కడపలో ఇంత సమస్య ఉందని అనుకోలేదు

కడపలో పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ అంటే చదువుల నేల అని.. ఒకప్పుడు రాయలసీమలో అత్యధికంగా లైబ్రరీలు ఉండేవని అన్నారు.

కడపలో పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను కలిసి అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యాలు చేశారు. 'రాయలసీమ అంటే చదువుల నేల. ఒకప్పుడు రాయలసీమలో అత్యధికంగా లైబ్రరీలు ఉండేవి. ఎంతోమంది మహానుభావులు రాయలసీమ నుంచి వచ్చారు. అలాంటి రాయలసీమకు పునర్ వైభవం రావాలి' అని అన్నారు.

2014-19 మధ్య ఉద్దానం సమస్యను బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు రూ. 61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. కడప ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు అయ్యారు కనుక ఈ ప్రాంతంలో ఇక సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నానని అయితే, కడపలో ఇంత నీటి సమస్య ఉందని అనుకోలేదని పవన్ పేర్కొన్నారు.

బతుకుదెరువు కోసం వచ్చి హెరాయిన్‌ విక్రయిస్తూ

బ్రౌన్‌ హెరాయిన్‌(Brown heroin) విక్రయిస్తున్న ఇద్దరు స్మగ్లర్లు, వినియోగదారుడిని సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, మొగల్‌పురా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 50 గ్రాముల బ్రౌన్‌ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

బ్రౌన్‌ హెరాయిన్‌(Brown heroin) విక్రయిస్తున్న ఇద్దరు స్మగ్లర్లు, వినియోగదారుడిని సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, మొగల్‌పురా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 50 గ్రాముల బ్రౌన్‌ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన జమాల్‌ మోమిన్‌ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మొగల్‌పురా(Mogalpura) పరిధిలో నివసిస్తూ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. మేస్త్రీ పని ద్వారా వచ్చే సంపాదన సరిపోకపోవడంతో బ్రౌన్‌ హెరాయిన్‌ను విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేశాడు.

హైదరాబాద్‌(Hyderabad)లో డ్రగ్స్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో బెంగాల్‌ నుంచి హెరాయిన్‌ను తీసుకొచ్చి మీర్‌చౌక్‌ ప్రాంతానికి చెందిన స్నేహితుడు షేక్‌ షాబాజ్‌తో కలిసి అవసరమైన కస్టమర్స్‌కు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిఘా పెట్టి ఇద్దరు నిందితులతోపాటు.. వినియోగదారుడు సయ్యద్‌ అబ్ధుల్‌ మాజిద్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

హైదరాబాద్ బిర్యానీ ఇష్టమా అయితే జాగ్రత్త

 కల్తీ ఆహారానికి కేరాఫ్ అడ్రస్‌గా భాగ్యనగరం మారిపోతోంది. రెస్టారెంట్లు, హోటళ్లలో తినే ఆహారంలో రోజుకో వస్తువు బయటపడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. వ్యాపారుల నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌లో బయట ఫుడ్ తినాలంటేనే భాగ్యనగర వాసులు భయపడే పరిస్థితికి దారితీస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ బిర్యానీ అంటే ప్రతీ ఒక్కరూ లొట్టలేసుకుని మరీ తింటుంటారు.

మీకు బిర్యానీ అంటే ఇష్టమా.. ముఖ్యంగా హైదరాబాద్‌ బిర్యానీ (Hyderabad Biryani) అంటే లొట్టలేసుకుంటారా.. అయితే మీరు కచ్చితంగా అనారోగ్యానికి గురికాక తప్పదు. ఇటీవల కాలంలో పలు రెస్టారెంట్లు, హోటళ్లలో బిర్యానీలో బయటపడుతున్న విస్తుపోయే విషయాలే ఇందుకు ప్రధాన కారణం. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. సెలబ్రటీల నుంచి సామాన్య ప్రజల వరకు హైదరాబాద్ బిర్యానీ ఫ్యాన్సే. కానీ ఇప్పుడు ఆ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి నెలకొంది. అందుకు వ్యాపారస్తుల నిర్లక్ష్యమే కారణం. బిర్యానీ తయారు చేసే సమయంలో వారి నిర్లక్ష్యం కారణంగా అది కల్తీ అవుతోంది. హోటల్స్‌లోని వంటశాలలు పరిశుభ్రంగా ఉండకపోవడంతో బిర్యానీలో బొద్దింకలు ప్రత్యక్షమవుతున్నాయి. ఎంతో ఇష్టంగా బిర్యానీని తిందామని వచ్చిన కస్టమర్లకు బిర్యానీలో ఇలాంటి కనిపించడం మింగుడుపడని విషయం.

కల్తీ ఆహారానికి కేరాఫ్ అడ్రస్‌గా భాగ్యనగరం మారిపోతోంది. రెస్టారెంట్లు, హోటళ్లలో తినే ఆహారంలో రోజుకో వస్తువు బయటపడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. వ్యాపారుల నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌లో బయట ఫుడ్ తినాలంటేనే భాగ్యనగర వాసులు భయపడే పరిస్థితికి దారితీస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ బిర్యానీ అంటే ప్రతీ ఒక్కరూ లొట్టలేసుకుని మరీ తింటుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బిర్యానీలో పలు వస్తువులతో, అనేక జీవులు బయటపడటం కనిపిస్తోంది. దీంతో ఎంతో ఇష్టంగా భావించే హైదరాబాద్ బిర్యానీని తినాలంటే ప్రజలు ఆలోచించే స్థితి నెలకొంది. వామ్మో.. హైదరాబాద్ బిర్యానీనా అనే స్థాయికి వ్యాపారస్తులు తీసుకువస్తున్నారు.

తాజాగా ఆలు కర్రీలో ఇనుప ముక్కలు.. ధమ్ బిర్యానీలో టాబ్లెట్ పీసులు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. ఒకేరోజు రెండు ప్రముఖ రెస్టారెంట్లలో కల్తీ నిర్వాకం బయటపడింది. దీంతో వ్యాపారుల నిర్లక్ష్యం బిర్యానీ ప్రియులను భయపెట్టేలా చేస్తోంది. కల్తీ ఆహారంతో హైదరాబాదీ బిర్యానీ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. చికెన్ పీసులకు బదులు బిర్యానీల్లో బొద్దింకలు, జర్రులు, సిగరెట్ పీకలు, బల్లులు దర్శనమిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా బయటపడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారుతున్నాయి. బిర్యానీలో బయటపడుతున్న వాటిని చూసి బిర్యానీ ప్రియులు ఆందోళన చెందుతున్నారు.

అయితే జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కూడా తూతూ మంత్రంగా ఉన్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఫుడ్ సేఫ్టీ అధికారుల దూకుడుకు బ్రేక్ పడింది. చలానాలకు మాత్రమే ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిమితమవుతున్నారు. గడిచిన ఆరు నెలలలో బావర్చిపై 10 కేసులు.. కృతుంగా రెస్టారెంట్‌పై 8 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నప్పటికీ.. ప్రముఖ హోటల్స్ తీరు మారకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిన్న(శుక్రవారం) హైదరాబాద్‌లో బావర్చి హోటల్‌లో చికెన్ బిర్యానీలో ట్యాబ్లెట్లు ప్రత్యక్షమయ్యాయి. చికెన్ బిర్యానీ తింటున్న కస్టమర్లకు అందులో ట్యాబ్లెట్లు ప్రత్యక్షం కావడంతో.. వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతలో వీడియో తీస్తున్న కస్టమర్లుపై హోటల్ యాజమాన్యం ఆగ్రహంతో ఊగిపోయింది. దాంతో బావర్చి హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల ఇదే హోటల్‌లో చోటు చేసుకున్న ఇది రెండో ఘటన. పది రోజుల క్రితం.. ఇదే బావర్చి హోటల్లో బిర్యానీలో సిగరెట్ పీకలు ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి కస్టమర్లు తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఇదే విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం గమనార్హం.

తెలంగాణలో ఈ నెల 9న బంద్‌‌కు పిలుపు

తెలంగాణలో ఈ నెల 9న బంద్‌కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ములుగుజిల్లా చెల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌ బూటకమని, ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఏడుగురు విప్లవకారులకు విషమిచ్చి పోలీసులు అతి కిరాతంగా చంపారని పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ ఆరోపించార. ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.. ఈ నెల 9న బంద్ పాటించాలంటూ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ లేఖను విడుదల చేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక సమీప అడవుల్లోని పోకలమ్మ వాగు దగ్గర జరిగిన పాశవిక హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన తన పేరుతో మీడియాకు గురువారం లేఖను విడుదల చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 9వ తేదీన తెలంగాణలో బంద్‌ పాటించాలని పిలుపునిచ్చారు. నవంబర్‌ 30న చెల్పాక పంచాయతీలోని ఓ వలస ఆదివాసీ గ్రామంలో ఏడుగురు సాయుధులను అధీనంలోకి తీసుకుని దగ్గరి నుంచి అతి కిరాతకంగా కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ ఘటనకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అన్నారు

ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్‌ 1వ తేదీన ములుగు జిల్లా. ఏటూర్‌ నాగారం మండలం, చెల్పాక గ్రామ పంచాయితీ అడవుల్లో పోల్‌ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్‌ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతంగా చంపారు. నవంబర్‌ 30వ తేదీ సాయంత్రం ఏడుగురితో వున్న మా దళం చల్చాక పంచాయితీలో ఉన్న వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి తినడానికి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు. ముందుగానే పోలీసులకు అప్రోవర్‌‌గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృృహం కోల్పోయే లాగా చేశారు. స్పృహా కోల్పోయిన కామ్రేడ్స్‌‌ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారుజామున 4 గంటలకు అతి సమీపం నుండి కాల్చి చంపారు. 

శత్రువు మోస పూరిత పథకంలో చిక్కి అమూల్యమైన కామ్రేడ్స్‌ కురుసం మంగు అలియాస్ పాపన్న, బద్రు (తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు), ఏగోలపు మల్లయ్య అలియాస్ మధు, కోటి (జెఎండబ్యూపీ డివిజన్‌ కమిటీ సభ్యుడు), ముచాకీ అందాల్‌ అలియాస్ కరుణాకర్‌ (ఇల్లెందు-నర్సంపేట్‌ ఏరియా కమిటీ సభ్యుడు), ముచాకీ బూమే అలియాస్ జమున (ఏరియా కమిటీ సభ్యురాలు ), పూనెం చోటు అలియాస్ కిషోర్ (రీజినల్‌ కంపెనీ -2 మొదటి ప్లటూన్‌ పార్టీ కమిటి సభ్యుడు), కర్టం కామాల్‌ (రీజినల్‌ కంపెనీ-2లోని రెండవ ప్లటూన్‌ నభ్యుడు), కామ్రేడ్ జైసింగ్‌ (ఏటూర్‌ నాగారం-మహదేవ్‌ పూర్‌ ఏరియా దళం నభ్యుడు)లు ప్రాణాలర్పించారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరకులకు పేరు పేరున తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుంది'అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యకాండను తీవ్రంగా ఖండిస్తూ డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త బంద్‌ కు పిలుపునిస్తున్నది. యావత్‌ పీడత ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యాలయాలు, తదితర వ్యాపార సంస్థలు బంద్‌ను పాటించి జయప్రదం చేయాలని కోరుతున్నది. ఈ ఘటనకు కాంగ్రెస్‌ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పూర్తి బాధ్యత వహించాలి. ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేట్లకు అత్యంత విశ్వాసంగా కొమ్ముకాస్తుంది. వారి లాభాల కోసమే దోపీడీ విధానాలను అమలు చేస్తున్నది. అందులో భాగంగానే ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డంకిగా మారిన ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికి ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీని, పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్‌ కగార్‌‌ను కొనసాగిస్తున్నారు. దామెరతోగు, రఘునాథపాలెం, పోల్‌ కమ్మ వాగు వంటి వరుస ఎన్‌ కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కొనసాగిస్తున్న ఈ పాశవిక దాడులను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాము' అంటూ లేఖను విడుదల చేశారు.

జాయ్ రైడ్ లో మరణించిన బాలుడు

పార్క్ లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ బాలుడు భారీ టవర్ పైనుంచి పడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదంలో జాయ్ రైడ్ తయారీ సంస్థతో పాటు నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందని నిర్ధారించిన కోర్టు భారీ జరిమానా విధించింది. మరణించిన బాలుడి తల్లిదండ్రులకు 310 మిలియన్ డాలర్లు (రూ.2,624 కోట్లు) చెల్లించాలంటూ తీర్పు చెప్పింది. రైడ్ తయారీ సమయంలో భద్రతకు పెద్ద పీట వేయడం జవాబుదారీతనం కోసమే ఈ తీర్పు వెలువరించినట్లు వ్యాఖ్యానించింది.

ఓర్లాండోలోని ఐకాన్ పార్క్ కు స్థానిక స్కూలుకు చెందిన ఫుట్ బాల్ టీమ్ సభ్యులు వెళ్లారు. పిల్లలంతా అక్కడి రైడ్ లను ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే టైర్ సాంప్సన్ (14) అనే బాలుడు ఫ్రీ పాల్ రైడ్ ఎక్కాడు. నిబంధనల ప్రకారం 129 కిలోల లోపు బరువున్న వారినే రైడ్ ఎక్కేందుకు అనుమతించాలి. సాంప్సన్ మాత్రం 173 కిలోల బరువున్నాడు. అయినప్పటికీ నిర్వాహుకులు అతడిని రైడ్ కు అనుమతించారు. సాంప్సన్ లావుగా ఉండడంతో సీటు బెల్ట్ సరిగా ఫిట్ కాలేదు.

దీంతో టవర్ పైకి వెళ్లాక అది ఊడిపోయి సాంప్సన్ కిందపడి చనిపోయాడు. దీనిపై సాంప్సన్ తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. పార్క్ నిర్వాహకులతో పాటు ఫ్రీ పాల్ తయారీదారుల నిర్లక్ష్యం ఉందని కోర్టు నిర్ధారించింది. నిర్వాహకులు, తయారీదారులలో జవాబుదారీతనం తీసుకురావాలనే ఉద్దేశంతో సాంప్సన్ తల్లిదండ్రులకు భారీ మొత్తంలో పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.

తెలంగాణ పల్లెల్లో ఇక ఇంటర్నెట్ విప్లవం

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇల్లు ఇక ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందనుంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ సేవలను కేవలం రూ.300కే అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నెల 8న (ఆదివారం) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫైబర్‌నెట్‌ను ప్రారంభించనున్నారు. ఫైబర్ నెట్ కనెక్షన్‌తో ఇంట్లోని టీవీ కంప్యూటర్‌లా మారిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా అందించే కనెక్షన్ ద్వారా 20 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ లభిస్తుంది. ఈ కనెక్షన్ ద్వారా వివిధ రకాల చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. టీవీని కంప్యూటర్‌లా ఉపయోగించుకోవచ్చు కాబట్టి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. గ్రామంలోని అన్ని కార్యాలయాలు, స్కూళ్లకు కూడా ఫైబర్ నెట్ కనెక్షన్ ఇస్తారు. ప్రతి గ్రామంలోని కూడళ్లు, ఇతర చోట్ల అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఫైబర్‌నెట్‌ కనెక్షన్ ఇచ్చి వాటిని పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానిస్తారు.

రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల ఇళ్లకు ప్రభుత్వం దశల వారీగా ఫైబర్‌నెట్ సౌకర్యం కల్పిస్తుంది. వైఫైలాంటి ఈ కనెక్షన్ తీసుకుంటే ఇంటర్నెట్‌తోపాటు టెలిఫోన్, ఓటీటీల సేవలను కూడా వినియోగించుకోవచ్చు. మొదటి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 పంచాయతీల్లో అమలు చేస్తారు. తర్వాత దశల వారీగా మిగిలిన గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తిచేస్తారు. దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్ నెట్’ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి రూ. 2,500 కోట్లు కేటాయించింది. ఆ నిధులతోనే ప్రభుత్వం ఫైబర్‌నెట్‌ను ప్రారంభించబోతోంది.

కేసీఆర్ ఎర్ర‌వ‌ల్లి ఫామ్‌హౌస్‌కు మంత్రి పొన్నం

తెలంగాణ‌ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్న ప్ర‌భుత్వం

మ‌రికాసేపట్లో ఎర్ర‌వ‌ల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్ల‌నున్న మంత్రి పొన్నం

ఈ నెల 9న రాష్ట్ర స‌చివాల‌యంలో తెలంగాణ‌ త‌ల్లి కొత్త‌ విగ్రహం ఆవిష్క‌ర‌ణ‌

తెలంగాణ‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకోనుంది. మాజీ సీఎం, బీఎస్ఆర్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ అధికారిక కార్య‌క్ర‌మానికి ఆహ్వానించేందుకు ఆయ‌న ఎర్ర‌వ‌ల్లిలోని ఫామ్‌హౌస్‌కు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ను పంపిస్తోంది. 

రేవంత్ రెడ్డి స‌ర్కార్ ఈ నెల 9న రాష్ట్ర స‌చివాల‌యంలో తెలంగాణ‌ త‌ల్లి కొత్త‌ విగ్రహాన్ని ఆవిష్క‌రించ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖుల‌తో పాటు మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కూడా ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించింది. 

దీనికోసం ఆయ‌న వ‌ద్ద‌కు మంత్రి పొన్నంను పంపుతోంది. మ‌రికాసేపట్లో ఆయ‌న ఎర్ర‌వ‌ల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్ల‌నున్నారు. బీఎస్ఆర్ అధినేతను తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు రావాల్సిందిగా స్వ‌యంగా ఆహ్వానించ‌నున్నారు.

ఆ కంటైనర్‌లో డ్రగ్స్ లేవని తేల్చిన సీబీఐ

విశాఖపట్నం వచ్చిన ఒక కంటైనర్‌ విషయంలో మిస్టరీ వీడింది. డ్రై ఈస్ట్‌తో పాటు డ్రగ్స్‌ కొకైన్‌ ఉన్నాయనే అనుమానాలు రావడంతో సీజ్ చేశఆరు. కంటైనర్ నుంచి సేకరించిన డ్రై ఈస్ట్‌ నమూనాలను సెంట్రల్‌ నార్కోటిక్‌ డ్రగ్స్‌ లేబొరేటరీకి పంపించారు. అయితే అందులో ఎటువంటి మత్తు పదార్థాలు(డ్రగ్స్‌) లేవని నివేదిక వచ్చింది. అదే వివరాలను విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో సమర్పించి.. కేసును మూసేయాలని సీబీఐ అధికారులు కోరారు. కోర్టు ఆమోదం తెలపడంతో ఆ కంటైనర్‌ను సంబంధిత సంస్థకు ఇచ్చేయాలని కస్టమ్స్‌ అధికారులకు 10 రోజుల క్రితం లేఖ రాశారు. ఈ మేరకు సదరు సంస్థకు సమాచారం ఇచ్చారు.

విశాఖపట్నంలో కొంతకాలం క్రితం మిస్టరీగా మారిన కంటైనర్ అంశంపై క్లారిటీ వచ్చింది. విశాఖ పోర్టులో డ్రగ్స్‌ ఆనవాళ్లు ఉన్నట్లు అనుమానాలు రాగా.. కంటైనర్‌లో అలాంటివేమీ లేవని సీబీఐ తేల్చింది. బ్రెజిల్‌ నుంచి ఆ కంటైనర్‌లో తెచ్చిన 25,000 టన్నుల డ్రైడ్‌ ఈస్ట్‌లో డ్రగ్స్ ఉన్నాయే అనుమానంతో అప్పట్లో సీబీఐ అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు శాంపిల్స్‌ను ఢిల్లీలోని ల్యాబ్‌కు పంపించగా.. వాటిలో డ్రగ్స్ అవశేషాలేమీ లేవని సీబీఐ అధికారులు తేల్చారు. ఈ మేరకు అధికారులు కోర్టుకు నివేదికను అందించారు.. దీంతో కంటైనర్‌ సంధ్యా ఆక్వాకు అప్పగించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. గతనెల 27న పోర్టు అధికారులకు ఆదేశాలు కూడా అందాయి.

ఏపీకి చెందిన సంధ్యా ఆక్వా ప్రతినిధులు బ్రెజిల్‌ నుంచి డ్రైడ్‌ ఈస్ట్‌ ఆర్డర్‌ పెట్టగా.. ఈ ఏడాది మార్చి 16న విశాఖపట్నం పోర్టుకు ఎస్‌ఈకేయూ-4375380 కంటైనర్‌లో వెయ్యి బ్యాగుల్లో పంపించారు. ఈ సరుకు విషయంలో ఇంటర్‌పోల్‌ ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు అందులో తనిఖీ చేశారు. గుజరాత్‌ ల్యాబ్‌ నుంచి మార్చి 19న వచ్చిన నిపుణులు 49 నమూనాలు సేకరించారు.. వీటిలో 27 నమూనాల్లో డ్రగ్స్‌ అవశేషాలు గుర్తించారు. ఆ వెంటనే కేసు నమోదు చేసిన సీబీఐ, జడ్జి ఆధ్వర్యంలో మరో 100 నమూనాలు సేకరించారు. ఆ తర్వాత నమూనాలను సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తీసుకెళ్లారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత నివేదిక వచ్చింది.

అయితే అప్పట్లో డ్రగ్స్‌ అవశేషాలు ఉన్నాయని గుర్తించగా.. ఇప్పుడు అవశేషాలు లేవని నివేదిక వచ్చింది. ఈ కంటైనర్ అంశంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్య పొలిటికల్ వార్ నడిచింది. ఎన్నికల సమయం కావడంతో మరింత హీట్ పెంచింది. బ్రెజిల్ నుంచి డ్రైడ్‌ ఈస్ట్‌ ఆర్డర్ పెట్టిన సంస్థపై ఆరోపణలు రాగా.. నేతలకు వారితో లింక్ ఉందనే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు ఆ కంటైనర్‌లో వచ్చిన డ్రైడ్‌ ఈస్ట్‌లో డ్రగ్స్ అవశేషాలు లేవని తేలడంతో.. పార్టీలు ఎలా స్పందిస్తాయన్నది చూడాలి.

తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్‌గా ప్రొడ్యూసర్ దిల్ రాజు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు కొత్త పదవి బాధ్యతలు ఇచ్చింది తెలంగాణ సర్కార్. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్‌గా దిల్ రాజును నియమించింది సర్కార్.

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ హిట్ ప్రొడ్యూసర్‌గా పేరున్న దిల్ రాజు, ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించింది తెలంగాణ సర్కార్.. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది..రెండేళ్ల పాటు ఈ పదవి లో కొనసాగుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం గతంలో దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిజామాబాద్ ఎంపీగా బరిలో దిగేందుకు సన్నాహాలు చేశారు. అయితే రాజకీయ ఈక్వేషన్స్ అనుకూలించకపోవడంతో అది జరగలేదు. కానీ ఇప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అప్పగించడం, సినీ వర్గాలతో పాటు రాజకీయా వర్గాల్లో సైతం ఆసక్తికర చర్చకు దారి తీసింది.

దిల్ రాజు ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో ఇప్పటికే కీలక సభ్యుడిగా ఉన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సంబంధాల వారధిగా చురుకుగా వ్యవహరిస్తూ తనపై ప్రభుత్వం నమ్మకాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మారడంతో, ఆయన ప్రభుత్వానికి మరింత దగ్గరగ సినిమా పరిశ్రమను తీసుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దిల్ రాజు తెలంగాణ ముఖ్యమంత్రిను కలవబోతున్నారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీ కేవలం అభినందనల వరకే పరిమితం అవుతుందా. లేక సినీ పరిశ్రమకు సంబంధించిన కీలక అంశాలు చర్చించే అవకాశం ఉందా. అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించడానికి నిజంగా ప్రయత్నాలు చేస్తారా.?, లేక ఈ పదవి దిల్ రాజుకు కేవలం మరిన్ని రాజకీయ మార్గాల కోసం ఉపయోపడుతుందా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది సినీ పరిశ్రమకు ఇది నిజమైన గేమ్-చేంజర్ అవుతుందా.? లేక ఇది కేవలం రాజకీయ స్క్రిప్ట్‌గా మిగిలిపోతుందా.? దిల్ రాజు వైఖరి మీదే అందరి దృష్టి పోకస్ అయి ఉంది.

హుటాహుటిన అప్రమత్తమైన కేంద్రం

సిరియాలో అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. అక్కడి వేర్పాటువాదులు, తిరుగుబాటుదారులు.. ఒక్కో నగరాన్నీ ఆక్రమించుకుంటూ వస్తోన్నారు. రష్యా, ఇరాన్ మద్దతుతో కొనసాగుతున్న బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వం కుప్పకూలే దశకు చేరుకుంటోంది. ఒక్కో నగరాన్నీ కోల్పోతోంది.

టర్కీ మద్దతుతో మిలీషియా గ్రూప్‌లు, ఇస్లామిస్ట్ తిరుగుబాటుదారులు చెలరేగుతున్నారు. సిరియాలోని రెండో అతిపెద్ద నగరం అలెప్పో సైతం వారి వశమైంది. సనా, హమా సిటీనీ తాజాగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పలు రీజియన్లు ప్రభుత్వ నుంచి చేజారాయి. అవన్నీ కూడా తిరుగుబాటులదారుల నియంత్రణలోకి వెళ్లాయి.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సిరియాలో నానాటికీ దిగజారుతున్న శాంతిభద్రతలు, యుద్ద వాతావరణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సిరియా అంతర్యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని అర్ధరాత్రి కీలక ప్రకటన విడుదల చేసింది. అడ్వైజరీని జారీ చేసింది. తదుపరి ప్రకటన జారీ అయ్యేంత వరకూ సిరియాకు వెళ్లొద్దని, ప్రయాణాలను మానుకోవాలని సూచించింది.

దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదింపులు నిర్వహించడానికి హెల్ప్‌లైన్ నంబర్, ఇమెయిల్ ఐడీని అందుబాటులోకి తీసుకొచ్చారు. సిరియాలో ఉన్న భారతీయులందరూ కూడా డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు.

డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయం కోసం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ +963 993385973. అలాగే అత్యవసర ఇమెయిల్ ద్వారా రాయబార కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని జైస్వాల్ సూచించారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

బషర్ అల్-అస్సాద్ కుటుంబం అయిదు దశాబ్దాల పాటు సిరియాను పరిపాలిస్తూ వస్తోంది. ఆ దేశ చరిత్రలో తొలిసారిగా ఆయన ప్రభుత్వం పతనావస్థకు చేరుకుంటోంది తిరుగుబాటుదారుల వల్ల. హామ్స్‌ను స్వాధీనం చేసుకోగలిగితే మాత్రం బషర్ అస్సాద్‌ ప్రభుత్వం పూర్తిగా కుప్పకూలినట్టవుతుంది.