తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్‌గా ప్రొడ్యూసర్ దిల్ రాజు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు కొత్త పదవి బాధ్యతలు ఇచ్చింది తెలంగాణ సర్కార్. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్‌గా దిల్ రాజును నియమించింది సర్కార్.
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ హిట్ ప్రొడ్యూసర్‌గా పేరున్న దిల్ రాజు, ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించింది తెలంగాణ సర్కార్.. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది..రెండేళ్ల పాటు ఈ పదవి లో కొనసాగుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం గతంలో దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిజామాబాద్ ఎంపీగా బరిలో దిగేందుకు సన్నాహాలు చేశారు. అయితే రాజకీయ ఈక్వేషన్స్ అనుకూలించకపోవడంతో అది జరగలేదు. కానీ ఇప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అప్పగించడం, సినీ వర్గాలతో పాటు రాజకీయా వర్గాల్లో సైతం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
దిల్ రాజు ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో ఇప్పటికే కీలక సభ్యుడిగా ఉన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సంబంధాల వారధిగా చురుకుగా వ్యవహరిస్తూ తనపై ప్రభుత్వం నమ్మకాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మారడంతో, ఆయన ప్రభుత్వానికి మరింత దగ్గరగ సినిమా పరిశ్రమను తీసుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దిల్ రాజు తెలంగాణ ముఖ్యమంత్రిను కలవబోతున్నారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీ కేవలం అభినందనల వరకే పరిమితం అవుతుందా. లేక సినీ పరిశ్రమకు సంబంధించిన కీలక అంశాలు చర్చించే అవకాశం ఉందా. అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించడానికి నిజంగా ప్రయత్నాలు చేస్తారా.?, లేక ఈ పదవి దిల్ రాజుకు కేవలం మరిన్ని రాజకీయ మార్గాల కోసం ఉపయోపడుతుందా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది సినీ పరిశ్రమకు ఇది నిజమైన గేమ్-చేంజర్ అవుతుందా.? లేక ఇది కేవలం రాజకీయ స్క్రిప్ట్‌గా మిగిలిపోతుందా.? దిల్ రాజు వైఖరి మీదే అందరి దృష్టి పోకస్ అయి ఉంది.
Dec 07 2024, 11:31