పీఎస్ఎల్వీ సీ-59 సూపర్ సక్సెస్
పీఎస్ఎల్‌వి సి-59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరి కోట నుంచి ఇస్రో ఈ రాకెట్‌ను ప్రయోగించింది. ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపుతోంది ఇస్రో.
పీఎస్ఎల్‌వి సి-59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరి కోట నుంచి ఇస్రో చేసిన ఈ రాకెట్ ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా పంపింది. ఈ ప్రోబా-3ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించింది. సూర్యుడిపై పరిశోధలనకు గానూ ఈ ప్రోబా-3 ఉపయోగపడనుంది. ఈ ఉపగ్రహాలు సూర్యకిరణాలపై మరింత డెప్త్‌గా అధ్యయనం చేయనున్నాయి. కరోనా పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా ఈ ఉపగ్రహాలను రూపొందించారు శాస్త్రవేత్తలు.
వాస్తవానికి బుధవారం సాయంత్రం 4:08 గంటలకు ప్రయోగించాల్సిన పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. నిన్న మధ్యాహ్నం 2:38 నిమిషాలకు శ్రీహరికోట సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్‌లో దీనికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంతలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రయోగాన్ని గురువారానికి వాయిదా వేశారు. గురువారం సాయంత్రం 4:12 గంటలకు ఇస్రో ఈ రాకెట్‌ను ప్రయోగించింది. పీఎస్ఎల్వీ సి-59 ద్వారా మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది.
యూరోపియన్ స్పేష్ ఏజెన్సీ.. ప్రోబా-3ని రూపొందించంది. ఈ మిషన్ ద్వారా రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు. వీటిని ఒకే కక్ష్యంలో ఏర్పాటు చేశారు. ఇది భూమి నుంచి 60 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యడి బాహ్య వాతావరణమైన కరోనాపై కీలక పరిశోధనలు జరపనున్నారు. దీనిపై నిఘా పెట్టడం ద్వారా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకోనున్నారు. ఈ రెండు ఉపగ్రహాలు పరస్పర సమన్వయంతో ఒకే భూ కక్ష్యలో పయనిస్తుంటాయి. భవిష్యత్తులో కృత్రిమ సూర్యుడిని సృష్టించడం వంటి ప్రయోగాలకు కూడా ఈ ఉపగ్రహాలు కీలకం కానున్నాయి.
Dec 06 2024, 10:12