు ఉండేవని అన్నారు.

కడపలో పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను కలిసి అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యాలు చేశారు. 'రాయలసీమ అంటే చదువుల నేల. ఒకప్పుడు రాయలసీమలో అత్యధికంగా లైబ్రరీలు ఉండేవి. ఎంతోమంది మహానుభావులు రాయలసీమ నుంచి వచ్చారు. అలాంటి రాయలసీమకు పునర్ వైభవం రావాలి' అని అన్నారు.

2014-19 మధ్య ఉద్దానం సమస్యను బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు రూ. 61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. కడప ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు అయ్యారు కనుక ఈ ప్రాంతంలో ఇక సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నానని అయితే, కడపలో ఇంత నీటి సమస్య ఉందని అనుకోలేదని పవన్ పేర్కొన్నారు.

బతుకుదెరువు కోసం వచ్చి హెరాయిన్‌ విక్రయిస్తూ

బ్రౌన్‌ హెరాయిన్‌(Brown heroin) విక్రయిస్తున్న ఇద్దరు స్మగ్లర్లు, వినియోగదారుడిని సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, మొగల్‌పురా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 50 గ్రాముల బ్రౌన్‌ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

బ్రౌన్‌ హెరాయిన్‌(Brown heroin) విక్రయిస్తున్న ఇద్దరు స్మగ్లర్లు, వినియోగదారుడిని సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, మొగల్‌పురా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 50 గ్రాముల బ్రౌన్‌ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన జమాల్‌ మోమిన్‌ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మొగల్‌పురా(Mogalpura) పరిధిలో నివసిస్తూ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. మేస్త్రీ పని ద్వారా వచ్చే సంపాదన సరిపోకపోవడంతో బ్రౌన్‌ హెరాయిన్‌ను విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేశాడు.

హైదరాబాద్‌(Hyderabad)లో డ్రగ్స్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో బెంగాల్‌ నుంచి హెరాయిన్‌ను తీసుకొచ్చి మీర్‌చౌక్‌ ప్రాంతానికి చెందిన స్నేహితుడు షేక్‌ షాబాజ్‌తో కలిసి అవసరమైన కస్టమర్స్‌కు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిఘా పెట్టి ఇద్దరు నిందితులతోపాటు.. వినియోగదారుడు సయ్యద్‌ అబ్ధుల్‌ మాజిద్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.